రిథమ్‌బాక్స్
రిథమ్‌బాక్స్ | |
---|---|
రిథమ్‌బాక్స్ 2.90.1 యొక్క తెరపట్టు | |
అభివృద్ధిచేసినవారు | గ్నోమ్ జట్టు |
మొదటి విడుదల | ఆగస్టు 18, 2001 |
సరికొత్త విడుదల | 2.95 / జనవరి 15, 2012 |
ప్రోగ్రామింగ్ భాష | సీ |
నిర్వహణ వ్యవస్థ | లినక్స్, సొలారిస్, BSD, ఇతర యునిక్స్-వంటి |
భాషల లభ్యత | బహుళభాషలు |
రకము | ఆడియో ప్లేయర్ |
లైసెన్సు | గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ |
వెబ్‌సైట్ | రిథమ్‌బాక్స్ వెబ్ సైటు |
రిథమ్‌బాక్స్ అనేది డిజిటల్ సంగీతాన్ని ఆడించుటకు రూపొందించబడిన ఒక సంగీత ప్లేయర్. నిజానికి ఆపిల్ ఐట్యూన్స్ నుండి ప్రేరణ పొంది తయారుచేయబడింది. ఇది ఒక ఫ్రీ సాఫ్టువేర్, గ్నోమ్ డెస్కుటాప్ కొరకు జిస్ట్రీమర్ మీడియా ఫ్రేమ్ వర్కుని వాడుకుని పనిచేసేలా రూపొందించబడింది.
విశిష్టతలు
[మార్చు]రిథమ్‌బాక్స్ చాలా విశిష్టతలను కలిగివుంది. వాటిలో కొన్ని
మ్యూజిక్ ప్లేబ్యాక్
[మార్చు]వివిధ రకాల డిజిటల్ సంగీతానికి ప్లేబ్యాక్ మద్ధతు ఉంది. కంప్యూటరులో ఫైళ్ళు స్థానికంగా ఉండటం వలన సాధారణంగా ప్లేబ్యాక్ అందిస్తుంది. అంతర్జాల రేడియో, పాడ్ కాస్టులకు కూడా రిథమ్‌బాక్స్ మద్ధతుస్తున్నది.
సంగీతాన్ని దిగుమతిచేయుట
[మార్చు]ఆడియో సీడీ రిప్పింగు (ఇందుకొరకు సౌండ్ జ్యూసర్ ప్యాకేజీ అదనంగా కావాలి) ఐపాడ్ మద్ధతు
ఆడియో సీడీ బర్నింగు
[మార్చు]0.9 విడుదల నుండి, రిథమ్‌బాక్స్ లోని పాటలజాబితా ద్వారా ఆడియో సీడీలను సృష్టించవచ్చు.
ఆల్బమ్ కవర్ ప్రదర్శన
[మార్చు]0.9.5 విడుదల నుండి, ప్రస్తుతం ప్రదర్శించబడుతున్న పాట యొక్క ముఖచిత్రాన్ని ప్రదర్శిస్తున్నది.
పాటల లిరిక్స్ ప్రదర్శన
[మార్చు]0.9.5 విడుదల నుండి, ప్రస్తుతం ప్రదర్శించబడుతున్న పాట యొక్క లిరిక్సును కూడా ప్రదర్శిస్తున్నది.
లాస్ట్.ఎఫ్ఎం మద్ధతు
[మార్చు]0.9.6 విడుదల నుండి, పాటల సమాచారాన్ని ఖాతా ద్వారా లాస్ట్ ఎఫ్ఎంకు నివేదించగలదు.
DAAP భాగస్వామ్యం
[మార్చు]0.10 రూపాంతరంలో DAAP భాగస్వామ్యం కూడా మద్ధతు చేర్చబడింది.