లవణరాజు కల
లవణరాజు కల' గురజాడ అప్పారావు రచించిన పద్య కావ్యం. దీని ముఖ్య ఉద్దేశం అస్పృశ్యతా నివారణోద్యమం.
ఇతివృత్తం
[మార్చు]లవణుడు కొలువుదీరి గారడీ చూడడం, ఒక తెల్లని గుర్రము పుట్టడం, అతను దాని మీద ప్రయాణము చేయడం, అది అంతటా తిరిగి ఒక అడవిలో పడగా ఒక చెట్టుతీగవల్ల క్రింద వాలడమూ, ప్రయాణ బడలిక వల్ల నిదుర చెందడం, అపుడిలా కలగాంచడం. అదియొక సంధ్యా సమయము. ఆకలితో వున్న లవణరాజుకు మధురగీతం వినిపించింది. లవణుడా వంక కెళ్ళాడు. ఒక సుందరి కనిపించింది. ఆమెపై మనసుపడి ఆమె ప్రేమను కోరి ఆరగించాడు. ఆమెను వివాహమాడి ఆ మాలపల్లెలోనే ఉన్నాడు. ఇంతలో మామ మరణించాడు. మాలవాడను మడ్డితన మల్లుకుంది. లవణదంపతులు అడవిని బట్టారు. సతీపతులు ఇద్దరూ చితిలో దూకారు. తరువాత లవణుడు మేల్కొని తన స్వప్నసుందరికై విచారింపసాగాడు. ఇంతలో ఆ స్వప్నసుందరి వచ్చింది. అందర్నీ అద్భుతాశ్చర్యాలు అలుముకున్నాయి. లవణుడు ప్రియా పరిశ్వంగములో ఒళ్ళు మరిచాడు. దీనిని గురజాడ బహు నిపుణంగా అద్భుత సన్నివేశాలతో నడిపాడు.
కొన్ని పద్యాలు
[మార్చు]- మలిన వృత్తులు మాలవారని
- కులము వేర్చిన బలియు రొక దే
- శమున కొందరు వెలికి దోసిరి మలినమే, మాల
- కులము లేదట వొక్క వేటున
- పసరముల హింసించు వారికి,
- కులము కలదట నరుల వ్రేచెడి క్రూర కర్ములకున్
- మలిన దేహుల మాల లనుచును
- మలిన చిత్తుల కథిక కులముల
- నెల వొసంగిన వర్ణ ధర్మ మ ధర్మ ధర్మంబే.
అర్ధం: బలము కలిగినవాళ్ళు మలినవృత్తులని మాలలను విడగొట్టారని మలినత్వమే మాలకాని మనుష్యులు కాదని తెలియజేశాడు. జాతి ధర్మంగా పశువులు నరికిన వారికి కులము లేకుండుట, క్రౌర్యముతో మానవుల హింసించేవారికి కులము కలుగుట అన్యాయమని దేహమలినం కలిగినవాళ్ళను మాలలని, మలినహృదయులను అధిక కులముల వారనటం అన్యాయమని చక్కగా నిశ్చయము చేశారు.
పూర్తి పాఠం
[మార్చు]s:లవణరాజు కల పూర్తి పాఠం వికీసోర్సులో చూడండి.
మూలాలు
[మార్చు]- 150 వసంతాల వావిళ్ల వాజ్మయ వైజయంతి.