వాడుకరి:Mufti.abdurrahman shareef guntur
మీలాదున్నబి వాస్తవికత మరియు 💐ప్రజల మూఢాచారాలు 🌷✍:ముఫ్తి అబ్దుర్రహ్మాన్ ఖాస్మి,అష్రఫీ (ఉపాధ్యాయుడు: ఇదార అష్రాఫుల్ ఉలూమ్ హైదరాబాద్) (🌸బిస్మిల్లా హిర్రహ్మాన్ నిర్రహీమ్🌸) ( اليوم أكملت لكم دينكم....:తాత్పర్యం ) (ఈనాడు నేను మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం చేసి మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను ) 🌼రబీవుల్ అవ్వల్ ,ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మూడవ నెలగా పరిగణించబడుతుంది. ఈ నెల కూడా ఇతర నెలల లాగానే ఒక ప్రత్యేకమైన స్ధానం కలిగి ఉంది. అది ఏమనగ అంటే ఈ మాసంలో మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు, సోమవారం శుభదినాన జన్మించారు.కాని ఇక్కడ విచారించే విషయం ఏమిటంటే,చాలా మంది ధార్మిక పరిశోధకుల మధ్య మీరు ( మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ) ఏ తారీఖున జన్మించారు అన్న దాని గురించి భేదాభిప్రాయాలున్నాయి .ముహద్దిస్ అనబడే ధార్మిక పరిశోధకులు ఈ భిన్న హదీసులను బాగా పరిశీలించి ఏకాభిప్రాయనికి వచ్చారు.మీరు ( మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు ) రబీవుల్ అవ్వల్ 9 వ తారీఖునే జన్మించారని. దీనిని ఏకభవిస్తూ చాలా ప్రసిద్ది చెందిన చారిత్రాత్మక ధార్మిక పండితులైన అల్లామహ్ షిబ్లి నొఅమాని ( రహమతుల్లాహి అలైహి గారు)వ్రాయడం జరిగింది. మీరు ( మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు) రబీవుల్ అవ్వల్ 9 సోమవారం నాడు (క్రీశ 571 వ సంవత్సరం, ఏప్రిల్ 20వ )తారీఖున జన్మించారని,💔కాని ఎంతో బాధాకరమైన విషయం ఏమిటంటే మన ముస్లిమ్ సోదరులలో చాలా మంది వీటికి విరుద్ధంగా పూర్తి బలమైన రివాయాత్లను వదిలిపెట్టి,(12 రబీవుల్ అవ్వల్ రివాయత్నే ముస్తనద్ గా భావిస్తున్నారు) ఆనాడు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా మీలాదున్నబి జరుపుకుంటున్నారు.దీని యథార్థాన్ని తెలుసుకుంటే రబీవుల్ అవ్వల్ 12వ తారీఖున మీ జన్మదినం కన్న మీ మర్ణదినం గురించే గట్టి ఆధారాలు ఉన్నాయి.👉 💐అసలు మీలాదున్నబి ఎక్కడ నుంచి ప్రారంభమైంది? 💐: చరిత్ర అధ్యయనం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది (4వ శతాబ్దంలో ) మీలాదున్నబి (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫాతిమియో అని పిలవబడే ఒక మార్గభ్రష్టకమైన బృందం నుంచి ఆరంభమైంది. దీనిని ప్రత్యేకంగా ఒక పండుగలా ఆకారం చుట్టింది, 6వ శతాబ్దంలో ఇరాక్ దేశములోని మవ్-సుల్ అనబడే నగరంలో ఆ నగరపు రాజైన ముజఫ్ఫరుద్దీన్ ,తన చేతిలో ఉన్న అధికారన్ని విచ్చలవిడిగా ఉపయోగించి ,తన పలుకుబడితో ఎన్నో లక్షలరూపాయలు ఈ కార్యములో నీరులా ఖర్చు చేశాడు.మరియు ప్రజల సమయాన్ని వృథా చేశాడు. దీనివల్ల ప్రజల అతిమూల్యమైన పరలోక నష్టం ఏమికలిగిందంటే,వారు దైవ ఆజ్ఞలైన ఫరాయిజ్ నమాజులను పఠించడంలో ఆశ్రధ్ధ వహించడం మొదలుపెట్టారు. కొంత మంది అయితే పూర్తిగా నమాజులనే వదులుతున్నారు.ఈ మాసంలో మీలాదున్నబి పండుగ అని, అందమైన, ఆకర్షణీయమైన టైటిల్ పెట్టి, ఫరాయిజ్,వాజిబాత్ నమాజులను, వదలిపెట్టడం ఎంత వరకు న్యాయం? దీనిని మీరే సమయస్ఫూర్తితో గ్రహించండి.అందుకే ఇలాంటి అంతర్గతమైన మార్గభ్రష్టకుల గురించి మొత్తం ధార్మిక చారిత్రకారుల ఏకాభిప్రాయం ఉన్నది.వీరి మనస్తత్వం ఒకేలా ఉన్నాయని ,వీరు బహిర్గతంగా కనబడటానికి ,విశ్వసులుగా కనబడిన,వీరు అంతర్గతలో మాత్రం లో లోపల అవిశ్వాసులుగా ఉన్నారు. 🌺మీలాదున్నబి మూఢాచారాలు: రబీవుల్ అవ్వల్ మొదటి తేది నుండి రబీవుల్ అవ్వల్ 12 వ తేది వరకు లేదా మరికొన్ని చోట్లు పూర్తి నెల వరకు ఈ మీలాదున్నబి కార్యక్రమాలను ఏర్పాటు చేసి,ట్రాఫిక్ను ఇబ్బంది పరుస్తు,ఎన్నో వేలరూపాయలు ఖర్చు చేసి, పెద్ద పెద్ద స్టేజిలను ఏర్పాటు చేసి,వీధులను అలంకరించి,మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారి జీవిత చరిత్రను తెలియజేస్తారు.మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారి జీవిత చరిత్రను తెలియజేయడంలో తప్పేమి లేదు. ముమ్మాటికీ అది పుణ్యకార్యాము.దానిని మేము సమర్థిస్తున్నాము.కాని ప్రస్తుత కాలంలో మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారి పేరు మీదుగా జరుపుతున్న ఈ సభావేశాలు,వేదికలు,స్వయంగా మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారి ఆచరణాలకు మరియు ఆదేశాలకు వ్యతిరేకంగా ఉన్నాయి.1🍁:ఈ కార్యక్రమంలో,ప్రామాణికం కాని,అర్థంలేని కవితల పైన తమ సమయాన్ని వృథా చేస్తారు.మరియు అందులో విపరీతమైన శబ్ద కేకలు,అల్లాహ్ హు అక్బర్ అన్న నారాలు.2🍁నిశబ్దంగా మరియు నిదానంగా మీ పవిత్రమైన జీవిత చరిత్రను వినాల్సింది పోయి ,అందులో కూడా పనికిరాని మాటలు,మరియు చర్చలు చేస్తు కుళ్ళు జోకులు వేస్తు,పవిత్రమైన మీ జీవితచరిత్రను,అపవిత్రం చేస్తున్నారు 3🍁యథావిధిగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనే ప్రసంగీకులు,ఎక్కువ శాతం తమ ప్రసంగాలలో జయీఫ్ (బలహీనమైన)హదీసులను ప్రసంగించి ప్రజలలో బిద్అత్లను నెలకోల్పుతున్నారు.మరియు వ్యాపించేలా చేస్తున్నారు. 4🍁సాధారణంగా ఈ కార్యక్రమం ఇషా నమాజు తర్వాత మొదలవ్వుతుంది.కనుక ఈ కార్యక్రమం ఎక్కువ సేపు, చాలా సమయం వరకు కొనసాగుతుంది ,దీని వల్ల కలిగే అతి పెద్ద పరలోక నష్టం ఏమిటంటే, వీరు ఫజర్ నమాజును చదవకుండా గురకలు పెడ్తూ, మంచాల పైన శవాలుగా పడుకొని ఉంటారు 5🍁ఇలాంటి ప్రోగ్రాములు ఏర్పాటు చేసి చేసి, వీరి బుద్ధి నశించింది అనుకుంటున్నాను. వీరికి ఇంత ఙ్ఞానము మరియు చలనం కూడా లేకపోయింది, వీరు అనవసరమైన భారాన్ని మోస్తు తమ సమయాన్ని వృథా చేస్తూ, దైవ ఆజ్ఞను వదలి పెడుతున్నారని.6🍁వీరి బుద్ధి నశించింది అన్న దానికి మరో ఉదాహరణ ఏమిటంటే వీరు ఈ సభలో పాల్గోంటే చాలు మోక్ష మార్గానికి,చేరుకుంటారని,భావిస్తున్నారు.ఎంత మోసం,వీరు ఎంత లోతైన మార్గభ్రష్టకానికి గురి అయ్యారు.7🍁అందుకే మన ధార్మిక పండితులు ఇలాంటి సభలను వ్యతిరేకిస్తున్నారు. దేనిలో అయితే ధార్మిక మాటల కన్న ఎక్కువ అధార్మిక మాటల పైన ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందో,అట్లాంటి వాటిలో మంచి కంటే ఎక్కువ చెడు దాగి ఉంటుంది. 8🍁దీనినే అల్లామహ్ ఇబ్న్ అల్-హాజ్ (రహమతుల్లాహి అలైహి గారు)తెలియజేస్తున్నారు. వీరు మీలాదున్నబి తోనే ఆగలేదు, ఇంకా ముందుకి సాగి, ఎన్నో రకాల బిద్అత్లను సృష్టించారు.అవి పూర్తిగా దివ్య ఖుర్ఆన్ మరియు హదీసు విరుద్ధంగా ఉన్నాయి. 🌳మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం పేరు మీదుగా ఊరేగింపు 🌳: 1🌹మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారి జన్మదిన తారీఖు గురించి ఖచ్చితంగా నిర్ధారణ అయిన ఒక పెద్ద జనాభా మాత్రం అలాంటి తారీఖు పైనే అమలుపరుస్తుంది,దేనిలో అయితే (తారీఖు)మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారి జననం కన్న మరణం గురించే ధార్మిక పుస్తకాలలో స్పష్టంగా ఉన్నది. కాని బాధ కరమైన విషయం ఏమిటంటే వీరు ఈ విషయాన్ని తెలిసి తెలియనట్టుగా వదలేసి మీ మరణతారీఖునే మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారి పేరు మీదుగా రోడ్లపైన విచ్చలవిడిగా నడుస్తూ ఊరేగింపు జరుపుతారు.దీని కోసం ఎంతో డబ్బును,నీరులా ఖర్చు చేస్తారు. ఇలాంటి వారి గురించే దివ్య ఖుర్ఆన్ స్పష్టంగా తెలియజేస్తుంది.వీరే వాస్తవికంగా దుష్ట షైతాను యొక్క సోదరులని.కాని వీరు ఇలాంటి దైవ ఆజ్ఞలను పడిచెవి పెట్టి ,తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమలలో సమయాన్ని వృథా చేస్తూ నమాజులను వదులుతున్నారు.🌸వీరికి ప్రవక్త గారి ఆ మాట గుర్తుకు రావటం లేదా? దేని గురించి అయితే మీరు స్వయంగా చెప్పారు, నమాజు నా కన్నుల చల్లదనమని.ఇక్కడ నమాజులలోనే నా కన్నుల చల్లదనమని స్పష్టంగా చెప్తుండగా,ఈ మూర్ఖులు నమాజులను వదిలి ఎక్కడ చల్లదనాన్ని వెతుకుతున్నారు.2🌹ఇలాంటి ఊరేగింపులో మన యుక్త ముస్లింయేతర సమాజం, కాలం గడుపుతూ, మద్యమును సేవిస్తూ ,మధ్యం సేవించడాన్ని హలాల్ గా భావిస్తున్నారు. 3🌹ఇలాంటి సమయాన్న హజ్రత్ ఆమీన గారి ఙ్ఞాపకార్ధం మీ పేరు మీదుగా ఒక సామాన్య స్త్రీని కూర్చోబెట్టి ఆమె ఒడిలో ఒక చంటి బాబును పెట్టి ,ఆ బాబు పేరు మొహమ్మద్ అని నామకరణం చేసి,మీ (మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మదిన వేడుకలు జరుపుకుంటారు.4🌹కొంత ముంది అయితే యూదుల నడుబాటున నడుస్తూ మీ జన్మదినాన్న, నడి రోడ్డు మధ్యలో ఓ పెద్ద కేకు తెచ్చి కేరింతలు కొడుతు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం గారి పేరు మీదునా (happy birthday )చేస్తారు. 5🌹అలాగే హజ్రత్ అలీ( రజి) మరియు హజ్రత్ ఫాతిమా ( రజి) గార్ల పేర్ల మీదుగా ఓ జంటను తయారు చేసి వారిని ఓ ఒంటె మీద కూర్చోబెట్టేవారు.ఎంత సిగ్గుకరమైన విషయం ఏ స్త్రీ అయితే తన జీవితకాలంలో ఏ పరాయి మాగాడిని ,చూడలేదో,ఈ రోజు ఆమె పరువు మర్యాదలను భంగం కలిగిస్తున్నారు. అట్లాంటి పుణ్య స్త్రీ పరువును బజారుకి ఇడ్చుతున్నారు,ఇది ఎంత వరకు న్యాయం ? 🌺కొంత మంది ఇలాంటి ,మూఢాచారాలను రుజువు చేసేందుకు విఫల ప్రయత్నాలు🌺: కొంత మంది ఉన్నారు,వారు ఈ మూఢాచారాలను ,రుజువు చేసేందుకు, దివ్య ఖుర్ఆన్ లోని విభిన్న వాక్యాలను మరియు ధార్మిక పండితుల మాటలను ప్రవేశపెడుతున్నారు.🌼ఇక్కడ ఆగి కొంచం సేపు నిదానంగా ఆలోచించితే,అర్థమవుతుంది ఏ ఖుర్ఆన్ వాక్యాలను అయితే వీరు ప్రవేశపెడుతున్నారో ,వీరు ఆ వాక్యాల ముందు, వెనుక గల పదాలను పూర్తిగా తొలగించి,ప్రవేశపెడుతున్నారని తెలుస్తుంది. 🌼అలాగే వీరు ఏ ధార్మిక పండితుల ఉదాహరణలు అయితే ఇస్తున్నారో,అవి కూడా సరియైనదని చెప్పింది, కేవలం మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారి జీవిత చరిత్రను తెలియజేసి,ప్రజలను అమలుపరిచేలా చేయడమే తప్ప ఇంకేమీ లేదు. కాని ప్రస్తుత ఊరేగింపు, ఉత్సాహాలు,వాంటి గురించి ఏ ధార్మిక పండితులు తమ అంగీకారం ,ఇవ్వలేదు. 🍀🇸🇦🇸🇦🇸🇦 పచ్చ జెండాలు తగలించడం🍀: 12రబీవుల్ అవ్వల్ సంధర్భమున ప్రతి ఇంటి పైకప్పు పై పచ్చ జెండాను తగలించడం జరుగుతుంది, ఆ జెండాలపై కొన్నిచోట్ల కలిమే తయ్యిబా వ్రాయబడి ఉంటుంది, మరికొన్ని చోట్ల షిర్క్ మరియు కుఫ్ర్ కలిమాలు వ్రాయబడటం జరుగుతుంది, అవి గాలి వల్ల, లేక వర్షం వల్ల కుళ్ళి క్రిందకి ఏ మురుగు కాలువలో లేక రోడ్ల పైన పడుతుంది. దానిని అందరూ తొక్కుకుంటూ పోతారు. ఒక్కోసారి ఆ జెండాపై వ్రాసియున్న కలిమా నీడ రోడ్ల మీద పడుతుంది,దానిని కూడా చాలా మంది ప్రజలు తెలియకుండానే దాని మీద తమ పాదాలు వేస్తూ నడుస్తూ ఉంటారు. మరికొంత మంది దాని మీద నుంచి బండ్లను తీసుకోని వెళ్తారు. ఇట్లాంటి అపచారమైన పని బుద్ధి గడ్డి తిన్నవారే చేస్తారు. బుద్ధిమంతులు చేయరు.🍂దీని వల్ల ప్రయోజనం ఏమిటి, వీటిని ఎందుకు తగిలిస్తారు అని ప్రశ్నించగా🍂? జవాబు : దీని వల్ల నిన్న ప్రళయం నాడు హషర్ మైదానంలో ఆ జెండా నీడలో మనకు చోటు దొరుకుతుందని సమాధానం ఇచ్చారు. దీని వాస్తవం ఎంత వరకు నిజమో అని హదీసులలో వెతకగా,మనకు దీని గురించి ఏ ఆధారాలు మరియు సహబా కిరామ్ (రజి)గారి ఏ చార్యలు మరియు సూక్తులు కనబడలేదు. ఒకవేళ దీనిని సమయస్ఫూర్తితో ఆలోచించితే ఇది మనకు అవమానకరము మరియు అవహేళన చేయటం తప్ప మరేమీ లేదు. ఈ రోజు ఓ పెద్ద జనాభా ఇందులో పాల్గొనడం తప్పని సరిగా భావిస్తున్నారు. అందుకే మన ప్రభుత్వం ఈనాడు సెలవుదినగా,ప్రకటించింది.ఈ రోజు ప్రభుత్వ సంస్థలు అన్ని ,మూసివేయబడతాయి.చాలా చోట్ల పెర్వేటు సంస్థలకు కూడా సెలవు ఉంటుంది. ఈ రోజు మన యావత్ ముస్లిమ్ సమాజానికే, తలదించుకునే విషయం .మన ప్రభుత్వం కూడా ఇస్లాంలో లేని పండుగను ,పండుగగా భావిస్తున్నది.అందుకే 🌻మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు ఈ విధంగా సెలవిచ్చారుوإياكم ومحدثات الأمور فإن كلّ: محدثةبدعةوكلّ بدعةضلالة )🌻మీరు ఇస్లాం లో క్రొత్త క్రొత్త ఆవిష్కరణల నుండి తమని తాము రక్షించండి,ఎందుకంటే ఇస్లాంలో సరికొత్త ఆవిష్కరణ మార్గభష్టకము,మరియు ప్రతి మార్గభ్రష్టకము మనిషిని నరకానికి ప్రవేశించేలా,చేయును. అల్లాహ్ మనల్ని ఇలాంటి మూఢాచారాల నుంచి మన చివరి క్షణం దాకా రక్షించుగాక!🌳