విప్రనారాయణ (1937 సినిమా)

వికీపీడియా నుండి
(విప్రనారాయణ ( అరోరా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
విప్రనారాయణ
సినిమా
మూల దేశంబ్రిటిషు భారతదేశం మార్చు
సినిమా లేదా టీవీ షో మూల భాషతెలుగు మార్చు
ప్రచురణ తేదీ1937 మార్చు
విప్రనారాయణ
(1937 తెలుగు సినిమా)
దర్శకత్వం అహీంద్ర చౌదరి
తారాగణం చిత్తజల్లు కాంచనమాల,
కస్తూరి లక్ష్మీనరసింహారావు,
టంగుటూరి సూర్యకుమారి
సంగీతం ప్రఫుల్ల మిత్ర
నేపథ్య గానం కాంచనమాల, కస్తూరి నరసింహారావు
గీతరచన త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి
ఛాయాగ్రహణం నిమాయి ఘోష్
నిర్మాణ సంస్థ అరోరా పిక్చర్స్
భాష తెలుగు

1937లో విడుదలైన విప్రనారాయణ తెలుగు చిత్రాన్ని కలకత్తాలో నిర్మించారు. దీని దర్శకుడు అహీంద్ర చౌదరి, ఛాయాగ్రాహకుడు నిమాయి ఘోష్, సంగీతదర్శకుడు ప్రఫుల్ల మిత్ర తదితర సాంకేతిక వర్గమంతా బెంగాళీవాళ్ళే. ఈ సినిమాలో 12 ఏళ్ల సూర్యకుమారితో పాటపాడించటానికై ప్రత్యేకంగా ఆమె కొరకు సినిమాలో ఒక పాత్రను సృష్టించారు.[1] ఈ సినిమాతోనే ఛాయాగ్రాహకునిగా పరిచయమైన నిమాయి ఘోష్ కాంచనమాలకు తొలిసారిగా తెరపరీక్ష చేశాడు.[2] 1937, నవంబర్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రంకు ఆహింద్ర చౌదరి దర్శకత్వం వహించగా ఈ చిత్రంలో చిత్తజల్లు కాంచనమాల, కస్తూరి లక్ష్మీనరసింహారావు, టంగుటూరి సూర్యకుమారి తదితరులు నటించగా, ప్రఫుల్ల మిత్ర సంగీతం అందించాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం :అహీంద్ర చౌదరి
  • సంగీతం: ప్రఫుల్ల మిత్ర
  • నేపథ్య గానం: కాంచనమాల, కస్తూరి నరసింహారావు
  • గీతరచన: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి
  • ఛాయాగ్రహణం: నిమాయి ఘోష్
  • నిర్మాణ సంస్థ: అరోరా పిక్చర్స్

పాటలు

[మార్చు]
  1. ఆర్తత్రాణపరా రంగా అనవరతాశ్రితరక్షణ దీక్షా, గానం. కస్తూరి వెంకట నరసింహరావు
  2. ఆహాహా ఆ పిల్ల ఎవ్వతె వోహో బంగారు పసిమి తళుకు , గానం. రామబ్రహ్మం
  3. ఏ నవరసగీతికలను పాడునో నా హృది వీణ , గానం.కాంచనమాల
  4. ఏబ్రసాపడి తోటకేతెంచు నందాక పనిజేయు , గానం. కస్తూరి వెంకట నరసింహరావు
  5. ఒరే మూఢ నీ వొక్కడవే ధృతితోడ మాయా బాధ త్రోసి , గానం .కస్తూరి. వెంకట నరసింహారావు , రామబ్రహ్మం, వెంకట సుబ్బయ్య
  6. కరములు నీ పాద కైంకర్యమును మాని లలితాంగి , గానం. కస్తూరి వెంకట నరసింహరావు
  7. కరుణామృతస్యందివిలోకన పాహిమాం రంగా రంగా , గానం: బృందం
  8. కరుణింపగదవయ్య విపృపయినన్ గాసంత దోసము, గానం.కాంచనమాల
  9. కాకులు రావిపండ్లు దిని జేర శిలామయదేవమందిరా , రచన: వెంకట సుబ్బయ్య
  10. గతించెగా యవ్వనభాగ్యము ఏవిధి తాళుదున్ కాంచనమాల
  11. గతియేమున్నది నాకు నీ చరణ కైంకర్యము లేకున్న , గానం. కస్తూరి వెంకట నరసింహరావు
  12. చాల్ ఛీ ఛీ సిగ్గులేదా నీకు చాలు పొ బొంకులేలా టక్కుజేసి, గానం. సరళ, వెంకట కృష్ణయ్య
  13. దడదడమని హృదయము దిన నిశము కొట్టుకొనెడి , గానం.కాంచనమాల
  14. దేవా నాదు హృది జొచ్చితివా ఓహో దేవా , గానం. కస్తూరి వెంకట నరసింహరావు
  15. నాధా నీ పదముల కర్పణజేసెద ప్రీతితో గైకొను , గానం.కాంచనమాల
  16. నాధు కౌగలించునొ నాదు బాహులత నాదు మదిలోని వాంఛ , రచన:కాంచనమాల, రమణీ మణి
  17. నీపాదపద్మముల నిరతము గొలిచెద నెనరున బ్రోవవే, గానం. బృందం
  18. ప్రేమకు ఫలితమిట్లు గలుగునే విరిసి కనుల నింపనాయె , గానం. కస్తూరి వెంకట నరసింహరావు
  19. ప్రేమమె ధర్మము ప్రేమమె కర్మము ప్రేమమె ఈశ్వర చింత, గానం. కస్తూరి వెంకట నరసింహరావు, కాంచనమాల
  20. భరింప భరింప ప్రియ నిశ్చయము భరింప, గానం. కాంచనమాల , కస్తూరి వెంకట నరసింహరావు
  21. ముద్దులు పెట్టుకొంటాన్ ఓ పెండ్లమ నా పెండ్లమ , గానం. వెంకట కృష్ణయ్య
  22. రంగనాధ ప్రభో రావగదేల పిలిచి పిలిచి నే నలసితిన్, గానం. కస్తూరి వెంకట నరసింహరావు
  23. రంగుపిల్లా వేయకుమా పదను చూపు బాణములు
  24. రతిసుఖసారే గతమభిసారే మదనమనోహర వేషం , గానం.రామబ్రహ్మం
  25. రూపమున గుంటికాదు కురూపి కాదు వారసతియై , గానం. కస్తూరి వెంకట నరసింహరావు
  26. శ్రీహరీ కరుణాసాగరా దీనుల బ్రోవంగన్ భారంబంతయు, గానం. బృందం
  27. స్మర శాస్త్రంబు పటింపజేతు జలజాక్షధ్యానమున్ మాన్పి , గానం. కాంచనమాల
  28. స్వామి యేమని విన్నవింతు నతికష్టంబైన నా జన్మ , గానం. కాంచనమాల
  29. హరిహరి యెంతమాట యెటులాడితివే తరలాయతాక్షి , గానం. రమణీ మణి.
  30. ప్రేమ నగరమున గాంచేద సుఖము సంసారము, గానం.కాంచనమాల.

మూలాలు

[మార్చు]
  1. http://www.guardian.co.uk/news/2005/may/18/guardianobituaries.artsobituaries
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-09-28. Retrieved 2009-09-19.

3.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

బయటిలింకులు

[మార్చు]