Jump to content

ఎ. జి. రత్నమాల

వికీపీడియా నుండి
(రత్నమాల (నటి) నుండి దారిమార్పు చెందింది)
A. G. Rathnamala
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంఎ.జి.రత్నమాల
తమిళం: ஏ. ஜி. ரத்தினமாலா
జననం1931
మద్రాసు రాజ్యం, బ్రిటిష్ ఇండియా
మరణం2007 జూలై 3(2007-07-03) (వయసు 75–76)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
సంగీత శైలిసినిమా సంగీతం, నేపధ్య గాయని
వృత్తిSinger, actor
వాయిద్యాలుVocalist
క్రియాశీల కాలం1950–1964

రత్నమాల (1931 – 2007 జూలై 3) [1] అలనాటి తమిళ సినిమా నటీమణి, రంగస్థల కళాకారిణి, నేపథ్య గాయని. ఆమె తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషా సినిమాలలో సుమారు 500 పాటలను పాడింది.[2] రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన రత్నమాల ఎమ్.జీ.రామచంద్రన్, శివాజీ గణేషన్ వంటి అగ్రనటుల సరసన అనేక సినిమాలలో కథానాయకిగా నటించింది. శివాజీ గణేషన్ నటించిన వీరపాండ్య కట్టబొమ్మన్ చిత్రంలో కట్టబొమ్మన్ భార్య పాత్రలో రత్నమాల నటన సినీ ప్రపంచములో పలువురి మన్ననలను అందుకొన్నది.

జీవిత విశేషాలు

[మార్చు]

రంగస్థల కళాకారిణిగా

[మార్చు]

ఆమె ఎం. జి. రామచంద్రన్ డ్రామా బృందంలో ఉన్నప్పుడు, ఇన్బా కనవు అనే నాటకంలో అతనితో జంటగా నటించింది. ఇది కాకుండా ఆమె టి. ఆర్ మహాలింగంతో కలిసి ఓర్ ఇరావు అనే నాటకంలో నటించింది. ఆమె కె. ఆర్. రామస్వామి డ్రామా బృందంతో కూడా నటించింది.

టి. ఎస్. నటరాజన్ నాటకం ఆధారంగా ఎన్ తంగై అనే సినిమా రూపొందించబడింది.[3] స్టేజ్ డ్రామాలో శివాజీ గణేషన్ హీరో అయితే ఆమె అతని చెల్లెలుగా నటించింది. తరువాత ఆమె శివాజీ గణేషన్ డ్రామా బృందంలో చేరి వీరపాండ్యన్ కట్టబొమ్మన్ అనే నాటకంలో జక్కమ్మ పాత్రను పోషించింది.[4]

ఆమె వివిధ సంగీత స్వరకర్తలకు పాడిన పాటలు

[మార్చు]

అనేక మంది సంగీత స్వరకర్తలకు ఆమె పాటలు పాడింది. వారిలో కె.వి.మహదేవన్, విశ్వనాథన్-రమమూర్తి, ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు, సి.ఆర్ సుబ్బురామన్, సి.ఎన్.పాండురంగన్, ఎస్.వి.వెంకట్రమన్, ఆర్. సుదర్శనం. టి.ఆర్. పప్పా, జి. గోవిందరాజులు నాయుడు. టి.జి. లింగప్ప, ఎం. ఎస్. విశ్వనాథన్, ఎస్. దక్షిణామూర్తి, కె.ఎన్.దండాయుధపాణి పిళ్ళై, సాలూరు రాజేశ్వరరావు, సాలూరు హనుమంతరావు, టి.ఆర్. రామనాథన్, ఆర్, గోవిందనం, వేధ, హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎం.ఎస్.జ్ఞానమణి ఉన్నారు.[5]

రత్నమాల చాలాకాలం అనారోగ్యముతో బాధపడుతూ 76 యేళ్ల వయసులో 2007 జూన్ 3 న మద్రాసులో మరణించింది. ఈమెకు ఒక కుమారుడు.[6]

మూలాలు

[మార్చు]
  1. https://www.veethi.com/india-people/a._g._rathnamala-profile-13949-24.htm
  2. "Indian Heritage".
  3. "En Thangai 1952". The Hindu. 28 November 2008. Archived from the original on 3 June 2015. Retrieved 1 February 2017.
  4. "எம்.ஜி.ஆரும் எங்களூர்க்காரரும் – தொடர் 7". Archived from the original on 10 April 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Notes of peace – The Hindu".
  6. డెక్కన్ హెరాల్డ్‌లో రత్నమాల సంతాపవార్త[permanent dead link]