బ్రంచ్
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (అక్టోబరు 2016) |


బ్రంచ్ అనగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనము- రెండింటి బదులూ ఒక్కసారే తీసుకునే ఆహారము. ఇది మెట్రో నగరాలలో బాగా పేరు పడింది.
నేపధ్యం
[మార్చు]ఈ ఆలవాటు ముఖ్యంగా కొన్ని రకాలైన ఉద్యోగార్థుల అవసరార్థం పుట్టుకొచ్చింది.
దుష్ప్రభావాలు
[మార్చు]బ్రంచ్ వలన అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి.ఉదయం టిఫిన్ ఎంత ముఖ్యమో, మధ్యాహ్న భోజనమూ అంతే ముఖ్యం. ఉదయం లేచిన తర్వాత ఒకటి రెండు గంటల్లో టిఫిన్ తినకపోతే చాలా అనర్ధాలున్నాయని పోషకాహార నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. వాస్తవానికి రాత్రంతా ఆహారం లేకుండా ఖాళీగా ఉండటంతో శరీరంలో జీవక్రియలన్నీ మందగిస్తాయి. శక్తి కూడా సన్నగిల్లుతుంది. మనం ఉదయాన్నే టిఫిన్ తినటం వల్ల ఆ జీవక్రియలు వేగం పుంజుకుంటాయి. శక్తి కూడా ఉత్తేజితమవుతుంది. ఇక రోజంతా అలాగే కొనసాగుతుంది. కాబట్టి అల్పాహారం మన శరీరంలో రోజంతా జరగాల్సిన జీవక్రియలను గాడిలో పెడుతుందని, చక్కటి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని గుర్తించాలి. పెద్దలతో పాటు పిల్లలకు ముఖ్యంగా యవ్వనదశలో ఉన్నవారికి ఇది అత్యంత అవసరం. ఉదయం అల్పాహారం తినకుండా స్కూలుకు, ఆఫీసులకు వచ్చిన వారిలో చురుకుదనం మందగించి, చదువుల్లో, పనిలో సామర్థ్యం కొరవడుతున్నట్టు అధ్యయనాల్లో గుర్తించారు. ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే- ఎక్కువసేపు పనిచేసే సామర్ధ్యాన్నిస్తుంది, కొలెస్ట్రాల్ మోతాదును తగ్గించటంతో పాటు మనసును ఆహ్లాదంగా కూడా ఉంచుతుంది. టిఫిన్ తినకపోతే మధ్యాహ్నానికి ఆకలి పెరిగిపోయి నియంత్రణ లేకుండా తినే ప్రమాదమూ ఉంది. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు ఉదయం పూట చక్కటి అల్పాహారం తీసుకోవటం మరవరాదు. ఇందులో బలవర్ధకమైన మాంసకృత్తులు, పప్పులతో చేసిన పదార్ధాలు, పీచు ఎక్కువగా ఉండేవి తీసుకోవటం మంచిది. మాంసకృత్తులు కడుపు నిండిన భావన కలిగించి త్వరగా ఆకలి వేయకుండా చూస్తాయి. కాబట్టి అల్పాహారంలో పొట్టుతీయని ధాన్యాలు, కొవ్వు తీసిన పాలు, గుడ్లు, పండ్ల వంటివి ఉండేలా చూసుకోవాలి.