వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 13, 2007

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పైపు కిటుకులో ఉప కిటుకు

ఒకేలాగా ఉండే పేర్లతో వివిధ వ్యాసాలున్నపుడు అయోమయ నివృత్తి పేజీలు అవసరమౌతాయి. ముఖ్యంగా గ్రామాలకు పేజీలు తయారు చేసేటపుడు ఈ సమస్య వస్తుంది. ఒకే పేరుతో లేదా ఒకేలా ఉండే పేర్లతో వివిధ గ్రామాలు ఉన్నపుడు అయోమయ నివృత్తి కోసం వాటి పేర్లకు పక్కన బ్రాకెట్లలో వివరం కూడా రాస్తాము. ఉదాహరణకు తిమ్మాపూర్ పేరుతో అనేక పేజీలున్నాయి. వివిధ గ్రామాలను విడిగా గుర్తించడం కోసం తిమ్మాపూర్ (ఫలానా మండలం) అని రాస్తాము. ఏదైనా వ్యాసం నుండి ఈ పేజీలకు లింకు ఇవ్వాలంటే [[తిమ్మాపూర్ (మందమర్రి మండలం)]] అని రాస్తాము. ఈ లింకు అంత ముచ్చటగా ఉండదు కాబట్టి పైపు లింకును వాడి ఇలా రాస్తాము:[[తిమ్మాపూర్ (మందమర్రి మండలం)|తిమ్మాపూర్]] అప్పుడు మనకు తిమ్మాపూర్ అనే కనిపిస్తుంది. అయితే ఇలా రాసేందుకు ఒక అడ్డదారి కూడా ఉంది:

[[తిమ్మాపూర్ (మందమర్రి మండలం)|]] అని రాస్తే సరిపోతుంది. పైపు తరువాత ఏమీ లేకపోవడాన్ని, (ఖాళీ కూడా లేదు) గమనించండి.

అది ఇలా కనిపిస్తుంది:

తిమ్మాపూర్

ఇదే కిటుకు వాడి నేముస్పేసు కూడా కనబడకుండా చెయ్యవచ్చు. ఇలా:

[[వికీపీడియా:వికీ చిట్కాలు|]] (పైపు తరువాత ఏమీ లేదు, గమనించండి)

అది ఇలా కనిపిస్తుంది:

వికీ చిట్కాలు


మరింత సమాచారం కోసం: వికీపీడియా:లింకులు urlలు


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా