విద్యుత్ సామర్థ్యం

వికీపీడియా నుండి
(వాటేజ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఘటము, బ్యాటరీ లేదా ఏదైనా శక్తి జనకం పనిచేసే రేటు దానికి సంధానం చేయబడిన విద్యుత్ సాధనంపై ఆధారపడి ఉంటుంది. ఈ విద్యుత్ సాధనాలు వాటికి అందించబదిన పనిని కాంతి లేదా ఉష్ణం వంటి మరో శక్తి రూపంలోకి మార్చుతాయి. కాబట్టి ఒక విద్యుత్ సాధనం ఎంత శక్తిని వినియోగించుకున్నది అనే అంశం, విద్యుత్ జనకం చేసిన పని నుండి నిర్థారించవచ్చు.

విద్యుత్ పని రేటును, విద్యుత్ సామర్థ్యంగా నిర్వచిస్తారు.

ఒక విద్యుత్ వలయంలోని విద్యుత్ పరికరం పనిని కాలంలో చేస్తే, ఆ పరికర విద్యుత్ సామర్థ్యం ను,

జౌలు/సెకను లేదా వాట్ గా రాయవచ్చు.

పై సమీకరణముల నుండి

అంటే సామర్థ్యం = పొటెన్షియల్ భేదం X విద్యుత్ ప్రవాహం. సామర్థ్యాన్ని ఒక విద్యుత్ జనకం, విద్యుత్ పరికరానికి అందిస్తే అది పూర్తిగా వినియోగించు కుంటుంది. కాబట్టి విద్యుత్ పరికరం వినియోగించుకున్న శక్తిని విద్యుత్ జనక సామర్థంగా తెలుసుకోవచ్చు.

వాట్

[మార్చు]

సామర్థానికి ప్రమాణం "వాట్". ఒక జౌలు పని ఒక సెకను కాలంలో జరిగితే విద్యుత్ సామర్థాన్ని ఒక వాట్ అంటాం. పై సమీకరణము నుండి వాట్ = వోల్టు x యాంపియర్.


విద్యుత్ సాధనాల వాటేజ్

[మార్చు]

విద్యుత్ సాధనాలు విద్యుచ్ఛక్తిని వినియోగించుకునే రేటుని, దాని వాటేజ్ గా నిర్వచిస్తారు.

బల్బు, ఇమ్మర్షన్ హీటరు,మైక్రోవేవ్ ఓవెన్ వంటి విద్యుత్ సాధనాలు వినియోగించుకునే సామర్థ్యాన్ని వాటేజ్ అంటారు.వాటేజిని వాట్లలో తెలియ జేస్తారు;
వాట్ గుణిజాలు సామర్థ్యం యొక్క పెద్ద ప్రమాణాలు;
1 కిలో వాట్ వాట్లు
1 మెగా వాట్ వాట్లు

యివి కూడా చూడండి

[మార్చు]