రతిరహస్యం
(రతిరహస్యము నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే. లైంగికత గురించి చర్చించటం మూలాన ఈ వ్యాసం చదవటం అందరికీ అమోదయోగ్యం కాకపోవచ్చును . ఇది మీకు సౌకర్యవంతం కాకపోతే దయచేసి తక్షణమే ఈ పుట నుండి నిష్క్రమించ ప్రార్థన. |
రచయిత(లు) | కొక్కోకుడు |
---|---|
దేశం | భారతదేశం |
భాష | సంస్కృతం |
విషయం | Human sexuality |
శైలి | Sex manual |
ప్రచురించిన తేది | 11th or 12th శతాబ్దం |
ఆంగ్లంలో ప్రచురించిన తేది | 1964 |
మీడియా రకం | ముద్రణ |
పుటలు | 172 |
భారతీయ సంస్కృతిలో కామాన్ని చర్చింపరాని, నిషిద్ధ విషయంగా కాక పురుషార్థాలలో ఒకటిగా భావించారు. కనుక ప్రతీవారికీ కామాన్ని గురించి తెలిపే విజ్ఞాన గ్రంథాలుగా కామశాస్త్ర గ్రంథాలు రచించారు. సంస్కృతాంధ్రాలలోని కామశాస్త్ర గ్రంథాలలో అత్యంత ప్రసిద్ధి పొందిన వాత్సాయన కామసూత్రాల అనంతరం అంతటి ప్రఖ్యాతి పొందింరచన కొక్కోకము. కొక్కోకుడు దీనిని రచించడం వల్ల దీనికి ఆపేరు వచ్చింది. దీని అసలు పేరు రతిరహస్యము (ఆంగ్లం: Ratirahasya). ఐతే బ్రిటీష్ యుగంలో కామసంబంధిత గ్రంథాలను నిషేధించడంతో వీటి ప్రచారం రహస్యంగా జరిగింది. ఈ ప్రతి కూడా రహస్య పండిత ప్రతి. ఈ గ్రంథాన్ని కూచిరాజు ఎఱ్ఱన ఆంధ్రీకరించి, తాత్పర్యాన్ని కూడా రచించారు. వినుకొండ దుర్గాధిపతి కుంటుముక్కల మల్లమంత్రికి అంకితం ఇవ్వబడింది.
విషయసూచిక
ప్రథమాశ్వాసం:
- ప్రథమ పరిచ్ఛేదం - జాత్యధికారః - పద్మినీ జాతిస్త్రీ లక్షణము, చిత్రిణీ జాతిస్త్రీ లక్షణము, శంఖినీ జాతిస్త్రీ లక్షణము, హస్తినీ జాతిస్త్రీ లక్షణము, పద్మినికిగాక తక్కిన మూడు జాతులకు ప్రియమైన తిథులు, పద్మిని మొదలగు జాతులకు ప్రియమగు జాములు, పద్మినికి దప్ప మిగిలిన జాతులను పురుషులు మంత్రౌషధములచే వశులను జేసుకొను లక్షణములు.
- ద్వితీయ పరిచ్ఛేదం - చంద్రకళాధికారః - స్త్రీ కళాస్థానములు, స్త్రీ పురుష కళాస్థానములు, స్త్రీలకు తిధులు - కళాస్థానములు, స్త్రీలను రమించి ద్రవింపజేయు బంధవిశేషములు, పద్మినీ స్త్రీకి ముఖ్యకళాస్థానములు, చిత్రిణికి ముఖ్యకళాస్థానములు, శంఖినికి ముఖ్యమగు కళాస్థానములు, హస్తినికి ముఖ్యమగు కళాస్థానములు, మన్మథబాణములకు స్థానములు, షోడశ కళాస్థానములు, పాడ్యమియొక్క వివరము, విదియ సవిస్తరము, తదియయొక్క విశేషము, చవితియొక్క సామ్యము, పంచమి షష్ఠియొక్క సందర్భము, సప్తమి విషయము, అష్టమి నవమియొక్క నిర్ణయము, దశమి నిదానము, ఏకాదశియొక్క నిశ్చయము, ద్వాదశి త్రయోదశియొక్క వినియోగము, చతుర్దశి పున్నమ యవసలయొక్క సవిస్తరము.
- తృతీయ పరిచ్ఛేదం - సురతభేదే జాత్యధికారః - భగదండ ప్రమాణరతుల లక్షణములు, అతృప్తి స్త్రీబాధ లక్షణము, పరవశత్వ లక్షణము, హరిణీ జాతిస్త్రీ లక్షణము, అశ్వినిజాతి స్త్రీలక్షణము, ద్వాదశహస్తినీ లక్షణము, శశజాతి పురుష లక్షణములు, వృషజాతి పురుష లక్షణము, తురగజాతి పురుషలక్షణము.
- చతుర్థ పరిచ్ఛేదం - సామాన్య ధర్మాధికారః - వయోస్వభావ లక్షణము, బాల లక్షణము, యౌవన స్త్రీ లక్షణము, ప్రౌఢస్త్రీ లక్షణము, లోలస్త్రీ లక్షణము, వయోబల మాస లక్షణము, బాలాద్యుపచార లక్షణము, శ్లేష్మ పిత్త వాత ప్రకృతుల లక్షణములు, దేవ నర నాగ యక్షసత్త్వల లక్షణములు, సుగంధి, ధ్రువకోకిల, గంధర్వసత్త్వ లక్షణము, మత్తకోకిల, మానిని, కవిరాజ, సంసారమునకు దగిన స్త్రీలు, స్త్రీల నుపేక్షించుట వలన గలుగు దోషములు, విరక్తిస్త్రీ లక్షణము, స్త్రీల వలపు నెరింగెడి లక్షణము, స్త్రీల సమయ రతి విశేషము, అభ్యాస యోగలక్షణము, అభిమానజ సంప్రత్య వైషయికంబుల లక్షణములు, స్వభావసాత్మ్యక లక్షణము.
- పంచమ పరిచ్ఛేదం - దేశ జ్ఞానాధికారః - దేశస్త్రీల రతివిశేష లక్షణములు, గుర్జరీ దేశస్త్రీ లక్షణము, లాటదేశస్త్రీ లక్షణము, ఆంధ్రదేశస్త్రీ లక్షణము, కోసల దేశస్త్రీ లక్షణము, మహారాష్ట్ర పాటలీపుత్ర దేశముల స్త్రీల లక్షణములు, చతుష్షష్టి కళలు, ద్రవిడ దేశస్త్రీ లక్షణము, వెలిరతి, లోరతుల లక్షణము, వనవాస దేశస్త్రీ లక్షణము, వంగ గౌడ దేశస్త్రీల లక్షణము, కామరూప జాతిస్త్రీ లక్షణము, ఉత్కళ దేశస్త్రీ లక్షణము.
- షష్ఠ పరిచ్ఛేదం - ఆలింగనాధికారః - స్పృష్టక లక్షణము, విద్ధక లక్షణం, ఉద్ఘృష్టక నిపీడనముల లక్షణాలు, లతావేష్టిత లక్షణం, వృక్షాధిరూఢ లక్షణం, తిలతండుల లక్షణం, క్షీరనీర లక్షణం, ఊరూపగూఢ లక్షణము, జఘనోశ్లేష లక్షణము, కుచాశ్లేష లలాటికముల లక్షణము.
- సప్తమ పరిచ్ఛేదం - చుంబనాధికారః - చుంబన స్థానములు, నిమిత స్ఫురిత చుంబనముల లక్షణం, ఘట్టిత చుంబన లక్షణం, భ్రాంతి తిర్యగ పీడిత విఘటిత అధర ఉత్తర చుంబనముల లక్షణములు, సంపుట అనువదన చుంబనముల లక్షణము, అన్వితచుంబన లక్షణము, ప్రాతిబోధ ఛాయిక క్రాంతమ చుంబనముల లక్షణం.
- అధికాధికరణం - భద్రుని లక్షణము, కూచిమారజాతి పురుష లక్షణం, పాంచాల పురుషుని లక్షణము, దత్తుని లక్షణము,
- అష్టమ పరిచ్ఛేదం - నఖచ్ఛేదాధికారః - నఖక్షత స్థాన సమయ లక్షణం, నఖక్షత గుణ లక్షణము, నఖక్షత నామములు, ఛురిత నఖక్షత లక్షణము, అర్థచంద్ర మండలక మయూరపాద నఖక్షతముల లక్షణము, శశకఫ్లుత కుముదపత్త్ర నఖక్షతముల లక్షణము,
- సప్తమ పరిచ్ఛేదం - దంతచ్ఛేదాధికారః - దంత నఖ క్షతముల లక్షణం, గూఢక ఉచ్ఛూనక ప్రవాళమణి దంతక్షతముల లక్షణము, బిందువు బిందుమాల దంతక్షతముల లక్షణములు, ఖండాబ్రక కోలచర్విత దంతక్షతముల లక్షణము.
ద్వితీయాశ్వాసము:
- సురతాధికారః - రతిప్రేరేపణ క్రియా లక్షణము, భగ భేద లక్షణము, బంధ భేదములు, గ్రామ్య నాగరక బంధముల లక్షణములు, ఉత్ఫుల్లక బంధ లక్షణము, జృంభిత బంధ లక్షణము, ఇంద్రాణిక ఇంద్రక బంధముల లక్షణములు,
- కన్యావిశ్రుంభనాధికారః
- భార్యాధికారః
- పారదారికాధికరణము
తృతీయాశ్వాసము
- వశీకరణాధికరణము
- సకలయోగాధికరణము