రాజుల లోగిళ్లు

వికీపీడియా నుండి
(రాజుల లోగిళ్ళు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

రాజుల లోగిళ్లు ప్రముఖ రచయిత కె.ఎన్.వై.పతంజలి రచించిన నవల. ఇది విజయనగర సంస్థానంలోని అలమండ గ్రామ శివార్లలో 18వ శతాబ్దం నేపథ్యంలో జరుగుతుంది. ఆ గ్రామంలోని కాకరపర్తి రాజవంశీయుల జీవితచిత్రాలే దీని కథావస్తువు. వీరి కుటుంబాలలోని వ్యక్తుల ప్రవర్తనలు, కలహాలు, ఆస్తి గొడవలు, వేటలు, యుద్ధాలు మొదలైన చాలా విషయాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. క్షత్రియ కుటుంబాలతో సంబంధమున్న విభిన్న జాతుల ప్రజల భాష గురించి రచయిత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వారి యాసలోనే రచించారు. ఆయా జాతుల ఆచారవ్యవహారాల్ని చూపించారు.

ఇందులోని పాత్రలు[మార్చు]

  • రాజుగోరు
  • గాలిసాయెబు
  • చందర్రాజు

మూలాలు[మార్చు]