Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబరు 13

వికీపీడియా నుండి
Weasel Words వాడవద్దండి


సరైన ఆధారం లేని విషయాలలోని అస్పష్టతను కప్పిపుచ్చుకొనేలా వాడే పదజాలాన్ని Weasel Words అంటారు. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు" అని వ్రాస్తే అది నిరాధారం. ఆ సమస్యను అడ్డదారిలో అధిగమించడానికి "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని చాలామంది భావిస్తారు" అని వ్రాయడం తరచు జరుగుతుంది. ఇందులో ఉన్న నిజం కేవలం ఊహా జనితం. నిరాధారం. మొదటి వాక్యానికీ దీనికీ తేడా లేదు. ఇటువంటి పదజాలం వాడుక వికీ వ్యాసాలలో అనుచితం. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని ఇక్కడ వ్రాసిఉంది" అని చెప్పవచ్చును. ఈ విషయమై మరింత వివరణ కొరకు ఆంగ్లవికీ వ్యాసం en:Wikipedia:Avoid weasel words చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా