Jump to content

వ్యవసాయ పంచాంగం

వికీపీడియా నుండి
(వ్యవసాయపంచాంగము నుండి దారిమార్పు చెందింది)

పంచాంగంను అనుసరించి చేసే వ్యవసాయంను వ్యవసాయ పంచాంగం అంటారు. ఆంధ్రప్రదేశ్‍తో పాటు దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో స్థానిక పంచాంగాన్ని అనుసరించి వ్యవసాయం చేస్తుంటారు. పంచాంగాన్ని అనుసరించి వేసే పంటల వలన పంట సులభంగా బతకడమే కాకుండా అధిక దిగుబడులు రావడానికి అవకాశాలున్నాయి.

వివిధ కార్తెల్లో చేయవలసిన వ్యవసాయ పనులు[1]

[మార్చు]

అశ్వని కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - అశ్వని కార్తె

సజ్జ : వేసవి పైరు కోతలు వరి : కోతలు, కత్తెరకు (కృత్తిక) వరి నారు పోయుట.

జొన్న : వేసవి జొన్న పంట సాగు.

మొక్కజొన్న : వేసవి పంట విత్తుట.

వేరుశనగ : త్రవ్వకాలు

భరణి కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - భరణి కార్తె

వేసవి పనులు

కృత్తిక కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - కృత్తిక కార్తె

వేసవి పనులు

రోహిణి - మృగశిర కార్తెలు

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - రోహిణి కార్తె మరియువ్యవసాయ పంచాంగం - మృగశిర కార్తె

వరి : సార్వ లేక అబి వరినారు పోయుట, వరి వేయబోయే పొలాల్లో ఎరువులు వేయుట.

మొక్కజొన్న : దమ్ములు చేయుట. ఎరువులు వేసి దుక్కులు దున్నుట, ఖరీఫ్ పంటలను విత్తుట.

కాయ ధాన్యాలు : తక్కువ పంటకాలపు పెసర, మినుము, కంది విత్తుట, అంతర కృషి చేయుట.

గోగు : రసాయనిక ఎరువులు వేయుట.

పసుపు : భూమిని తయారు చేయుట, ఎరువులు వేయుట, విత్తనం వేయుట (కడప, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో)

కూరగాయాలు : బెండ, గోరుచిక్కుడు విత్తుట, గుమ్మడి, సొర, పొట్ల, కాకర పాదులు పెట్టుట.

సజ్జ : ఎరువులు వేసి దుక్కులు దున్నుట.

ప్రత్తి : ఎరువులు వేసి దుక్కులు దున్నుట. విత్తనం వేయుట.

పండ్లు : ద్రాక్షకు క్రిమి సంహారక మందులు చల్లుట, ఎరువులు వేయుట, నిమ్మకు ఎరువులు, రేగు, దానిమ్మ మొక్కల నాట్లు. (అంటు కట్టే మొక్కలకు మామిడి టెంకలు నాటడం).

వేరుశనగ : రసాయనిక ఎరువులు వేసి విత్తుట.

సువాసన మొక్కలు : రూషాకామంచి, పాల్మా రోజా విత్తనాలు చల్లటం.

ఆర్ధ్ర కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - ఆర్ధ్ర కార్తె

వరి : నారుమళ్లలో అంతరకృషి, సస్యరక్షణ

జొన్న : దుక్కులు దున్నుట, రసాయనిక ఎరువులు వేయుట, విత్తనం వేయుట.

మొక్కజొన్న : సస్యరక్షణ - రెండవ దఫా ఎరువులు వేయుట.

ప్రత్తి : అంతరకృషి, మొక్కలను పలుచన చేయుట.

గోగు : అంతరకృషి, మొక్కలను పలుచన చేయుట.

పండ్లు : అరటి, మామిడి, జామనాట్లు, కొబ్బరి చెట్లకు ఎరువులు వేయుట, రేగు, దానిమ్మ నాట్లు.

పప్పుధాన్యాలు : వర్షాలు ఆలస్యం అయినచో కంది విత్తుటకు భూమిని తయారు చేయుట - విత్తుట.

కూరగాయలు : బీర, సొర, పొట్ల, గుమ్మడి విత్తుట.

సువాసన మొక్కలు : నిమ్మగడ్డి, కామాక్షిగడ్డి, సిట్రొనెల్లా నాట్లు.

పునర్వసు కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - పునర్వసు కార్తె

వరి : సార్వా లేక అబి వరినాట్లు, ముందుగా నాటిన వరిలో అంతరకృషి, సస్యరక్షణ.

సజ్జ : రసాయనిక ఎరువులు వేసి పునాస లేక ఖరీఫ్ పైరు విత్తుట.

వేరుశనగ : అంతరకృషి, సస్యరక్షణ.

ఆముదం : రసాయనిక ఎరువులు వేసి విత్తుట.

మిరప : నారుమళ్లలో విత్తులు జల్లుట.

పసుపు : దుగ్గిరాల ప్రాంతంలో నాట్లకు భూమిని తయారు చేయుట, ఎరువులు వేయుట, గోదావరి ప్రాంతంలో పైరులో కలుపు తీయుట, గొప్పు త్రవ్వుట, (త్రవ్వటం).

పూలు : చేమంతి నారు పోయుట, గులాబి, మల్లె కనకాంబరం చెట్లకు ఎరువులు వేయుట. సస్యరక్షణ.

జొన్న : పునాస లేక ఖరీఫ్ జొన్న విత్తుట. విత్తిన పంటకు ఎరువులు వేయుట. సస్యరక్షణ.

మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ. నెలాఖరులో ఎరువులు వేయుట.

పసుపు : దుగ్గిరాల ప్రాంతంలో పసుపు నాట్లు.

చెరకు : సస్యరక్షణ, ఎరువులు వేయుట.

పండ్లు : మామిడి, నిమ్మ, నారింజ, అరటి, సపోటాలకు ఎరువులు వేయుట, ద్రాక్ష తీగలను పారించుట, మందులు చల్లుట. జామ, సపోటాలకు అంట్లు కట్టుట. దానిమ్మ, రేగు, అనాస నాట్లు వేయుట.

కొర్ర : ఎరువులు వేయుట, దుక్కి తయారు చేయుట.

వేరుశనగ : అంతరకృషి, సస్యరక్షణ.

ఆముదం : కలుపు తీయుట, సస్య రక్షణ.

మిరప : నారుమళ్ళలో సస్యరక్షణ.

కూరగాయలు : చేమ, వంగనాట్లు.

సువాసన మొక్కలు : కామంచి గడ్డి, నిమ్మగడ్డి మొక్కల నాట్లు.

పుష్యమి కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - పుష్యమి కార్తె

వరి : సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట.

జొన్న : అంతరకృషి, మొక్కలు పలుచన చేయుట, సస్యరక్షణ.

మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ.

కొర్ర : విత్తనం వేయుట.

మిరప : నాట్లకు భూమి తయారు చేయుట.

పొగాకు : నారుమళ్లు తయారు చేయుట.

పండ్లు : తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో నిమ్మ జాతి మొక్కలు నాటుట. దానిమ్మ, రేగు, అనాస నాట్లు.

వనమహోత్సవం : చెట్లనాట్లకు తయారీ, పొలాల గట్లపై చెట్లనాట్లకు తయారి.

పశువులు : దొమ్మ, పారుడు, గురక, గాలికుంటు, యితర వ్యాధుల నుండి కాపాడుటకు చర్యలు.

ఆశ్లేష కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - ఆశ్లేష కార్తె

జొన్న : అంతరకృషి, రెండవ దఫా ఎరువులు వేయుట, సస్యరక్షణ

సజ్జ : అంతరకృషి, సస్యరక్షణ

వేరుశనగ : సస్యరక్షణ.

ఆముదం : రసాయనిక ఎరువులు వేయుట, అంతరకృషి, సస్యరక్షణ.

మిరప : నారుమళ్ళలో సస్యరక్షణ.

పొగాకు : నారుపోయుట, తర్వాత సస్యరక్షణ.

పసుపు : అర్మూర్, మెట్టుపల్లి, కోరట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పసుపులో కలుపు తీయుట, ఎరువులు వేయుట, కృష్ణా జిల్లాలో భూమిని తయారు చేయుట, విత్తడం పూర్తి చేయుట.

వరి : అంతరకృషి, సస్యరక్షణ, ఉల్లికోడు తట్టుకొనే రకాల నాట్లు పూర్తిచేయుట.

మొక్కజొన్న : రసాయనిక ఎరువులు వేయుట.

కొర్ర : ఆలస్యంగా వర్షాలు పడినచో వెంటనే విత్తనం వేయుట.

రాగి : మే నెలలో విత్తిన రాగి కోతలు.

కాయధాన్యాలు : తక్కువ పంటకాలపు పెసర, మినుము కోతలు, కంది పంటకు కలుపు తీయుట.

ప్రత్తి : అంతరకృషి, రసాయనిక ఎరువులు వేయుట.

మాఘ కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - మాఘ కార్తె

జొన్న : మాఘీ జొన్నకు నేల తయారీ.

సజ్జ : సస్యరక్షణ.

కొర్ర : రసాయనిక ఎరువులు వేసి అంతరకృషి చేయుట.

ఆముదం : అంతరకృషి, సస్యరక్షణ, దాసరి పురుగు నివారణ

పొగాకు : నారుమళ్ళలో సస్యరక్షణ, పొగాకు వేయు చేలలో దుక్కులు తయారు చేయుట.

పసుపు : మే, జూన్, జూలై నెలల్లో నాటిన పైరులో సస్యరక్షణ, ఎరువులు వేయుట.

వరి : సస్యరక్షణ, కలుపు తీయుట, రెండవ దఫా ఎరువులు వేయుట.

కాయధాన్యాలు : తక్కువ పంటకాలపు మినుము పంటకు వస్తుంది.

వేరుశనగ : సస్యరక్షణ.

ప్రత్తి : సస్యరక్షణ

మిరప : నారుమడిలో సస్యరక్షణ, నాట్లకు దుక్కులు తయారు చేయుట.

పశుగ్రాసాలు : చలికాలపు పశుగ్రాసాల నాట్లకు నేలను తయారు చేయుట, విత్తనం సేకరించుట.

పశువులు : వ్యాధులు రాకుండా టీకాలు వేయించుట.

చేపల పెంపకం : మడుగులు నిర్మించుట, విత్తనం సేకరించుట.

అటవీ శాస్త్రం : మెట్టపొలాల గట్లపై చెట్లు నాటుట.

పండ్లు : జీడిమామిడి తోటల నాట్లు, మామిడి మొక్కల నాట్లు, ఎరువులు వేయుట.

పుబ్బ కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - పుబ్బ కార్తె

వరి : రసాయనిక ఎరువులు వేయుట, సస్యరక్షణ, కలుపు తీయుట.

జొన్న : రబీ జొన్న వేయుటకు దుక్కులు తయారు చేయుట.

వేరుశనగ : సస్యరక్షణ, ఎరువులు వేయుట.

పసుపు : ఆగస్టులో నాటిన పైరులో కలుపు తీయుట, జూన్‍లో నాటిన పంటకు పొటాష్ వంటి ఎరువులు వేయుట. సస్యరక్షణ చర్యలు.

కూరగాయలు : క్యాబేజి, కాలిఫ్లవర్ పంటలకు నారు పోయుట.

ఉత్తర కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - ఉత్తర కార్తె

సజ్జ : రబీ పంటలకు రసాయనిక ఎరువులు వేయుట, విత్తుట.

వేరుశనగ : సస్యరక్షణ.

ఆముదం : సస్యరక్షణ.

మిరప : మిరప తోటలలో ఖాళీలను పూరించుట, సస్యరక్షణ, అంతరకృషి.

పొగాకు : నారుమడిలో సస్యరక్షణ, పొగాకు వేయబోయే చేలలో దుక్కులు దున్నుట.

కూరగాయలు : వంగ, టొమాటో నాట్లు.

పండ్లు : ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో నిమ్మ మొక్కలు నాటుట. అరటి నాట్లకు నేలను తయారు చేయుట. విత్తనం పిలకలను సేకరించుట.

సజ్జ : కోతలు

నువ్వులు : జూన్ నెలలో వేసిన పైరు కోతలు

ప్రత్తి : సస్యరక్షణ

పశుగ్రాసాలు : శీతాకాలపు పశుగ్రాసాల విత్తనం సేకరించుట, నేలను తయారు చేయుట.

హస్త - చిత్త కార్తెలు

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - హస్త కార్తె, వ్యవసాయ పంచాంగం - చిత్త కార్తెలు

జొన్న : జూలై నెలలో విత్తిన పైరులో సస్యరక్షణ. రబీ జొన్న విత్తుట, సస్యరక్షణ.

కాయధాన్యాలు : కోతలు, దీర్ఘకాలపు కందికి సస్యరక్షణ, ఉలవ, శనగ విత్తుట.

వేరుశనగ : గుత్తి రకం కాయ తీయుట.

మిరప : అంతరకృషి, సస్యరక్షణ, పచ్చికాయ ఏరుట.

ఉల్లి : నారు పోయుట.

పూలు : గులాబి కత్తిరించుట, ఎరువులు వేయుట.

మొక్కజొన్న : కోతలు.

ప్రత్తి : సస్యరక్షణ.

ఆముదం : అరుణ పైరులో కాయ తీయుట ప్రారంభించుట.

పొగాకు : నాట్లు, మూడవ వారంలో ఖాళీలను పూరించడం.

పసుపు : సస్యరక్షణ, జూన్ నెలలో నాటిన పైరులో కలుపు తీయుట, రసాయనిక ఎరువులు వేయుట, జూలై నెలలో నాటిన పైరులో అంతరకృషి.

కొర్ర : కోతలు

కుసుమ : విత్తుట.

ధనియాలు : విత్తుట.

వాము : విత్తుట.

పశుగ్రాసాలు : లూసర్న్, బర్సీము, పిల్లిపెసర, జనుము విత్తుట.

పండ్లు : కోస్తా జిల్లాల్లో అరటి పిలకల నాట్లు, రేగు పండ్ల మొక్కలు, దానిమ్మ మొక్కల నాటు.

స్వాతి కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - స్వాతి కార్తె

వరి : తక్కువ పంటకాలపు రకాల కోతలు.

జొన్న : రబీ జొన్నలో సస్యరక్షణ, ఖరీఫ్‍లో వేసిన తక్కువ పంట కాలపు రకాలు కోతకు వచ్చుట.

వేరుశనగ : తీగ రకం కాయ తీయుట.

గోగు : కోతలు.

పొగాకు : అంతరకృషి

ఆలుగడ్డ : నాటుటకు భూమిని తయారు చేయుట.

మొక్కజొన్న : రబీ పంటకు విత్తనాలు వేయుట.

పశుగ్రాసాలు : చలికాలపు పశుగ్రాసాలు విత్తుట. (పిల్లిపెసర, లూసర్న్)

చిలగడ దుంప : నాటుట.

విశాఖ కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - విశాఖ కార్తె

జొన్న : రబీ జొన్నలో అంతరకృషి, తొందరగా విత్తిన వాటికి సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట.

మొక్కజొన్న : రబీ పంటకు విత్తనం వేయుట.

గోధుమ : భూమిని తయారు చేయుట, ఎరువులు వేయుట, రెండవ వారంలో విత్తుట.

ప్రత్తి : ఖరీఫ్ ప్రత్తిలో ఎరువులు.

గోగు : కోసిన గోగు మొక్కలను నీటిలో ఊర వేయుట.

మిరప : అంతరకృషి, సస్యరక్షణ.

పొగాకు : అంతరకృషి, సస్యరక్షణ.

ఉల్లి : నాట్లు.

కాయధాన్యాలు : తక్కువ పంట కాలపు పెసర, మినుము, వరి పండిన పొలాల్లో చల్లుట, కందికి సస్యరక్షణ.

పసుపు : సస్యరక్షణ, జూన్ నెలలో నాటిన పైరులో ఎరువులు వేయుట, ఆఖరి సారి నాగలితో అంతరకృషి.

కాయగూరలు : క్యాబేజి, కాలిఫ్లవర్ నాట్లు, కంద నాట్లు, బిన్నీసు విత్తుట.

పండ్లు : మామిడి తోటలకు సస్యరక్షణ, అరటి నాట్లు.

అనూరాధ కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - అనూరాధ కార్తె

వరి : మధ్య కాలిక రకాల కోతలు, రబీ పైర్లకు నారు పోయుట.

మొక్కజొన్న : సస్యరక్షణ.

మిరప : తోటలలో సస్యరక్షణ.

చెరకు : చెరకు తోటలు కొట్టడం ప్రారంభం. కార్శి తోటల పెంపకం, బెల్లం తయారి, చెరకు పిప్పిని పాతరవేయుట.

గోధుమ : ఇంకా విత్తనచో వెంటనే విత్తనం వేయుట.

జొన్న : రబీ పైరులో సస్యరక్షణ.

గోగు : నార తీయుట.

పసుపు : సస్యరక్షణ.

పశుగ్రాసాలు : చెరకు పిప్పిని పాతర వేసి పశుగ్రాసంగా మార్చడం.

కాయధాన్యాలు : కంది విత్తడం

పశువులు : ఈనిక కాలంలో మాయ పడనిచో తగు జాగ్రత్తలు తీసికొనుట, దూడలకు ఏలిక పాములు రాకుండా నివారణ చర్యలు.

పండ్లు : ఫాల్సా కత్తిరింపులు, ఉసిరి కాయలు మార్కెటింగ్, పచ్చళ్ళ తయారీ.

సువాసన మొక్కలు : కోతలు, సుగంధ తైలం తీయుట.

జ్యేష్ఠ కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - జ్యేష్ఠ కార్తె

వరి : దీర్ఘకాలిక రకాల కోతలు, రబీ నారుమళ్ళకు ఎరువులు వేయుట, సస్యరక్షణ.

మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట.

గోధుమ : అంతరకృషి, సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట.

కాయధాన్యాలు : దీర్ఘకాలిక కంది రకాలు కోతకు వచ్చుట.

మిరప : సస్యరక్షణ.

పొగాకు : తలలు త్రుంచుట, సస్యరక్షణ.

చెరకు : నరుకుట, బెల్లం తయారీ.

పసుపు : ఆగస్టులో నాటిన పైరుకు రసాయనిక ఎరువులు వేయుట. అన్ని ఋతువుల్లో నాటిన పైర్లకు సస్యరక్షణ, ఎరువులు వేయుట.

పూలు : గులాబీల్లో బడ్డింగ్ చేయుట, ఎరువులు వేయుట.

ప్రత్తి : మాగాణి ప్రత్తికి భూమిని తయారు చేయుట.

ఆముదం : దీర్ఘకాలిక రకాల కాయ తీయుట ప్రారంభించుట.

పండ్లు : ఫాల్సా కత్తిరింపులు, ఉసిరిక, నిమ్మకాయ పచ్చళ్ల తయారీ.

సువాసన మొక్కలు : కోతలు, తైలం తీయుట.

మూల కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - మూల కార్తె

వరి : నారుమడికి ఎరువులు వేయుట, దాళ్వా లేక తాబి వరినాట్లకు పొలం తయారు చేయుట.

మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ, ఎరువులు వేయుట.

గోధుమ : సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట.

రాగులు : రాగి విత్తుట.

కాయధాన్యాలు : పెసర, మినుములను వరి పండించిన భూముల్లో విత్తుట, కంది కోతలు, కంది మొడెం పంటగా సాగు చేయుట.

మిరప : పండు కాయలు కోయుట.

చెరకు : తెలంగాణా జిల్లాలో నాట్లు.

ఉల్లి : వరి పండించిన నేలల్లో నాటుట.

వేరుశనగ : వరి పండించిన చేలలో విత్తుట.

పండ్లు : అరటికి పిలకలు తీయుట. నాటిన పిలకలకు ఎరువులు వేయుట.

పూర్వాషాడ - ఉత్తరాషాడ కార్తెలు

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - పూర్వాషాడ కార్తె, వ్యవసాయ పంచాంగం - ఉత్తరాషాడ కార్తె

వరి : తాబీ లేక దాళ్వా వరి నాట్లు, నాటిన వరికి కలుపు తీయుట, సస్యరక్షణ.

జొన్న : సంకర జొన్నకు నేలను తయారు చేయుట, విత్తనం వేయుట.

సజ్జ : వేసవి పంటకు నేల తయారి - విత్తనం వేయుట.

ప్రత్తి : మాగాణి ప్రత్తికి నేలను తయారు చేయుట.

మొక్కజొన్న : ఎరువులు వేయుట, అంతరకృషి.

పసుపు : మే నెలలో ఆర్మూర్, కొరుట్ల, మెట్టుపల్లి, యితర ప్రాంతాలలో నాటిన కస్తూరి రకం పసుపు త్రవ్వుట, విత్తనం నిల్వ చేసుకొనుట.

వేరుశనగ : డిశంబరులో విత్తిన వేరుశనగకు అంతరకృషి, తెలంగాణా ప్రాంతంలో నీటి వసతి క్రింద విత్తుట.

ఆముదం : విత్తుట

చెరకు : తెలంగాణా జిల్లాల్లో నాటిన పైరుకు, కార్శి తోటల్లో ఎరువులు వేయుట, సస్యరక్షణ, కోస్తా రాయలసీమల్లో క్రొత్త తోటలను నాటుట.

పప్పు దినుసులు : వరి పొలాలందు (మాగాణిలో) నవంబరులో వేసిన మినుము, పెసర కోతలు.

కూరగాయలు : బఠాణికాయ ఏరుట, ధనియాలు కోతలు

పండ్లు : మామిడిపై తేనె మంచు పురుగు నివారణ చర్యలు, అరటి, ద్రాక్ష నాట్లకు గుంతలు త్రవ్వుట, ఉసిరి కాయలు అమ్ముట, నిల్వచేయుట.

పువ్వులు : గులాబి, మల్లెల కత్తిరింపులు, ఎరువులు వేయుట, చేమంతి పూల కోతలు.

ధాన్య నిల్వలు : విత్తనాలు నిల్వ చేసుకొనుటలో జాగ్రత్తలు తీసుకొనుట, నిల్వ ఉంచిన ధాన్యానికి పురుగు పట్టకుండా శాస్త్రీయ పద్ధతులను పాటించుట.

శ్రవణం కార్తె

[మార్చు]

ధనిష్ఠా కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - ధనిష్ఠా కార్తె

వరి : ముందు మాసాల్లో నాటిన వరికి రెండవ దఫా ఎరువులు వేయుట, కలుపు తీయుట.

జొన్న : రబీ జొన్న కోతలు, వేసవి పంటకు ఎరువులు వేయుట, అంతరకృషి.

గోధుమ : కోస్తా జిల్లాల్లో కోతలు, తెలంగాణాలో నీరు పెట్టుట, సస్యరక్షణ, ఎలుకల నిర్మూలన.

సజ్జ : వేసవి పంట విత్తుట, ఎరువులు వేయుట.

ప్రత్తి : మొక్కలు పలచన చేయుట. ఎరువులు వేయుట, సస్యరక్షణ

చెరకు : మూలకార్తెలో (ముందు మాసాలలో) నాటిన పంటకు, కార్శి తోటలకు ఎరువులు వేయుట.

వేరుశనగ : వరి పొలాల్లో వేసిన పంటకు సస్యరక్షణ

కుసుమ : కోతలు మార్కెట్‍కు పంపుట

ఆముదం : ముందు మాసాలలో విత్తిన పంటకు సస్యరక్షణ

పొగాకు : ఆకు కోత, క్యూరింగ్ చేయుట.

మిరప : కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో పండు కాయ ఏరుట, అమ్ముట

పండ్లు : ద్రాక్ష గుత్తులు కత్తిరించుట - మార్కెట్‍కు సస్యరక్షణ, పండ్లను నిల్వ చేయుట.

శతభిషా కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - శతభిషా కార్తె

మినుము : వరి మాగాణుల్లో వేసిన మినుము కోతలు.

వేరుశనగ : వేసవి పంటకు సస్యరక్షణ, తెలంగాణా జిల్లాల్లో విత్తిన పంటకు ఎరువులు వేయుట.

ఆముదం : సస్యరక్షణ, తెలంగాణాలో విత్తిన పంటకు అంతరకృషి.

పసుపు : సస్యరక్షణ, తెలంగాణాలో విత్తిన పంటకు అంతరకృషి.

కూరగాయలు : బెండ విత్తుట, బీర, సొర పాదులు వేయుట, టమాట, వంగ విత్తనం తీయుట.

మెంతులు : కోతలు - విత్తనం తీయుట.

జీలకర్ర : కోతలు - విత్తనం తీయుట.

పండ్లు : ద్రాక్ష గుత్తులు కోయుట - అమ్ముట, పండ్ల పానీయాలు తయారు చేయుట.

మిరప : ఏరుట, మార్కెట్‍కు పంపుట.

పూర్వాబాధ్ర కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - పూర్వాబాధ్ర కార్తె

వరి : రెండవ పంటకు ఎరువులు వేయుట, సస్యరక్షణ

గోధుమ : తెలంగాణా రాయలసీమ జిల్లాల్లో కోతలు.

జొన్న : వేసవి పంటకు సస్యరక్షణ.

ప్రత్తి : ఎరువులు వేయుట - సస్యరక్షణ, ఎడ సేద్యం.

రాగి : రబీ రాగి కోతలు

సజ్జ : సస్యరక్షణ

వేరుశనగ : ఎరువులు - సస్యరక్షణ

పసుపు : జూలైలో నాటిన పసుపు త్రవ్వుట.

మిరప : ఎండు కాయలు అమ్ముట, విత్తనం తయారు చేయుట.

పొగాకు : ఆకు కోయుట, క్యూరింగ్

చెరకు : జనవరిలో నాటిన పైరుకు ఎరువులు వేయుట, సస్యరక్షణ

పప్పుదినుసులు : మాగాణిలో విత్తిన పెసర, మినుము పంటకు వచ్చుట.

ఆకుకూరలు : పాల, తోట, చుక్క కూరలు విత్తుట.

అల్లం : పంట త్రవ్వకాలు

పువ్వులు : చేమంతి పూలు ఏరుట.

ఉత్తరబాధ్రా కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - ఉత్తరబాధ్రా కార్తె

పసుపు : పంటకాలు మార్కెట్‍కు పంపుట, విత్తనం సేకరించుట.

ఆముదం : సస్యరక్షణ

అల్లం : త్రవ్వకాలు, అమ్మకాలు, శొంటి తయారీ.

గోధుమ : ఆలస్యంగా విత్తిన పంట కోతలు

వేరుశనగ : డిశెంబర్‍లో విత్తిన పంట నుండి కాయ త్రవ్వుట.

పండ్లు : ద్రాక్ష పండ్ల ఎగుమతి, నిల్వలు పానీయాలు తయారు చేయుట.

కూరగాయలు : వేసవి కూరగాయల పెంపకం.

పప్పు దినుసులు : పెసర, మినుము కోతలు

ఖర్భూజ తర్బూజ : సస్యరక్షణ, తొందరగా విత్తిన పంటలు కోతలకు తయారగుట.

ఉల్లిగడ్డ : డిశంబర్‍లో నాటిన ఉల్లి త్రవ్వకాలు

వరి : అశ్వని కార్తెలో వేయబోయే వరిని విత్తుట

రేవతి కార్తె

[మార్చు]

ప్రధాన వ్యాసం వ్యవసాయ పంచాంగం - రేవతి కార్తె

వరి : స్వల్పకాలిక రకాల కోతకు తయారి, అశ్వనీ కార్తె వరికి పొలం తయారి.

జొన్న : జనవరి మొదటి వారంలో విత్తిన జొన్న కంకులకు పురుగుల నుండి రక్షణ.

వేరుశనగ : డిశంబర్ ఆఖరులో విత్తిన పంట త్రవ్వకాలు.

ప్రత్తి : మాగాణి ప్రత్తిలో కాయ తొలిచే పురుగు నివారణకు మందులు చల్లుట

చెరకు : అంతరకృషి, నీరు పెట్టుట, బోదె సవరింపులు

పసుపు : ఆగస్టులో నాటిన పంట త్రవ్వకాలు, వండుట, మార్కెట్‍కు పంపుట.

పొగాకు : అమ్మకాలు.

పండ్లు : నిమ్మ, నారింజలో ఎండు కొమ్మల కత్తిరింపు, బోర్డో మిశ్రమం పూయుట, గజ్జి రాకుండా మందులు చల్లుట, ద్రాక్ష అమ్మకాలు పూర్తి చేయుట, అరటికి అంతరకృషి.

కూరగాయలు : ఉల్లిగడ్డల త్రవ్వకం, ఆకు కూరలకు ఎరువులు వేయుట, కాకర పాదులు తయారు చేయుట.

అల్లం : త్రవ్వకాలు పూర్తి చేయుట, దుక్కులు తయారు చేయుట.

ముద్రణలు

[మార్చు]

ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతి సంవత్సరం ఏ కార్తెలో ఏ పంటలు వేయాలి, ఏ పంటలు వేస్తే అధిక దిగుబడులు వస్తాయి, ఏ నేలలో ఏ పంటలు వేయాలి, ఏ పంటలు వేస్తే అధిక లాభాలు వస్తాయి వంటి అనేక విషయాలను కూలంకషంగా వివరించిన పుస్తకాన్ని ముద్రించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అంకితమిస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ముద్రించిన వ్యవసాయ పంచాంగం