Jump to content

వాడుకరి:గుర్రం సీతారాములు

వికీపీడియా నుండి
డా. గుర్రం సీతారాములు
డా. గుర్రం సీతారాములు
జననం06 జులై , 1975
నివాసంహైదరాబాద్
జాతీయతభారతీయులు
రంగములుపరిశోధకుడు
వృత్తిసంస్థలుఅంగ్లము మరయు విదేశీ భాషల విశ్వవిద్యాలయము [alma_mater =అంగ్లము మరయు విదేశీ భాషల విశ్వవిద్యాలయము
occupation  = పరిశోధకుడు 

Iwebpage =[[ https://gurramseetaramulu.wordpress.com/]]


విద్యాబ్యాసం

[మార్చు]

Dr. Gurram Seetaramulu is a poet, editor, story writer and a political analyst. His area of interest includes politics, literature, history and translation. He was born Dalit in 1975 in a small village Tallampadu near Khammam in Telangana. He has extensively contributed his articles to various Telugu dailies and journals on different political occasions. He presented papers in national and international seminars both in India and abroad. His response to the social inequalities and discrimination that he faced shaped in him a story teller and a poet. Presently, he is a doctoral research fellow, working on oral literary history of Dalit societies, in the English and Foreign Languages University, Hyderabad, India. He born in Khammam disctrict and studied Master of Arts (English) in Osmania University in Hyderabad, Telangana. He analyzed the society not only from academic perspective but also from the standpoint of real-life social realities. What really shaped his consciousness is liberation from social exploitation, inequalities and injustice faced by millions of Dalits throughout the history. As citizen of Dalit community, he understood how the democracy and justice were limited to a small section of rich and powerful elite. Finished his doctoral thesis entitled" The Cultural Genealogies of Madigas' Memory, History and Identity" from the School of Interdisciplinary Studies The English and Foreign Languages University (EFLU), he engaged in translation of Telugu Dalit literature into English. He presented papers in national and international


ప్రచురితమయిన పుస్తకాల జాబితా

[మార్చు]

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు

[మార్చు]

కవిత్వం

[మార్చు]

== [[1]]


I won’t spit on your face

[మార్చు]

Now I understand

Why you tied a pot

Below my mouth, and a broom

Around my arse!

If I spat at your ugly face,

My spit would have been defiled!

I was nourished by amniotic fluid,

Not weaned on vomit like you!

I know everyone is born

From the loins, but weren’t you born

From the mouth!

That’s why you vomit vomit!

Aren’t you a septic tank from head to toe,

With a mouth that has gone to rot

From the chanting of dishonest slokas

For ages!

Aren’t you Manu’s child

Who remains impassive

Even when spat at or

Showered with dirt!

That is why

I won’t defile my spit

By spitting at your face!


Sorry Mudasir Bhai!

Long before you were born In this country Your name was listed Among the traitors.

Your religion is a conspiracy Your prayer meetings are a conspiracy Your lying quiet is a conspiracy

It's true !!

Your study in EFLU is a conspiracy; All is well in Heaven: The other day, someone else, Yesterday, you, Today, someone else – Tomorrow and day after tomorrow? Who is next ?

Sorry Mudasir!!!

The 'collective consciences' were satisfied yesterday But today the story recurs in another form History repeats itself…

Sorry Mudasir Bhai!!!

Gurram Seetaramulu's 'Sorry Mudassir Bhai' was written in memory of a young Kashmiri student in the English and Foreign Languages University (EFLU), Mudasir Kamran, who commited suicide in the campus on March 2, 2013. [Read more about the incident here].


Articles published various News papers and Journals

[మార్చు]

లింకులు

[మార్చు]

Few Bones and Few more grains:

[మార్చు]

ద ఫ్లష్ ఈజ్ Heavy ఆన్ మై బ్యాక్, షీ ఈజ్ మై డాటర్… జస్ట్ టర్న్‌డ్ ఫిఫ్టీన్… ఫీల్ హర్ బి బ్యాక్ సూన్…'’ ఈ వాక్యం నన్నెంతో డిస్ట్రబ్ చేసింది. ప్రముఖ ఒరియా కవి జయంత్ మహాపాత్ర రాసిన ‘ది హంగర్’ లోనిదా వాక్యం.

ఓ అరవై ఏళ్ళ ముసలివాడు తన పదిహేనేళ్ళ కూతురుతో సముద్రంలో చేపలు పట్టి రోజూ చస్తూ బ్రతుకుతున్న బీదకుటుంబ కథాంశం అది. తీరంలో గట్టిగా గాలివాన వస్తే మాయమయ్యే పూరిపాక అది. తండ్రి కూతుళ్ళకు శరీరం మీద సరైన ఆచ్ఛాదన లేదు. శరీర పోషణ, సరైన బట్టలు లేని ఆ అమ్మాయికి వయస్సును మించిన తన శరీరం వంపుసొంపులు దాచుకోవడానికి బారెడు గుడ్డలేని దీనస్థితి వాళ్ళది. తండ్రితోబాటే తీరానికి రోజూ వచ్చేది. సముద్రంలోకి వెళ్ళిన తన తండ్రి వచ్చేదాకా ఒడ్డునే తచ్చాడుతూ సాయంత్రం దాకా ఎదురుచూడడం నిత్యకృత్యం ఆమెకు. మనుగడే ప్రశ్నార్థకమైన ఆ ముసలాడికి ఆమె ఓ గుదిబండ, తలకు మించిన భారం. ఆమె పెళ్ళి గురించి ఆలోచించే ధైర్యం, తీరిక కూడా ఆ ముసలాడికి లేదు. ఎంతో కష్టపడితే తప్ప నోట్లోకి నాలుగు మెతుకులు పోవడం దుర్లభం. వాళ్ళ జీవితంలో ఏలినాటి శనిలా దరిద్రం ఆ ఇంట దాపురించింది.

ఆ సాయంత్రం అతను సముద్రం నుండి తీరానికి చేరాడు. ఆకాశం ఉరిమి ఎప్పుడు మీద పడుతుందా అన్నట్లుంది, అంతా శూన్యంగా వుంది. గత రెండు మూడు రోజులుగా తినడానికి ఏమీలేకపోవడం మూలాన అతనికి నిలబడే ఓపిక నశించింది. ఏడ్చేందుకు కూడా శరీరం సహకరించటం లేదు. అతని కన్నీళ్ళు ఎప్పుడో ఇంకిపోయాయి. తీరం అల్లకల్లోలంగా ఆ ముసలోడి మనసులాగే ఉంది. సందర్శకులు ఇళ్ళకు వెళ్ళడానికి తొందరలో ఉన్నారు. తీరం దాదాపు ఖాళీగా ఉంది. ఎవరి తొందరలో వాళ్ళు గబగబా ఉరుకుతున్నారు. ప్రతిరోజు యూనివర్సిటీ కుర్రాళ్ళు సరదాగా సముద్రతీరానికి వస్తుంటారు. గుంపులు గుంపులుగా అరుపులు, కేరింతలతో నీళ్ళలో ఒకళ్ళను మరొకరు తోసుకొంటూ సరదాగా వాళ్ళ జీవితంలో బాధలన్నీ ఆ తీరంలో గుమ్మరించిపోతారు. అందులో కొంతమంది కేవలం శరీర వాంఛలు తీర్చుకోవడానికే వస్తారు. వచ్చిన కాడ్నించి ఎప్పుడూ శరీరమంతా కళ్ళేసుకొని వెతుకుతుంటారు. కాస్త నాలుగు పైసలున్నవాళ్ళు రెగ్యులర్‌గా, లేనివాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు. ఓ పాతికేళ్ళ విద్యార్థి నిత్యం తీరానికి రావడం, వేశ్యల కోసం వెంపర్లాడటం నాలుగు పైసలు ఇచ్చి తన వాంఛ తీర్చుకోవడం అతను ఎన్నోసార్లు గమనించాడు. ఎర్రగా బొద్దుగా ఉన్నాడు. చేతికి ఖరీదైన వాచ్, మెడలో చైన్, ఉంగరాలు, ఖరీదైన బట్టలు మంచి కుటుంబం నుంచి వచ్చినట్లే ఉన్నాడు. కాకుంటే కండ కావరంతో ఉన్నాడు. ఆరోజు ఎవరూ దొరకలేదనుకుంటా ఇసుకలో కాళ్ళను ఈడ్చుకొంటూ, ఒడ్డున గవ్వలను తన్నుకుంటూ తనవైపు వస్తున్నాడు. ఆ ముసలాడికి ఆ రోజుతో ఇంతకాలం తను పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయినాయి. నమ్మిన సముద్రమే మింగేసేటట్టుంది. తను జీవితంలో ఎంతోకాలంగా ఓడిపోతూనే ఉన్నాడు. అతను కేవలం బ్రతకడం కోసం మాత్రమే ఓడిపోయాడు. ఇక ఎంతోకాలం ఆ ఓటమికి తట్టుకోలేడు. కేవలం ఆ ఓటమికి తలవంచి మాత్రమే తాను ఆ నిర్ణయం తీసుకొన్నాడు. అందుకే అతను తన స్థితికి తలవంచి ఆ కుర్రాణ్ణి పిలిచాడు. కొంతసేపు మాట్లాడి అతని ఆంతర్యం గ్రహించి… “బాబూ! ఇది నా కూతురు. మొన్ననే పదిహేను దాటాయి.'’ “ద ప్లష్ ఈజ్ హెవీ ఆన్ మై బ్యాక్… ద స్కైఫెల్ ఆన్ మీ ఫిల్ హర్ బి బ్యాక్ సూన్…'’ “వర్షం వచ్చేటట్లుంది బాబూ- బహుశా లాస్ట్ బస్ కూడా వచ్చే టయమైంది. అలా వెళ్ళి పని ముగించుకొని తొందరగా వచ్చేయ్!'’ అంటూ ఆమెను అతనికి అప్పగించి తన దుఃఖాన్ని దిగమించుకొంటూ అక్కడ నుండి నిష్క్రమించాడు.

ఆ అమ్మాయి కళ్ళు గాజుగోలీల్లా కళాకాంతి లేకుండా ఉన్నాయి. ఆ కళ్ళల్లోంచి చూస్తే ఆమె ఎముకలు కనిపిస్తున్నాయి. యాంత్రికంగా అతన్ని అనుసరించిన ఆమె వాంఛా రహితంగా తన కాళ్ళను ఎడంగా జరిపి అతనికి వశమౌతుంది. అప్పుడే దూరంగా ఉన్న ఆ ముసలాడి సంచిలో ఉన్న చేపలు గిలగిలా తన్నుకున్నాయి.

తన ఆకలి తీర్చుకోవడం కోసం కన్న కూతుర్ని ఆ క్షణానికి అమ్మిన ఆ తండ్రి నిస్సహాయత, విధిలేక నిష్క్రియాపరురాలైన ఆమె ఆ యువకుడి మగతనం క్రింద నలిగి నుజ్జయి ఆ నాటకంలో ఎలా ఆటబొమ్మగా మారిందో చెప్తుందీ పోయమ్. ఈ దేశంలో కేవలం వృత్తిని నమ్ముకొన్నవాళ్ళకు ఏం మిగుల్తోందో ఈ కవిత చెపుతోంది. ఈ కవిత చెప్తుంటే అమ్మాయిలు కొంతమంది సిగ్గుతో తలవంచుకొని ఒకింత అసహనానికి గురైనారు. మరి కొంతమంది అబ్బాయిలు మిడ్‌నైట్ మసాలా చూస్తూ తాత్కాలిక సుఖానికి లోనైనట్లు నవ్వుకొన్నారు. అతికొద్దిమందిలో ముఖంలో రంగులుమారి కళ్ళ కొనుకులలో తిరిగిన నీళ్ళసుడిని చూశాను మరికొంతమందిలో. తరగతి గదిలో చాలాసేపు అందరూ పూర్తిగా ట్రాన్స్‌లో ఉన్నట్లున్నాము.

“సార్! బెల్ కొట్టారండి!'’ అని ఓ విద్యార్థి అనడంతో సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత మామూలు మనిషిని అయ్యాను. చేతుల్లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌వారి ‘కామన్‌వెల్త్ పోయెట్రీ’ ఆంతాలజీలోంచి బొక్కలపొడి చూర్ణంలా రాలిపడుతోంది. ఎముకల వాసన వస్తోంది. ఈరోజు శుభ్రంగా కడుక్కోవాలి. ఒంటికి అంటిన ఆ గులాలు (రంగులు) ఇంకా వదలడంలేదు. ఎంత రుద్ది కడిగినా ఆ రంగు పోవడంలేదు. ఇంకా ఎంతకాలం కడగాలో అర్థం కావడంలేదు.

పుస్తకం తీసుకొని స్టాఫ్‌రూమ్‌కి బయలుదేరాను. పొడి దారి వెంట రాలుతూనే ఉంది. ఒంటి మీద చొక్కాలోంచి ఆ రంగుల వాసన ఇంకా వస్తూనే ఉంది… బయట ఎవరో తరుముతున్నట్లు అటుయిటు ఉరుకుతున్నారు. కేరింతలు కొడుతున్నారు. అలా స్టాఫ్‌రూమ్ వైపు నడుస్తున్నాను. క్యాంపస్‌లో అక్కడక్కడా చిన్నచిన్న సమూహాలు, ప్రెషర్స్‌ను ఆటపట్టిస్తున్న సీనియర్స్ ఆ ప్రక్కనే కొంతమంది లాన్‌లో కూర్చున్నారు. మరికొంతమంది పాప్‌కార్న్ నములుతున్నారు. ఎవరో అరుస్తున్నారు. కాలేజీ నిండా రకరకాల విద్యార్థి సంఘాల బ్యానర్లు, ఆకట్టుకొనే నినాదాలు… కొంతమంది విద్యార్థులను కలవడానికి వచ్చిన తల్లిదండ్రులు ఉండడం మూలాన కాలేజీ వాతావరణం నిత్య నూతనంగా కళకళలాడుతున్నా… నాకెందుకో ప్రతి విద్యార్థి శిలువను మోస్తున్న క్రీస్తుల్లా ఉన్నారు. ఆ ఉద్విగ్న వాతావరణం మధ్య స్టాఫ్‌రూమ్‌కు వచ్చి కుర్చీలో కూలబడ్డాను.

నా పక్క సీటులో ఉన్న తెలుగు లెక్చరర్ యాదయ్యగారు పలకరించారు. ఏంటి సుందర్రాజు… ఏమయింది? ఎందుకు అదోలా ఉన్నారు? ఏం లేదండీ అంటూ సాయంత్రం జరిగే సెమినార్‌కు నోట్స్ రాయడానికి పేపర్సు తీశాను. అద్దాలు కనిపించలేదు ఎక్కడ పెట్టానా అని వెతుకుతుండగా… శ్యామ్ అనే విద్యార్థి, ‘ఇదిగోండి మాస్టారూ!’ అని చేతికిచ్చాడు. నేను క్యాంపస్‌లో స్టూడెంట్ వెల్ఫేర్ కమిటీ బాధ్యతలు చూడటం మూలాన అక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థి గూర్చి కొద్దోగొప్పో తెలుసు. “సార్! శ్యామ్ కూడా ఈరోజు సెమినార్‌లో పేపర్ సబ్‌మిట్ చేస్తున్నాడటగా?'’ అన్నాడు యాదయ్యగారు. “అవునండీ!'’ శ్యామ్ మంచి విద్యార్థి. సేవా కార్యక్రమాల్లో ముందుండే కుర్రాడు.

కాలేజీ అడ్మిషన్ల సమయంలో హాస్టల్ ఇన్‌ఛార్జిగా ఉన్న నన్ను కలవడానికి సూట్‌కేసుకు ఏదో పాతగుడ్డ కట్టి చంకలో పెట్టుకొన్నాడు. హ్యాండిల్ విరగడం మూలాన పట్టుకోవడం ఇబ్బందిగా ఉందతనికి. పోషణ కరువైన జుట్టు, పాత చెప్పులు కాని, కళ్ళలో ఏదో సాధించాలనే తపన ఉన్నట్టనిపించింది. గుడ్డలో మూట కట్టుకొన్న సూట్‌కేస్ మరో చేతిలో ఏదో సంచి. కొద్దిపాటి సామానుతో నా గదిలోకి వచ్చాడు. అక్కడే అతని వివరాలు తెలిశాయి. అడ్మిషన్ పూర్తి అయ్యాక హాస్టల్ రూంకు వెళ్ళాడు.

పాలమూరు జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం నుండి వచ్చిన శ్యామ్ ఎవరూ లేని ఓ అనాథ. అతని తండ్రి చెప్పులు కుట్టేవాడు. అతను పుట్టగానే బహుశా నెలలవాడుగా ఉండగానే తల్లి రక్తహీనతతో చనిపోయింది. తండ్రి చాలీచాలని తిండి తింటూ కాలం అతి కష్టంగా నెట్టుకొస్తూ సక్రమంగా తిండి లేకపోవడమో, పోషణ కొరవడడమో కడుపులో పుండు అయి అతనూ చనిపోయాడు. ఆకలి, అంటరానితనం, అవమానాలు, బంధువుల ఛిత్కారాలు, అడక్కతినడాలు సంక్షేమ హాస్టళ్ళలో శరణార్థిగా బ్రతికిన అతను హాస్టళ్ళలో కేవలం బ్రతకడం కోసం మాత్రమే పురుగులు నిండిన తిండి, పంపునీళ్ళతో కడుపు నింపుకొన్నాడు. తోడూ నీడా లేకుండా చీదరింపులు, ఛీత్కారాల మధ్య యూనివర్సిటీ దాకా వచ్చాడు. చదువులో అతనికి ఉన్న శ్రద్ధ, క్రమశిక్షణ మూలంగా అతని గూర్చి ఈ కొన్ని విషయాలు తెలిశాయి. అతనికి ఉన్న ఈ నేపథ్యమే క్లాస్‌లో ఆ పాఠం చెప్తున్నప్పుడు, అతని కళ్ళలో నీళ్ళు రావడానికి కారణం అనుకొన్నాను. ఇలా ఆలోచిస్తూ మళ్ళీ నోట్సు రాసుకొనే పనిలో నిమగ్నమైనాను. ఆ మధ్యాహ్నం అన్నం తినాలనిపించలేదు. రెండుసార్లు టీ త్రాగి రాసుకుంటున్నాను. సాయంత్రం 5 గంటలు కావస్తున్నది. ఎవరికివారే హడావుడిగా తమతమ బీరువాలకు తాళాలు వేసి తిరుగు ప్రయాణం అవుతున్నారు. యాదయ్యగారు నా టేబుల్ దగ్గరకు వచ్చి, “సుందర్ మేం బయలుదేరుతున్నాం, వస్తున్నావా? అవునూ సెమినార్ ఎక్కడ? ఎన్ని గంటలకు?'’ అన్నారు. “ఈరోజేనండీ సాయంత్రం ఏడున్నరకు సెంట్రల్ లైబ్రరీ సెమినార్ హాల్లో ‘అస్థిత్వ కులాల సాహిత్యం - సమాలోచన’ వీలుంటే మీరూ రండి,'’ అంటూ రాసిన కాగడితాలు ఫైల్లో పెట్టుకొని బయలుదేరాను. కాలేజీ గేటు దగ్గర శ్యామ్ కనిపించాడు. “ఎలా వస్తున్నావ్?'’ అడిగాను. “కొంతమంది ఫ్రెండ్స్ వస్తున్నారండీ. అందరం కలిసి వస్తాం. మీరు బయలుదేరండి.'’ “సరేలేగాని, వీలుంటే రేపు ఆదివారం ఇంటికి రా,'’ అంటూ బస్ ఎక్కాను. అంతా గందరగోళంగా ఉంది. ఎవడో వెంటబడి తరుముతున్నట్లుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుజీవుడా అన్నట్లు ఫుట్‌బోరు మీద విన్యాసాలు చేస్తున్నారు కొందరు. సెమినార్ పూర్తయ్యేసరికి చాలా లేట్ అయింది. ఆరేడుగురు ప్రముఖ కవుల, ఓ మాజీ వైస్ ఛాన్సలర్ సందేశాలతో సెమినార్ ముగిసింది. మళ్ళీ ఇంటికి ప్రయాణం.

రాత్రి చాలాసేపుచదివాను. విక్టర్ హ్యూగో రాసిన ‘ది లాస్ట్ డే ఆఫ్ ఎ కండెమ్డ్ మ్యాన్’ చదివాను. ఉరిశిక్ష పడి రేపో మాపో ఉరి తీయబడే వ్యక్తి చివరి క్షణాల మానసిక విషయాలను ఉత్కంఠభరితంగా రాశారాయన. అలా చదువుతూ ఎప్పుడు నిద్రపోయానో తెలియదు. కిటికీలోంచి ఎండ ముఖం మీద పడి చురుక్కుమనడంతో మెలకువ వచ్చింది. పక్కనిండా కాగితాలు, పుస్తకాలుచిందరవందరగా పడి ఉన్నాయి. గత కొన్ని రోజులుగా రాత్రిళ్ళు ఎక్కువ మెలుకువగా ఉండటం మూలాన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఉదయం లేవగానే టవల్ భుజం మీద వేసుకొని బ్రష్ చేసుకొంటూ బయటకు వచ్చాను. రోడ్ మీద వీధి కుళాయి దగ్గర ఆడాళ్ళు తిట్టుకొంటున్నారు. కొంతమంది ఖాళీ బిందెలతోనే వెనక్కు తిరిగారు. ముఖం కడుక్కొని ఇంట్లోకి వచ్చి కూర్చున్నాను.

టి.వి. ఆన్ చేశాను. ఏదో చర్చా కార్యక్రమం జరుగుతోంది. కొంతమంది పత్రికా ఎడిటర్లు కూర్చొని ఏదో అరుస్తున్నారు. ఎవరో దీక్షితులుగారు మాట్లాడుతున్నారు. అతను పత్రికా ఎడిటర్ల స్వేచ్ఛా స్వాతంత్య్రం గురించి మాట్లాడుతున్నాడు.

“ఈ రోజుల్లో ఎడిటర్లకు ప్రత్యేకమైన ఎజెండా అంటూ ఏమీ లేదని… పత్రికాధిపతుల ఎజెండాలే తమ ఎజెండాలుగా భావిస్తూ చచ్చినట్లు పడి ఉంటున్నారు…'’ నాకెందుకో ఆ మాట్లాడుతున్నాయన మాత్రం స్వతంత్య్రంగా ఉన్నాడా అనే సందేహం కలిగింది. చర్చ రోతగా అనిపించింది. న్యూస్ పేపర్ తీసుకున్నాను. పార్టీ ఫిరాయింపులు, మిస్సింగ్ కేసులూ, నకిలీ భార్యల పాస్‌పోర్ట్ కుంభకోణాలు అన్నీ రొటీన్‌వే. అప్పుడప్పుడూ పాత్రలూ, పాత్రధారులూ మారుతుంటారు.

అప్పుడే గదిలో బెల్ బ్రోగింది. బహుశా శ్యామ్ వచ్చాడనుకున్నాను. తలుపు తీయగానే అతనే ఉన్నాడు. “కమాన్ యంగ్ మాన్. హౌ ఆర్ యూ?'’ అంటూ ఇంట్లోకి తీసుకెళ్ళి, “కూర్చో మంచినీళ్ళు తాగుతావా?' ’ అని వంటగదిలోకి వెళుతూ కొన్ని లిటరరీ మ్యాగజైన్స్ ముందువేసి వెళ్ళాను. కొంతసేపటి తర్వాత రెండు కాఫీ కప్పులతో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, ‘దిగో,’ అంటూ టీపాయి మీద కప్పులు పెట్టి నీళ్ళ బాటిల్ చేతికిచ్చాను. కాఫీ త్రాగుతూ టీవీలో పత్రికా స్వేచ్ఛ చర్చను చూస్తున్నాము. మధ్యలో శ్యామ్ కల్పించుకొని, “వీళ్ళ దృష్టిలో పత్రికా స్వేచ్ఛ అంటే ఏంటండీ? పత్రికాధిపతుల స్వేచ్ఛనా? పత్రికా రచయితల స్వేచ్ఛనా? ఒకర్ని అంటుకుంటే మరొకరు ఉరికి వస్తున్నారే! ఈ బహురూపులకు ఏ స్వేచ్ఛ కావాలండీ?'’ అన్నాడు. అంతటితో ఆ చర్చను ఆపేశాం. “సార్! మేడంగారు ఎక్కడ? పిల్లలు ఏం చదువుతున్నారండి?'’ “అలాంటిదేమీ లేదు. నేనింతవరకు పెళ్ళి చేసుకోలేదు. అది సరేలేగానీ చదువు ఎలా సాగుతోంది? హాస్టల్ వసతి ఎలా ఉంది?'’ ముక్తసరిగా జవాబు చెప్పాడు. అతని వాలకం చూస్తుంటే ఏదో పెద్ద పనిమీదే వచ్చినట్లు అనిపించింది. అతనే కొంచెం చొరవ తీసుకొని, “సార్ నాకెందుకో మీ నేపథ్యం తెలుసుకోవాలని ఉందండి. మీ గురించి చెప్పండి?'’ అని అడిగాడు. అతని ప్రశ్న నాకు ఆసక్తి కలిగించకున్నా అతన్ని నిరుత్సాహపర్చడం ఇష్టంలేక మొదలుపెట్టాను. అతన్ని తలుచుకుంటే నా నలభై ఐదు సంవత్సరాల జీవితం కళ్ళ ముందు తిరుగుతుంది. కళ్ళెమ్మటి నీళ్ళు ఉబికి వస్తున్నాయి. గొంతు తడారిపోతుంది. అయినా తమాయించుకొని… “పెద్దగా చెప్పుకొనేందుకు ఏమీ లేదయ్యా… నీలాగే కష్టాలు కన్నీళ్ళు అనుభవించాను. తీవ్రమైన ఆకలిని, అంటరానితనాన్ని నా బాల్యం ఎదుర్కొన్నది. తెలంగాణలో ఓ మారుమూల గ్రామంలో బీద కుటుంబంలో పుట్టిన నా బాల్యం ఎంతో క్షోభను అనుభవించింది. దాన్ని నేను కళాత్మకంగా చెప్పలేను. పైగా నాకు పండితుల భాష రాదు. అందుకే నేను నా భాషలోనే చెప్తున్నా. నా గురించి ఏం చెప్పినా, ఏం రాసినా ఆకలి, అంటరానితనం గూర్చి మాత్రమే.

అప్పటికి మా ప్రాంతంలో సాగర్ లాల్‌బహదూర్ కెనాల్ త్రవ్వలేదు. విపరీతమైన కరువుతో అల్లాడేది ఆ గ్రామం. మా ఊళ్ళో మాదిగలంతాచిన్న సన్నకారు రైతుల దగ్గర జీతానికి కుదిరేవారు. అలా పాలేరుగా పుట్టిన మా అయ్య పేరు లచ్చయ్య. అతన్ని ఊళ్ళోవాళ్ళు ఏనాడూ అలా పిలవలేదు. లచ్చిగా అనేవారు. ఆయన ఏ అంటదగిన కులంలోనో పుట్టి ఉంటే లక్ష్మయ్యగారూ అనేవారేమో. అంటరాని కులంలో పుట్టాడు కనుకే లచ్చిగాడు అయ్యాడు. ఆరుగురిలో ఆఖరివాణ్ణి నేను. అటూయిటూ కొన్ని తర్వాత తర్వాత అక్షరం ముక్క నేర్చుకుంది నేనొక్కణ్ణే. మాకు సెంటు భూమి లేదు. అమ్మా అయ్యా ఇద్దరూ కూలిపని చేసేవారు. గూడేలలో వాళ్ళంతా పెద్ద కులపోళ్ళ ఇళ్ళను భాగాలుగా పంచుకొనేవారు. వాళ్ళిళ్ళల్లో పండగలకు, పబ్బాలకు, పెళ్ళిళ్ళకూ కుటుంబం అంతా పనిచేసేవారు. వాళ్ళిళ్ళల్లో పశువులు చనిపోతే ఎత్తివేయడాలు, మనుషులు చస్తే దాన్ని తగలబెట్టి ఆ శవం బుగ్గి అయిందాకా బొగ్గు అయ్యేవారు. డై లెట్రిన్‌లో మలాన్ని చేతుల్తో ఎత్తి పోసేవారు. అలా మలినమైన పనులన్నీ మాకు పంచి ఇచ్చిన నీతి ఏ శాస్త్రంలోదో నాకర్థమయ్యేది కాదు. వీళ్ళు ప్రధానంగా వ్యవసాయపనుల్లోనే బ్రతుకు వెతుక్కొనేవారు. వీళ్ళ జీవితమంతా వ్యవసాయపనుల్లోనే మసిఅయ్యేది. వీళ్ళకు చివరగా దక్కేది కళ్ళం అడుగు గింజలు మాత్రమే. మా అంటే ఇంతో కొంత భిక్షంగా విదిల్చేవాళ్ళు. ఎంత కష్టపడ్డా వీళ్ళకు మిగిలేది మట్టి, తాలుతో నిండిన కొద్దిపాటి ధాన్యమే. వాళ్ళు ఏనాడూ ఆ ధాన్యపు రాశుల్లో తమకూ వాటా ఉంటుంది అని ఎందుకు కొట్లాడరో నాకస్సలే అర్థమయ్యేది కాదు. నా బాల్యం మరీ దుర్భరంగా గడిచింది. పాన్‌షాప్ బడ్డీల కింద తమలపాకులీ ఏరుకొని తిన్నరోజులు, ఊరిబయట వాగులవెంట చామగడ్డలు తొవ్వి కాల్చుకున్న రోజులు, ఊసబియ్యం తెచ్చుకొని వేపుకొని దంచుకొని తిన్న రోజులు, పశువులు కాస్తూ పరిగ ఏరిన వడ్లనుక ండువాలో పలుకురాళ్ళతో దంచి భూమిలో గుంటతీసి పూడ్చి పైన మంటపెట్టి ఉడికి ఉడకని అన్నం తిన్న రోజులు… కందికాయలు, అనపకాయలు ఊరిబయట ముళ్ళపొదల్లో రక్తం కారుతున్నా సేకరించిన ఈతకాయలు, బలుసుపండ్లు, గుబ్బకాయలు ఇవ్విటి సేకరణలోనే నా సగం బాల్యం గడిచింది. బడి వదిలాకా మేమంతా మా ఊరి బొడ్రాయి దగ్గర గుమిగూడేవాళ్ళం. ఊరిపక్క వాగుల్లో నీళ్ళకయ్యల్లో చేపలు పట్టేవాళ్ళం. చిన్నచిన్న పరకలు, రొయ్యపిల్లలు, ఉసికదంతులు, జెళ్ళలు, కనిశెలు ఇంటికి తెచ్చేవాళ్ళం. చాలా సందర్భాలలో అన్నంకు బదులు అవే మాకు తిండి. మా ఇళ్ళల్లో ఉట్టి మీద ఏనాడూ మీగడ పెరుగు లేదు. ఉంటే గింటే ఎండుతునకలు, దోసకాయ వరుగులు ఉండేవి. సెంటు భూమి లేకున్నా మాకు ఆప్యాయతలే ఆస్తులు, ప్రేమలే జీవితాలు. నిజంగా పేదవాళ్ళు గొప్ప ప్రేమికులు. ఆ ఆప్యాయతా అనురాగాలే నా గురించి చెప్పడానికి, రాయడానికి కారణమైనాయి. మా అన్నయ్య చాలా చిన్నవయస్సులోనే జీతం కుదిరాడు. అతనికి రెండు పూటలా అక్కడే తిండి. ఉదయం తనక్కడ తిని మధ్యాహ్నం తినాల్సిన సద్దిమూట స్కూల్‌లో ఇచ్చిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. నేను చవిచూసిన ఆకలి బాధ రాయాలంటే నా కలంలో ఇంకు సరిపోదేమో. నా కంట్లోంచి కారిన రక్తాన్ని ఇంకుగా మార్చి రాయాలని ఉంది శ్యామూ! నేను ఇంతకుముందే చెప్పాను, మా ఇళ్ళలో ఎండుతునకల గూర్చి. చాలామంది మేమది తింటున్నామనే మమ్మల్ని దగ్గరకు రానియ్యలేదు. మనుషుల్ని మనుషులు చంపుకుని తింటే తప్పులేదుగాని చచ్చినవి తింటే తప్పెట్లా అవుద్ది. ఈ దేశంలో చాతుర్వర్ణం బ్రతికి ఉన్నవాళ్ళను తిన్నది. దానికి బయట ఉన్న మేము చచ్చినవాటినే తిన్నాము. వాళ్ళు కండకావరంతో చేస్తే మేం కేవలం బ్రతకడానికి మాత్రమే తిన్నాం. తప్పేమీ లేదు. నా జీవితంలో మర్చిపోలేని మరో జ్ఞాపకం, మా ఊళ్ళో పశువుల ఎండిన బొక్కలను అమ్మడం. వాటి సేకరణ చాలా కష్టంతో కూడుకొన్నది. ఎక్కడైనా పశువు చనిపోతే ఊరికి దూరంగా పారేసేవారు. మా ఇళ్ళు కూడా ఊరికి దూరంగానే ఉండేవి. చచ్చిన పశువులు చూస్తేనే భయంకరంగా ఉండేవి. విపరీతంగా కుళ్ళి వాసనొచ్చేవి. ఒక్కోసారి వర్షం వస్తే అప్పుడు విపరీతంగా ఉబ్బేవి. వాటి దగ్గరకు పోవాలంటే దుర్లభంగా ఉండేది. అంత వాసన వచ్చినా దాని మీద తెల్ల పురుగులు లక్షలాదిగా లుకలుకలాడేవి. మేమేం తక్కువ తిన్నాం అంటూ కొన్ని ఎర్ర పురుగులూ పోటీపడి బొక్కల్ని నుజ్జునుజ్జు చేసేవి. ఈ దేశ ఆర్థికవ్యవస్థను పీల్చి పిప్పిచేస్తున్న పెట్టుబడిదారుల్లా కొన్ని దూడబాతులు, రాబందులు ఎగబడేవి. అవి ఎలా పసిగడతాయో ఏమో! పశువు చచ్చిందంటే టంచన్‌గా ప్రత్యక్షమయ్యేవి. ఎంతో సఖ్యతతో చాలా సాఫీగా ఆ పశువు మీద మాంసం పీక్కు తినేవి. మనుషుల కంటే అవే చాలా క్రమశిక్షణగా తింటాయి. రాబందులు, కుక్కలు పీక్కు తినగా మిగిలిన అస్థిపంజరాలు మాకు అవసరమయ్యేవి. “అప్పట్లో ఊళ్ళల్లో వచ్చే విపరీత కరువు మూలాన ఊళ్ళో పెద్దవాళ్ళు ఉండేవారు కాదు. బ్రతుకుతెరువు కోసం గూడేలు గూడేలే కాలవ క్రిందకు వలసపోయేవాళ్ళు. కేజవలం ఊళ్ళో పిల్లలమూ, వృద్ధులమూ మిగిలేవాళ్ళం. బ్రతుకు తెరువు వెతుక్కొనే క్రమంలో తెలంగాణలో ప్రతి పల్లె ఈటుపోయిన చేనులా ఉండేది. ప్రతి గడపకు తాళాలు వెక్కిరించేవి. అలా మిగిలిన కొద్దిమంది పిల్లలం జట్లు జట్లుగా విడిపోయి, బొక్కలు సేకరించేవాళ్ళం. వాటిని చిన్నచిన్న ముక్కలుగా కట్టలు కట్టి ఇంటికి తెచ్చేవాళ్ళం. అవి తెస్తున్నప్పుడు సైకిల్ మీద కట్టిన మూట ఒక్కోసారి తెగి కిందపడేవి. వాసనతో కూడినవి మళ్ళీ కట్టాలంటే చాలా ఇబ్బందనిపించేది. కిందపడ్డ అవి అక్కడ ఎక్కువసేపు ఉంటే ఊళ్ళోవాళ్ళు తిట్టేవాళ్ళు. ఆ తొందర్లో నేననుభవించిన న్యూనతా అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎండుబొక్కలు విపరీతమైన వాసన వచ్చేవి. అవికొనేవాడు ఆ వాసన అంతకాలం ఎలా అనుభవించేవాడో నాకు అర్థం అయ్యేది కాదు. సైకిల్‌పై రెండు గోనెబస్తాలు వేసుకొని ఊరూరూ తిరిగి అవి కొనేవాడు. అలా వస్తూ ఊరిబయట కాలువ దగ్గర ఆగి తెచ్చుకున్న అన్నంమూట తినేవాడు. ఆ వాసనలోనే ఆ చేతులతోనే అన్నం తిని పొద్దస్తమానం అవి సేకరించి ఫ్యాక్టరీలో అమ్మేవాడు. వాసన అని అన్నం మానలేదు కదా! అలా వాటి సేకరణలో అరుపులు, తిట్లు, శాపనార్థాలు, కొట్లాటలు, చివాట్లు అదో గోల. వాటి సేకరణలో ఒక్కోసారి కొట్లాటలే జరిగేవి. అప్పుడప్పుడూ అవే ఆయుధాలుగా మారేవి. వాటితోనే గాయపర్చుకొనేవాళ్ళం. ఈ క్రమంలో తగిన గాయాలు, కారిన రక్తాలు జరిగిన అవమానాలు కోకొల్లలు…'’

గదిలో ఎందుకో ఉక్కపోతగా అనిపించింది. ఇద్దరికీ బాగా చెమటలు పట్టాయి. ఏదైనా తినాలనిపించింది. ఆమధ్య ఊరి నుండి ప్రేమలత పంపిన అరిసెలు ఉన్నాయి. ప్లేట్‌లో అవి పెట్టుకొని రెండు వాటర్‌బాటిల్స్ తీసుకొని బయటికి వచ్చాము. బయట మొక్కల మధ్య తింటూ కూర్చున్నాం. ఆకాశంలో ఏదో అలజడి కన్పిస్తూనే ఉంది. వర్షం వచ్చేటట్లుంది. ఆ తర్వాత?'’ అన్నాడు శ్యామ్.

మా ఊరికి దగ్గరలోనే ఓ బొక్కల మిల్లు ఉండేది. ఇప్పుడది లేదు. ఓ వామపక్ష పార్టీ నాయకుడిది అది. కేవలం బ్రతుకుదెరువు కోసం మా తెలంగాణ జిల్లాలలోకి సంచి భుజాన వేసుకొని వచ్చిన వేలాదిమందిలో అతనూ ఒకడు. కులం కారణంగానో, పార్టీ పలుకుబడి కారణంగానో అతి సామాన్యమైన అతను నేడు కోట్ల రూపాయలు సంపాదించాడు. వాటితో బాటే విస్తృతమైన పలుకుబడి, దాంతో విలువైన అపార్టుమెంట్లు, విదేశీ కార్లు సంపాదించాడు. మా తెలంగాణలో ఇలాంటివాళ్ళు ఎంతోమంది ఉంటే ఉండవచ్చు. వాళ్ళు నేడు మా అజ్ఞానం ఆకాశం అంత అనీ, వాళ్ళకు నోళ్ళు లేకపోయినా నోట్లో నాలుకలు ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి కోటీశ్వరులు ఏ బూర్జువా పార్టీలోనే ఉంటే పోనీలే అనుకొనేవాళ్ళం. వ్యక్తిగత ఆస్తి ఉన్న ఆయన కమ్యూనిస్టు పార్టీ పాఠాలు చెప్తాడు. అతని ఫ్యాక్టరీకే ఈ బొక్కల సేకరణ చేసేవాళ్ళం. అలా సేకరించిన మా బొక్కలు బొందల పాలయినాయి కానీ అతను మాత్రం కోటీశ్వరుడు అయ్యాడు.

కొంతకాలానికి తెలంగాణ పల్లెలు తొండల గుడ్లకి స్థావరాలైనాయి. అప్పుడు గొడ్లు సహజంగా చావడం కంటే కబేళాలకు బలవన్మరణాలతో తరలించబడ్డాయి. తినడానికి తిండి లేని రైతు అవసరమైతే తాళిపుస్తెలు తాకట్టుపెట్టి కొన్న పురుగుమందులతో, తెచ్చిన కష్టాల నష్టాల మూలంగా అవే త్రాగి ఉసురు తీసుకొన్న రైతులు మాత్రం ఎంతకాలం ఆ భారం మోయగలరు. ‘ద ప్లష్ వాజ్ హెమీ ఆన్ దెయిర్ బ్యాక్.’ వాళ్ళకు కట్టుగొడ్లు గుదిబండలుగా మారాయి. మందలు మందలుగా లారీలకు లారీలు పట్టణాలలోని కటిక దుకాణాలకు కళ్ళనీళ్ళు ఉబికి వస్తుండగా అమ్మివేశారు. ఈ దేశంలో రైతుగా పుట్టడమే శాపమయింది. ఆ శాపగ్రస్తులు కట్టుగొయ్యలతో సహా అమ్మివేసి నిస్సహాయులుగా మిగిలిపోయారు. కేవలం పశువులు మాత్రమే కాదు ఇక్కడ మనుషుల అసహజ మరణాలు మాకు సర్వసాధారణమే. స్మారక స్థూపాలు చెప్తాయ్ ఎంతమంది పోయారో. మా ఊళ్ళో అప్పుడు బొక్కల కరువువ చ్చింది. అప్పటిదాకా చచ్చిన కళేబరాల కోసం వెతుకులాడిన మా చూపులు స్మశానం వైపు మళ్ళాయి. మనుష్యుల బొందలు త్రవ్వే పనికి సాహసించాం. అలా రాత్రిళ్ళు స్మశానంలోనే ఎక్కువ కాలం గడిపాం. శవాన్ని తగలెయ్యగా మిగిలిన మొద్దులు రాత్రి వీచే గాలులకు ఎర్రగా కణకణలాడుతున్నట్లుగా కనిపించేవి. భయంభయంగా ఉండేవి. అవి చూస్తే చిన్నప్పుడు స్మశానంలో కొరివిదయ్యాలు తిరుగుతాయి అని విన్న కథలు మరింతగా భయపెట్టేవి. ఇవేవి ఆకలి ముందు అంత సమస్యగా అనిపించేవి కావు. పైసల కోసం, ఆకలి కోసం, బొక్కల కోసం బొందలు తవ్వాం. తిరిగాం తిరిగాం ఎన్నో బొందలు మాయమైపోతున్నాయి కాని మా వెతుకులాట మాత్రం ఆపలేదు. చాలాకాలానికి బొక్కల సైజు తగ్గడం చూసి వాటిని కొనే వ్యక్తి మమ్మల్ని నిలేశాడు. విషయం ఊరంతా తెలిసింది. పెద్ద పంచాయతే జరిగింది. మా నోటికాడ సకల సంపదల్ని కొల్లగొడుతున్న రాబందులు మమ్మల్ని ఈ విషయంలో దొంగలన్నారు. తిట్టారు, కొటాజ్టిరు. అలగా లంజాకొడుకుల్ని ఊరు నుండి వెలివేయండి అన్నారు. ఊరికి అరిష్టం జరిగింది శాంతి జరపాలన్నారు. నిజంగా దొంగలెవరో నాకిప్పటికీ అర్థం కాదు.'’ బయట ఎవరో పిలుస్తున్నట్లనిపించింది. ఇద్దరం అటు తిరిగాం. సుందర్ సార్, “ఏదో పార్శిల్ అండీ, నల్గొండ నుండి,'’ అన్నాడు. బహుశా పుస్తకాలు అయి ఉంటాయి. ఫ్రమ్ అడ్రస్ చూశా. వేముల ఎల్లయ్య ‘సిద్ధి’ పంపాడు. పార్శిల్ పక్కనపెట్టాను. స్కూల్‌కి వెళుతున్న నన్ను వంటి మీద బట్టల సమస్య విపరీతంగా ఇబ్బంది పెట్టేది. అమ్మ పాతచీరలే మాకు పక్కకూ, కప్పుకోవడానికి. నా చిన్నప్పటి నుండి మావి చింకిపాతలే. మా ఇంటి ప్రక్కనే బయిండ్ల వీరస్వామి ఉండేవాడు. ఊళ్ళో ముత్యాలమ్మ, మైసమ్మ లాంటి గ్రామదేవతల దగ్గర ఓ రకంగా సేవ చేసేవాడు. పక్క ఊర్లో ఉన్న కొంతమంది తండాల నుండి వచ్చి బాణామతి చిల్లంగిలాంటివి అతను తొలగిస్తాడని అతని వద్ద పూజలు చేయించుకొనేవాళ్ళు. అర్ధరాత్రి వేళ అరుపులు, మంత్రాలుచదివేవాడు. అతనితో మమ్మల్నెవరినీ మాట్లాడనిచ్చేవారు కాదు. ఓ రోజు నేను స్మశానంలో తిరుగుతున్నప్పుడు శవదహనానికి ముందు దాని మీద కప్పిన తెల్లగుడ్డను ఓ కర్రతో పక్కకు విసిరేశాడు. దానివంక అందరూ భయంభయంగా చూసేవారు. ఆ గుడ్డను వీరస్వామి ఇంటికి తెచ్చుకోవడం నేను చూశాను. ఓరోజు ధైర్యం చేసి ఇంటికి వెళ్ళాను. గడప దగ్గర నిమ్మకాయలు, తాయత్తులు కనిపించాయి. భయం వేసింది. ధైర్యం చేసుకొని, “పెద్దయ్యా నాకో తెల్లగుడ్డ కావాలి ఇస్తావా?'’ “ఎందుకు రా?'’ అడిగాడు. “చొక్కా కుట్టించుకుంటా!'’ “అలా అతనిచ్చిన ఆ తెల్లగుడ్డతో రెండు చొక్కాలు కుట్టించుకున్నాను. ఎన్నోసార్లు అవే చొక్కాలు వేసుకున్నాను. ఈ సంఘటన నన్ను కొన్ని విషయాల పట్ల ధైర్యంగా మాట్లాడేటట్లు చేశాయి. అప్పటినుండే నాలో హేతువాద భావాలు అలవడ్డాయి. హేతువాద ప్రచారకుడ్ని చేశాయి. హైస్కూలు తర్వాత చదువులో కొంచెం చురుకైన నన్ను మా టీచర్ ఆశాదేవిగారు చేరదీశారు. వారు నన్ను వాళ్ళింట్లోనే అట్టిపెట్టుకొని చదువుకొనే ఏర్పాటు చేశారు. ఎంతో నిష్టగల శ్రీవైష్ణవుల కుటుంబం అది. ఆ ఇంట్లో నేను ఉండడానికి మా మేడం పెద్ద యుద్ధమే చేశారు. వాళ్ళను ఒప్పించి నాకు తిండిపెట్టి చదువు చెప్పించారు. భద్రాచలం దేవాలయంలో ఇప్పటికీ వాళ్ళ కుటుంబమే ప్రధాన అర్చకత్వం చేస్తున్నారు. అలా శ్రీవైష్ణవుల ఇంట్లో పనిమనిషిగా మారి చదువుకున్న నేను అనేక ఒడిదుడుకుల మధ్య యూనివర్సిటీ దాకా ఎదిగాను.'’ ఇలా నా విషయాలు శ్యామ్‌తో పంచుకోవడానికి ప్రధాన కారణం ఇద్దరి బాధలూ భావాలూ ఒక్కటి కావడమే… నా కాలంలో నా పట్ల వివక్ష చూపినా, నేటి నాగరికత ఎంతో అభివృద్ధిచెందినది. ఎక్కడికో వెళ్ళాం అంటున్న ఈ వ్యవస్థ ఈనాడు కూడా శ్యామ్ పట్లా అదే వైఖరి కలిగి ఉంది. రెండు తరాలకు ప్రతీకలైన మాపట్ల ఎందుకు ఈ వ్యవస్థ కటువుగా ఉంది? గడిచిన ఈ అర్ధ శతాబ్దంలో ఏమీ ఎందుకు మారలేదు? ఎంతో మారింది అంటున్నారే ఈ దేశ మేధావులు. వీళ్ళు అంతా వృద్ధిరేటు పెరిగిందీ పెరిగిందీ అంటున్నారు. ఏం పెరిగిందీ? స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల అనే డొల్ల పదాలతో మోసం చేస్తున్నారు. మనలాంటి పేదలు ఎంత మగ్గినా జి.డి.పి. పెరుగుదల నమోదు చేయవచ్చు. కేవలం గణాంకాలు మాత్రమే పెరుగుతాయి. ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది ఆకలి అవుతోంది. ఇంట్లోకి పోదాం పద ఏమైనా వండుకుందాం అంటూ కిచెన్‌లోకి వెళ్ళాం. లైట్ వేశాను. కుక్కర్‌లో రైస్ వేసి ఆ ప్యాకెట్ విప్పాను. అప్పుడు గుర్తుకు వచ్చింది తను తప్పని పరిస్థితిలో ఈమధ్య ఇంటికి వెళ్ళాను. చిన్ననాటి మిత్రురాలు యూనివర్సిటీలో నా జూనియర్ అయిన ప్రేమలత తన కూతురుకు అన్నం ముట్టియ్యాలి, అదీ నాచేత జరపాలని పట్టుపట్టింది. ఆ పద్ధతులు నాకు ఇష్టం లేకున్నా తప్పలేదు వెళ్ళాలనిపించింది. వాళ్ళను చూసినట్లు ఉంటుందని వెళ్ళాను. వెళుతూ ఆమెకిష్టమైన పూర్ణాలు కొని తీసుకెళ్ళాను. భోజనాల తర్వాత ఇంటికి బయలుదేరుతుండగా, ‘వన్‌మినిట్!’ అంటూ నీట్‌గా ప్యాక్ చేసిన కవర్ ఇస్తూ, “నీకిష్టంగా సుందర్ ఇవి తీసుకెళ్ళు…’ అంది నవ్వుతూ, వట్టి తునకలు ఇస్తూ.

మాట్లాడుతూనే ఆ ప్యాకెట్ తీసి ఆ పూట వండాను. భోజనాల తర్వాత చివరగా అంతకు ముందురోజు సెమినార్‌లో శ్యామ్ ప్రెజెంట్ చేసిన పేపర్, ‘అస్తిత్వ కులాల ఉద్యమాలు-సాహిత్య ధోరణులు’ మీదకు మళ్ళింది చర్చ. అతను కేవలం అకడమిక్ పుస్తకాలను మాత్రమే చదివినట్లు నాకనిపించలేదు. కొద్దోగొప్పో అదనంగా కూడా చదివాడు.

ఒక్కసారిగా ఆకాశంలో ఏదో మార్పు కలిగింది. సన్నటి చినుకులు మొదలయ్యాయి. గాలి బలంగా వీస్తోంది. ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. కరెంటు పోయింది. ఇంట్లో రీడింగ్ రూమ్‌లోకి తీసుకెళ్ళాను. గ్లాస్ కిటికీలకు అడ్డంగా ఉన్న కర్టెన్‌లను పూర్తిగా తొలగించాను. గదిలో వెలుతురు కొంచెం పెరిగింది. మా ఇద్దరి చర్చ కులం అనే అంశం మీదకు పోయింది. కులసమస్య పట్ల ఇంతకాలం ఒంటిచేతి చప్పట్లతోనే ఉద్యమాలు నడుపుతున్నారు. ఇక్కడ కులం కేవలం ఒక భావన మాత్రమే. వర్గాలు మాత్రమే ఉన్నాయి అంటున్నారు ఈ దేశ బుద్ధిజీవులు. “సార్ ఒకటి మాత్రం నిజం. ఈ దేశంలో శవానికీ, స్మశానానికీ అన్నింటికీ కులం ఉంది. అంతెందుకు కుల ఆచ్ఛాదన లేని గుండుసూది మొన పట్టినంత స్థలాన్ని చూపించమనండి ఈ దేశ బుద్ధిజీవులను. అలగాజనాల కళలకూ భావాలకూ తీరని ద్రోహం జరిగింది. ఇంతకాలం పండిత వర్గాలు అలగాజనాల కళలనూ సాహిత్యాన్నీ తృణీకరించాయి. వాళ్ళు చెప్పిందే కళ అయింది. సాహిత్యం అయింది. అందుకేనండీ మన కళలకూ, భావాలకూ ఏ గ్రంథాలు చోటివ్వలేదు. గ్రంథస్తం చేయలేదు. ఆధిపత్య కులాల కళలకూ, అలగాజనాల కళలకూ పెద్ద అగాధం సృష్టించారు. ఆ అగాథాన్ని పూడ్చి ఓ ప్రత్యామ్నాయ సంస్కృతినీ, సాహిత్యాన్నీ సృష్టించాల్సిన అవసరం చాలా ఉంది. అది ఎంతైనా అవసరం. ఇంతకాలం మనపట్ల ఎంతో వివక్ష చూపారు. చాలామంది మేధావులు చక్రవర్తి ఫారో శవం ముందు కిరాయి దుఃఖితులుగా దొంగేడ్పులు ఏడ్చారు. మనం ఇలాగే ఉంటే ఆ ఏడ్పులతో మనల్ని మభ్యపెడుతూనే ఉంటారండీ. మనం ఇలాగే ఉంటే మనల్ని భూస్థాపితం చేసి మరీ ఆనందంగా ధైర్యంగా నవ్వుతారు. ఎవడి అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని వాడే రాసుకోవాలి. అస్థిత్వ ఉద్యమాల ఆత్మ గౌరవాన్ని పరిపుష్టం చేయడానికి సరిపడా గింజలు తయారుచేశాం. వాటిని నలుమూలలా చల్లుతాం. ఇంతకాలం కేవలం ఆధిపత్యాల కోసం మాత్రమే జరిగిన ఈ అబద్ధ యుద్ధాల సిలబస్‌ను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఒంటి చేటతి చప్పట్ల దిశను దశనూ మారుస్తాం! “సార్! మనం కొన్ని వేల సంవత్సరాలుగా పరాజితులుగానే ఉన్నాం. ఓడిపోతూ వంచింపబడుతూనే ఉన్నాం. ఎంతకాలం ఇలా… ఇంతకాలం విజేతలే చరిత్రను నిర్మించారు. ఆ పరాజితులే చరిత్ర నిర్మాతలైతే ఎలా ఉంటుందో… ఇంత కాలం బ్రతకడమే ఓడిపోవడమయినప్పుడు బరితెగించి యుద్ధమే చేయాలండీ! ఏమో ఈ యుద్ధంలో మనమే గెలుస్తామేమో…'’ శ్యామ్ ఈ మాటలన్నాక కాసేపు మౌనంగా ఉండిపోయాను. ఆ నిశ్శబ్దం నాకు చిత్రంగాకనిపించింది. శ్యామ్‌ని తీక్షణంగా చూశాను. ఎముకలు పిగులుతున్న చప్పుడు…......................



చెదిరిన కల

[మార్చు]

‘తెలంగాణా ప్రజలు భావోద్వేగాలను ఆపుకోలేరు’ అన్నాడు ఓ సీమాంధ్రమిత్రుడు. ఈ మాట అతను సరదాగా అన్నా ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నాకు అర్ధం అయింది . ఇచ్చిన మాటకోసం ఏ త్యాగానికి అయినా సిద్దపడే బలహీనత లోంచి అతను ఆ మాట అని ఉండొచ్చు.వాస్తవానికి అదో విచిత్రమయిన మానసిక దౌర్భల్యం. ఈ లక్షణం కేవలంతెలంగాణాలోనే కాదు, తరతరాల అణచివేత దోపిడీ పీడన వివక్ష ఎక్కడున్నా ఆప్రజల భావోద్వేగాలు వర్తమానసమాజాల కంటేభిన్నంగానే ఉంటాయి . చరిత్రలో అవి అరుదుగా అప్పుడప్పుడూ బయటపడతాయి . ఒక ప్రాంత విముక్తికోసం వందలాదిగా సామూహిక హననం చేసుకున్న దుష్టాంతాలు అరుదు. అక్కడక్కడా శత్రుదేశాల బారినపడకుండా ఆత్మాహుతి చేసుకున్నవి, మతపరమయిన బలిదానాలు మినహాయిస్తే, తెలంగాణా లో మొఘలాయీ లకు బందీగా చిక్కి న ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి చనిపోయిన వైనం వెనక ఓటమిని జీర్ణించు కోలేని బలహీనత చరిత్రలో మనం విన్నాం . మళ్ళీ ఆ ఒరవడి ప్రత్యేక తెలంగాణా సందర్భంగా ఎల్బీనగర్ చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహ సాక్షిగా ఒక ప్రాంత ఆక్రోశం అగ్గిఅయి మండింది. దేశ రాజధాని ఒక ఉరిని చూసి ఉలిక్కి పడింది, ఒక ఆనాద ఆశ్రమం లో పెరిగిన యాదయ్య తాను సంపాదించిన దానిని అదే ఆశ్రమానికి ఇచ్చి యన్ సి సి గేటు దగ్గర ఆత్మగౌరవ పతాక అయి కనుమరుగు అయ్యాడు. రక్షణ కోసం వాడాల్సిన తుపాకి కానిస్టేబుల్ కిష్టయ్య కణత మీద నర్తించుకునేలా చేసింది. పరిగెత్తుతున్నరైలును ఒక నినాదం డీకొని ఉలిక్కి పడేలా చేసింది, చీకటిని పారద్రోలే వెలుగు పెట్రోల్అయి పెయ్యి మీద నర్తించింది. ఒకటా రెండా వందల అత్మాహుతులు ఇవన్నీ దానికి మరొకటి ప్రేరేపితమయిన చర్యలు ఆ చర్యల వెనక ఒక ఉద్వేగం ఉంది ఒక ఆశ ఉంది ఒక ఆర్తి ఉంది ఒక కన్నీటి వలపోత ఉంది. దాని వెనక ఒక సుందర స్వప్నం కోసం కన్న తరం ఆశలు ఉన్నాయ్. ఆశయం సన్నగిల్లితే జరిగిన తప్పిదాలు అవి . తెలంగాణా ప్రజల అదృష్టమో దురదృష్టమో కానీ ఉస్మానియా విశ్వవిధ్యాలయ కేంద్రంగా నే ఎక్కువగా ఈ ఉద్వేగాలు పెల్లుబికాయి. ఇలాంటి కథనాలు కష్టాలు కన్నీళ్లు కలగలసి ఉంటాయ్ అక్కడ . ఒకసారి ఉస్మానియా కి వచ్చి పలకరించండి. ఒక్కొక్క విధ్యార్దిది వెతలకలబోత. ఒక్కో తండ్రిది ఒక్కో ఆశ. పండిన దాన్యం అమ్ముకొని వాళ్ళను పట్నంచద్వులకు పంపిస్తూ కన్నీటిపొరలు కదులుతున్న కళ్ళతో చేసుకున్న వీడ్కోలు, తన కొడుకులు ఉన్నత చద్వులు చదవి తన తలరాతను మారుస్తాడు అనుకొని కోటిఆలోచనల తో భవిష్యత్ మీద గంపెడు ఆశతో,తర తరాలుగా తన తండ్రులు తట్టలు మోసారు. దానికి చదువే విముక్తి అనుకుని ఒక్కో విద్యార్ది నడవాలనుకున్న గమనం గతుకుల మయిమయిన రోడ్డులా మారింది .

తెలంగాణలో పుట్టిన ప్రతి విద్యార్ది జీవితం నల్లేరు మీద నడకలా లేదు, జీవితం అంతా నిత్యకల్లోలాలతోనే బాల్యం గడిచింది.తన యవ్వనం ఆకలి, అంటరాని తనం మధ్య, విశ్వవిధ్యాలయ చదవు ఒక సైనిక పహారామధ్య నడిచింది. నగరం అంతా పోలీసుల డేరాలతో శత్రు దేశాల మధ్య ఉండాల్సిన మిలటరీ పద గట్టనల మధ్య గడిచింది ,హాస్టల్ మూసి వేతతో ఛీకటి గదుల మధ్య ఆకలి కడుపులను ఎండబెట్టిన వైనం. ఒక భద్రత లేని పరిస్థితుల మధ్య బిక్కు బిక్కుగా గడిచింది. అదో మానసిక ఉక్కపోత ,చీటికి మాటికి కేసులతో నీడలా వెంటాడిన ఒక భయానక స్థితుల మధ్య కొట్టు మిట్టాడిన ఒక నిరుద్యోగి జీవితం ఎందుకు బళ్ళున తెల్లారిందో మీకు చెప్పాలనిపించింది .

పెద్దపల్లి కి చెందిన సూర్యనారాయణ ఉస్మానియాలో పరిశోదకవిద్యార్ది కెసిఆర్ నిరాహారదీక్ష తదనంతరం ఊస్మానియాతో సహా యావత్తెలంగాణా విద్యార్దిలోకం అగ్గి రవ్వై మండింది. ఆ ఉద్యమ ఉద్రితిని ఆపేందుకు సీమాంధ్ర పోలీసు చేసిన కసాయి తనానికి బలయిండు.హాయిగా తిని చద్వుకోవాల్సిన పరిశోదక విద్యార్ది ఒక అర్ద రాత్రి హటాత్తుగా ‘అయ్యో తుపాకులు’ ‘బాంబులు’ ‘పారిపోండి’ ‘రక్షించు కొండి’ అని అరవడం మొదలెట్టాడు. ఆనాడు ఉస్మానియా బి హాస్టల్ దగ్గర జరిగిన లాటీ చార్జిని బహుసా దగ్గరగా చూసిఉండొచ్చు. పోలీసుల చేసిన స్వైర విహారానికి కలత చెంది మనో వైకల్యానికి గురై,తన ఊరికి పోయి ఓ కాళరాత్రి ఇంట్లో నిద్రపోతున్న కన్న తల్లిని రోకలి బండతో కొట్టి చంపాడు, పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు పంపారు. కొంతకాలం జైల్లో ఉన్నాడు. బెయిలుమీద ఇంటికి వచ్చాడు. మళ్ళీ కొన్ని నెలల తర్వాత అర్దరాత్రి తన తండ్రినీ అదేరోకలి బండతో కొట్టి చంపాడు. ఇది అతనిచెదిరినకల ఒక బవిష్యత్ కు బలవంతపు పులుస్టాప్ . ఇదే క్రమంలో బల్వన్మరనానికి గురిఅయిన మరో విద్యార్దిగతం కూడా చెప్పాలనిపించింది బోగాసత్యనారాయణ అనే ఒక పద్మశాలీ విద్యార్ది వ్యదార్దమయిన వైనం కూడా మీకు చెప్పాలి. కోటి ఆశలతో కూటికోసం పేగులు దారల్లా మారిన ఒక చేనేత బడుగు జీవి వలపోత గురించి చెప్పాలి. సత్యనారాయణ అనే ఒక నిరుద్యోగి అత్యంత ప్రతిభావంతమయిన విద్యార్ది. కూటి కోసం కోటి ఆశలతో కన్నారం నుండి ఒక వలస కూలీ లా వచ్చాడు. తెలంగాణా ఉద్యమం ఉదృతంగా ఉన్న రోజులు అవి దశాబ్దాల వెనకబాటు తనం విద్య ఉద్యోగం ఉపాది లో వివక్ష కు మతిచెడి ఇంటికి వెళ్ళాడు . నిరుద్యోగ రూపం లో విధివెక్కిరించింది మనసు కలత చెందింది. తనలో తానె మాట్లాడుతూ ఉండేవాడు . గేటుకాడ గుంటలు తవ్వారని అవి తనను అందులో పాతి పెట్టేందుకే తీసారని తనతో పాటు చదవు కుంటున్న తన తమ్ముడితో అనేవాడట. పరిస్తితి విషమించడం తో తమ్ముడు తన అన్నను ఇంటికి పంపాడు అక్కడన్నా ప్రశాంతంగా ఉంటాడని.పాపం తనకేం తెలుసు విధి తనను హంతకుడిగా మార్చి బలవన్మరానికి లోనవుతాడని అలా ఓ కాళరాత్రి రోకలి బండతో తన తండ్రిని బాది చంపి మరుసటి రోజు తానూ బల్వన్మరనానికి పాల్పడ్డాడు. వ్యవస్థ దృష్టి లో అతనో హంతకుడు,పిచ్చివాడు, జీవితాన్ని ఎదిరించలేక నిష్క్రమించినవాడు, దుర్భలుడు పిరికివాడు . ఎన్ని లేబుళ్ళు అయినా తగిలించడానికి అర్హులు వాళ్ళు . కానీ ఆ హత్యలకు మూలం ఈ ప్రాంతం లో విద్యార్ది లోకం తమ ఆత్మస్థైర్యం మీద కోల్పోతున్న నియంత్రణ, దాని మూలంగా దాదాపు తొలి విడత మలివిడతలో పదిహేను వందల మంది బలవన్మర్నాలకు గురయ్ కన్న వారికి కడుపు కోత మిగిల్చిన వైనం తెలంగాణా సాధన సాక్షిగా చూసాం .

ఒక ప్రాంత విముక్తి కోసం యుద్ధం లో పోరాడి ప్రాణాలు అర్పించిన చరిత్ర చూసి ఉంటాం కానీ, తమను తాము బలవన్మ రానలకు కారణ భూతం కచ్చితంగా వ్యవస్థీకృత హత్యలు గానే చూడాలి. ఇక్కడ ఆత్మహత్య లు వ్యక్తిగత మయినవా వ్యవస్థీకృత మయినవా అనే చర్చ పక్కన పెడితే, ప్రతి మానసిక దౌర్భల్యం వెనక రాజ్యం లో ఉన్న అపసవ్యత నే కారణం దర్ఖ్ హమ్ లాంటి వివేచనా పరులు సూత్రీకరించారు . అదే సందర్భం లో ఈ వ్యాస రచయిత తో సహా వందలాది మంది విద్యార్దులు హైదరాబాద్ నుండి ఉత్తర తెలంగణా దక్షిణ తెలంగాణా లు కలుపుతూ చేసిన పాదయాత్రలో వరంగల్ జిల్లాలో ఒక తండా ఊరి బయట స్మశానం లో ఆత్మహత్య చేసుకున్న తన కొడుకు బొంద మీద పడి ఓ బక్క తల్లి చేస్తోన్న వలపోత గుండెలను పిండేసింది. నీ తోటోల్లు వచ్చారు లే బిడ్డా వాళ్ళకు గన్ని నీళ్ళు ఇవ్వు అని ఆ తల్లి చేసిన రోద మా మదిలో ఇంకా సుడులు తిరుగతూనే ఉంది. అలా పోయిన ప్రతి ఊరిలో ఉరితాల్లను చూస్తూ వరంగల్ దాకా సాగిన గతించి పోయిన గాయాలు సలుపుతున్నా అమరత్వాన్ని ఎత్తి పడుతూ ఒక లక్ష్యం కోసం చేసిన నడక అది. ఈ అన్ని ఒలపోతల వెనక ఒక వెనకబాటు తనం నుండి వచ్చిన ఆక్రోశం. ముఖ్యంగా నిరుద్యోగం.

నాటి వందేమాతరం నినాదం నుండి విశ్వవిద్యాలయాల నుండి బహిష్కరణకు గురి అయిన తరం తదనంతర నరహంతక ఎమెర్జెన్సీ తర్వాత ఒక వెల్లువలా వచ్చిన వామపక్ష విప్లవ చైతన్యం ఒస్మానియా లో విద్యార్దుల వైపు యావత్ దేశం చుసిన వైనం, ఇడ్లీ సాంబార్ గోబాక్ , బూర్జువా చద్వులు బువ్వ పెట్టవ్ అని తమ బవిష్యత్ ను ‘గ్రామాలకు తరలండి’ లో చుసుకున్న్ వైనం , కోరుట్ల జగిత్యాల వెలుగులో ఓనమాలు దిద్దుకున్న తరం , ‘బండ’ కాంటీన్ సాక్షిగా రగల్చిన తూర్పు పవనం, గిచ్చేన్న గిరిమల్లెలో అని పాడుకున్న పాటలు, చుండూరు కారంచేడు రగిల్చిన కసితో స్కాలర్స్ హాస్టల్ అంబేద్కర్ గా పేరు మార్చుకోవడం , కసాయీ మూకల మిన్నాగుల నుండి తల్లి కోడిలా కడుపు కింద దాచుకున్న వైనం అది . పడగవిప్పిన కాషాయీ మూకలకు ఇ టు (సరయూ హాస్టల్) లో తీర్చుకున్న పగ దాచేస్తే దాగని సత్యాలు. వామపక్ష విప్లవ శిభిరాల్లో కుల చర్చ ఒక అనివార్యతను సంతరించుకున్నప్పుడు తాము ఎటు వైపు ఉండాలో అని మేధో చర్చ చేసిన వైనం. చరిత్ర గతులూ గమనాలు చిత్రిక పట్టిన విద్యార్ది తరం లోకానికి ఒక ఆదర్శ వంతమయిన వీరులను కల గన్న వైనం అది. వీరులారా వందనం నుండి చంచల్ గూడా జైలు లోన చంద్రవంకలారా! ఓ చంద్రవంకలారా!! వరకూ పరిణామం చెందిన చరిత్ర మన కళ్ళముందే ఉంది. నాటి పీవీ నుండి పిడమర్తి దాకా తెలంగాణా లో విద్యార్దులు ఏం చేసారు ఏం చేస్తారు అంటే ఒక నాలుగు దశాబ్దాల సాహిత్య సాంస్కృతిక పోరాటాల వెనక విడదీయలేని సంబందాలను సజీవంగా ఉంచిన వైనం అది. యావత్ విద్యార్ది శక్తి తమ కష్టాలను సుఖాలను భవిష్యత్ ను తెలంగాణా వెలుగులో, తాము నిర్మించుకున్న ఒక ఆశల సౌధం వైపు నడక. ఆ నడకే ఉద్రుతుమై పెను మంటై దావానాలం అయి ఒక నినాద ప్రాయమయింది అదే జై తెలంగానా. ఏది ఏమయినా తెలంగాణా అనే ఒక ఊహను కలగన్నది విద్యార్ది లోకం. వీటి వెనక ఏ పెద్ద పెద్ద కోరికలు లేవు కోట్లు సంపాదించి, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనే తపనా లేదు. కేవలం చద్విన చద్వుకు ఉపాధి దొరికితే చాలు అనే చిన్న ఆశ వాళ్ళను నాలుగు దశాబ్దాల చరిత్రలో భాగస్వాములను చేసింది.

ఒకప్పుడు నినాదాలతో పిక్కటిల్లిన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఇక ప్రశాంతంగా ఉంటది ఇక ముళ్ళ కంచలు ఉండవు టియర్ గ్యాస్లు రబ్బరు బుల్లెట్లు ఉండవు అని విద్యార్థి లోకం ఆశించింది. కానీ నెల రోజులకే మొదటిసారి స్వీయ రాష్ట్రంలో పోలీసుల లాఠీలు తార్నాకా చౌరస్తా సాక్షిగా విద్యార్థినుల వీపులపై నర్తించాయి. ఇప్పడు తెలంగాణా రెండు నెలల పసిగుడ్డు. తెలంగాణా రాగానే ఇక్కడ ప్రజల తల రాతలు మారతాయనే భ్రమలు లేనప్పటికీ, నీళ్ళు నిధులు వనరులు దోపిడీ నుండి విముక్తికోసం ఉద్యోగాల సాధన తాత్విక భూమికగా స్వీయ రాజకీయ అస్తిత్వ పునాదిగా సాగినప్పటికీ, నెల గడిచాక కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం అని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటన విద్యార్దుల అక్రోశాలకు కారణం అయింది. అటు సీమంద్ర ఇటు తెలంగాణా పాలకులు ఎన్నికల్లో గెలిపిస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసారు. ముందు నోటిఫికేషన్ ఇచ్చేపని మొదలెట్టకపోగా ఉద్యోగం అడిగితే లాటీలు చూపించారు దాని పర్యవసానం భావోద్వేగాలు మళ్ళీ పెల్లుబికాలా చేసాయి. ఏ విద్యార్ది లోకం అయితే ఈ నేల విముక్తి కోసం జాక్ గా ఎర్పడ్డారో అదే విద్యార్ది లోకం ఈ కాంటాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్ చేసే క్రమాన్ని వ్యతిరేకించడం కోసం “జాక్” గా ఏర్పడి నిరవదిక నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఏం ఆశించి ఈ విద్యార్దులు లోకానికి భిన్నంగా నడ్వాలనుకున్నారు? చదవు కున్న చద్వుకు చిన్న ఉద్యోగం తో పాటు అసమానతలు లేని ఒక మెరుగయిన సమాజం కోసం. నూతన ఆర్ధిక సరళీకృత విధానాలు తెచ్చిపెట్టిన కాంట్రాక్ట్, ఔట్సొర్సింగ్ ఉద్యోగుల నియామక విధానం వెనక ప్రపంచ బ్యాంకు ఆంక్షలకు ప్రతి బింబం. ఈ లోపబూయిష్టమైన విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎప్పుడో ఐక్య పోరాటాలు నిర్మించాల్సి ఉండే. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కొత్త ప్రభుత్వం ఎన్నో ఏళ్ళుగా పేరుకుపోయిన జఠిలమయిన సమస్యను నేత్తినేసుకుంది.

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం అనే ప్రధాన నినాదం నిజంగా అభినందనీయమే కానీ జూనియర్/డిగ్రీ లెక్చరర్ లాంటి గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలను కూడా క్రమబద్దీకరణ చేయాలనుకోవడం సరయినది కాదు. ఎందుకంటే ఇప్పడు కాంట్రాక్ట్ లో, ఔట్సొర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్ళు చానామంది కనీస అర్హతలు లేకుండా, చాలా చోట్ల బంధు ప్రీతితో కుల సమీకరణలో బాగంగా జరిగినవే ఎక్కువ. పైగా ఈ మధ్య కాంటాక్ట్ లెక్చరర్ ఉద్యోగ నియామకానికి యాభై వేలు డిమాండ్ చేస్తూ ఒక రీజినల్ జాయింట్ డిరెక్టర్ స్తాయి అధికారి పట్టుబడటం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది జరిగిన నియామకాలు ఎక్కువగా రోల్ అఫ్ రిజర్వేషన్ల కు విరుద్దంగా శాస్త్రీయత కు అతీతంగా జరిగినవే. వీటిని సరిదిద్ది తాజా నియామకాలు చేపట్టే క్రమం లో కాంటాక్ట్ వాళ్ళకు కొంత వైటేజీ ఇవ్వడానికి ఎవరూ వ్యతిరేకం కాదు. అందునా నాలుగో తరగతి స్తాయి ఉద్యోగుల క్రమబద్ధీకరణ సమంజసమే అయినా, గెజిటెడ్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ అనేది అసమంజసమైందే. మొత్తం ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయడం అంటే విదార్డుల నోట్లో మన్ను కొట్టినట్టే. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించడం మూలంగా తలెత్తే న్యాయపరమయిన చిక్కులను అధ్యయనం చేయకుండా గత అనుభవాలు కర్ణాటక వెర్సెస్ ఉమాదేవి , సురేంద్ర ప్రసాద్ తివారి వెర్సెస్ ఉత్తరాప్రేదేశ్ తో పాటు సుప్రేం కోర్ట్ లో ఎన్నో తీర్పులు ఈ విధాన పరమయిన లోపభూయిష్ట మయిన క్రమబద్ధీకరణలకు వ్యతిరేకమయిన తీర్పులు చూసయినా ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఆ అనుభవాల నుండి ఇంకా గునపాటాలు ప్రభుత్వాల్లు నేర్చుకోవల్సే ఉంది. దాదాపు మూడు తరాలు గెలుపు యాత్రలో విసిగి వేసాగి పోయాయి.తెలంగాణా వచ్చింది ఇప్పుడు సూర్యనారాయణ తమ్ముడు టెంట్ కింద బిక్కుబిక్కుమంటూ రాబోయే ఉద్యోగాల కోసం చూస్తుండు. అతని బవిష్యత్ ఉద్యోగ నియామకాల పట్ల ప్రభుత్వ విచక్షణ మీద అధారపడ్డది. (ఆంధ్ర జ్యోతి డైలీ ఆగష్టు 16 సంపాదకీయం .)


కర్కశ రాజకీయమే పోలవరం

[మార్చు]

గతం జ్ఞాపకం కాదు అన్నాడు కళ్యాణరావు గారు, పోలవరం డాం నిర్మాణం ద్వారా నిర్వాశితులు అవుతున్న మూడు లక్షల మంది ఆదివాసులు జ్ఞాపకాలు నేడు శిధిల మవబోతున్నాయి. పైగా రెండు వందల ముప్పై రెండు గ్రామాలను తెలంగాణా నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్ లో బదలాయింపు బిల్లు ఆమోదం పొందడం మూడు లక్షల మంది జల సమాధి పార్లమెంట్ సాక్షిగా జరిగింది. వందల ఏళ్ళుగా భూమితో ముడి పడి ఉన్న జ్ఞాపకాలు , దానికి జరిగిన రక్తపాతం ఆ గాయాల సలపరం మరో సారి పోలవరం నిర్వాశితుల నెత్తిన పిడుగులా పడ్డది.

ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు అన్నాడు నెహ్రూ, ఆయన వారసులు ఆ ఆనకట్టల ను శవాల దిబ్బలకు నిలయాలు చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో కట్టిన ఆనకట్టల వలన కొన్ని వేల గ్రామాలు కనుమరుగు అయ్యాయి. క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో మెసపుటేమియా లో మొదలయిన ఈ నిర్మాణాల వలన కోట్లాది మంది అభివృద్ధి చేదుఫలం చవి చూసారు. సూయజ్ కాలవ తవ్వకాల సందర్భం లో కోల్పోయిన భూముల కోసం నిర్వాశితులు కొందరు కోర్టుకు వెళ్ళారు. అక్కడ జరుగుతున్న వాదనలను విన్న ఒక నిర్వాశితుడు కోర్టు బోనులో నిలబడి జడ్జి గారితో “అయ్యా నాకు ప్రభుత్వం అనే దాయాదు ఒకడు ఉండని వాడు ఎప్పటికయినా మా భూముల మీదకు వస్తాడని నా తండ్రి నాకో మాట మాత్రం చేప్పలేదే” అని అమాయకంగా అన్నాడట . ఇప్పుడు పోలవరం కట్టడం వలన లక్షా పదివేలకు పైగా సాగుభూమి, మూడువందల గ్రామాలు, మూడు రాష్ట్రాల్లో మూడు లక్షలకు పైగా నిర్వాశితులు అమాయకంగా మేము ఇక్కడే పుట్టాం ఈ కట్టే ఇక్కడే కాలి ఈ మట్టిలో కలిసిపోవాలి అంటున్నారు. కోర్టుల్లో కేసులు వేద్దాం అనుకుంటే వేలాది ఎకరాలు ఆదివాశేతర కబ్జాలో ఉన్నవి పైగా ముంపు ప్రాంతాలు ఆంధ్ర లో కలపడం మూలాన ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంకులు తొలిగి నట్లే అని ఒక మంత్రి సెలవిచ్చాడు . ఆదివాసీలను సర్వనాశనం చేసే ఈ ప్రాజెక్ట్ నిర్మించడం అంటే రాజ్యాంగం లో 5 షెడ్యూల్డ్ లో అంతర బాగం అయిన వాళ్ళ నివాస ప్రాంతాన్ని ముంచేసి రాజ్యాంగ బద్ద జీవించే హక్కును కాలరాస్తున్నారు. పైగా వాళ్ళు నేడు రాష్ట్ర విభజన రాజకీయాలలో నిలవనీడ లేకుండా పోతున్నారు .

ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒక రాష్ట్ర ప్రాదేశిక ప్రాంతాన్ని ఇంకో రాష్ట్రం లో కలపడం ఏంటో అర్ధం కాని అమాయకులు ఆదివాసీలు వాళ్ళు ఆంధ్రాలో ఉన్నా తెలంగాణాలో ఉన్నా గుండె పగిలి గూడు చెదిరి విభజన రాజకీయాల్లో బలిపశువులు కావడం వింతల్లో వింత .రాష్ట్ర విభజన తదనంతరం మోడీ నాయకత్వం కనీశ రాజ్యాంగ సూత్రాలను గౌరవించ కుండా తెలంగాణలో ఉన్న ఏడు మండలాలను సీమాంధ్ర లో కలిపి ఆర్డినెన్సు తెచ్చి ఆంధ్ర రాష్ట్రానికి మూడు లక్షల ఆదివాసీలను బలవంతపు బట్వాడా చేసి రాజ్య కసాయీతనాన్ని చూపించింది.

అసందర్భం కాకున్నప్పటికీ వందల ఏళ్ళకింద మహాభారతం లో పాండవుల అర్ధాంగిని ఆమె అనుమతి లేకుండా మయాజూదం లో అమ్మకపు సరుకు చేసిన వైనం తన ఇష్టం లేకున్నా కౌరవుల పంచన పడి ఉండాల్సిన దుస్థితి. పాపం ఆమెకు తెలియదు భర్తలు ఇలా జూదం లో కట్టుకున్న దాన్ని తాకట్టు పెడతారని, ఆమె ఆనాడు జూదం లో తనను కట్టుకున్న వాళ్ళు ఓడిపోయి తనను జూదం లో పావును చేసినప్పుడు ఒక ధర్మ సందేహం వ్యక్తం చేసింది తనను కట్టుకున్న వాళ్ళను “నన్నోడి తానోడేనా తానోడి నన్నోడే నా” అని అడిగింది ! ఏమయినప్పటికీ మొదట పాండవులు ఓడిపోయాకే ద్రౌపదిని జూదం లో పెట్టినప్పటికీ తాకట్టులో పెట్టే అర్హత ఎవరికీ లేదని ద్రౌపది నిలదీసి ఉంటె భారతం ఇంకో మలుపు తిరిగేది. నేడు భువన భవనాలు పగిలాయి విభజనతో అధికార మార్పిడీ జరిగింది తెలంగాణా రాష్ట్రం లో స్వీయ రాజకీయ పురుడు పోసుకుంది , స్వరాష్ట్రం లో స్వీయ పాలనలో బ్రతుకులు మారతాయి అని కోటి ఆశలతో ఉన్న ఆదివాసీలకు ఏం మిగిలింది ? నూతన రాష్ట్రం లో నిర్వాశితుల తలరాత మారుద్ది అనుకుంటే వాళ్ళ ఇంటి అడ్రెస్స్ ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి బలవంతపు బదిలీ జరిగింది. ఇప్పుడు వందల ఏళ్ళుగా వాళ్ళ జీవితాల తో పెనవేసుకున్న నేలనుండి వాళ్ళను విడదీస్తున్నారు. ఇలా దాదాపు మూడు లక్షల మంది వాళ్ళ ఇష్టా అయిస్టాల తో ప్రమేయం లేకుండా ఆంధ్రలో కల్పబడ్డారు. పాపం వాళ్ళు ఆదివాసీలు అడవుల్లో కందమూలాలు తిని బ్రతికారు. ఒకప్పుడు గొండ్వానా రాజ్యానికి అధిపతులు వాళ్ళు , నేడు నాగరికం అని చేప్పుకుంటున్న సమాజానికి దూరంగా తమ బ్రతుకు తాము బ్రతుకుతున్నారు. వాళ్ళెప్పుడూ ఈనాగరిక సమాజంతో స్నేహం చేయలేదు. సంతాల్, కోయ గోండు,నాగాలు నివసించిన ప్రాదేశిక ప్రాంతం నేడు కుక్కలు చించిన విస్తరిలా బెంగాల్, బంగ్లాదేశ్,నాగాలాండ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణా లోకి విభాజించబడ్డారు ఇప్పుడు విభజన తెచ్చిన చిక్కు పోలవరం పుణ్యాన లక్షలాదిమంది ఆదివాసులను తెలంగాణాకే పరాయ్ వాళ్ళుగా మార్చింది, కానీ ఈ దేశ అంతర్గత సమగ్రతకు ముప్పు వాటిల్లిన ప్రతి సంక్షోభం లోనూ శత్రు దేశాలనుండి మనల్ని రక్షించడానికి ప్రాణాలు అర్పించారు. వాళ్ళకు సమ్మక్క సారలక్క వారసత్వం ఉంది. సంతాల్,రంప,మన్యం,భూంకాల్ అనుభవాలతో పొందిన స్ఫూర్తి ఉంది. ఎన్ని పోరాటాలు చేసుంటాడు తను. ఎంత చరిత్ర ఈ మట్టిపోరల్లో నిక్షిప్తమయి ఉండొచ్చు.

ఈ పోరాటాల కొనసాగింపుగా వాళ్ళ తాత బిర్సాముండా తెల్లదోరలతో కొట్లాడాడు. వాడి వారసుడు రాంజీగోండ్, వాడి మరో వారసుడు కొమురం భీం నిజాం ను ఎదిరించాడు. వాడు ఏం ఆశించి ఈ త్యాగానికి సిద్దం అయ్యాడు కేవలం జల్ జంగిల్ జమీన్ చిన్న నినాదం ఆ నినాదం కోసం కుత్తుకలు తెగినాయ్ ఆ త్యాగాల పునాదుల మీద ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అది కేవలం అధికార మార్పిడీ మాత్రమే అని బుద్దిజీవులు అనుకున్నారు .అరవై ఏడు ఏళ్ళ తర్వాత మరో అధికార మార్పిడీ జరిగింది అదే తెలంగాణా. అరవై ఏళ్ళ సీమాంధ్ర పాలన మీద వేలాది మంది చేసిన త్యాగాలతో తెలంగాణా వచ్చింది.వందలాది మంది బలిదానాల పునాదిగా సాదిన్చుకున్న తెలంగాణా లక్ష్యం వనరుల దోపిడీ లేని బంగారు తెలంగాణా. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి రాకముందు ఉన్న రాజాస్తానాలు మళ్ళీ మారు రూపం మార్చుకొని నూతన ఆర్దిక మండల్లు గా మళ్ళీ సెజ్ ల పేరుతో ఆధునిక దేవడీ లుగా రిలయన్స్ , టాటాలు, బిర్లాలు వేదంత లు కొత్త అవతారం ఎత్తారు . కోస్తా కారిడార్ కు నీళ్ళు అందించే లక్ష్యం తో బాటు బహుళజాతి కంపనీల కడుపు నింపడానికి లక్షలాది మంది ఆదివాసీల గూడు చేదరగోడుతున్న సందర్భం ఇది. కోస్తాంధ్ర వలస దోపిడీ కులానికి వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు కాపాడే క్రమంలోనే అక్రమ ఆనకట్టలు నిర్మిస్తున్నారు.ఇప్పుడు ఆదివాసీలకు కొంచం నేల అడుగుతున్నారు వాళ్ళు వందల ఏళ్ళుగా పాలించిన చంద్రాపూర్, గొండ్వానా లాంటి పూర్వ వైభవాన్ని అడగడం లేదు . కేవలం వాళ్ళు ఇంతకాలం నమ్ముకున్న నేలను రాష్ట్రవిభజన ల పేరుతో అభివృద్ధి పేరుతో కొల్ల గొట్టవద్దు అని అభ్యర్దిస్తున్నారు. వాళ్ళకు తెలియదు వాళ్ళు ఉన్న నేలకింద లక్షల కోట్ల విలువయిన సంపద వాళ్ళను నిలువ నీడ లేకుండా చేస్తోంది .

ఏ పోరాటాల స్పూర్తితో ఆదివాసీలు దళితులు బహుజనులు త్యాగాల పునాదుల మీద నిర్మించుకున్న తెలంగాణా కేవలం అధికార మార్పిడీ కోసమే కాదు గదా. మొదటి నుండి వనరులతో కూడుకున్న బంగారు తెలంగాణా కోసం కోట్లాదిమంది కొట్లాడి తెచ్చుకున్నది జలసమాధి కావడం కోసం మాత్రం కాదు . ఆత్మ గౌరవం తోబ్రతకడం కోసం ఇక్కడి నీళ్ళు నిధులు, నేల కోసం. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని వచ్చినా కాళ్ళకింద నెల కుంగి పోతుంటే వచ్చిన తెలంగాణా కు అర్ధమే లేదు. ఇప్పుడు తెలంగాణలో అందరూ పండగ వాతావరణం లో ఉన్నారు, కానీ కొన్ని వందల ఊళ్లు స్మశానాల దిబ్బలు గా లక్షలాదిమంది వందలఎల్లుగా పెనవేసుకున్న బొడ్డు పేగు కసితో తెంపిన కమురు వాసన చూస్తున్నారు .ఈ గోస ఎవరికీ పట్టలేదు, అందరూ కొత్త రాష్ట్రం లో స్వీయ రాజకీయ నిర్మాణం పేరుతో ఆదివాసుల సమాధుల మీద తమ రాజకీయ పునాదులు, భవనాలు నిర్మించే పనిలో ఉన్నారు.

మొదటి నుండి తెరాస తో సహా తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీల స్వలాభాలు ఈ నిర్మాణం తో ముడి పడి ఉన్నవి అనేది దాచేస్తే దాగని సత్యం. ఒక్కటా రెండా మూడు వందల పైగా గ్రామాలు. కనీసం యాభై వేల మంది ఆవాసా నికి బంగం కలిగించే ఏ ప్రాజెక్ట్ నిర్మాణం అయినా చట్టవిరుద్ధం అని అంతర్జాతీయ ప్రమాణాలు గోశిస్తున్నాయ్ . మూడు లక్షల మందికి పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్న పోలవరం నిర్మించడం అంటే ఈ దేశం లో ఆదివాసీల ప్రాణానికి ఇచ్చే విలువేంటో అర్ధం అవుతుంది. అంతే కాకుండా ఒక వేల ప్రాజెక్ట్ నిర్మించినా ఏ కొద్ది పాటి ప్రకృతి విఫత్తు సంభవించినా ఆంధ్ర లో దాదాపు రెండు మూడు జిల్లాల్లో ఉన్న నలభై లక్షల మంది పైగా సముద్రం లో కలిసే ప్రమాదం ఉంది అని దేశం లో పేరుమోసిన శాస్త్రవేత్తలు నిర్దారించి నప్పటికీ ఈ ప్రాజెక్ట్ నిర్మించడం అంటే ఇక్కడ సాదారణ ప్రజలకు బద్రత మీద కనీస సానుభూతి లేదని తెలుస్తోంది. వాళ్ళు తాతలు,తండ్రులు, ఆడుకున్న జ్ఞాపకాలు, శిధిలం కాబోతున్న బాధాకరమైన మయిన సందర్భం ఇది , పోలవరం వాళ్ళ బొందలగడ్డలు కూడా మిగల్చడం లేదు; ఎన్ని తరాలు ఆ నేలమీద ఆకలి, కష్టం, సుఖం , దుఖం, కలబోసుకొని ఉండొచ్చు. నాలుగేళ్ళు చద్విన బడి చదవు అయిపోయాక ఒదిలి పోతుంటేనే వలపోత ఆగదు. తాతలు,తండ్రులు అయ్యలు, పురుళ్ళు పుణ్యాలు, దినాలు, కొత్తగా పెళ్ళయిన పెళ్లి కూతురు ఊరొదిలి పోలిమర దాటి ఓ సారి ఊరికి దండం పెట్టె అవ్వా అయ్యలను వదలలేక, పొలిమేర గుండుమీద పెట్టిన వెతలు కథలు ఒక్కటా రెండా. ఊరి పొలిమేర లోకి రాగానే కాళ్ళకు రెక్కలోస్తాయి ,ఇప్పుడు మన్యం లో ఒక్కో రెక్కా విరిసి మంటల్లో మాడుస్తున్నారు . చరిత్రకు మూలవాసులు ఆనవాళ్ళు కోల్పోయి అనాదలు కాబోతున్నారు .ఇప్పుడు ఊళ్లు ఊళ్ళే మాయం అవుతుంటే ఎక్కడ బొడ్రాయి ? ఎక్కడ పొలిమేర గుండు ? ఒక్కో ఊరు జ్ఞాపకాల గుండె గనుల్ని తవ్వు కుంటున్నాయి .

వాళ్ళకు మార్కెట్ తెలవదు, రాజకీయం తెలవదు తెలంగాణా తెలవదు . వాళ్ళకు అది అవసరమే లేదు. వాళ్ళకు మట్టి తెలుసు మమత తెలుసు ప్రేమ తెలుసు ఏ రంగయినా ప్రకృతిలో బాగమే అనుకొనే స్వచ్చమయిన జాతి కదా వాళ్ళది. ఏ లెక్కలు వాడి కుండను పగల గొట్టినవో , పోలవరం ఎవడికి కన్నీరో ఎవడికి పన్నీరో కానీ, వాడికి ఒక్కటి మాత్రం తెలుసు అదే ‘నమ్మకం’ . ఆ నమ్మకమే క్రూర మృగాలను మచ్చిక చేసుకొనే లా చేసింది. వాడికి నాగరికుడు ఎంత విష పూరితుడో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది, వాడిది విశాల ప్రపంచం. అవధులు లేని నేల.ఆ ఆ నేలతో ముడేసుకున్న పేగు బంధం తెంపేస్తే తెగేది కాదు.

చరిత్రలో చానా వింతలు విశేషాలు జరుగుతాయి వలసవాద క్రైస్తవ మిషనరీలు ప్రపంచం అంతా నాగరీకం చేద్దామని బయలుదేరి తాము తప్ప మిగతా ఎవరూ నాగరీకులు కారు అనే కావరంతో . రాజ్య విస్తరణ కాంక్షతో మతం పేరుతో ‘చీకటిఖండం’ అని ముద్రవేసిన ఆఫ్రికాకు వెలుగు ప్రసాదిద్దామని మొదట వాళ్ళ చేతుల్లోకి బైబుల్ ఇచ్చారు, ఇప్పుడు మనం ప్రార్దన చేసుకుందాం కళ్ళు మూసుకోండి అన్నారు . నల్లజాతి వాళ్ళు కళ్ళు తెరిచి చూసే సరికి వాళ్ళ చేతుల్లో బైబుల్ మిగిలింది,వాళ్ళ కాళ్ళకింద నేల మాయం అయింది. ఇదు వందల ఎల్లకింది తెల్లవాడు చేసిన ద్రోహానికీ, మొన్న జరిగిన రాష్ట్ర విభజన జూన్ రెండున తర్వాత పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్రలో కలపడానికి తేడా ఏమాత్రం లేదు. వాళ్ళు వందల ఏళ్ళుగా నమ్ముకున్న నేల జలసమాధి అవుతుంటే నిస్సహాయ స్తితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకు మీద మినుక్కు మినుక్కు ఆశతో ఉన్నారు . ముంపు ప్రాంతాల్లో ఒక్కో ఇంటిది ఒక్కో కన్నీటి గాధ, ఒక్కో జ్ఞాపకం కాలం చెక్కిళ్ళ మీద కన్నీటి బొట్లుగా రాలుతున్నాయి. అభివృద్ధి పేరుతో ఆధునికత తెచ్చిన విధ్వంసం కు ఇప్పుడు ఆదివాసుల నరబలి కావాల్సి వచ్చింది. ఇంతమంది ప్రాణాలను బలిపెట్టి ఎవరి ప్రయోజనాలు కాపడుతుందో అర్ధం చేసుకోలేని అమాయకులు కాదు, కానీ ఆ మట్టితో వాళ్ళకు తాతల తండ్రుల పురా స్మృతి జ్ఞాపకాలు ఉన్నాయి అవి ఇప్పుడు ఇక్కడ ఒకప్పుడు ఒక నాగరికత ఉండేది అని గానం చేసుకుంటారు .వాళ్ళు తాతల తండ్రుల నుండి పోరాటాలకు చిరునామా అయిన నేల తో తెగదెంపు అంత తేలిక కాదు . ఇప్పుడు ఈ భూమికి మూలవాసి నిట్టాడి కూలింది వాళ్ళను ఎక్కిరిస్త్తూ జై తెలంగాణా నినాదం . ఇప్పుడు చెప్పండి ఇంతకాలం మనం మాట్లాడుకుంటున్న అధికార మార్పిడీ ఎవరికి మేలు చేసిందో ? ఇన్ని పోరాటాలకు సజీవ సాక్షి అయిన ఆదివాసీ చైతన్యం ముందు ఈ అబద్దపు లెక్కలు ఎంతోకాలం నిలవవు. వాడి కాళ్ళకింద భూమి కాపాడుకోవడం కష్టం కాదు చేతోలో సత్తువ ఉంది విషం పూసిన విల్లు నారి బిగించి ఈ భూమి నాది అంటుంది. ఇప్పుడు వాడికి కావాల్సింది ఓదార్పు కాదు ఒంట్లో సత్తువ ఉన్నదాకా పోరాడే ధైర్యం ఉంది తెలంగాణా ఆంధ్ర రాజకీయ కొట్లాటలో వాళ్ళను పావులను చేయొద్దు ఇప్పుడు వాడికి కాస్త బరోసా ఇద్దాం ,వీలయితే తలా ఒక చేయెసి ఆదివాసీ ఆత్మగౌరవాన్ని నిలబెడదాం.నాగరిక సమాజం మీద నమ్మకం సన్నగిల్లితే వాళ్ళకు తాతల తండ్రుల విముక్తి పోరాటాల వారసత్వం ముందే ఉంది. (ఆంధ్ర జ్యోతి డైలీ సెప్టెంబర్ 18 సంపాదకీయం .)




  • [గుర్రం సీతారాములు  : కంచర్ల గోపన్న నుండి ఉసికిల గోపన్న దాకా…]


ఆగస్టు 5 వ తేదీన ఖమ్మం నుండి కొంతమంది సాహితీ మిత్రృలం ముదిగొండ మృతవీరుల కుటుంబాలను పరామర్శించి, ఓ చిన్నపాటి కవి సమ్మేళనం నిర్వహించాలని వెళ్ళాం. మాతోబాటు కొత్తగూడెం, పాల్వంచ, విజయవాడ, హైద్రాబాద్‌ నుండి విరసం, జనసాహితీ, సాహితీ స్రవంతి మిత్రులమంతా యాదృచ్ఛికంగా ముదిగొండ సెంటర్‌లో కలుసుకున్నాం.ఆ బృందంలో కొంతమందిమి ఆ నరమేథం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి సమీపంలో ఉన్న ఓ స్కూల్‌లో చిన్న బ్యానర్‌ ఏర్పాటు చేసుకొని కవి సమ్మేళన సన్నాహాలు మొదలుపెట్టాం. అక్కడ ఓ ఇరవైమంది యువకులు క్రికెట్‌, మరేదో ఆట ఆడుతున్నారు. వాళ్ళలో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎంతోమంది అక్కడకు రావడం మూలాన ఎవరొచ్చినా ఏం జరుగుతుందిలే అనే అనాసక్తతనూ గమనించాను. వెళ్ళిన మేమే శ్రోతలుగా, వక్తలుగా కొన్ని మాటలు కలబోసుకొని ముగించాం.

ఆ తర్వాత కాల్పుల్లో చనిపోయిన ఉసికిల గోపన్న ఇంటికి వెళ్ళాలనిపించింది. కాల్పులు జరిగిన రోజు అతను ముఖ్యమంత్రి దిష్ఠిబొమ్మను ఊరేగించాడనీ, రిక్షా కార్మికుడిగానే తన కొడుకును ఇంజనీరింగ్‌ దాకా చదివించాడని తెలిసి సెంటర్‌లో అతనిల్లెక్కడ అని అడిగాను. ఎలాగో వెతుక్కుంటూ అతనింటికి చేరుకున్నాను.

దాదాపు పాతికేళ్ళ క్రితం కట్టిన ఓ పాత ఇల్లు అది. మొరంతేలిన వాకిలి, మసిబారిన గోడలు, వానకు కురిసిన నీళ్ళచారలు, ఎప్పుడో కట్టిన తడికెలు ఇగ్లూను తలపించే ఆ ఇంటిలోకి నిటారుగా వెళ్ళలేం. నేలమీద కనీసం బేస్‌మెంటు కూడా లేకుండా నాలుగు ఇటుకలు పేర్చి కట్టిన ఆ ఇంట్లోనే గోపన్న కుటుంబ ఆవాసం. అతనితోబాటు భార్య, కొడుకు, కోడలు, పెళ్ళై ఇంటికి తిరిగివచ్చిన కూతురు, ఆమె పిల్లలు, అంత చిన్న ఇంట్లోనే అంతమంది. వాళ్ళకు నాలుగు గజాల స్థలం అవసరం కనుకనే ముఖ్యమంత్రి దిష్ఠిబొమ్మను ఊరేగించే పనికి పురికొల్పింది. ఇంటిముందు ఓ చిన్న చిరుగుల చాపపర్చి భార్యతోబాటు కొడుకూ, కూతురూ, కోడలూ బాసికం పట్లు వేసుకొని కూర్చున్నారు. ఆ తర్వాతరోజే గోపులు కర్మకాండలు, మోచేతులదాకా తొడిగి ఉన్న ఆమె చేతి గాజులు చూస్తే రాజ్యం చేసిన కసాయితనం కనిపించింది.

నేను వెళ్ళేటప్పటికి విరసం మిత్రులు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎవరో ఫోటోలు తీస్తున్నారు. ఒకళ్ళిద్దరు వివరాలు నోట్‌ చేసుకుంటున్నారు. కూర్చున్న వాళ్ళంతా చేతులు దీనంగా జోడిస్తూ అర్థిస్తూ మాట్లాడుతున్నారు. వచ్చినవాళ్ళు ఎంతో కొంత ఇచ్చివెళతారనే ఆశకూడా వాళ్ళకుంది. గోపన్న కొడుకు పట్నంలో ట్రిపుల్‌ 'ఇ'లో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి నాలుగు సంవత్సరాలు అవుతున్నా కార్పొరేట్‌ కుల కళ్ళకు ఆ డిగ్రీ కనిపించలేదు. తన ప్రతిభ కుల తక్కెడలో తూగలేక సమీప గ్రానైట్‌ కంపెనీలో గుమస్తాగిరి మాత్రం ఇప్పించగలిగింది. అంత చదువుకున్న అతను వరవరరావు గారు మాట్లాడి వెళ్ళగానే ఆయనెవరండీ! అని నన్నడిగారు. పేపర్లలో, టివిలలో నిత్యం కనిపించే ఓ సామాజిక ఉద్యమ కార్యకర్తను అడిగాడంటే ఆ కుటుంబ రాజకీయ నేపథ్యం, స్థితి కొంతమేరకు అర్థం చేసుకోవచ్చు.

నేలకొండపల్లి, ముదిగొండ పరిసర ప్రాంతాలకు తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యం ఉంటే ఉండవచ్చు. యాదృచ్ఛికంగా కంచెర్ల గోపన్న ఈ ప్రాంతం వాడే. ఆ గోపన్న నుండి ఈ గోపన్న దాకా వ్యవస్థకృత దాష్టీకానికి బలి అవుతూనే ఉన్నారు. ఆ గోపన్నను తన భావదారిద్య్రం జైలుపాలు చేస్తే నేటి గోపన్నను మాత్రం నాలుగడుగుల స్థలం అడిగినందుకు శ్మశానంలో ఆరడుగుల బొందను సగౌరవంగా చూపిందీ వ్యవస్థ. నిజానికి రిక్షా గోపన్న రిక్షా కార్మికుడిగా కాకుండా వ్యవసాయ కూలీగా గ్రానైట్‌ కంపెనీ వర్కర్‌గా వెళ్ళి ఉంటే బ్రతికేవాడు. తనకు రిక్షా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను తీసుకొని వచ్చాడు.ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఓ ప్రజా ఉద్యమకారుణ్ణి గుర్తించలేదంటే, ఆ కుటుంబానికి నిజంగా రాజకీయ నేపథ్యం, చైతన్యమే ఉంటే చాపమీద కూర్చొని దీనంగా చేతులు చాపి నిరాసక్తంగా కూర్చోడు. ఏదిఏమైనా ఈ వ్యవస్థ చేసిన గాయం ఆ కుటుంబాన్ని కుదేలయ్యేటట్లు చేసింది. కానీ ఉసికిల గోపులు మాత్రం వీరోచిత తెలంగాణా సాయుధ పోరాటయోధుడు కాడు. వారి వారసుడుకాదు. రోజూ కూలీగా దిష్టిబొమ్మను తీసుకెళ్ళిన అతన్ని అదే దిష్టిబొమ్మ ఎకె 47గా గర్జించి ఏడుగుర్ని ఉసురు తీసుకుంది. ఆ నేలకు తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యం ఉన్నమాట వాస్తమే. ఆనాటినుండి ఈనాటిదాకా ఆ వారసత్వాన్ని కొనసాగించడంలో జరిగిన అలసత్వాన్ని, భూసమస్యపట్ల ఇంతకాలం నిరాసక్తంగా ఉన్న సమూహాలను గత నలభై సంవత్సరాలుగా కొన్ని సమూహాలు ఈదేశంలో రైతులే కూలీలుగా మారుతున్నారనీ, భూమి సమస్య పరిష్కరించడం ద్వారా ఉపరితల నిర్మాణాలు మారవనీ, కేవలం ఓటు ద్వారానే జనత ప్రజాస్వామిక విప్లవాలను కలగంటున్న కొన్ని శక్తులను కొన్ని ప్రశ్నలు అడగాలనిపిస్తోంది. ఆ సాయుధపోరాట యోధుల వారసులమని చెప్పుకొంటున్న వారి చైతన్యం నేడెక్కడ తాకట్టు పెడుతోంది అనే ప్రశ్నా ఉదయించక మానదు. విద్యుత్‌ ఉద్యమంలో కాల్పులు జరిపిన అభినవ నీరోచక్రవర్తి వారసుడు, శవాలతో ధర్నా జరిపి పదిలక్షల డిమాండ్‌ చేస్తున్నాడు. ఆయన దాష్టీకానికి బషీర్‌బాగ్‌లో బలైన సత్తెనపల్లి రామకృష్ణ (మహా కూటమిని రామకృష్ణ క్షమించుగాక) భార్య మంగ నేడు నాలుగిండ్లలో పాచిపనులు చేసుకుంటోంది. ఆమె అతనిమీద విరుచకపడ్డది.

ఆనాటి కాల్పులలో జరిగిన బాధితులకు నష్టపరిహారం అందించడంలో జరిగిన అలసత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఒకటిమాత్రం నిజం. ఇక్కడ జరిగిన ప్రతిహత్యకూ ఓ వర్గం ఉంది. కులం ఉంది. దాంతోబాటు ఓ 'వెల' కూడా వుంది. రామకృష్ణ హత్యకూ ఓ వెల ఉంది. గోపుల హత్యకూ ఓ వెల ఉంది. కానీ గోపుల భార్య వేసుకొన్న గాజులకు రేపటితో ఏ వెలా ఉండదు.

కాల్పులు జరిగిన రోజు యాదృచ్చికంగా చారుమజుందార్‌ అమరత్వం పొందినరోజూ, ఆరోజు సెంటర్‌లో కాల్పులు జరుపుతుంటే చావుకు సమీపంలో ఉన్న ఆ విగత జీవుల్ని ఈడ్చుకొంటూ సెంటర్‌లో నిరసన వ్యక్తం చేసే క్రమంలో శవాల్ని ఓ దగ్గరకు చేర్చిన కొందరు కార్యకర్తలు చనిపోయిన వ్యక్తి జేబుకు పెట్టిన బ్యాడ్జీ తిరగబడితే దాన్ని సరిచేసి సరిగా తీయండి అని కెమెరాలకు చూపడం లక్షలాది మందిమి టీవిల్లో గమనించాం. అక్కడ నిరసన వ్యక్తం చేయడం కంటే వాళ్ళను హాస్పటల్‌కు తరలించడంతో జరిగిన అలసత్వమూ గమనించాం. ఎక్కడకు వెళ్తున్నాం మనం! కాకుంటే ఆ బ్యాడ్జి ప్రయోజనాలు దానికున్నాయి. అధికారం ఆధిపత్యం పొందే క్రమంలో ప్రతి కాల్పులకూ ఓ ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం వెనక అధికార మార్పిడీ, నాలుగు సీట్ల తపనా ఉంది. కాకుంటే ముదిగొండలో చనిపోయింది కేవలం దళితులు, కార్యకర్తలు మాత్రమే. నాయకులు ఎందుకు చావలేదు అనే ప్రశ్న నేనడగను. కానీ ముదిగొండలో జరిగిన హత్యలలో ముగ్గురు మాదిగలు, ఓ మాల, మరో ముగ్గురు బహుజనులు ఉన్నారు. కనుక చనిపోయింది ఏ కులం అనే చర్చ నాకనవసరం. ఆమాటకొస్తే నమ్మిన విశ్వాసానికి ప్రాణం పణంగా పెట్టిన సాకేతరాజన్‌, శ్యాం, మహేష్‌ వీళ్ళంటే నాకు గౌరవం కానీ ముదిగొండ గోపులుకి అది అంటగడితే చరిత్ర మనల్ని క్షమించదు. భూమిసమస్య పరిష్కరించాలని చిత్తశుద్ది వుంటే - ముదిగొండలో ముష్కరుల పాలన లేదు. అలాగని నైజాం వారసుల పాలనాలేదు. కమ్యూనిస్టు పార్టీకి కంచుకోట ఆ గ్రామం. కేవలం గ్రామం యూనిట్‌గా తీసుకుంటే అక్కడ వున్న మిగులు భూమి వివరాలు సాక్షాత్తూ స్టేట్‌ రెవిన్యూ వ్యవస్థకంటే ఆ గ్రామ సర్పంచ్‌, పెద్దలు లేదా గ్రామ కార్యదర్శికి స్పష్టంగా తెలుసు. ఆ ఊర్లో బంజరు ఎంత? సాగుభూమి ఎంత? మిగులు భూమి ఎంత? బంచరాయి ఎంత అనే విషయం స్పష్టంగా తెలుసు. గ్రామాన్ని నమూనాగా తీసుకొని మిగులు భూమి పంచి ఆదర్శంగా బయటి ప్రపంచానికి చెప్పవచ్చు కదా? ప్రతి గ్రామంలో ఆధిపత్యంలో ఉన్న పార్టీ నాయకుల, ఆధిపత్యకులాల చేతుల్లోనే ఈ మిగులు భూములు ఉన్నాయి. అంతేకానీ ఏ ఒక్క దళితుని చేతుల్లోనూ గజం నేల లేదు. అలాగని ప్రభుత్వ ఆధీనంలోనూ లేవు. మరి కాల్పులు ఎందుకు జరుగుతున్నాయి? ముదిగొండ పరిసర ప్రాంతాల్లో దాదాపు నూటయాభై గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అక్కడ వున్న వందకు పైగా ఫ్యాక్టరీలు ఒకే సామాజిక వర్గానికి, ఒకే రాజకీయ పార్టీ చేతుల్లో ఉన్నాయనే విషయం మనమెవరం ధైర్యంగా చెప్పలేకపోయినా, చనిపోయిన వాళ్ళకు మాత్రం తెలుసు. అక్కడ పెరుగుతున్న రియల్‌ఎస్టేట్‌, గ్రానైట్‌ కంపెనీల విస్తృతి మూలంగా స్వపక్ష, విపక్ష పార్టీల ఆధీనంలో ఉన్న మిగులు భూముల మీదికి ముందు ముందు జెండాలు పాతే విషయాన్ని ముందే పసిగట్టిన కొంతమంది ఆధిపత్య కులాలకు, కబ్జాదారులకు కంటగింపుగా మారింది. దాంతోబాటు పార్టీలోని అంతర్గత వైరుధ్యం వెరసి అక్కడి నాయకుడైన బండి రమేష్‌ను అంతచేయాలనే కుట్ర. (దాని పర్యవసానమే నిప్పుకు చెదలు, పార్టీలో ఎక్కువమంది ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకున్నారు.) ఆ నాయకున్ని కాపాడుకొనే క్రమంలోనే ఈ కాల్పులు జరిగాయనేది ఓ కథనం కానీ, గోపులు వీరోచిత పోరాటయోధుడూ కాడు వారి వారసుడూ కాడు.

గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా భూముల్ని ఆక్రమించుకొనే క్రమంలో ఆధీనంలో ఉన్న భూముల్ని అన్యాయంగా, అక్రమంగా గుంజుకొనే క్రమంలో జరిగిన కాల్పులకు కాయకల్ప చికిత్స చేసే పనిలో, మేధోమధనంలో పడ్డారు. ఈదేశ బుద్ధి జీవులు అదేం అంటే నందిగ్రాం వేరనీ, ముదిగొండ వేరనీ, కళింగ నగర్‌, సింగూరు వేరువేరు అనే అంటున్నారు. తేడా ఎందుకు లేదు? అక్కడ నిక్షేపణంగా సాగులో ఉన్న వ్యవసాయ భూమిని బలవంతంగా గుంజుకోవడం ఇక్కడ జానెడు భూమికోసం ప్రభుత్వ భూమిల్లో జెండాలు పాతడం. అక్కడ మహిళలను క్రూరంగా రేప్‌ చేసి శవాలను మాయం చేయడం, ఇక్కడ చనిపోయిన మహిళల శవం మీద బ్యాడ్జీని సరిచేయడం, అక్కడ నష్టపరిహారం, న్యాయ విచారణకు అవకాశం లేదనడం ఇక్కడ న్యాయ విచారణతో బాటు ముఖ్యమంత్రిని మార్చాలి అని డిమాండ్‌ చేయటం అంతే తేడా ఏమిలేదు.

నాలుగు గజాల స్థలం మీద నాలుగు రోజులు జెండాలు పాతినంత మాత్రాన అవి పోరాటాలు అవుతున్నాయి. ఇప్పుడు ఆందోళనలకూ, పోరాటాలకూ హద్దులు చెరిగిపోతున్నాయి. హైవే పక్కన నాలుగు గజాల స్థలంలో ఎలక్ట్రానిక్‌ మీడియా హంగామా మధ్య జెండా పాతినంత మాత్రాన అవి పోరాటాలు అవుతున్నాయి. ఈ జెండాలు, సత్యం కంప్యూటర్‌ కొన్ని వేల ఎకరాల బినామీ భూముల మీద ఎందుకు పాతరు? మరి గడచిన నాలుగు దశాబ్దాలుగా సిలిగురి, శ్రీకాకుళం నుండి, కోరుట్ల జగిత్యాల దాకా నాలుగు లక్షల ఎకరాల భూమి పంచి నాలుగు వేలమంది చేసిన బలిదానాన్ని ఏమందాం? నాలుగు రోజులపాటు జరిగే సీజనల్‌ రెడీమేడ్‌ ఆందోళనలకు పత్రికలలో ఫ్రంట్‌లైన్‌ కవరేజ్‌లు ఇస్తున్న మీడియా- దాని వెనుక దాగిన ప్రయోజనాలు దానికున్నాయి. ఎనిమిదేళ్ళ క్రితం ఆగస్టు 28న రాజధాని నడిబొడ్డున జరిగిన విద్యుత్‌ ఉద్యమ హత్యాకాండ మరోవాగ్దానాన్ని చేసింది. ఆ వాగ్దానం ముదిగొండలో జులై 28గా పరిణమించింది. అసహజ మరణాలకు నిలయమైన ఈ రాష్ట్రంలో ఈ హత్యలు ఇంకా పునరావృతమౌతూనే ఉంటాయి. మానవ హక్కులు మృగ్యం అవుతూనే ఉంటాయి. రేపు రాజ్యం ఇవ్వబోయే చిల్లరతోబాటు గోపన్న కొడుకు అదే రాజ్యం ఇవ్వజూపుతున్న అటెండర్‌ ఉద్యోగంలో కొలువు కుదురుతాడు.దాంతోబాటు అదేరాజ్యం వితరణగా విదిల్చిన చిల్లరతో గోపన్న మనుమడు మరో భూపోరాటానికి సన్నద్దం అవుతాడు. చిత్రగుప్తుడు మరో ముదిగొండ లాంటి ప్రాంతాన్ని వెతుకులాడి మరో ముహూర్తం సిద్ధంచేస్తూ ఉంటాడు. చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. పవర్‌ పాలిటిక్స్‌ గురించి రా.వి.శాస్త్రి ఓ మాట అన్నాడు. పల్లకీలో వర్మగారు కూర్చున్నా శర్మగారు కూర్చున్నా బరువు దాన్ని మోసే బోయీలదే. వర్మగారు ఎంత వేగంగా శర్మగారిని దించి అంతవేగంగా పల్లకీ ఎక్కినా బరువులో మాత్రం తేడారాదు. ఆ పల్లకీల మార్పు వేగవంతం చేసేపనిని మహాకూటమి పేరుతో వామపక్షాలు చేస్తున్నాయి. పల్లకీ మోసాలను తలకిందులు చేసేవరకూ బోయీలు బోయీలుగానే మిగిలిపోతారనేది చారిత్రక వాస్తవం.

ఆంధ్ర జ్యోతి లో వ్వ్యవస్తీ కృత దాష్టీకం పోఎదేప్పుడు గా ప్రచురణ





బయటి లింకులు

[మార్చు]



  • [ గుర్రం సీతారాములు వివిధ పత్రిక ల లో రాసిన రచనలు : [3]
  • [వికీ పీడియా హోం పేజి : [4]











విద్యాభ్యాసము

[మార్చు]

ప్రాధమిక విద్య : ప్రాధమిక పాటశాల తల్లంపాడు, జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల తల్లంపాడు

  • ప్రభుత్వ జూనియర్ కళాశాల నయాబజార్,ఖమ్మం
  • శీలం సిద్హరెడ్డి జ్యోతి డిగ్రీ కళాశాల ఖమ్మం
  • ఉస్మానియా విశ్వవిద్యాలయము
  • ఆంగ్లము మరయు విదేశీ బాషల విశ్వవిద్యాలయము హైదరాబాద్





వ్యాసాలూ గట్రా

[మార్చు]





ప్రచురణలు

[మార్చు]
  • [[ప్రముఖ విప్లవ కవి శివసాగర్ (కే జి సత్యమూర్తి) సమగ్ర సాహిత్యం ప్రచురణ]]




  • శివసాగర్ కవిత్వం 1931-2012
  • సంపాదకుడు : గుర్రం సీతారాములు
  • రఘుల్ ప్రచురణలు హైదరాబాద్:



పరిశోదనా పత్రాలు

[మార్చు]
  • [[జాంబపురాణము మీద కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 5th International Inter disciplinary studies conference అంతర్ జాతీయ సదస్సులో పత్ర సమర్పణ]]


  • [[<సౌత్ ఆసియన్ విభాగ> హైదరాబాద్ OUCIP లో జాతీయ సదస్సులో చదివిన పేపర్ ప్రచురణకు ఎన్నిక]]




  • [[<కర్కశ రాజకీయమే పోలవరం : గుర్రం సీతారాములు 19-08-2014 ఆంధ్ర జ్యోతి>*]]





గతం జ్ఞాపకం కాదు అన్నాడు కళ్యాణరావు గారు, పోలవరం డాం నిర్మాణం ద్వారా నిర్వాశితులు అవుతున్న మూడు లక్షల మంది ఆదివాసులు జ్ఞాపకాలు నేడు శిధిల మవబోతున్నాయి. పైగా రెండు వందల ముప్పై రెండు గ్రామాలను తెలంగాణా నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్ లో బదలాయింపు బిల్లు ఆమోదం పొందడం మూడు లక్షల మంది జల సమాధి పార్లమెంట్ సాక్షిగా జరిగింది. వందల ఏళ్ళుగా భూమితో ముడి పడి ఉన్న జ్ఞాపకాలు , దానికి జరిగిన రక్తపాతం ఆ గాయాల సలపరం మరో సారి పోలవరం నిర్వాశితుల నెత్తిన పిడుగులా పడ్డది. ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు అన్నాడు నెహ్రూ, ఆయన వారసులు ఆ ఆనకట్టల ను శవాల దిబ్బలకు నిలయాలు చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో కట్టిన ఆనకట్టల వలన కొన్ని వేల గ్రామాలు కనుమరుగు అయ్యాయి. క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో మెసపుటేమియా లో మొదలయిన ఈ నిర్మాణాల వలన కోట్లాది మంది అభివృద్ధి చేదుఫలం చవి చూసారు. సూయజ్ కాలవ తవ్వకాల సందర్భం లో కోల్పోయిన భూముల కోసం నిర్వాశితులు కొందరు కోర్టుకు వెళ్ళారు. అక్కడ జరుగుతున్న వాదనలను విన్న ఒక నిర్వాశితుడు కోర్టు బోనులో నిలబడి జడ్జి గారితో “అయ్యా నాకు ప్రభుత్వం అనే దాయాదు ఒకడు ఉండని వాడు ఎప్పటికయినా మా భూముల మీదకు వస్తాడని నా తండ్రి నాకో మాట మాత్రం చేప్పలేదే” అని అమాయకంగా అన్నాడట . ఇప్పుడు పోలవరం కట్టడం వలన లక్షా పదివేలకు పైగా సాగుభూమి, మూడువందల గ్రామాలు, మూడు రాష్ట్రాల్లో మూడు లక్షలకు పైగా నిర్వాశితులు అమాయకంగా మేము ఇక్కడే పుట్టాం ఈ కట్టే ఇక్కడే కాలి ఈ మట్టిలో కలిసిపోవాలి అంటున్నారు. కోర్టుల్లో కేసులు వేద్దాం అనుకుంటే వేలాది ఎకరాలు ఆదివాశేతర కబ్జాలో ఉన్నవి పైగా ముంపు ప్రాంతాలు ఆంధ్ర లో కలపడం మూలాన ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంకులు తొలిగి నట్లే అని ఒక మంత్రి సెలవిచ్చాడు . ఆదివాసీలను సర్వనాశనం చేసే ఈ ప్రాజెక్ట్ నిర్మించడం అంటే రాజ్యాంగం లో 5 షెడ్యూల్డ్ లో అంతర బాగం అయిన వాళ్ళ నివాస ప్రాంతాన్ని ముంచేసి రాజ్యాంగ బద్ద జీవించే హక్కును కాలరాస్తున్నారు. పైగా వాళ్ళు నేడు రాష్ట్ర విభజన వైకుంటపాళీ లో పాము నోటిలో చిక్కారు. ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒక రాష్ట్ర ప్రాదేశిక ప్రాంతాన్ని ఇంకో రాష్ట్రం లో కలపడం ఏంటో అర్ధం కాని అమాయకులు ఆదివాసీలు వాళ్ళు ఆంధ్రాలో ఉన్నా తెలంగాణాలో ఉన్నా గుండె పగిలి గూడు చెదిరి విభజన రాజకీయాల్లో బలిపశువులు కావడం వింతల్లో వింత .రాష్ట్ర విభజన తదనంతరం మోడీ నాయకత్వం కనీశ రాజ్యాంగ సూత్రాలను గౌరవించ కుండా తెలంగాణలో ఉన్న ఏడు మండలాలను సీమాంధ్ర లో కలిపి ఆర్డినెన్సు తెచ్చి ఆంధ్ర రాష్ట్రానికి మూడు లక్షల ఆదివాసీలను బలవంతపు బట్వాడా చేసి రాజ్య కసాయీతనాన్ని చూపించింది. ఇప్పుడు బాదితులు ఒక త్రిశంక స్వర్గం లో అలమటిస్తున్నారు. అసందర్భం కాకున్నప్పటికీ వందల ఏళ్ళకింద మహాభారతం లో పాండవుల అర్ధాంగిని ఆమె అనుమతి లేకుండా మయాజూదం లో అమ్మకపు సరుకు చేసిన వైనం తన ఇష్టం లేకున్నా కౌరవుల పంచన పడి ఉండాల్సిన దుస్థితి. పాపం ఆమెకు తెలియదు భర్తలు ఇలా జూదం లో కట్టుకున్న దాన్ని తాకట్టు పెడతారని, ఆమె ఆనాడు జూదం లో తనను కట్టుకున్న వాళ్ళు ఓడిపోయి తనను జూదం లో పావును చేసినప్పుడు ఒక ధర్మ సందేహం వ్యక్తం చేసింది తనను కట్టుకున్న వాళ్ళను “నన్నోడి తానోడేనా తానోడి నన్నోడే నా” అని అడిగింది ! ఏమయినప్పటికీ మొదట పాండవులు ఓడిపోయాకే ద్రౌపదిని జూదం లో పెట్టినప్పటికీ తాకట్టులో పెట్టే అర్హత ఎవరికీ లేదని ద్రౌపది నిలదీసి ఉంటె భారతం ఇంకో మలుపు తిరిగేది. నేడు భువన భవనాలు పగిలాయి విభజనతో అధికార మార్పిడీ జరిగింది తెలంగాణా రాష్ట్రం లో స్వీయ రాజకీయ పురుడు పోసుకుంది , స్వరాష్ట్రం లో స్వీయ పాలనలో బ్రతుకులు మారతాయి అని కోటి ఆశలతో ఉన్న ఆదివాసీలకు ఏం మిగిలింది ? నూతన రాష్ట్రం లో నిర్వాశితుల తలరాత మారుద్ది అనుకుంటే వాళ్ళ ఇంటి అడ్రెస్స్ ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి బలవంతపు బదిలీ జరిగింది. ఇప్పుడు వందల ఏళ్ళుగా వాళ్ళ జీవితాల తో పెనవేసుకున్న నేలనుండి వాళ్ళను విడదీస్తున్నారు. ఇలా దాదాపు మూడు లక్షల మంది వాళ్ళ ఇష్టా అయిస్టాల తో ప్రమేయం లేకుండా ఆంధ్రలో కల్పబడ్డారు. పాపం వాళ్ళు ఆదివాసీలు అడవుల్లో కందమూలాలు తిని బ్రతికారు. ఒకప్పుడు గొండ్వానా రాజ్యానికి అధిపతులు వాళ్ళు , నేడు నాగరికం అని చేప్పుకుంటున్న సమాజానికి దూరంగా తమ బ్రతుకు తాము బ్రతుకుతున్నారు. వాళ్ళెప్పుడూ ఈ నాగరిక సమాజం తో స్నేహం చేయలేదు. సంతాల్, కోయ గోండు,నాగాలు నివసించిన ప్రాదేశిక ప్రాంతం నేడు కుక్కలు చించిన విస్తరిలా బెంగాల్, బంగ్లాదేశ్,నాగాలాండ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణా లోకి విభాజించబడ్డారు ఇప్పుడు విభజన తెచ్చిన చిక్కు పోలవరం పుణ్యాన లక్షలాదిమంది ఆదివాసులను తెలంగాణాకే పరాయ్ వాళ్ళుగా మార్చింది, కానీ ఈ దేశ అంతర్గత సమగ్రతకు ముప్పు వాటిల్లిన ప్రతి సంక్షోభం లోనూ శత్రు దేశాలనుండి మనల్ని రక్షించడానికి ప్రాణాలు అర్పించారు. వాళ్ళకు సమ్మక్క సారలక్క వారసత్వం ఉంది. సంతాల్,రంప,మన్యం,భూంకాల్ అనుభవాలతో పొందిన స్ఫూర్తి ఉంది. ఎన్ని పోరాటాలు చేసుంటాడు తను. ఎంత చరిత్ర ఈ మట్టిపోరల్లో నిక్షిప్తమయి ఉండొచ్చు. ఈ పోరాటాల కొనసాగింపుగా వాళ్ళ తాత బిర్సాముండా తెల్లదోరలతో కొట్లాడాడు. వాడి వారసుడు రాంజీగోండ్, వాడి మరో వారసుడు కొమురం భీం నిజాం ను ఎదిరించాడు. వాడు ఏం ఆశించి ఈ త్యాగానికి సిద్దం అయ్యాడు కేవలం జల్ జంగిల్ జమీన్ చిన్న నినాదం ఆ నినాదం కోసం కుత్తుకలు తెగినాయ్ ఆ త్యాగాల పునాదుల మీద ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అది కేవలం అధికార మార్పిడీ మాత్రమే అని బుద్దిజీవులు అనుకున్నారు .అరవై ఏడు ఏళ్ళ తర్వాత మరో అధికార మార్పిడీ జరిగింది అదే తెలంగాణా. అరవై ఏళ్ళ సీమాంధ్ర పాలన మీద వేలాది మంది చేసిన త్యాగాలతో తెలంగాణా వచ్చింది.వందలాది మంది బలిదానాల పునాదిగా సాదిన్చుకున్న తెలంగాణా లక్ష్యం వనరుల దోపిడీ లేని బంగారు తెలంగాణా. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి రాకముందు ఉన్న రాజాస్తానాలు మళ్ళీ మారు రూపం మార్చుకొని నూతన ఆర్దిక మండల్లు గా మళ్ళీ సెజ్ ల పేరుతో ఆధునిక దేవడీ లుగా రిలయన్స్ , టాటాలు, బిర్లాలు వేదంత లు కొత్త అవతారం ఎత్తారు . కోస్తా కారిడార్ కు నీళ్ళు అందించే లక్ష్యం తో బాటు బహుళజాతి కంపనీల కడుపు నింపడానికి లక్షలాది మంది ఆదివాసీల గూడు చేదరగోడుతున్న సందర్భం ఇది. కోస్తాంధ్ర వలస దోపిడీ కులానికి వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు కాపాడే క్రమంలోనే అక్రమ ఆనకట్టలు నిర్మిస్తున్నారు.ఇప్పుడు ఆదివాసీలకు కొంచం నేల అడుగుతున్నారు వాళ్ళు వందల ఏళ్ళుగా పాలించిన చంద్రాపూర్, గొండ్వానా లాంటి పూర్వ వైభవాన్ని అడగడం లేదు . కేవలం వాళ్ళు ఇంతకాలం నమ్ముకున్న నేలను రాష్ట్రవిభజన ల పేరుతో అభివృద్ధి పేరుతో కొల్ల గొట్టవద్దు అని అభ్యర్దిస్తున్నారు. వాళ్ళకు తెలియదు వాళ్ళు ఉన్న నేలకింద లక్షల కోట్ల విలువయిన సంపద వాళ్ళను నిలువ నీడ లేకుండా చేస్తోంది . ఏ పోరాటాల స్పూర్తితో ఆదివాసీలు దళితులు బహుజనులు త్యాగాల పునాదుల మీద నిర్మించుకున్న తెలంగాణా కేవలం అధికార మార్పిడీ కోసమే కాదు గదా. మొదటి నుండి వనరులతో కూడుకున్న బంగారు తెలంగాణా కోసం కోట్లాదిమంది కొట్లాడి తెచ్చుకున్నది జలసమాధి కావడం కోసం మాత్రం కాదు . ఆత్మ గౌరవం తోబ్రతకడం కోసం ఇక్కడి నీళ్ళు నిధులు, నేల కోసం. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని వచ్చినా కాళ్ళకింద నెల కుంగి పోతుంటే వచ్చిన తెలంగాణా కు అర్ధమే లేదు. ఇప్పుడు తెలంగాణలో అందరూ పండగ వాతావరణం లో ఉన్నారు, కానీ కొన్ని వందల ఊళ్లు స్మశానాల దిబ్బలు గా లక్షలాదిమంది వందలఎల్లుగా పెనవేసుకున్న బొడ్డు పేగు కసితో తెంపిన కమురు వాసన చూస్తున్నారు .ఈ గోస ఎవరికీ పట్టలేదు, అందరూ కొత్త రాష్ట్రం లో స్వీయ రాజకీయ నిర్మాణం పేరుతో ఆదివాసుల సమాధుల మీద తమ రాజకీయ పునాదులు, భవనాలు నిర్మించే పనిలో ఉన్నారు.మొదటి నుండి తెరాస తో సహా తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీల స్వలాభాలు ఈ నిర్మాణం తో ముడి పడి ఉన్నవి అనేది దాచేస్తే దాగని సత్యం. ఒక్కటా రెండా మూడు వందల పైగా గ్రామాలు. కనీసం యాభై వేల మంది ఆవాసా నికి బంగం కలిగించే ఏ ప్రాజెక్ట్ నిర్మాణం అయినా చట్టవిరుద్ధం అని అంతర్జాతీయ ప్రమాణాలు గోశిస్తున్నాయ్ . మూడు లక్షల మందికి పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్న పోలవరం నిర్మించడం అంటే ఈ దేశం లో ఆదివాసీల ప్రాణానికి ఇచ్చే విలువేంటో అర్ధం అవుతుంది. అంతే కాకుండా ఒక వేల ప్రాజెక్ట్ నిర్మించినా ఏ కొద్ది పాటి ప్రకృతి విఫత్తు సంభవించినా ఆంధ్ర లో దాదాపు రెండు మూడు జిల్లాల్లో ఉన్న నలభై లక్షల మంది పైగా సముద్రం లో కలిసే ప్రమాదం ఉంది అని దేశం లో పేరుమోసిన శాస్త్రవేత్తలు నిర్దారించి నప్పటికీ ఈ ప్రాజెక్ట్ నిర్మించడం అంటే ఇక్కడ సాదారణ ప్రజలకు బద్రత మీద కనీస సానుభూతి లేదని తెలుస్తోంది. వాళ్ళు తాతలు,తండ్రులు, ఆడుకున్న జ్ఞాపకాలు, శిధిలం కాబోతున్న బాధాకరమైన మయిన సందర్భం ఇది , పోలవరం వాళ్ళ బొందలగడ్డలు కూడా మిగల్చడం లేదు; ఎన్ని తరాలు ఆ నేలమీద ఆకలి, కష్టం, సుఖం , దుఖం, కలబోసుకొని ఉండొచ్చు. నాలుగేళ్ళు చద్విన బడి చదవు అయిపోయాక ఒదిలి పోతుంటేనే వలపోత ఆగదు. తాతలు,తండ్రులు అయ్యలు, పురుళ్ళు పుణ్యాలు, దినాలు, కొత్తగా పెళ్ళయిన పెళ్లి కూతురు ఊరొదిలి పోలిమర దాటి ఓ సారి ఊరికి దండం పెట్టె అవ్వా అయ్యలను వదలలేక, పొలిమేర గుండుమీద పెట్టిన వెతలు కథలు ఒక్కటా రెండా. ఊరి పొలిమేర లోకి రాగానే కాళ్ళకు రెక్కలోస్తాయి ,ఇప్పుడు మన్యం లో ఒక్కో రెక్కా విరిసి మంటల్లో మాడుస్తున్నారు . చరిత్రకు మూలవాసులు ఆనవాళ్ళు కోల్పోయి అనాదలు కాబోతున్నారు .ఇప్పుడు ఊళ్లు ఊళ్ళే మాయం అవుతుంటే ఎక్కడ బొడ్రాయి ? ఎక్కడ పొలిమేర గుండు ? ఒక్కో ఊరు జ్ఞాపకాల గుండె గనుల్ని తవ్వు కుంటున్నాయి . వాళ్ళకు మార్కెట్ తెలవదు, రాజకీయం తెలవదు తెలంగాణా తెలవదు . వాళ్ళకు అది అవసరమే లేదు. వాళ్ళకు మట్టి తెలుసు మమత తెలుసు ప్రేమ తెలుసు ఏ రంగయినా ప్రకృతిలో బాగమే అనుకొనే స్వచ్చమయిన జాతి కదా వాళ్ళది. ఏ లెక్కలు వాడి కుండను పగల గొట్టినవో , పోలవరం ఎవడికి కన్నీరో ఎవడికి పన్నీరో కానీ, వాడికి ఒక్కటి మాత్రం తెలుసు అదే 'నమ్మకం' . ఆ నమ్మకమే క్రూర మృగాలను మచ్చిక చేసుకొనే లా చేసింది. వాడికి నాగరికుడు ఎంత విష పూరితుడో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది, వాడిది విశాల ప్రపంచం. అవధులు లేని నేల.ఆ ఆ నేలతో ముడేసుకున్న పేగు బంధం తెంపేస్తే తెగేది కాదు. చరిత్రలో చానా వింతలు విశేషాలు జరుగుతాయి వలసవాద క్రైస్తవ మిషనరీలు ప్రపంచం అంతా నాగరీకం చేద్దామని బయలుదేరి తాము తప్ప మిగతా ఎవరూ నాగరీకులు కారు అనే కావరంతో . రాజ్య విస్తరణ కాంక్షతో మతం పేరుతో ‘చీకటిఖండం’ అని ముద్రవేసిన ఆఫ్రికాకు వెలుగు ప్రసాదిద్దామని మొదట వాళ్ళ చేతుల్లోకి బైబుల్ ఇచ్చారు, ఇప్పుడు మనం ప్రార్దన చేసుకుందాం కళ్ళు మూసుకోండి అన్నారు . నల్లజాతి వాళ్ళు కళ్ళు తెరిచి చూసే సరికి వాళ్ళ చేతుల్లో బైబుల్ మిగిలింది,వాళ్ళ కాళ్ళకింద నేల మాయం అయింది. ఇదు వందల ఎల్లకింది తెల్లవాడు చేసిన ద్రోహానికీ, మొన్న జరిగిన రాష్ట్ర విభజన జూన్ రెండున తర్వాత పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్రలో కలపడానికి తేడా ఏమాత్రం లేదు. వాళ్ళు వందల ఏళ్ళుగా నమ్ముకున్న నేల జలసమాధి అవుతుంటే నిస్సహాయ స్తితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకు మీద మినుక్కు మినుక్కు ఆశతో ఉన్నారు . ముంపు ప్రాంతాల్లో ఒక్కో ఇంటిది ఒక్కో కన్నీటి గాధ, ఒక్కో జ్ఞాపకం కాలం చెక్కిళ్ళ మీద కన్నీటి బొట్లుగా రాలుతున్నాయి. అభివృద్ధి పేరుతో ఆధునికత తెచ్చిన విధ్వంసం కు ఇప్పుడు ఆదివాసుల నరబలి కావాల్సి వచ్చింది. ఇంతమంది ప్రాణాలను బలిపెట్టి ఎవరి ప్రయోజనాలు కాపడుతుందో అర్ధం చేసుకోలేని అమాయకులు కాదు కానీ ఆ మట్టితో వాళ్ళకు తాతల తండ్రుల పురా స్మృతి జ్ఞాపకాలు ఉన్నాయి అవి ఇప్పుడు ఇక్కడ ఒకప్పుడు ఒక నాగరికత ఉండేది వాళ్ళు తాతల తండ్రుల నుండి పోరాటాలకు చిరునామా అయిన నేల తో తెగదెంపు అంత తేలిక కాదు . ఇప్పుడు వాడి నిట్టాడి కూలింది వాణ్ణి ఎక్కిరిస్త్తూ జై తెలంగాణా నినాదం . ఇప్పుడు చెప్పండి ఇంతకాలం మనం మాట్లాడుకుంటున్న అధికార మార్పిడీ ఎవరికి మేలు చేసిందో ఇన్ని పోరాటాలకు సజీవ సాక్షి అయిన ఆదివాసీ చైతన్యం ముందు ఈ అబద్దపు లెక్కలు ఎంతోకాలం నిలవవు. వాడి కాళ్ళకింద భూమి కాపాడుకోవడం కష్టం కాదు చేతోలో సత్తువ ఉంది విషం పూసిన విల్లు నారి బిగించి ఈ భూమి నాది అంటుంది. ఇప్పుడు వాడికి కావాల్సింది ఓదార్పు కాదు ఒంట్లో సత్తువ ఉన్నదాకా పోరాడే ధైర్యం ఉంది తెలంగాణా ఆంధ్ర రాజకీయ కొట్లాటలో వాళ్ళను పావులను చేయొద్దు ఇప్పుడు వాడికి కాస్త బరోసా ఇద్దాం ,వీలయితే తలా ఒక చేయెసి ఆదివాసీ ఆత్మగౌరవాన్ని నిలబెడదాం