శ్రీ ఆణివిళ్ళ వేంకట శాస్త్రి ప్రాథమికోన్నత పాఠశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ ఆణివిళ్ళ వేంకట శాస్త్రి గారు

కాకరపర్రు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలానికి చెందిన పండిత గ్రామం. 1955వ దశాబ్దానికి పూర్వము  ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నత పాఠశాల సౌకర్యం లేనందున, విద్యార్థులు చాలా దూరం వెళ్ళవలసివచ్చేది. కాకరపర్రు గ్రామ జమిందారు శ్రీ ఆణివిళ్ళ వేంకట శాస్త్రి గారు నిత్యాన్న దాత, అందరు చదువుకోవాలని అభిలషించే వ్యక్తి. వారు ఎందరో  విద్యార్థులకు సహాయం చేసారు. ఈ ప్రాంత విద్యార్థులు పడుతున్న కష్టాలను గమనించిన ఆయన 1950వ సంవత్సరంలో అందరకి అందుబాటులో ఉన్న తన 5 ఎకరాల భూమినందు తన కుమారుడు శ్రీ ఆణివిళ్ళ అబ్బాయి గారి ఆద్వర్యంలో ఒక ప్రాథమికోన్నత పాఠశాలను నిర్మించి స్థాపించారు. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఎందరో దేశ విదేశాలంయందు వివిధ ఉన్నత పదవులనలంకరించి కీర్తిప్రతిష్ఠలు గడించారు.

ఇప్పటికీ శ్రీ ఆణివిళ్ళ అబ్బాయి గారి కుమారుడు శ్రీ సత్యనారాయణ మూర్తి (రాజు) గారు వారి తాత తండ్రుల అడుగుజాడల్లో ఎందరికో విద్యకోసం సహాయ పడుతున్నారు.

శ్రీ వేంకట శాస్త్రి ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభోత్సవం వారి కుమారుడు శ్రీ ఆణివిళ్ళ అబ్బాయి గారి ఆద్వర్యంలో
వేంకట శాస్త్రి ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభోత్సవం ఫోటో 3
వేంకట శాస్త్రి ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభోత్సవం ఫోటో 1 
వేంకట శాస్త్రి ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభోత్సవం ఫోటో 2 
వేంకట శాస్త్రి ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభోత్సవం ఫోటో 3