Jump to content

లుకులాపు లక్ష్మణదాసు

వికీపీడియా నుండి
(లుకులాపు లక్ష్మణ దాసు నుండి దారిమార్పు చెందింది)
లుకులాపు లక్ష్మణదాసు

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుడు.
పదవీ కాలం
1955
నియోజకవర్గం పాతపట్నం

వ్యక్తిగత వివరాలు

జననం 1916
రాజకీయ పార్టీ కాంగ్రేసు పార్టీ

లుకులాపు లక్ష్మణదాసు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుడు. ఇతడు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా పాతపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి 1952 తొలిసారిగా ఎన్నికయ్యారు. 1955, 62ల్లో శాసనసభ్యునిగా గెలుపొందాడు.[1]

లక్షణదాసు 1916 లో జన్మించాడు. బి. కాం. చదువుతున్న కాలంలోనే 1939లో ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిసంఘ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. తొలిసారిగా 1942లో కాంగ్రెస్ ఉద్యమములో ప్రవేశించాడు. అనంతరం 1948 శ్రీకాకుళం కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు డైరెక్టరుగాను, 1949-53 సెంట్రల్ బ్యాంకు ఉపాధ్యక్షుడుగా, ఆంధ్రరాష్ట్ర రైతు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ సహాయ కార్యదర్శి, 1950 లో జిల్లా బోర్డు మెంబరు, రాష్ట్ర హరిజన సేవా సంఘ కార్యవర్గ సభ్యుడుగా వివిధ పదవులను నిర్వహించారు. 1952 లో అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభలో సభ్యుడుగా ఎన్నికయ్యాడు. [2] ఇతనికి విద్యాభివృద్ధి, రైతు ఉద్యమము, సహకార ఉద్యమము అంటే ప్రత్యేక అభిమానం.

మూలాలు

[మార్చు]
  1. "హ్యాట్రిక్‌ విజయాలు వీరి సొంతం". Sakshi. 2019-03-11. Retrieved 2019-07-21.
  2. "మద్రాసు శాసనసభ సమీక్ష - 1952-57" (PDF). తమిళనాడు శాసనసభ. p. 82. Archived (PDF) from the original on 2020-10-15. Retrieved 2021-11-03.

వనరులు

[మార్చు]
  • ఆంధ్ర శాసనసభ్యులు : 1955, పేజీ : 10.