వాడుకరి:Alli.madhu
నా పేరు మధులిక వూటుకూరి. నేను విజయవాడ ప్రాంతములో నివసిస్తున్నాను.నేను కె.బి.యన్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాను. వికీ పీడియా వారు నిర్వహించే పోటీకి, నేను రచయిత అయిన సూర్య దేవర రామ మోహన రావు గారు గురించి వ్రాయుచున్నాను.
సూర్య దేవర రామ మోహన రావు
[మార్చు]పరిచయము
[మార్చు]సూర్య దేవర రామ మోహన రావు గారు కృష్ణా జిల్లా మున్నలూరు గ్రామములో జన్మించారు.వీరి తండ్రి కీ.శే.అనంతయ్య గారు మున్నలూరు గ్రామానికి చుట్టుపక్కల దాదాపు 40 గ్రామాలలోని ప్రజలకు సంప్రదాయ ఆయుర్వేద వైద్యం చేసేవారు మరియు వారి తల్లి కీ.శే.వేంకట నరసమ్మగారు.సూర్య దేవర రామ మోహన రావు గారు వీరికి 6 వ సంతానము.
వీరి గురించి
[మార్చు]సూర్య దేవర రామ మోహన రావు గారు తెలుగు మరియు కన్నడ భాషలలో ప్రముఖ రచయితగా అందరికి సుపరిచితులు.ఈయన 1985 నుండి నవలలు వ్రాయడం మొదలుపెట్టారు.ఇప్పటి వరకు రమారమి 95 నవలలు వ్రాశారు.వీరి నవలలు ప్రముఖ తెలుగు మరియు కన్నడ దిన,వార,మాస పత్రికలలో ధారావాహికంగా ప్రచురితమవుతున్నాయి.
ప్రాముఖ్యత
[మార్చు]నవలల చరిత్రలో వీరు సృష్టించిన రికార్డు వేరెవ్వరు ఎప్పటికి చేయలేరు.తెలుగులో వీరు వ్రాసినన్ని నవలలు ఏ రచయిత ఇప్పటి వరకు రాయలేదు.ఈయన నవలలే కాక 200 చిన్న కథలు కూడ రాశారు.వాటిని తమిళము మరియు కన్నడ భాషలలో అనువదించారు.కొన్ని నవలలు సినిమాలుగాను,టెలివిజన్ లలో ధారవాహికగా ప్రసారమయినాయి.ఈయన నవలల్లో అద్భుతమైనది "ముక్తేశ్వరి పునరాగమనము".ఇది నవలల చరిత్రలో ఆయుర్వేదమునకు సంబంధించిన నవల. వీరి నవలలు మానసిక ఒత్తిడి బాధలు పడే యువతకు ఆదర్శము గా నిలుస్తాయి.వీరు ప్రతి నవలకు రకరకాల ఇతివృత్తాలను ఎంచుకుంటారు.మోడలింగ్,గుర్రపుస్వారీలు,ఆటో ముబైల్స్,పునర్జన్మలు,చందనపు గజదొంగలు,ఆయుర్వేదము,చరిత్ర,అఘోరాలు,జ్యోతిష్యము,చలన చిత్రాలు,రాజకీయాలు,మంత్ర తంత్రాలు,వాసికర్ణ యోగాలు,బ్రహ్మంగారి కాలజ్ఞానము ఇలా మొదలగు వాటి గురించి వ్రాశారు.
పురస్కారాలు
[మార్చు]శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజి గారు ఆయన 60 వ జన్మదిన సందర్బంగా 2002 మైసూరులో సూర్య దేవర రామ మోహన రావు గారికి "దత్తపీఠము ఆస్థాన విద్వాన్" పురస్కారాన్నిచ్చి సత్కరించారు.ఆంధ్రప్రదేశంలో ఉత్తమ రచయితగా "కళాభారతి " అని 1996 లో బిరుదునిచ్చారు."సాహితిరంగా" పురస్కారాన్ని 2001 లో ఇచ్చారు. బి.జె.పి.అధ్యక్షుడు శ్రీ వెంకయ్య నాయుడు గారు 2002లో సూర్య దేవర రామ మోహన రావు గారిని " ఉత్తమ రచయిత"గా పేర్కొని సత్కరించారు.
సినిమాలుగా వచ్చిన నవలలు
[మార్చు]వీరి నవలలు తెలుగులో సినిమాలుగా వచ్చినవి. 1.చాదస్తపు 2.శ్రీమతి కానుక 3.ఒంటరి పోరాటం. 4.కలెక్టర్ గారి అబ్బాయి 5.కూతురు. 6.కలియుగంలో గందరగోళం. 7.అహో విక్రమార్క 8.ప్రేమకు వేళాయెరా 9.అయ్యిందా - లేదా 10.సిసింద్రీ హిందీలో సినిమాలు: 1.కానూన్ అప్నా అప్నా. దూరదర్శనము లో వచ్చినవి: 1.ముగ్ధ 2.మాధవి 3.కల్పన.
బయటి లింకులు
[మార్చు]http://www.suryadevararammohanrao.com/html/aboutus.html# https://en.wikipedia.org/wiki/User:Tejaswiananth/sandbox