వాడుకరి:వేల్పుల నారాయణ
వేల్పుల నారాయణ:
కవి,రచయిత,జర్నలిస్టు,కాలమిస్టు.
అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం(PWA)కార్యదర్శి.
తల్లి తండ్రులు :వేల్పుల రాజమ్మ, రాజయ్య
జననం :1960
మధ్య తరగతి రైతు కుటుంబంలో
స్వగ్రామం :అంకంపల్లి,కాల్వశ్రీరాంపూర్
మండలం,పెద్దపల్లి జిల్లా.
అడ్రస్ :ప్రస్తుతం గోదావరిఖని.
విద్యార్హతలు :మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లమా,
సోషాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్.
మడిపల్లి,కొలనూర్,పెద్దపల్లి,వరంగ
ల్ లలో విద్యాభ్యాసం చేశారు.
సాహితీ ప్రస్థానం :
1974 నుండి హైస్కూల్ దశనుండే రచనలు చేయడం ప్రారంభం.
-1979 నుండి అభ్యుదయ రచయితల సంఘంలో (అరసం) సభ్యత్వం
-1985లో తిరుపతిలో జరిగిన అరసం 9వ రాష్ట్ర మహాసభల్లో కార్యవర్గ సభ్యునిగా ఎన్నిక.
-1996లో నర్సారావు పేటలో జరిగిన 12వ రాష్ట్ర మహాసభల్లో అరసం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక.
-2008 సెప్టెంబర్ 13, 14 తేదీల్లో కడపలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 15వ రాష్ట్ర మహాసభల్లో మొదటిసారిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
-2012 ఫిబ్రవరి 4, 5 తేదీల్లో సూర్యపేటలో జరిగిన అరసం రాష్ట్ర 16వ మహాసభల్లో తిరిగి రెండవసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై రెండు రాష్ట్రాలుగా విడిపోయేంతవరకు 2014 వరకు కొనసాగారు.
-2014 సెప్టెంబర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర అరసం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై 2019 మార్చి వరకు పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తించారు.ప్రస్తుతం తెలంగాణ అరసం అధ్యక్ష వర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు.ప్రధాన కార్యదర్శిగా రెండు రాష్ట్రాల అరసం నిర్మాణ బలోపేతానికి,అభ్యుదయ సాహిత్య పురోభివృద్ధికి ఎంతో కృషి చేశారు.ప్రస్తుతం కృషి చేస్తున్నారు.
-2013లో,2019లో ఆల్ ఇండియా ప్రోగ్రెసీవ్ రైటర్స్ అసోసియేషన్ (పిడబ్ల్యూఎ) కార్యవర్గ సభ్యునిగా ఎన్నికై బాధ్యతలు నిర్వహించారు.
-2023 ఆగస్టులో జరిగిన అఖిలభారత అరసం మహాసభలల్లో జాతీయ కార్యదర్శిగా ఎన్నికయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రచనలు :
తన రచనలతో సత్యవతి నవల,ఎదనాదాలు,ప్రభాత గీతం పాటల సంపుటాలు,జైలుభూమి,చురక కవితా సంపుటాలు,పాటలపై అభ్యుదయోద్యమ పాట ఒక విశ్లేషణ పరశోధనాత్మక గ్రంథం,ప్రచురించారు.సింగరేణి సిరిజల్లు పాటల ఆడియో క్యాసెట్టు తీసుకొచ్చారు.కొన్ని పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.వివధ పత్రికల్లో వచ్చిన అనేక కథలు,వ్యాసాలు,కవితలు పాటలు,పుస్తకాలుగా రావాల్సి ఉంది.
-పలు ఆడియో పాటల క్యాసెట్లలో పాటలు వచ్చాయి.
ఆంధ్రజ్యోతి,విశాలాంధ్ర,ప్రజాపక్షం,ప్రజాశక్తి,నమస్తే తెలంగాణ,మన తెలంగాణ,ఉదయం లాంటి వివిధ దినపత్రికల్లో,కమ్యూనిజం,కార్మిక బాట తదితర మాస పత్రికల్లో పలు సాహితీ వ్యాసాలు, విమర్శలు, సమీక్షలు, కథలు, వందలాది పాటలు, కవితలు ప్రచురించబడ్డాయి.కొన్ని సినిమాలకు పాటలు రాశారు.కొన్ని సినిమాల్లో నటించారు.
పలు సాహితీ సభల్లో,సదస్సుల్లో పాల్గొని సాహిత్య పత్రాలు సమర్పించారు.పలు సాహితీ సాంస్కృతిక సభల నిర్వహణలో, అరసం మహాసభల నిర్వహణలో విస్తృతంగా కృషి చేశారు.అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం మహాసభల్లో,ఆసియా ఆఫ్రో రచయితల సంఘం అంతర్జాతీయ మహాసభలకు హాజరై చర్చల్లో పాల్గొన్నారు.
జర్నలిస్టుగా :
గత నాలుగు దశాబ్దాలుగా విశాలాంధ్ర దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు.
రాజకీయాలపై చాలాకాలం విశాలాంధ్రలో ఫిర్మిలీంగే శీర్షికన 'కాలం' రాశారు.ముల్లుగర్ర పేరున సమకాలీన సామాజిక సమస్యలు,రాజకీయాలపై అధిక్షేప కవితలతో ‘చురక’ కాలం పేరున మనతెలంగాణ,విశాలాంధ్ర లో చాలా సంవత్సరాలపాటు ప్రతి రోజు రన్నింగ్ కామెంట్రీ రాశారు.నేటినిజణ దినపత్రికలో చురక రన్నింగ్ కవితా కాలం రాస్తున్నారు.
పలు రాష్ట్ర, జాతీయ సమకాలీన, సామాజిక, రాజకీయ,సాహిత్య విషయాలపై వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు.
పురస్కారాలు:
సాహితీ సేవలో గుర్తింపుగా తుమ్మల వెంకట రామయ్య సాహితి పురస్కారం,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం,నమస్తే తెలంగాణ పత్రిక సాహత్య విశిష్ట పురస్కారం,తారా ఆర్ట్స అకాడమి నల్ల వజ్రం కీర్తి పురస్కారం,తో పాటు వివిధ సాహితీ సంస్థలనుండి పురస్కారాలు అందుకున్నారు.
ఉద్యోగం :
సింగరేణిలో ఓపన్ కాస్టులో మెకానికల్ ఫోర్ మెన్ ఇంచార్జ్ గా ఉద్యోగం చేసి పదవీవిరమణ చేశారు.సింగరేణి ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో పాల్గొన్నారు.సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంటుగా క్రియాశీల పాత్రపోషించారు.గని కార్మిక పోరాటాల్లో పాలుపంచుకోవడమే కాకుండా భారతదేశంలోని అనేక బొగ్గు పరిశ్రమలను సందర్శించి అక్కడి గని కార్మికుల స్థితిగతులను, పారిశ్రామిక సంబంధాలను అధ్యయనం చేసి వ్రాసిన పలు వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి.
నిత్యం గనికార్మికుల శ్రమలో,ఉత్పత్తి సంబంధాలలో,వారి పోరాటాలలో,యాజమాన్య కార్మిక సంబంధాలలో,పని విధానాలలో పాలుపంచుకోవడం,మమేకం కావడంతో గనికార్మి జీవన సాహిత్యం విరివిగా రాస్తున్నారు.