Jump to content

సమావేశం

వికీపీడియా నుండి
(మీటింగ్ నుండి దారిమార్పు చెందింది)
సమావేశ ప్రాంగణం

సాధారణంగా ఒక అధికారిక లేదా వ్యాపార సందర్భంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకటి లేదా ఎక్కువ విషయాల గురించి చర్చించడాన్ని సమావేశం అంటారు. కానీ సమావేశాలు ఇతర సందర్భాలలో కూడా జరుగుతాయి కావున అనేక రకాల సమావేశాలు ఉన్నాయి.

తెలంగాణ నాటకోత్సవ సమావేశం

నిర్వచనం

[మార్చు]

మోఖిక సంభాషణల ద్వారా సమాచారాన్ని పంచుకోవడం లేక, ఒక విషయంపై అంగీకారం సాధించడం లాంటి ఉమ్మడి లక్ష్యాలను సాధించటానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలసికొనటానికి ఏర్పడినదే సమావేశం. [1] సమావేశాలు మౌఖికంగాను, టెలిఫోన్ , వీడియో సమావేశం లాంటి సమాచార సాంకేతిక, మధ్యవర్తిత్వం ద్వారాను జరగవచ్చు. 1903 బ్రౌణ్య నిఘంటువు సమావేశం అంటే ఒకచోట కూడనుండుట, ప్రవేశము, కలిసికొనుట అనే అర్ధాలు సూచిస్తున్నది. [2]

మీటింగ్ ప్లానర్లు, ఇతర సమావేశ నిపుణులు "సమావేశం" అనే పదాన్ని ఒక హోటల్, కన్వెన్షన్ సెంటర్ లేదా అలాంటి సమావేశాలకు అంకితం చేసిన ఏదైనా ఇతర వేదిక వద్ద జరిగిన సంఘటనను సూచించడానికి ఉపయోగించవచ్చు. [1] [3]

మానవ శాస్త్రవేత్త హెలెన్ బి. ష్వార్ట్జ్మాన్ సమావేశాన్ని "ఒక సంస్థ లేదా సమూహం యొక్క పనితీరుకు సంబంధించిన ఒక ప్రయోజనం కోసం సమావేశమయ్యేందుకు అంగీకరించే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో కూడిన ఒక సంభాషణాత్మక సంఘటన" అని నిర్వచించారు. [4] దాని ప్రకారం, సమావేశాలు "ఎక్కువ సార్లు ఎక్కువమంది సంభాషణలకు అవకాశం కలిగివుండడం, పాల్గొనేవారు ఈ చర్చను నియంత్రించడానికి నిర్దిష్ట చర్యలను అభివృద్ధి చేయటం, ఉపయోగించటం." లక్షణాలను కలిగివుంటాయి

వివిధ రకాల సమావేశాలు

[మార్చు]

వ్యాపారవేత్తలు క్రమబద్ధముగా ఒక చోట సమావేశమై వ్యాపారాభివృద్ధిపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకొంటారు. ప్రజలకు తగు సేవలు అందించుటకు, చేస్తున్న సేవలు సక్రమంగా జరుగుతున్నాయా అని తెలుసుకొనుటకు ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రమబద్ధముగా ప్రభుత్వాధికారుల, ప్రజాప్రతినిధుల సమావేశాలు జరుగుతుంటాయి. రాజకీయపార్టీలు తమ బలాన్ని పెంచుకొనుటకు తరచుగా కార్యకర్తల సమావేశాలు, ప్రజా సమావేశాలను జరుపుతాయి. కొన్ని సంఘాలు ప్రభుత్వం తమకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సమావేశాలు ఏర్పాటు చేస్తాయి.

ప్రజల సమావేశం ఏర్పాటుచేసేటప్పుడు సంబంధిత శాఖ నుండి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అసంబద్ధమైన, ప్రజలకు అసౌకర్యాన్ని కలుగజేయగలవని భావించిన ప్రజల సమావేశాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వదు.

ప్రస్తావనలు

[మార్చు]
  1. 1.0 1.1 Meeting and Convention Planners. (2009, December 17). U.S. Bureau of Labor Statistics. Retrieved April 21, 2010.
  2. బ్రౌన్, రాబర్ట్ (1903). "సమావేశం". ఆంధ్రభారతి.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. Montgomery, Rhonda J.; Strick, Sandra K. (1994). Meetings, Conventions, and Expositions: An Introduction to the Industry. New York: Wiley. ISBN 9780471284390. Retrieved 2016-02-04.
  4. Schwartzman, Helen B. (1989). The Meeting : Gatherings in Organizations and Communities. Springer US. pp. 7. ISBN 978-1-4899-0885-8. OCLC 859586941.

మరింత చదవడానికి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సమావేశం&oldid=4352551" నుండి వెలికితీశారు