హేరీ ఫ్రాగ్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హేరీ ఫ్రాగ్
Hairy frog
Trichobatrachus robustus.JPG
తోకవలె నున్న కంతులను చూపుతున్న మగ హేరీ ఫ్రాగ్
పరిరక్షణ స్థితి
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: Animalia
విభాగం: కార్డేటా
తరగతి: ఉభయచరము
క్రమం: కప్ప
కుటుంబం: Arthroleptidae
జాతి: Trichobatrachus
Boulenger, 1900
ప్రజాతి: T. robustus
ద్వినామీకరణం
Trichobatrachus robustus
బోలింగర్, 1900

హేరీ ఫ్రాగ్‌ అనునది ఒక రకమైన కప్ప. ఇది చూడటానికి విచిత్రంగా ఒళ్లంతా వెంట్రుకలు...చిత్రమైన రూపుతో ఉంటుంది.

విశేశాలు[మార్చు]

  • భయపెట్టేలా ఉంటుంది కాబట్టి హారర్‌ ఫ్రాగ్‌ అనీ, శరీరమంతా జుత్తుతో ఉంటుంది కాబట్టి హేరీ ఫ్రాగ్‌ అనీ దీన్ని పిలుస్తారు.
  • ఈ కప్పకున్న ఈ వెంట్రుకలు శ్వాస తీసుకోవడంలో మొప్పల్లా పనిచేస్తాయి.
  • ఈ కప్ప ... ఏదైనా శత్రు జీవితో ఇది పోరాడాల్సి వచ్చినా, దీనికి ఏవైనా అపాయకర పరిస్థితులు ఎదురైనా వెంటనే అది అప్పటి వరకు మెత్తగా ఉన్న తన కాళ్లనే ఆయుధాలుగా చేసుకుంటుంది. కాలి ఎముకల్నే పటపటమని విరగ్గొట్టుకుంటూ పదునుగా ఉండే పంజాల్ని సృష్టించుకుంటుంది. వాటినే ఆయుధాలుగా వాడుతూ శత్రువుపై దాడి చేస్తుంది. ఈ వింత పంజాలు అవసరాన్ని బట్టి ముడుచుకోవడానికి వీలుగా ఉంటాయి.
  • విరిగిపోయిన ఆ ఎముకలు ఎలా అతుక్కుపోతాయి? మళ్లీ దీనికి మునుపటి మెత్తటి కాళ్లు ఎలా వస్తాయి? అంటే... ప్రమాదం తప్పాక విరిగిపోయిన ఎముకలు క్రమంగా యధాతథంగా మారుతాయి. అక్కడి చెదిరిపోయిన కణజాలం మళ్లీ పూర్వస్థితికి వస్తుంది.
  • నాలుగున్నర అంగుళాల పొడవుండే ఈ కప్పలు ఎక్కువగా కామెరూన్, నైజీరియా, అంగోలా ప్రాంతాల్లో తిరుగాడుతుంటాయి.

మూలాలు[మార్చు]

  1. Amiet, J.-L.; Burger, M. (2004). "Trichobatrachus robustus". IUCN Red List of Threatened Species. Version 2012.2. International Union for Conservation of Nature.

బయటి లంకెలు[మార్చు]

Data related to Trichobatrachus at Wikispecies Media related to Trichobatrachus robustus at Wikimedia Commons