మాయాదేవి దేవాలయం,హరిద్వార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాయాదేవి దేవాలయం
Lua error in మాడ్యూల్:Location_map at line 502: Unable to find the specified location map definition: "Module:Location map/data/Uttarakhand" does not exist.
భౌగోళికాంశాలు:29°57′00″N 78°09′43″E / 29.95000°N 78.16194°E / 29.95000; 78.16194Coordinates: 29°57′00″N 78°09′43″E / 29.95000°N 78.16194°E / 29.95000; 78.16194
పేరు
స్థానిక పేరు:మాయాదేవి దేవాలయం
దేవనాగరి:माया देवी मंदिर
స్థానము
దేశము:భారత దేశము
రాష్ట్రము:ఉత్తరాఖండ్
జిల్లా:హరిద్వార్
ప్రదేశం:హరిద్వార్
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:మాయాదేవి (శక్తి)
ప్రధాన పండుగలు:నవరాత్రి
చరిత్ర
స్థాపించిన తేదీ:11వ శతాబ్దం
నిర్మాత:తెలియదు

మాయాదేవి దేవాలయం (Hindi: माया देवी मंदिर, हरिद्वार) భారత దేశములోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లాలో గల హిందూ దేవాలయం. ఈ ప్రాంతం పరమేశ్వరుని భార్య అయిన సతీ దేవి యొక్క గుండె, నాభి పడిన ప్రాంతమని ఇక్కడి ప్రజల నమ్మకం. ఇది కొన్నిసార్లు శక్తి పీఠాలలో ఒకటిగా గుర్తింపబడుతుంది.[1][2]

ఈ దేవాలయ అధిష్టాన దేవత "మాయ". ఆమె మూడు తలలతోనూ, నాలుగు చేతులతోనూ కూడుకొని ఉన్న శక్తి యొక్క అవతారంగా ప్రసిద్ధి చెందినది. హరిద్వార్ ప్రముఖంగా "మాయాపురి"గా పిలివబడుతుంది. ఈ దేవాలయంలో తమ కోరికలు నెరవేర్చుకొనేందుకు భక్తులు కొలువబడే "సిద్ధ పీఠం"గా ప్రసిద్ధి చెందినది. ఇది హరిద్వార్ లో గల మూడు శక్తి పీఠాలలో ఒకటిగా అలరాలుతుంది. ఇది కాక హరిద్వార్ లో గల ముఖ్యమైన శక్తి పీఠాలుగా అలరాలుతున్నవి చండీదేవి ఆలయం, మానసదేవీ ఆలయం[3]

ఆలయ విశేషాలు[మార్చు]

ఈ దేవాలయం 11 వ శతాబ్దానికి చెందినది. ఇది హరిద్వార్ లోని మూడు ప్రాచీన దేవాలయాలలో ఒకటి. ఇది కాక ఇతర ప్రాచీన దేవాలయాలు నారాయణ శిల, భైరవ దేవాలయం. ఈ దేవాలయం యొక్క అంతర మందిరంలో మాయా దేవత యొక్క మూర్తి మధ్య భాగములోనూ, కాళీ యొక్క మూర్తి ఎడమ వైపున, కామాఖ్య దేవత మూర్తి కుడివైపున ఉంటాయి. యివికాక మరి రెండు యితర శక్తి దెవతలు అంతర మందిరంలో ఉంటాయి. ఈ దేవాలయం "హర్ కి పౌరి"కి తూర్పు వైపున ఉంది. ఈ దేవాలయానికి వెళ్ళుటకు బస్సు, రిక్షా సౌకర్యాలు ఉన్నాయి. ఈ దేవాలయం హరిద్వార్ వెళ్ళే యాత్రికులు తప్పనిసరిగా దర్శించవలసిన దేవాలయం.[4] ఈ దేవాలయానికి అనేక ప్రాంతముల నుండి భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా నవరాత్రి, కుంభమేళా సందర్భంలో ఎక్కువగా దర్శిస్తూంటారు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Mapsofindia.com. "Maya Devi Temple".
  2. "Devotion and harmony by the Ganga". The Hindu. 2006-06-25. Retrieved 2010-06-04.
  3. Mustseeindia.com. "Maya Devi Temple, Haridwar". Archived from the original on 2008-09-16. Retrieved 2014-10-03.
  4. "Places to visit in and around Haridwar". Zeenews.com. Archived from the original on 2010-01-29. Retrieved 2014-10-03.

ఇతర లింకులు[మార్చు]