శీతకుండ

వికీపీడియా నుండి
(శీత కుండ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మామిడి తోటలో ఏర్పాటు చేసిన శీతకుండ
మామూలు దిష్టి బొమ్మ

పైరు ఉన్న పొలాలలో లేదా తోటలలో తెల్లని బొట్టులు పెట్టిన నల్లని కుండ కర్రపై బోర్లించబడి ఉంటుంది, ఈ కుండనే శీత కుండ అంటారు. పైరుకు ఎక్కువగా చీడపీడలు ఆశించే శీతాకాలంలో ఈ కుండలను ఏర్పాటు చేయడం వలన ఈ కుండకు శీతకుండ అనే పేరు వచ్చింది. ముఖ్యంగా కనుమ పండుగ రోజు ఈ శీతకుండలను ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా శీతకుండలను ఏర్పాటు చేయడం ఒక సాంప్రదాయంగా మారింది.

శీతకుండ తయారు చేసే విధానం[మార్చు]

పాతదైనా, కొత్తదైనా ఒక కుండను తీసుకొని ఆ కుండను బాగా కడిగి దానిపై తెల్లగా సున్నం పూసి ఆపై బొగ్గును రంగరించి నల్లని బొట్లు, కుంకుమతో ఎర్రని బొట్లు పెడతారు. ఈ విధంగా తయారు చేసుకున్న కుండ బాగా ఆరినాక పొలంలో మనిషి ఎత్తులో ఒక కర్రను పాతి దానిపై ఈ కుండను బోర్లిస్తారు.

ఉపయోగాలు[మార్చు]

తోటలో మనిషి ఉన్నట్లుగా భ్రమకలిగించడం వలన చోరుల నుంచి, పక్షుల నుంచి పంట రక్షణ.

ఇవి కూడా చూడండి[మార్చు]

దిష్టి బొమ్మ

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=శీతకుండ&oldid=2436682" నుండి వెలికితీశారు