శాంతిస్వరూప్
జయంతి శాంతి స్వరూప్ ప్రభుత్వ ప్రచార సాధనమైన దూరదర్శన్ లో తొలి తెలుగు యాంకర్, అదే దూరదర్శన్ (టెలివిజన్)లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి .[1][2]
బాల్యం, కుటుంబం
[మార్చు]శాంతి స్వరూప్ గారి ఇంటి పేరు జయంతి. వారిది వైదికి వెలనాటీయ బ్రాహ్మణ కుటుంబం. వారి తండ్రిగారిది నందిగామ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం; తల్లిగారిది బాపట్ల.
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ గారు చిన్ననాటనే తండ్రి, ఆ తర్వాత... పెంచి పెద్దచేసిన అన్నయ్య కాలం చేయడంతో కుటుంబ భారం మోసారాయన. శ్రద్ధాశక్తులతో వార్తలు చదివిన ఆయన 1980 లో సహ సీనియర్ యాంకర్ రోజా రాణి ని జీవిత భాగస్వామి గా చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. వారిద్దరూ ఐ ఐ టీ చేసి అమెరికాలో స్థిరపడ్డారు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు.. బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్ టీ రామారావు ప్రారంభించారు… తెలుగు టీవీ చరిత్రలో తొలిసారి ప్రసారమైన వార్తల్లోని ముఖ్యాంశాలు ఇవి. దూరదర్శన్ చానల్ లో సాయంత్రం 7 గంటలకు 1983 నవంబర్ 14వ తేదీన ప్రసారమైన ఈ వార్తలు బులిటెన్ ప్రారంభం అయ్యింది. అప్పట్లో ఒక సంచలనం. వాటిని లైవ్ లో చదివి వినిపించింది, ఇప్పుడు చాలా మంది న్యూస్ రీడర్లు గురువుగా భావించే శాంతి స్వరూప్. జీవన, సాహిత్య సారాన్ని అవపోసనపట్టి యాంకర్ బాధ్యతను సమర్ధంగా నిర్వహించారు. 2011 లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు[3].
వృత్తి
[మార్చు]ఆయన వృత్తి రీత్యా 1977 అక్టోబర్ 23 లోనే లాంఛనప్రాయంగా హైదరాబాద్ వచ్చిన డీ డీ ఎదుగుదలను దగ్గరి నుంచి చూసిన శాంతి స్వరూప్ తెలియని నాటి తరం తెలుగువాళ్ళు బహుశా ఉండరేమో! వార్తలు చదవడం కోసం ఆయన 1978 లో ఉద్యోగం లో చేరినా ఆయన వార్తలు చదవడానికి 1983 దాకా వేచి చూడాల్సి వచ్చింది[4].మూడు దశాబ్దాల క్రితం కనీసం టెలీ ప్రాంప్టర్ కూడా లేదు. దీంతో స్క్రిప్ట్ పేపర్లనే బట్టీ పట్టి వార్లు చెప్పారు శాంతి స్వరూప్. వార్తలు ప్రారంభమైన పదేళ్ల పాటు అదే పరిస్థితి. టెలీ ప్రాంప్టర్ లేదు.. తప్పులు జరగకుండా చాలా బట్టీ పట్టి వార్తలు చదివే వాడిని.. మిగిలిన వారు అందరూ భయపడ్డారు ఎక్కడ తప్పులు చదువుతానోనని” అంటూ ఆనాటి జ్ఞాపకాలని ఆయన అంటారు.[5]
రచయితగా
[మార్చు]ఆయన "రాతిమేఘం" అనే నవల భోపాల్ గ్యాస్ దుర్ఘటనమీద, "క్రేజ్" అనే నవల క్రికెట్ మీద, "అర్ధాగ్ని" అనే నవల సతీ సహగమనానికి వ్యతిరేకంగానూ రాశారు.
మంచి వక్త
[మార్చు]తెలుగు లో మొట్ట మొదటి యాంకర్ అయిన శాంతి స్వరూప్ ఈ మధ్యన పలు టీవీ ఛానళ్లలో దర్శనం ఇస్తున్నారు.[6] ఎంతో ఉత్సాహంగా ఆయన పలు విషయాలు చెబుతారు. "వార్తలు చదవకండి. వార్తలు చెప్పండి....,"అని శాంతి స్వరూప్ గారు పిల్ల యాంకర్లకు సలహా చెబుతారు. 24 గంటలూ ఇచ్చే వార్తలు లేవని, అయినా వండి వార్చడం ఘోరంగా తయారయ్యిందని అని ఆయన అంటారు.
పురస్కారాలు
[మార్చు]- లైఫ్ టైం అఛీవ్‌మెంటు అవార్డు.[7]
మరణం
[మార్చు]శాంతి స్వరూప్ గుండెపోటుతో హైదారాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2024 ఏప్రిల్ 5న తుదిశ్వాస విడిచాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.[8]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Shanti Swaroop's Autobiography!". greatandhra.com. Archived from the original on 2017-11-02. Retrieved 2017-11-15.
- ↑ "'యాంకరింగ్ అంటే కత్తిమీద సాము లాంటిది : శాంతిస్వరూప్ -". www.andhrajyothy.com. Archived from the original on 2018-06-08. Retrieved 2018-06-08.
- ↑ https://www.youtube.com/watch?v=JCr2k7Q16Wg
- ↑ https://www.youtube.com/watch?v=AQEyQKpTbuQ
- ↑ Singh, T. Lalith (2015-04-05). "The doyen looks back". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2017-11-15.
- ↑ "నమస్కారం.. వార్తలు చదువుతోంది: దూరదర్శన్ వార్తలకు 34 ఏళ్లు". Archived from the original on 2017-11-15. Retrieved 2017-11-15.
- ↑ Reporter, Staff; Reporter, Staff (2010-12-29). "Lifetime achievement award for Shanti Swaroop". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2017-11-15.
- ↑ "తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత | first telugu news reader shanti swaroop passed away". web.archive.org. 2024-04-05. Archived from the original on 2024-04-05. Retrieved 2024-04-05.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)