వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 21
స్వరూపం
(వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబర్ 21 నుండి దారిమార్పు చెందింది)
ఇతరులు సృజించిన రచనలను లేదా చిత్రాలను వికీపీడియాలో వాడుకొంటే బాగుంటుందని మీకనిపించవచ్చును. అలాంటి సందర్భంలో తప్పక గమనించవలసిన విషయాలు కొన్ని -
- వారు అనుమతి ఇవ్వకుంటే వాటిని వికీపీడియాలో వాడరాదు. ఇందుకు మినహాయింపులు లేవు అనుమతి నిరాకరించడం వారి హక్కు. దానిని గౌరవించండి.
- వారు కేవలం వికీపీడియాలో వాడుకొంటానికి అనుమతిస్తే సరిపోదు. అది ఇతరులు, వాణిజ్యావసరాలకు కూడా, వాడుకోవడం సాధ్యమై ఉండాలి. GFDL లేదా అందుకు అనుగుణమైన లైసెన్సుతో అనుమతించాలి.
- అనుమతి కోసం తయారు చేసిన కొన్ని నమూనా అభ్యర్ధనలు en:Wikipedia:Example requests for permissionలో చూడవచ్చును. వీటిని మీరు వాడవచ్చును.
ఏతావతా, వీలయినంతవరకు, ఆ రచయితలు లేదా చిత్రకారులు లేదా ఫొటోగ్రాఫరులు స్వయంగా వాటిని వికీలోకి ఎక్కించేలా ప్రోత్సహించడం అన్నివిధాలా ఉత్తమం.