శ్వేతాశ్వతర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్వేతాశ్వతర ఉపనిషత్తు శ్వేతాశ్వతర ఉపనిషత్తు కృష్ణయజుర్వేద శాఖకు చెందినది. ఈ ఉపనిషత్తు లో ఆరు అధ్యాయములు ఉన్నాయి. ఈ ఆరు అధ్యాయాల్లో మొత్తం 113 మంత్రములు ఉన్నాయి.ఈ ఉపనిషత్తు శ్వేతాశ్వతర బ్రహ్మర్షి తన శిష్యులకు బోధించగా ఆయన పేరిటనే ఈ ఉపనిషత్తు విఖ్యాతమైంది. శ్వేతాశ్వతరం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇంద్రియనిగ్రహం అని ఒక అర్థం (శ్వేత = శుభ్రమైన + అశ్వతర = ఇంద్రియములు)మరియు మంచి కోడెదుడ అని ఇంకొక అర్థం (శ్వేత = స్యచ్ఛమైన + అశ్వతర = కోడెదూడ)

ప్రాముఖ్యత[మార్చు]

ఎంతోమంది భాష్యకరులు ఈ ఉపనిషత్తు కు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. మనం వినే ప్రవచనాలలో ఏ ఒక్క సిద్ధాంతాన్ని ఈ ఉపనిషత్తు బలపరచదు. ద్వైతానికీ,విశిష్టాద్వైతానికీ,అద్వైతానికీ,తదితర వేదాంత శాఖలకూ కూడా సంబంధపడే మంత్రాలు ఇందులో ఉన్నాయి. కొన్ని మంత్రాల్లో సాంఖ్యము,యోగముల భావాలు ప్రముఖ స్థానాన్ని వహిస్తాయి. కొన్ని మంత్రాల్లో వైదిక శైలి, ఊహ,భావ ప్రకటనలు కుడా ఉన్నాయి.

స్వదేహమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్। ధ్యాననిర్మథనాభ్యాసాద్దేవం పశ్యేన్నిగూఢవత్॥ (1 - 14) ( తన శరీరాన్ని క్రింది కట్టెగానూ ప్రణవాన్ని మథించే పై కట్టెగానూ చేసుకొని ధ్యానమే మథించడంగా అభ్యాసంగా చేస్తూ దాగివున్న వస్తువును కనుగొన్నట్లుగా మనం భగవంతుని సాక్షాత్కరించుకోవాలి)