Jump to content

వాడుకరి:చంద్రశేఖర్ ఆదిముల

వికీపీడియా నుండి

హోలియదాసారులు:

హోలియదాసరులు గతంలో సంచార జీవితం గడిపేవారు.ఈ సంచార జీవితం గడిపేటప్పుడు గుంపులు,గుంపులుగా ఏర్పడి 10 నుండి 15 కుటుంబాలు ఒక గుంపుగా ఏర్పడి గ్రామాలూ తిరుగుతూ బ్రతికేవారు.వారు ఒకొక్క గ్రామంలో 5 నుండి 10 రోజులు వొంకేర కట్టెలతో గుడారాలు వేసుకొని ఊరు చివరన ఉండేవారు.ఈ గుంపుకు ఒక్క నాయకుడు ఉండేవాడు.ఆ గుంపులో నివసిస్తున్న వారి మధ్య ఏవైనా చిన్న తగాదాలు ఏర్పడినప్పుడు ఆ గుంపు నాయకుడే తీర్పు చెప్పేవాడు.

పురుషులు గ్రామాలూ తిరుగుతూ రాత్రి సమయాలలో వీధి భాగవతులు ప్రదర్శించేవారు.సత్యహరిచంద్ర,రుక్మిణీకళ్యాణం,రామంజనేయయుద్ధం,చెంచుకోమలి,ఎరుకాలానాంచారమ్మ కథ మొదలైనవి ప్రదర్శించేవారు.రాత్రి నాటకం ప్రదర్శించేటప్పుడూ పాత్రలకు మెచ్చి చందాలు సమర్పించేవారు. వీటిని చదివింపులు అంటారు.ఉదయం పూట గ్రామంలో అన్ని కులాల ఇండ్లకు వెళ్లి భిక్షము ఆడుకునేవారు.ప్రజలు భిక్షంగా పాత వస్త్రాలు,ధాన్యం ఇచ్చేవారు.భిక్షం అడ్డుకునేటప్పుడు కానీ,మిగతా సమయాలలో కానీ హోలేయదాసరి వాళ్ళను అంటరానివారిగా చూసేవారు.భిక్ష అడ్డుకోగా వచ్చిన ధాన్యం,పాత వస్త్రాలు అందరు సమానంగా పంచుకునేవారు.భిక్షాటన తరువాత అందరు కలిసి మేళం(గుంపు)గా ఏర్పడి చేపలు,కంజులు మొదలైనవి వేటాడి తెచ్చుకునేవారు తెచ్చిన వాటిని అందరు సమానంగా మాంసాన్ని కుప్పలుగా పంచుకునేవారు.మా కులం వారు మాంసాహరులు.హోలియదాసరి వాళ్ళు ఎల్లమ్మ,జమ్ములమ్మ,మరెమ్మ,మైసమ్మ,పోశమ్మ,జోగులంబా వంటి దేవతలను పూజించేవారు.లక్ష్మీనరసింహస్వామి దేవుళ్లను కొలుస్తారు. వీధి నాటకాలలో పురుషులే స్త్రీ పాత్రలను ధరించేవారు.స్త్రీ పాత్రలలో చంద్రమతి పాత్ర,చెంచుకోమలి పాత్ర ప్రసిద్ధిపొందాయి.నాటకంలో సంగీత వాయిద్యాలుగా మద్దెల,ఫిడేలు,తాళాలు, హార్మోనియం,డోలక్ లాంటివి ఉపయోగించేవారు.బిక్షాటనకు ప్రత్యేకంగా బుర్రకాయను,చిటికెలు,డక్కి,తాళాలు ఉపయోగించేవారు. ఆ కాలంలో ఆడపిల్లల తల్లి తండ్రులు కు ఏ మాత్రం భారంగా లేకుండేది పెళ్లి. పెళ్లి కుమార్తె ఇంటి దగ్గరనే జరిపేవారు.పెండ్లి కొడుకు తరుపువారు ఒక వరం రోజుల ముందు వెళ్లి,పెళ్లి కుమార్తె ఇంటి దగ్గర ఒక గుడారం వేసుకొని పెండ్లి చేసుకునేవారు.వచ్చిన ఆతిధులకు భోజనంతో పాటు,తాగినంత కల్లు తాపేవారు.పెళ్ళికి వచ్చిన వారికి చార్జీలు కూడా చెల్లించేవారు.భార్యభర్తల మధ్య గొడవ వస్తే కుల పెద్దలే పరిష్కారేంచేవారు ఒక వేళ పిల్ల నాకు భర్త ఇష్టం లేదంటే నష్టపరిహారం చెలించేటట్లు చేసేవారు.పెండ్లి అయినమేకు పిల్లలు ఉన్నప్పటికీ మరొక్కరు పెళ్లి చేసుకునే సంప్రదాయం ఉండేది.భార్యతో పాటు వెంబడి ఉన్న పిల్లల ఆలనా పాలనా చేసుకున్న మొగడే చూసుకున్నేవాడు మొత్తం పైన స్త్రీ,పురుషులకు సమాన న్యాయం ఉండేది. గతంలో పురుషులలో కొంత అక్షరాస్యత ఉండేది.ఎందుకంటే వారు నాటకాలు ఆడేటప్పుడు పద్యాలూ సంభాషణలు నేర్చుకోవాలంటే చదువు తప్పనిసరి కాబట్టి చదవడానికి,రాయడానికి ఓచేటట్లు ఓనమాలు నేర్చుకునేవారు.ఇలా చదువుకున్నవారు సుమతి శతకం,నీతి శాస్త్రము,పెద్దబాలశిక్ష లాంటివి చదివేవారు.ఇంతకన్నా ముందు కాగితాలు లేనందున తాటి ఆకులపైన రాసినట్లు మా పెద్దలు అంటుంటారు.

వర్తమానం:

ప్రస్తుతం హోలేయదాసరి కుల వృత్తి అయినా వీధి నాటకాల ప్రదర్శనకు ఆదరణ కరువైంది.సామ్రాజ్యవాద విష సంస్కృతి వల్ల సినిమా,టి.వి రంగాలు అభివృద్ధి చెందడం వల్ల మా వారి కళల కు ప్రాధాన్యం తగ్గింది.కుల వృత్తి ద్వంసం అయినా మా యువ కళాకారులూ పాత ఇనుప సామానులు కొనుగోలు చేసి పెద్ద పెద్ద షెట్ లకు అమ్ముకొని బతుకుతున్నారు. మరి కొందరు మేస్త్రి పని,పట్టణ ప్రాంతాలలో ఫుట్పాత్ లపై తోపుడు బండ్ల పై అద్దాలు,పౌడర్ డబ్బాలు,రిబ్బన్లు,కుంకుమ డబ్బాలు,గాజులు,జీడీ గింజాలు మొదలగు సామాన్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు.కొందరు ఉప్పరి పనికి బొంబాయి,పూనా,నల్గొండ,హైదరాబాద్,వరంగల్ మొదలగు ప్రాంతాలకు మట్టి పనికి వెళ్తున్నారు.ఒక్కరోజు సంపాదన 200 రూపాయలు కూడా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధ కళాకారుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.వీరికి ప్రభుత్వం నుండి పింఛన్లు కూడా రావడం లేదు.చాల మంది యూవకులు పెళ్లి చేసుకున్న తరువాత మట్టి పనికి వెళ్తున్నారు.పెళ్లి చేసుకున్న వారు ఉప్పరి పనికి వెళ్లాడమే హనీమూన్ గా అనుకునే పరిస్థితి ఏర్పడింది.ఇటువంటి పరిస్థితులు ఉన్నపుడు జాతీయ పండుగలు జరుపుకోవడం వృధా అనిపిస్తుంది.హోలేయదాసరి వాళ్లకు నిజమైన స్వాతంత్రం రాలేదు.గుంపు మేస్త్రీలు పెట్టె బాధలు భరించలేక చాల మంది అనారోగ్యానికి గురై చనిపోయినారు. మహిళలు గ్రామాలలో ఇనుప పెట్టెలలో సూదులు,కాంటలు,కుంకుమ డబ్బాలు,జీడి గింజలు,మొలతాడులు మొదలైన చిన్న వస్తువులు అమ్ముకుంటున్నారు.పట్టణ ప్రాంతాలలో అయితే ఫుట్ పాత్ ల మీద సామాన్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కాకా తమ వస్తువులు ఎవరు కొనేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనుటకు ఫైనాన్స్ ద్వారా అప్పులు తెచ్చుకొని రోజు బాకీ చెలిస్తూ వడ్డీకి వడ్డీ చెలిస్తూ శ్రమ దోపిడీకి గురౌతున్నారు. సామాజికంగా,విద్య పరంగా వెనకబడి ఉండటం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోలేకపోతున్నారు.ఒక వేళ ప్రభుత్వ సహాయం పొందే అవకాశం వున్నవాలకు బ్యాంకు తో ముడి పెట్టి ఉండటం వల్ల కనీసం అవి కూడా పొందలేకపోతున్నారు. హోలేయదాసరి లలో ప్రస్తుతం అక్షరాస్యత శాతం చాల తక్కువ ఉంది.రాష్ట్రంలో హోలియదాసరిలు ఇప్పటి వరకు రాజకీయంగా ఎదగకపోవడం చూస్తే హోలేయదాసరి లు రాజకీయంగా ఎంత వెనకబడి ఉన్నారో అర్ధమగుతున్నది.s c ఉపకులలో భాగంగా ఉన్న మేము రాజకీయ రిజర్వేషన్ ఎప్పుడు ఉపయోగించుకోలేదు. హోలేయదాసరి కులం sc కులలో ఉపకులం ఇప్పటి వరకు sc రిజర్వేషన్ ను,s c ఉపకులంలో ప్రధానంగా మాల, మాదిగలు కొంత ఎక్కువగా ఉపయోగించుకున్నారు.కానీ వాస్తవంగా 59 ఉపకులలకు రిజర్వేషన్ ఫలాలు అందవాల్సివుంది.


మీ ఆదిముల చంద్రశేఖర్ హోలియదాసరి.