Jump to content

వికీపీడియా:బాటు సృష్టించడం ఎలా?

వికీపీడియా నుండి
(వికీపీడియా:Bots నుండి దారిమార్పు చెందింది)
అడ్డదారి:
WP:MKBOT
WP:MAKEBOT

బాటును మీకు నచ్చిన స్క్రిప్టింగ్ భాషలో రాయవచ్చు కానీ ఇక్కడ ప్రస్తుతానికి కేవలం పైవికీపీడియా ఫ్రేంవర్కుతో తయారుచేసిన బాటును ఎలా ఉపయోగించాలో వివరిస్తున్నాము. ఇక్కడ వివరణ కొంచెం కట్టె కొట్టె తెచ్చె పద్ధతిలో ఉంది. విస్తారమైన వివరణకు మెటాలోని పేజీ చూడండి. అదీ సరిపోకపోతే బాటు నడపటంలో అనుభవమున్న సభ్యులను తప్పకుండా అడగండి. ఈ పేజీ యొక్క చర్చాపేజీలో కూడా మీ ప్రశ్నలు సంధించవచ్చు.

  • మీ సిస్టంలో పైథాన్ భాషను డౌన్లోడ్ చేసుకొని ఇస్టాల్ చేసుకోవాలి (http://www.python.org/download/)
  • సోర్స్‌ఫోర్జ్ నుండి పైవికీపీడియా ఫ్రేంవర్క్ ని దిగుమతి చేసుకొని పైథాన్ ని ఇన్స్టాల్ చేసిన డైరెక్టరీలో ఇన్స్టాల్ చేసుకోవాలి (http://sourceforge.net/projects/pywikipediabot/ )
  • ఇక పైవికీపీడియా డైరెక్టరీలో ఒక టెక్స్ట్ ఫైలు సృష్టించి అందులో ఈ విధంగా రాయండి.
mylang = 'te'

usernames['wikipedia']['te'] = u'మీ బాటు లాగిన్ పేరు'

console_encoding = 'utf-8'
  • ఈ టెక్స్ట్ ఫైలుకు user-config.py అని నామకరణం చెయ్యండి.