Jump to content

3D అల్ట్రాసౌండ్

వికీపీడియా నుండి
(3D ఆల్ట్రాసౌండ్ నుండి దారిమార్పు చెందింది)
గర్భంలోని 20 వారాల శిశువు యొక్క 3D అల్ట్రాసౌండ్ చిత్రం

3D అల్ట్రాసౌండ్ అనేది మెడికల్ అల్ట్రాసౌండ్ మెడికల్ లాంటి ఒక ప్రక్రియ. దీన్ని గర్భములోని శిశువు, గుండె, పురీషనాళ, నాడీ సంబంధమైన రోగాలను పరీక్షించటానికి వాడతారు. మూడు దిశలలో అల్ట్రాసౌండ్ సమాచారాన్ని 3D అల్ట్రాసౌండ్ ద్వారా పొందుచు. సమయంతో దీన్ని జోడించినప్పుడు 4D అల్ట్రాసౌండ్ అని కూడా పిలుస్తారు. ఈ సమాచారాన్ని నాలుగు విధాలుగా సేకరిస్తారు. ఈ ప్రక్రియను ప్రసూతి శాస్త్రం, హృయకోశాధ్యయన శాస్త్రం, శస్త్రచికిత్స నిర్దేశం, రక్తనాళ ప్రతిబింబనం, ప్రాదేశిక మత్తు ఇవ్వటం వంటి వైద్య పద్ధతుల్లో వాడతారు.

ఉపయోగాలు

[మార్చు]

ప్రసూతి శాస్త్రం

[మార్చు]
గర్భంలోని శిశువు వేన్నెముక యొక్క 3D అల్ట్రాసౌండ్ చిత్రం

గర్భాశయంలో పెరుగుతున్న శిశువుని పరీక్షించటం క్లిష్టకరమైన ప్రక్రియ. ఈ ప్రక్రియను సరియైన పద్ధతిలో చేయటానికి, ఆ శిశువు తల్లి ఊపిరిని బిగబట్టి ఉంచాలి. అప్పుడే వైద్యులు శిశువు యొక్క స్పష్టమైన చిత్రాన్ని తీయగలరు. కానీ ఊపిరిని బిగబట్టి ఉంచటం కష్టం, ప్రమాదకరం కూడా. 3D అల్ట్రాసౌండ్ తో శిశువు కదలికలను క్షణం కంటే తక్కువ సమయంలో గుర్తించి, వెంటనే తగిన చర్యలు తీసుకోవచ్చు. శిశువు స్థితి, స్థానంతో పాటు, అసాధారణ ప్రవర్తనలను (ఉదాహరణకి ద్రవం చేరడం లేదా వెన్నెముక వక్రత) కూడా గుర్తించవచ్చు.[1] 3D అల్ట్రాసౌండ్ శిశువు యొక్క గుండెచప్పుడుని కూడా పరిశీలించవచ్చు.[2]

హృయకోశాధ్యయన శాస్త్రం

[మార్చు]

3D అల్ట్రాసౌండ్ ని గుండెకి సంబంధించిన చికిత్సలో వాడతారు. ఒక మనిషి యొక్క గుండె స్థితిని చిత్రించి విశ్లేషించవచ్చు, దీన్ని ఎకోకార్డియోగ్రాఫీ (Echocardiography) అని పిలుస్తారు.[3] ఇతర ప్రక్రియలను ఈ ప్రక్రియతో అనుసంధానం చేయటం ద్వారా హృదయచక్రము పరిమాణ విశ్లేషణము యొక్క పరిమాణ విశ్లేషనం కూడా చేయవచ్చు.[4] దీనితో పాటు రక్తపోటు, రక్త స్రావం, గుండె సంకోచం, వ్యాకోచము లాంటివి కూడా తెలుసుకోవచ్చు. 3D ఎకోకార్డియోగ్రాఫీ ప్రక్రియ ఉపయోగించి వైద్యులు నాడి వ్యవస్థకు సంబంధించిన సమస్యలను కూడా గుర్తించవచ్చు.[5]

శస్త్రచికిత్స నిర్దేశం

[మార్చు]

శస్త్ర చికిత్స సమయంలో, 2D అల్ట్రాసౌండ్ ద్వారా అవయవాలు, కణజాలాల యొక్క తిర్యక్‌ సమక్షేత్రము లోని నిర్దిష్ట స్థానాలను తెలుసుకోవడం కుదరదు. ఈ సమస్యని 3D అల్ట్రాసౌండ్ ద్వారా పరీక్షించవచ్చు,, మరింత సమర్థవంతంగా స్కానింగ్ చేయవచ్చు.[6] దీని సహాయంతో కాన్సర్, అవయువ మార్పిడి చికిత్సలు కూడా సునాయాసముగా చేయవచ్చు.[7] ప్రతి కణంని వేరుగా చూడవచ్చు కనుక గ్రంథి వ్యాధులను కూడా విశ్లేషించవచ్చు–లోపాలను కారణాలను తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఉపయోగించటం వలన క్యాన్సర్, కణితులు, అవయువ మార్పిడి వంటి సమస్యలతో ఉన్న రోగులకు చికిత్స సులభం అవుతుంది.[8]

రక్తనాళ ప్రతిబింబనం

[మార్చు]

రక్త నాళాలు, ధమనుల కదలికలు గుర్తించటం క్లిష్టమైన పని. కానీ వీటి పరిశీలన ప్రతి చికిత్సలో అత్యంత కీలకం. 3D అల్ట్రాసౌండ్ ద్వారా ఇది సులభం అవుతుంది–రక్త కణాలు, సిరలు, ధమనుల యొక్క కదలికలను అత్యంత కచ్చితత్వంతో చూడవచ్చు.[9] వీటితో పాటు అయస్కాంత శక్తిని ఉపయోగించి వ్యాసాలని కొలవటం, ధమనుల మధ్య పొరలని గుర్తించటం కూడా చేయవచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నాళాల యొక్క పనితీరును సులభముగా పరిశీలించవచ్చు.[10]

ప్రాదేశిక మత్తు ఇవ్వటం

[మార్చు]

3D అల్ట్రాసౌండ్ ఉపయోగించి శస్త్ర చికిత్స సమయంలో చర్మం క్రింది భాగాలలో మత్తు ఇచ్చే ప్రక్రియను సులభముగా చేయవచ్చు. కండరాలు, నరములు, నాళాలు స్పష్టంగా గుర్తించబడతాయి–అందువలన సూదితో కచ్చితమైన ప్రదేశములో మత్తు ఇవ్వచ్చు. ఎముకలకూ వేళ్ళకూ సంబంధించిన చికిత్స ఇది ఉపయోగకరం. భుజం, మోకాలి,, చీలమండ శస్త్రచికిత్సలలో శారీరక ఆకృతలని గుర్తించి, చిత్రాలుగా మర్చి, వాటిని కావలసిన రీతిలో అమర్చుకొని కావలసిన స్వతంత్రనాడీమండలముకు మత్తుమందును పంపిచవచ్చు.[11][12]

నష్టములు

[మార్చు]

మాములుగా మెడికల్ అల్ట్రాసౌండ్ వల్ల కలిగే సమస్యలే 3D అల్ట్రాసౌండ్ వాళ్ళ కూడా కలుగుతాయి. అసలు అల్ట్రాసౌండ్ ని సురక్షితముగా పరిగణిస్తారు. కానీ దీనిని రేడియోధార్మిక పదార్థాలు, అయొనీకరణ విసర్జనము వంటివి వాడటం వలన కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. కణజాలం వేడిబడటం అనేది సాధారముగా కనిపించే పరిణామము. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు థర్మల్ ఇండెక్స్, మెకానికల్ ఇండెక్స్ అనే రెండు కొలతల ద్వారా ఒక మనిషికి ఒక రోజుకి ఇంత తీవ్రత వరకు అల్ట్రాసౌండ్ ని వాడచ్చు అని పరిమితులు సూచించారు. వీటికి మించి వాడిన యెడల రోగి ఆరోగ్యానికి అది ప్రమాదకరం,, చట్టరీత్యా నేరం.[13]

మూలాలు

[మార్చు]
  1. బాబా, కజునోరి; ఒకై, తకాషి; కోజుమా, శిరో; తాకేటని, యుజి (1999). "ఫీటల్ అబీనార్మాలిటీస్: ఎవాల్యూయేషన్ విత్ రియల్-టైం ప్రోసిస్సిల్ త్రి-డైమెన్షనల్ యూ స్ -ప్రిలిమినరీ రిపోర్ట్". రేడియాలజీ (in ఇంగ్లీష్). 211 (2): 441–446. doi:10.1148/radiology.211.2.r99mr02441. PMID 10228526.
  2. అకార్, ఫిలిప్; బట్టిల్, లయ; దూలాక్, వైవీఎస్; పెయిర్, మరియాన్నే; దుబారుదియులే, హెలెన్; హస్కొయెట్, సెబాస్టియన్; గ్రూసోల్స్, మారిన్; వయస్సైరే, క్రిస్టోఫే (2014). "రియల్-టైం త్రి-డైమెన్షనల్ ఫీటల్ ఏచోకార్డియోగ్రాఫీఉసింగ్ ఏ న్యూ ట్రాన్సబ్డోమినల్ ఎక్స్ మార్ట్రిక్స్ అర్రే ట్రాన్సడుసర్". ఆర్కైవ్స్ అఫ్ కార్డియోవాస్క్యూలర్ దిసీజ్స్ (in ఇంగ్లీష్). 107 (1): 4–9. doi:10.1016/j.acvd.2013.10.003. PMID 24364911.
  3. హుయాంగ్, కీనఘుల; జంగ్, జయోజ్హేంగ్ (2017). "ఏ రివ్యూ ఆన్ రియల్ టైం 3D ఇమేజింగ్ టెక్నాలజీ". బయో మెడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ (in ఇంగ్లీష్). 2017: 1–20. doi:10.1155/2017/6027029. PMC 5385255. PMID 28459067.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  4. పెడ్రోస, జె; బార్బోసా, డి; అల్మెయిదా, యెన్; బెర్నాండ్, ఓ; బోస్చ్, జె; డి'హోగె, జె (2016). "కార్డియాక్ ఛాంబర్ వొలుమెట్రిక్ అసెస్మెంట్ ఉసింగ్ 3D అల్ట్రాసౌండ్ – ఆ రివ్యూ". కరెంటు ఫార్మాస్యూటికల్ డిజైన్ (in ఇంగ్లీష్). 22 (1): 105–21. PMID 26548305.
  5. పీకేనా, ఈ .; పెళిక్క, పి. ఏ. (2013). "స్ట్రెస్ ఎకో అప్లికేషన్స్ బియాండ్ కరోనరీ ఆర్టరీ డిసీస్". ఎఉరోపెయన్ హార్ట్ జర్నల్ (in ఇంగ్లీష్). 35 (16): 1033–1040. doi:10.1093/eurheartj/eht350. PMID 24126880.
  6. యాన్, పి. (2016). "SU-F-T-41: 3D MTP-TRUSఫర్ ప్రోస్టేట్ ఇంప్లాంట్". మెడికల్ ఫిజిక్స్ (in ఇంగ్లీష్). 43 (6Part13): 3470–3471. doi:10.1118/1.4956176.
  7. డింగ్, మింగ్యులే; కార్డినల్, హెచ్. నెలలే; ఫెన్స్టర్, ఆరోన్ (2003). "ఆటోమేటిక్ నీడలే సెగ్మెంటేషన్ ఇన్ త్రి డైమెన్షనల్ అల్ట్రాసౌండ్ ఇమగెస్ ఉసింగ్ టు ఆర్తోగోనల్ టు డైమెన్షనల్ ఇమేజ్ ప్రొజెక్షన్స్". మెడికల్ ఫిజిక్స్ (in ఇంగ్లీష్). 30 (2): 222–234. doi:10.1118/1.1538231. PMID 12607840.
  8. "ఇంట్రొపెరటివే అల్ట్రాసౌండ్ గైడెడ్ రెసెక్షన్ అఫ్ గ్లియోమాస్". వరల్డ్ నెఉరోసర్జరీ (in ఇంగ్లీష్). 92: 255–263. 2016. doi:10.1016/j.wneu.2016.05.007. PMID 27178235.
  9. జిన్, చాంగ్ జహు; నామ్, కేవెన్ -హోం; పాఇంగ్, డాంగ్-గుక్ (2014). "ది స్పేషియే తెంపొరల్ వారియేషన్ అఫ్ రట్ కెరోటిడ్ ఆర్టరీ బిఫ్ర్కేషన్ బై అల్ట్రాసౌండ్ ఇమేజింగ్". 2014 IEEE ఇంటర్నేషనల్ అల్త్రాసోనిక్స్ సింపోసియం (in ఇంగ్లీష్). pp. 1900–1903. doi:10.1109/ULTSYM.2014.0472. ISBN 978-1-4799-7049-0.
  10. "స్టాండర్డిజ్డ్ 2D అల్ట్రాసౌండ్ వర్సెస్ 3D/4D అల్ట్రాసౌండ్ అండ్ ఇమేజ్ ఫ్యూషన్ ఫర్ మెస్సుర్మెంట్ అఫ్ అయోర్టిక్ నేర్సయం ధియేటర్ ఇన్ ఫాలో అప్ విత్ EVAR". క్లినికల్ హెమోర్హేలోజి అండ్ మైక్రోసర్క్యూలేషన్ (in ఇంగ్లీష్). 62 (3): 249–260. 2016. doi:10.3233/CH-152012. PMID 26484714.
  11. "రియల్ టైం 3D అల్ట్రాసౌండ్ స్పీడ్స్ పేషెంట్ రికవరీ" (Press release) (in ఇంగ్లీష్). మాయో క్లినిక్. July 13, 2007. Retrieved May 21, 2014.
  12. ఫెయిన్గ్లాస్, నెయిల్ జి.; సీలెండెనెన్, స్టీవెన్ ఆర్.; టోర్ప్, క్లూస్ డి.; వాన్గ్, ఆర్డోరిస్; క్యాస్టళ్లో, రామం; గ్రీన్గ్రేస్, రాయ్ ఏ. (2007). "రియల్ టైం త్రి డైమెన్షనల్ అల్ట్రాసౌండ్ ఫర్ కాంతినోస్ పొప్లిట్ల్ బబ్లాకేడ్". అనేస్తేషియా &అనాల్జేసియా (in ఇంగ్లీష్). 105 (1): 272–274. doi:10.1213/01.ane.0000265439.02497.a7. PMID 17578987.
  13. సెంటర్ ఫర్ డెవిస్స్ అండ్ రేడియోలాజికల్ హెల్త్. "మెడికల్ ఇమేజింగ్ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్". ఎఫ్ డి ఏ (in ఇంగ్లీష్).