వాడుకరి:Devathilakula
మన భారతదేశంలో చోటుచేసుకున్న యాంత్రీకరణ తేలి కులస్థులను చావుదెబ్బ తీసేసింది! అప్పటి దెబ్బనుండి ఈ కులస్తులు ఇప్పటికీ కోలుకోలేదంటే ఆశ్చర్యం లేదు.1995కు పూర్వం బలహీన వర్గాల మాదిరిగానే తెలికుల కులస్తులు కూడా గతంలో వివక్షను ఎదుర్కొన్నారు. వీరు నెత్తిన నూనె డబ్బా పెట్టుకుని ఎదురుపడితే చాలు... గ్రామస్తులు అశుభంగా భావించేవారు. ఎంత ముఖ్యమైన పని ఉన్నా అడుగు ముందుకు వేసేవారు కాదు. ఇంట్లో కొంత సమయాన్ని గడిపి మళ్లీ రోడెక్కేవారు. అంతేకాదు వీరిని ‘శని’ గ్రహాలనీ, జిడ్డుగాళ్లని హేళన చేసి మాట్లాడేవారు. గాంధీ అప్పట్లో అంటరానివారిని ఏవిధంగా దగ్గరకు చేర్చుకుని వారికి హరిజనులని నామకరణ చేశారో అదే విదంగా హేళనకు గురవుతున్న గాండ్ల, తెలికుల, దేవతిలకుల కులస్తులను ఓదార్చే విధంగా ‘మై గాంచ్ తేలీ హూ...’ అని అప్పట్లో చెప్పడం జరిగింది. అయితే సమాజం నుండి వస్తున్న ప్రతిహేళను తేలి కులస్తులు ఛాలెంజ్‌గా తీసుకోవడంతో అప్పట్లో నూనె గానుగలు ఆడించే వీరు తమ పిల్లలను బడికి పంపించి చదివించే ప్రయత్నం చేశారు.
1965 పరిస్థితుల్లో గానుగుల స్థానంలో మార్వాడీలు యంత్రాలను ప్రవేశపెట్టారు. అయితే తేలి కులస్తులు కూడా రోటరీ పద్దతి ద్వారా నూనె తీసే ప్రక్రియను అందుకున్నారు. దీంతో మార్వాడీలు బేబీ ఎక్స్‌పెల్లర్‌లను అధునీకరించి ఆయిల్ ఎక్స్‌పెల్లర్లుగా రంగంలోకి దించడంతో అంతపెట్టుబడి పెట్టే స్తోమతలేని తేలి కులస్తులు క్రమంగా వృత్తికి దూరమయ్యారు. ఈ క్రమంలో నూనె గింజల నుండి నూనె తీయగా వచ్చిన పిప్పిని దాణాగా వేసి పెంచిన పశువులు వీరిని ఆదుకున్నాయని చెప్పొచ్చు. దీంతో వీరు నూనె తీయడానికి స్వస్తిపలికి కొట్టాల్లొ ఉన్న పశువులతో డెయిరీ ఫారాలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల లోని బడుగు బలహీన వర్గాలతో పోల్చుకున్నప్పటికీ వీరు ఇప్పటికీ వెనుబడే ఉన్నారు.
స్కంద్పురాణములోని మునువంశ చరిత్రకలిగి చంద్రవ౦శమున కీర్తి ప్రతిష్టలు కలిగి రాజవంశమున జన్మించిన మహారాజు విమలవిధునకు, కలియుగమున మీ వంశమున జన్మించినవారు తిలాఘాతకులగుదురని మహాముని విశ్వంభరుడు శాపమొనరించెను. ఆశాపం కారణంగా దేశమంతా కలియుగన గానుగపై నూనె తీసి పరమేశ్వరునికి జటాజూటమునకు తైలాభిషేకంగా సమర్పిస్తూ తిలకుల “తేలి”గా పిలవబడుచున్నారు. హిందూ ధర్మ రక్షణ లో భాగంగా మన తిలకులకు కొన్ని దేవాలయాలు బాధ్యతను అప్పటి శ్రీమంతులు మన తిలకులకు కల్పించడం ద్వారా మన పూర్వికులు మన కుల దైవంగా భావించే పరమశివుడి సేవలో తరించారు. www.devathilakula.com సంఖ్యాపరంగా నూనె గానుగపై జీవించేవారు భారతదేశం అంతటా అభివృద్ధి చెంది ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా వెనుకబడే వున్నారు. 20వ శతాబ్దంకు ముందు మన వారు సమాజంలో పలు ప్రాంతాల్లో నిరాశా నిస్పృహలతో అవహేళనకు గురి అయ్యారు. 20వ శతాబ్దం తర్వాత మన కులస్తులకు సమాజంలో గుర్తింపు, సముచితమైన స్థానం సంపాదించుకున్నమనే చెప్పవచ్చు. మనకులస్తులు చేసే గానుగ వృత్తి ఆధారంగానే మనవారిని తెలికుల కులస్తులుగా పిలిచేవారు. గానుగ ఆడించి నూనె తీసి, నూనె మరియు తెలగపిండి వ్యాపారం చేస్తారు కనుక తెలీకులోరు అని పిలిచేవారని మన పెద్దలు చెబుతున్నారు. వాస్తవానికి దేవతిలకుల అని చెప్పబడుతున్న కారణం తిల అంటే నువ్వులు, నువ్వులు సంబంధిత వ్యాపారం చేసే కులంగా మరియు దేవాలయాల్లో నూనె సరఫరా చేసే కులంగా దేవతిలకుల గా పిలిచేవారుగా గ్రంధాలు, శాసనాలులో చెప్పబడుతున్నాయి.. దేవతిలకుల కుల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన శ్రీ చిట్టాల సూర్యనారాయణ మూర్తి గారూ , మరికొంతమంది పెద్దలు కుల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించివారిలో వున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుప్రాంతాల్లో నివసించే మన తేలి సామాజిక వర్గాని వివిధ పేర్లుతో పిలవబడుచున్నారు. రాయలసీమ ప్రాంతంలో “గాండ్ల” అని, ఉత్తరాంధ్ర కోనసీమ ప్రాంతాల్లో తెలికుల, దేవతిలకుల గా పిలవబడుచున్నారు. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమిషన్ (BC-B“6”) పుస్తకంలో “బి” కేటగిరీలో ”6వ క్రమసంఖ్యలో గాండ్ల, తెలికుల, దేవతిలకుల గా నమోదు కాబడివున్నారు. రాజకీయ నాయకులు సహకారంతో, మన కుల పెద్దలు సహకారంతో 2019 ఫిబ్రవరి నెలలో #ఆంధ్రప్రదేశ్ #గాండ్ల, #తెలికుల, #దేవతిలకుల సహకార ఫైనాన్స్ #కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.