హెడ్‌సెట్
సాధారణంగా సెల్‌ఫోను, టెలిఫోను, టీవీ కంప్యూటర్లలో వచ్చే శబ్దాలను వినడానికి చెవులకు అమర్చుకునే ఎలక్ట్రానిక్ పరికరాన్ని హెడ్‌సిట్ అంటారు.
వాడుక
[మార్చు]ఇవి వైర్ల అనుసంధానంతో ఉండే తంత్రీ, లేదా నిస్తంత్రీ (వైర్‌లెస్) పద్ధతుల్లో పనిచేసేలా రెండు రకాలుగా ఉంటాయి. తలమీద అటూ ఇటూ అమర్చుకునేలా ఉంటుంది కాబట్టి దీన్ని హెడ్‌సిట్ అంటున్నారు. తంత్రీ (కేబుల్డ్) పద్ధతిలో ధ్వని సంకేతాలు మోసుకొచ్చే హెడ్‌సిట్ పరికరాలు వాడడంలో పెద్దగా ప్రమాదాలు లేవు. ఎటొచ్చీ శబ్దపరిమాణం తగినంతగా ఉంటే చెవులకు మంచిది. ఇక నిస్తంత్రీ పద్ధతిలో వాడే పరికరాల్లో, ధ్వని స్థావరం నుంచి బలమైన రేడియో తరంగాలు లేదా మైక్రోవేవ్ తరంగాల రూపంలో వచ్చే సంకేతాలను గ్రహించి, వాటిని ధ్వని తరంగాలుగా మార్చే ప్రక్రియ ఉంటుంది. అంటే అక్కడ ఒక సంక్లిష్ట ఎలక్ట్రానిక్ తతంగం జరుగుతుందన్నమాట. తలకు అంత చేరువలో విద్యుదయస్కాంత తరంగాల ప్రక్రియ ఉండడం ఏమంత గొప్ప విషయం కాదు. తక్కువ సేపు అవసరానికి సరిపడా వాడితే పరవాలేదు కానీ గంటల తరబడి బ్లూటూత్ లేదా మైక్రోవేవ్ తరంగాల ప్రక్రియ సాగే పరికరాల వాడకాన్ని తగ్గించడమే మంచిది[1].
చిత్రమాలిక
[మార్చు]-
మొదటి ప్రపంచ యుద్ధంలో వాడిన హెడ్‌సెట్
-
బ్లూటూత్ హెడ్‌సెట్
-
A user wearing a monoaural Plantronics headset. (Nov 2012)
-
A typical Bluetooth headset.
-
Some Bluetooth headsets are designed for playing music and answering phone calls[2]
-
A stereo Bluetooth headset.
మూలాలు
[మార్చు]- ↑ http://www.mnn.com/green-tech/gadgets-electronics/stories/are-headphones-bad-for-your-hearing
- ↑ "Arctic Sound P311 Bluetooth Wireless Headset Review" Archived 2013-02-15 at the Wayback Machine Retrieved 28/9/2012