వికీపీడియా:ఫ్లో
ఈ Wikipedia page ను తాజాకరించాలి. ఇటీవలి ఘటనలను, తాజాగా అందుబాటు లోకి వచ్చిన సమాచారాన్నీ చేర్చి ఈ Wikipedia page ను తాజాకరించండి. సంబంధిత చర్చను చర్చ పేజీలో చూడవచ్చు. |
For last updates, please see mw:Flow.
ఫ్లో ('Flow)' వికిమీడియా ఫౌండేషన్ వద్ద పరస్పర సహకారంతో రూపుదిద్దుకొంటున్న ప్రాజెక్టు. వికీమీడియా ప్రాజెక్టులన్నింటిలో చర్చ మరియు సహకారాలకు ఒక అత్యాధునిక వేదికను నిర్మించటమే దీని లక్ష్యం. ఫ్లో తుదకు ప్రస్తుతమున్న చర్చాపేజీల వ్యవస్థ స్థానంలో ఫ్లో వ్యవస్థాపించబడుతుంది. ఇది అనేక ఆధునిక వెబ్‌సైట్లో ఇప్పడికే మనం చూస్తున్న సదుపాయాలను కలుగజేస్తుంది. ప్రస్తుతమున్న వికీపాఠ్యంతో అలాంటి ఫీచర్లను పొందుపరచేందుకు వీలులేదు. ఉదాహరణకు ఫ్లో ఆటోమేటిగ్గా వాడుకరి చేసిన వ్యాఖ్యలకు సంతకం చేస్తుంది, ఉత్తరప్రత్యుత్తరాలను ఒక మాలలాగా అల్లుతుంది. సభ్యునికి ఆసక్తి చర్చపై జరిగిన కొత్త మార్పులను తెలియజేస్తూ సందేశాలను కూడా పంపగలదు.
ఫ్లో ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యాలు:
- వికీ చర్చావ్యవస్థను కొత్తవాడుకరులకు మరింత అందుబాటులో ఉండేట్లు చేయటం
- వికీ చర్చావ్యవస్థను అనుభవజ్ఞులైన వాడుకరులకు మరింత సులభతరం చెయ్యటం.
- సభ్యుల మధ్య సహకారాన్ని పెంపెందించే దిశగా అర్ధవంతమైన సంభాషణలను ప్రోత్సహించడం
ఫ్లో ప్రస్తుతం మీడియావికీ.ఆర్గ్ లోని అనేక చర్చా పేజీలలోనూ, అనేక భాషల వికీపీడీయాల్లోనూ ప్రయోగాత్మకంగా వాడబడుతున్నది. 2015లో, ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతలు, వివిధ భాషల వికీపీడియాల్లోని సముదాయాలతో దగ్గరగా పనిచేస్తూ, ఫ్లోను కొన్ని పేజీలలో వ్యవస్థాపించడం, దీన్ని సమర్ధవంతగా ఉపయోగించుకోగల సందర్భాలలో దీన్ని సచేతనం చేయడం, క్రియాశీలక వాడుకర్లు మరింతగా సహకరించుకొని, కొత్త సభ్యులకు చేరువయ్యేలా చేసేందుకు కావలసిన ఫీచర్లను రూపకల్పనచేసి నిర్మించడం. వాడుకర్ల అనుభవాలు, అందించే ఫీడుబ్యాక్ ను బట్టి ప్రాజెక్టు పెరుగుతూ, మరింత మెరుగౌతుంది.
హేతువులు
[మార్చు]ఆంగ్లవికీపీడియాలో కొత్త వాడుకర్లను లక్ష్యంగా పెట్టుకొని సందేశాలు (చాలామటుకు ఆటోమేటిగ్గా ఇవ్వబడుతున్నవి) ఇస్తున్నా,[1][2] కొత్త సభ్యులు రాను రాను వికీలో జరిగే చర్చలలో చాలా తగ్గువగా పాల్గొనటం జరుగుతుందని గమనించారు[3] ప్రస్తుతమున వికీ చర్చాపేజీల వ్యవస్థ కొత్త వాడుకరి అంత సులభతరం కాదని, అది వాళ్ళు చర్చల్లో పాల్గొనేందుకు పెద్ద ఆటంకమని కూడా తెలుసుకొన్నాం[4][5][6] కొంతమంది అనుభవజ్ఞులైన సభ్యులకు కూడా ఈ వ్యవస్థ చాలా ఇబ్బందులు పెడుతున్నది.[7]
అంతేకాక, అనుభవజ్ఞులైన సభ్యులు, తాము పాల్గొంటున్న వివిధ చర్చలను, ఒక కంట కనిపెడుతూ ఉండేందుకు వివిధ రకాల ఉపకరణాలను, పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఇలాంటివి ఈ విధమైన పనిచేయటానికి సరైన సాధనాలు కాకపోయినా, గత్యంతరం లేక వాడుతున్నారు. ఇటువంటి పనిముట్లకు ఉదాహరణలు
- వీక్షణ జాబితాలు
- పేజీ మార్పుల బేధంను వంటివి.
అయితే ఇవి వాడుకరి ఆసక్తి ఉన్నతో చర్చలతో పాటు ఆసక్తిలేని చర్చలు కూడా చూపిస్తాయి. అనుభవజ్ఞులైన సభ్యులు తాము పాల్గొంటున్న వివిధ చర్చలను పేజీ బేధంతో కనిపెట్టుకొని ఉండటానికి చాలా సమయం వృధా చేస్తున్నారు. ముఖ్యంగా, తమకు ఆసక్తి ఉన్న చర్చ అంతగా క్రియాశీలకంగా కొనసాగని చర్చ అయిన సందర్భంలో ఈ సమస్య మరీ జఠిలం ఔతుంది.
ఆధునిక చర్చావేదికలపై వాడుకరులకున్న ఆపేక్షలు రాను రాను ప్రస్తుతమున్న చర్చాపేజీల వ్యవస్థకు దూరంగా జరుగుతున్నాయి అనిపిస్తున్నది. అందుకు అనుగుణంగా మన వాడుకరులకు కూడా వారివారి అవసరాలకు తగ్గ చర్చ మరియు సహకార వేదికను తప్పకుండా అందివ్వాల్సి అవసరం ఎంతైనా ఉంది.
వాడుకరుల ఆపేక్షలు | ప్రస్తుతమున్న వాస్తవికస్థితి |
---|---|
|
|
చర్చాపేజీలు—ఒక చర్చా వేదికగా—చాలా ముతకవైన, పురాతనమైన సాంకేతిక.
ఈ చర్చా పేజీల చుట్టూ అల్లుకుపోయిన సంస్కృతి ("ప్రత్యుత్తరం" మూసలు, ఇతరసభ్యులు తమ వ్యాఖ్యలను దిద్దగలిగే సౌకర్యం మొదలైనవి) కొత్తవాడుకరులకు చాలా ఆయోమయం కలుగజేస్తున్నాయి. ఇలాంటివి తప్పని కాదు, ఇతర ఆధునిక వెబ్‌సైట్లను చూసొచ్చిన సభ్యులు, ఇలాంటి పద్ధతులను జీర్ణించుకోలేకపోతున్నారు.
సరస్పర సహకారాన్ని మెరుగుపరచే పద్ధతులు, పరస్పర సహకారాన్ని పెంచుతాయు. తద్వారా అన్ని ప్రాజెక్టుల అభివృద్ధికి తోడ్పడతాయి.