మరమనిషి

వికీపీడియా నుండి
(రోబోట్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఎక్స్‌పో 2005 లో భాగంగా ప్రదర్శించిన అసిమో రోబో

మరమనిషి (Robot) కంప్యూటరు సాయంతో ప్రోగ్రామింగ్ చేయగలిగి, సంక్లిష్టమైన కార్యాలను నిర్వర్తించగల స్వయంచాలక యంత్రము.[1] రోబోను ఒక బయటి పరికరం ద్వారా నియంత్రించవచ్చు లేదా ఆ పరికరాన్ని దానిలోపలే ఇమడ్చవచ్చు. రోబోలను సాధారణంగా మనిషి రూపంలో తయారు చేస్తారు కానీ, చాలా వరకు రోబోలు ఏదైనా ఒక పనిని సమర్ధవంతంగా నిర్వహించగల యంత్రాలు. దానిని అందంగా తయారు చేయడం అనేది అదనపు ఆకర్షణ మాత్రమే.

రోబోలు పూర్తి స్వయంచాలకంగా ఉండవచ్చు, లేదా పాక్షికంగా స్వయంచాలకంగా ఉండవచ్చు. భవిష్యత్తులో స్వయంచాలక వస్తువులు మరింతగా విస్తరించవచ్చు. దీనికి ఉదాహరణ చోదకుడు అవసరం లేని కార్లు.[2]

రోబోల రూపకల్పన, నిర్మాణం, పరికర్మ, అనువర్తనాలు మొదలైన వాటిని గురించి, వాటిని నియంత్రించేవి, వాటి నుంచి సందేశాలను స్వీకరించి, ఆ సమాచారాన్ని విశ్లేషించే కంప్యూటర్ శాస్త్ర విభాగమే రోబోటిక్స్.[3]

మూలాలు

[మార్చు]
  1. Definition of 'robot'. Oxford English Dictionary. Retrieved 27 November 2016.
  2. "Forecasts – Driverless car market watch". driverless-future.com. Retrieved 26 September 2023.
  3. "robotics". Oxford Dictionaries. Archived from the original on 18 May 2011. Retrieved 4 February 2011.
"https://te.wikipedia.org/w/index.php?title=మరమనిషి&oldid=4362632" నుండి వెలికితీశారు