సలామ్
స్వరూపం
(సలాము నుండి దారిమార్పు చెందింది)
సలామ్ (అరబిక్ భాష : السلام "అస్సలామ్")
క్రింది విధాలుగా అర్థాలు కలిగివున్నది:
- సీన్-లామ్-మీమ్ (హిబ్రూ భాష : שלם Š-L-M, అరబ్బీ : س ل م S-L-M, మాల్టెస్ : S-L-M) ఒక ట్రైకాన్సోనాటల్ పదము. ఇది సెమెటిక్ భాష పదాలు, వాటి ఉపయోగాలు కలిగిన మూల పదం. ఈ మూల పదానికి మూలార్థం "సంపూర్ణం, నిరపాయ, బాంధవ్య" అనే భావార్థాలు గలది.
అర్థాలు
[మార్చు]అరబ్బీ భాష లో
- తస్లీమ్ : "సలామ్ స్వీకారం" — "స్వీకారం"
- ముస్తలీమ్ : "సలామ్ స్వీకారానికి స్వాగతించడం" "ఒప్పుకోలు" లేదా "అంగీకారం" లేదా "విధేయత ప్రకటించడం".
- సలేమ్ : "సలామ్" కు సంబంధించిన, అఖండిత, పరిపూర్ణ అనే అర్థాలు గోచరిస్తాయి.
- ముసల్లమ్ : "వివాదములేని"
- ముస్లిం : ఇస్లాం మతావలంబీకుడు
- ఇస్లాం : శాంతిమార్గము
అల్లాహ్ పేరు
[మార్చు]అల్లాహ్ విశేషణమాత్మక 99 నామాలలో ఒక నామం "సలామ్".
అభివాదం
[మార్చు]అస్సలాము అలైకుమ్( السلام عليكم ): (As-Salāmu `Alaykum) ఒక అభివాదం. దీని అర్థం "శాంతి". అస్సలామ్ ఒ అలైకుమ్ అని అభివాదం చేస్తే దానర్థం "మీపై శాంతి కలుగును గాక". (తెలుగులో అభివాదం: నమస్కారం) ఈ అభివాదానికి ప్రత్యుత్తరం : వ-అలైకుమ్ అస్సలామ్. దీనర్థం, మీకునూ శాంతి కలుగును గాక.
సాహిత్యంలో సలామ్
[మార్చు]అరబ్బీ, ఫార్సీ, తుర్కీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో సలామ్ అనునది ఒక కవితా రూపం. మహమ్మదు ప్రవక్త , హుసేన్ ఇబ్న్ అలీ, ఇతర ఔలియా లను శ్లాఘిస్తూ సమర్పించే వందనాన్ని సలామ్ అంటారు.
ఉదాహరణకు ఒక ప్రఖ్యాత "సలామ్"
- యా నబీ సలామ్ అలైక
- యా రసూల్ సలామ్ అలైక
- యా హబీబ్ సలామ్ అలైక
- సలవాతు లా అలైక
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]Look up Appendix:Proto-Semitic *šalām- in Wiktionary, the free dictionary.