Jump to content

సన్‌స్క్రీన్ లేపనము

వికీపీడియా నుండి
(సన్‌స్క్రీన్ లోషన్ నుండి దారిమార్పు చెందింది)

సన్‌స్క్రీన్ లేపనము లేదా సన్‌స్క్రీన్ లోషన్ సూర్యుని అతినీలలోహిత కిరణాల నుండి రక్షణకు వాడే లేపనము.

నేపధ్యము

[మార్చు]
SPF 15 సన్ స్క్రీన్ లోషన్

వేసవికాలంలో సన్‌స్క్రీన్ లోషన్లు, క్రీములకి విపరీతమైన గిరాకీ ఉంటుంది. అందుకే మాయిశ్చరైజర్లలో, మేకప్ క్రీముల్లో, లిప్ బామ్‌ల్లో కూడా సన్‌స్క్రీన్ ప్రత్యక్షమవుతోంది. సన్‌స్క్రీన్‌లోషన్లలో ఎస్‌పిఎఫ్ ఎక్కువగా ఉన్న వాటిని వాడితే ఫలితం బాగుంటుంది అనుకుంటారు ఎక్కువమంది. కాని ఎస్‌పిఎఫ్ 15-30 ఉన్న క్రీములు వాడినా, ఎస్‌పిఎఫ్ 90 -100 ఉన్న క్రీములు వాడినా ఫలితంలో ఏమంత తేడా ఉండదు అని డర్మటాలజిస్టుల అభిప్రాయం. అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని చేయకుండా ఎస్‌పిఎఫ్ 15 క్రీమ్ 93 శాతం వరకు కాపాడితే... ఎస్‌పిఎఫ్ 30 సన్‌స్క్రీన్ 97 శాతం ఆ కిరణాలని నిలవరిస్తుంది. ఇక ఎస్‌పిఎఫ్ 50 ఉన్న క్రీములయితే 98 శాతం అల్ట్రావైలట్ కిరణాల్ని నిరోధిస్తాయట. "సన్‌స్క్రీన్‌లోషన్లు వినియోగించేవాళ్లలో ఎక్కువమంది ఎస్‌పిఎఫ్ నెంబరు ఎక్కువగా ఉంటే చర్మాన్ని అంతగా కాపాడుకోవచ్చు అనుకుంటారు. కాని అంకెల్లో తేడానే తప్ప అవి ఇచ్చే ఫలితాల్లో పెద్ద తేడా ఉండదు. మన భారతీయల చర్మానికి ఎస్‌పిఎఫ్ 26 ఉంటే చాలు. అందుకని ఎస్‌పిఎఫ్ 30 ఉన్న క్రీములు, లోషన్లు వాడితే సరిపోతుంది.

ఎలా వాడాలి?

[మార్చు]

సూర్యకాంతి పడే శరీర భాగాలన్నింటికీ ఇది రాసుకోవాలి. చెవులు, మెడ వెనక భాగాలను అంతగా పట్టించుకోరు కాని వాటికి కూడా రాయాలి. వేసవిలోనే కాకుండా అన్ని కాలాల్లో సన్‌స్క్రీన్‌లోషన్ రాసుకోవాల్సిందే.

ఎప్పుడు రాసుకోవాలి?

[మార్చు]
  • సన్‌స్క్రీన్‌లోషన్ బాటిల్‌ను స్నానాలగదిలో ఉంచుకోవాలి. ఉదయం స్నానం చేసిన వెంటనే రాసుకోవాలి.
  • సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోగానే బయటికి పోకూడదు. సన్‌స్క్రీన్ చర్మం మీద ఇంకేందుకు పావుగంట సమయం పడుతుంది.
  • రాసుకున్న తరువాత రెండు మూడు గంటలు మాత్రమే పనిచేస్తుంది. అందుకని ఎండలో ఎక్కువసేపు పనిచేసేవాళ్లు మళ్లీ మళ్లీ రాసుకోవాలి అంటున్నారు డాక్టర్లు.
  • దుమ్ము పడే ప్రాంతంలో పనిచేస్తుంటే చర్మాన్ని మొదట క్లెన్సింగ్ వైప్స్‌తో శుభ్రంచేసుకుని ఆ తరువాత సన్‌స్క్రీన్ రాసుకోవాలి. ఇలా చేయలేదంటే చర్మంలోకి దుమ్ము వెళ్లి రంధ్రాలు మూసుకుపోతాయి.
  • సన్‌స్క్రీన్‌లోషన్లతో పాటు ఎండనుంచి కాపాడుకునేందుకు గొడుగులు, స్కార్ఫ్‌లు, టోపీలు, చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే బట్టలు వేసుకోవాలి.
  • తెల్లరంగు బట్టలు ఎస్‌పిఎఫ్ 7 లా పనిచేస్తాయి. అందుకని తెలుపురంగుల్ని ఈ కాలంలో వాడడం బెటర్.
  • సన్‌స్క్రీన్‌లోషన్ అందుబాటులో లేకపోతే టాల్కమ్ పౌడర్ రాసుకున్నా ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఇందులో జింక్ ఉంటుంది. అది కొంతమేరకు ఎండనుంచి కాపాడుతుంది.