వాడుకరి:అబ్రకదబ్ర
మరీ నేపాళ మాంత్రికుడి పేరులా ఉందా? అసలు పేరు వేరే. దాన్నవతల పెట్టి ఇప్పటికిలాగే కానిచ్చేద్దాం.
తెలుగంటే నాకు పిచ్చ పిచ్చి. ఇంటర్మీడియెట్ లోను, డిగ్రీలోనూ అందరూ తేలిగ్గా మార్కులొస్తాయని రెండో భాషగా హిందియో, సంస్కృతమో తీసుకుంటుంటే నేను మాత్రం ఆవేశంగా మాతృభాష మీద వాళ్లకో లెక్చరు దంచి మరీ తెలుగు తీసుకున్నాను. ఏమండీ, మనభాషే సరిగా రాకపోతే వేరే భాషలెలా వంటబడతాయి? మొన్నామధ్య ఈనాడు ఆదివారం సంచికలో తెలుగు వికీపీడియా గురించి, అందులో మనవాళ్లు చేస్తున్న హడావిడి గురించీ వివరంగా రాశారు. వెంటనే వచ్చి తెవికీ లో చేరిపోయాను.
ప్రస్తుతానికి తెవికీ లో తెలుగులోకి అనువదించవలసిన వ్యాసాలు చాలా ఉన్నట్లున్నాయి. వాటిలో కొన్నిటిని ఎంచుకుని అనువదించటం మొదలు పెట్టాను. ప్రస్తుతం కమల్ హసన్ మరియు రష్యా లను అనువదిస్తున్నాను. ఇవి నా మొదటి అనువాదాలు. మీ విలువైన సలహాలను ఆనందంగా స్వీకరిస్తాను.
పై అనువాదాలు కాకుండా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, శ్రీ కృష్ణ దేవ రాయలు, అలెక్జాండరు మరియు రెండవ ప్రపంచ యుద్ధం నేను పని చేస్తున్న, చేయబోతున్న వ్యాసాలు.