Jump to content

వాడుకరి:Pramodkumar

వికీపీడియా నుండి

Modati rachana

[మార్చు]

వెన్నెలను పొత పొసి

వెన్నను మనసుగా చెసీ

ఒక మనిషిని చేయదలిచి బ్రహ్మ

మనకిచ్చాడు కానుకగా అమ్మ.

చంద్రుడికి తన వెన్నెల కన్నా

ఆమె మనసె చల్లన అని,

ఆ కన్నతల్లి పిల్లలకు మామ అయ్యాడు ,

జోలపాట అయ్యాడు.

పెదాల కలయికే అమ్మైతే ,

అమ్మకై నా పెదాలు కలుస్తూనే ఉంటాయి.

నమస్కారమే కృతజ్ఞత కి తార్కాణమైతే ,

అమ్మ కై నా చేతులు విడివడనే విడివడవు

హితుడా పుట్టిన రోజు శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు సర్వేజనా సుఖినో భవంతు:

వర్షించని వెన్నలనీ నవ వర్షం

[మార్చు]

సమయ సాగరంలో మరో అల ఎగసేందుకు ఉత్సాహపడుతుంది,

కాలగర్భంలో సంవత్సర కాలం కలిసిపోబోతుంది.


కాలెండర్లు మార్చడం

కార్డులు మార్చుకోవడం

మినహా చెసేది ఏమీ లేకపోయినా

ఆశావాదమే కదా ఆమ్లజని!!


ఎదుగుతున్న బిడ్డను చూసి తల్లి , ఆయువు తగ్గుతున్నదనుకోదు కద!!

అంతే! చూపును మార్చు, లోకం నిన్నే చూస్తుంది!!

గతం వెన్నెలనూ వర్షించింది, విషాన్ని చిమ్మింది!

సమతుల్యత సృష్టి నిర్మాణ రహస్యం!!

ఐతే మాత్రం,

కొత్త వత్సరం నరనరాన కొత్త శక్తి నింపలనుకోవడం తప్పు కాదెమో!!

ఆలోచనే కదా ,ఆచరణకు పునాది!

భోగి మంటలు గంగిరెద్దులతో .. హరిదాసు కీర్తనలు,రంగ వల్లులతో... కోడిపుంజుల కోట్లాటలతో ప్రకాశించే ఈ సంక్రాంతి ...


మీ ఇంట ఆనందాలను పూయించాలని ఆశిస్తూ...


కొత్త ఆశలు , కొత్త బాసలు ,అంతా ,ఇపుడంతా కొత్తే ! ఒక్క రోజులో ,కాదు కాదు , ఒక్క సెకనుతో జీవితమే మారాలని కాలానికి కొత్త రంగేసి, కార్దులు మార్చుకొని, కాలెండర్లు కొత్తవి తెచ్చుకొని, మనం చేసే హడావిడి ,కేరింతల సడిని చూస్తూ ,వింటూ ,కాలాచక్రం నవ్వుకుంటుందేమో, పరిగెడుతూనే !! సమయ సంద్రంలో కొత్త కెరటాలకిది కొత్త కాకపోయినా ఎప్పటికప్పుడు కోరికల చిట్టా సవరింపులు , ఆశావాదమే శ్వాసకు నాదమని నిరూపణలు. విధ్వంస విషాద చారకలు, విజ్ఞాన వికాస తారకలు తో... మిశ్రమ ఫలిత సహితయై విశ్రాంతికై నిష్క్రమిస్తుంది, గత వత్సరం! బాధల బరువును సోదరునికి వడ్డిస్తూ!! మోదకారకమై వెలుగొందాలని ని నిట్టూరుస్త్టూ!!!! సమయాన్ని భందించాలని ,సంవత్సారాలతో గెలవాలని , మనసుకి సర్దిచెప్పుకొనే ప్రయాస! మనిషి చేసిన మరో తమాష!! ఐనా...మనిషే కాల ప్రవాహంలో బందీ ఐనప్పుడు, మనసు సమయానికి స్పందిచడం తప్పు కాదెమో!!!

నమస్కారం!! స్వఛ్చమైన తెలుగు ని అభిమానించే భాషా ప్రియులకు స్వాగతం!

దేనీ గురించి ఈ బ్లాగ్ అని మీకో అనుమానం రావచ్చు! మీకు కథలన్నా కవితలన్నా ఇష్టమా .....?, ఐతే ఈ బ్లాగ్ మీ కొసమే!

అందరికి ఏదో ఒక అభిరుచి ఉండడం సహజం కదా! అది సచిన్ లా షాట్ కొట్టడం కావచ్చు! లేక రాజమౌలి లా షాట్ ఓ.కె అని చెప్పడం కావచ్చు!

అది ఏదైన మనకు నచ్చేలా,మనకే వచ్చేలా చేయడమే విలక్షనత! నాకు కథలు కవితలు రాయడమంటే ఇష్టం! నాకిష్టమంటె కుదరదు కదా! మీకు కష్టంగా ఉంటుంది !

తెల్ల కాగితాన్ని అర్థం లేనీ అక్షరాలతో నింపే కుకవి ని కాదు లెండి!

డా||సి.నారాయణ రెడ్డి(జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత!), ఫ్రో||పేర్వారం జగన్నాధం (ప్రముఖ రచయిత) ల ప్రశంసలు పొందినవాన్ని పిచ్చి రాతలు ఎలా రాస్తాను చెప్పండి!

సరె! "కవితలు" అనే పోస్ట్ లొ నా కవితలు కొన్ని ఉంటాయి ..చదవండి! నచ్చినా, నచ్చకపోయినా కూడ కామెంట్స్ రాయడం మర్చిపోకండి! మీరు మరింత మెచ్చేలా రాయడానికి అది నాకు ఉపయోగపడుతుంది!

మళ్ళీ కలుద్దాం! హరి మీరు చాలా మంచి వారు ర్యాతోన్నాచ్చి

అమ్మా….ఐ.టి మాతా…….

. నీ మీద లవ్వు ను పెంచేది నువ్వే

వంట్లో కొవ్వు ని పెంచేది నువ్వే

పని లేనప్పుడు పి.ఎం తొ తిట్టించేది నువ్వే

తెగ చించుకుని చెసినప్పుడు మా పి.ఎం ను రాకుండా చేసెదీ నువ్వే

అందమైన అమ్మయి పక్కన సీట్ పడేలా చెసేదీ నువ్వే

నెక్స్ట్ డే ఆమెకు పెళ్ళి ఫిక్స్ అని స్వీట్స్ పంచెదీ నువ్వే

పాపం అని నాకనిపించి పక్కనోడికి సబ్జెక్ట్ చెప్పేల చెసెది నువ్వె

వారం తర్వాత వాడూ మాంచి జాబ్ కొట్టానని చెప్పెల చేసెదీ నువ్వే

ఎప్పుడూ ఇంకెప్పుడూ

ఇంక్రిమెంటైనా ఇంకో అమ్మయైనా

ప్రమోషన్ అయినా ప్రేమలో ఎమోషన్ ఐనా

లక్కు కుక్కలా కరిచి చెక్కులు చుక్కలు చూపించేట్టు ఎన్నడూ సినిమా చూడని ఫేస్ కి ఐమాక్స్ రాసిచ్చినట్టూ

ఒక్కసారిఒకేఒక్కసారి

ఓ ఐ.టి మాతాకరుణించవూ ……..

కి అంకితమ్ \ కాలెండర్ మార్చాల్సిన సమయం వచ్చింది! మళ్ళీ చేయాలనుకున్న లిస్ట్ కి దుమ్ము దూరం అయింది !! రిజల్యూషన్స్..రీజన్సూ అంటూ చర్చలు ఛాయ్ గ్లాసులతో వేడెక్కుతాయి!! అక్కడక్కడా వసంతకోకిల గానం లా తెలుగు కవితా గోష్టులతో మళ్ళే పురుడు పోసుకుంటుంది !!

పద్దతి మనది కాకపొయినా పసందైతే ప్రాణం తో మమేకం చేస్తామని పండుగ సంబరాలతో తెలుపుకుంటాం!

రైల్లో వెళ్తున్నపుదు వెనక్కి వెళ్ళే చెట్లను గుర్తుకుతెస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళు అన్న కథను మళ్ళీ చెపుతున్నాయి మారుతున్న సంవత్సరాలు  !!

రేపటి గురించి నేడే ఆలోచించాలన్న సుమతి చేప కథ ను చివరి అంకెను చూపుతూ చెప్తుంది కాలెండరు !!

గంగడోలు ను హరిదాసుల కీర్తనలను రంగవల్లుల అల్లికలను సవరించుకుంటూ సమయ ప్రవాహం లో దూకుతున్నదీ నవ వర్షం!!

తాజా తేదీలతో ఐనా జీవిత వీణ పై సరికొత్త రాగాలు మోగుతాయని ఎప్పటిలానే ఆశలు! మనిషి ఆశా జీవి అని నిరూపణలు!

మార్పు కి కావల్సింది ప్రయత్నం కాని పరిగెత్తే కాల చక్రం కాదని తెల్సినా

అలవాటైన పద్దతిలొనే "నూతన సంవత్సర శుభాకాంక్షలు"చెప్తాం! కొన్నిటిని కాదని అనలేము! అలాగని ఔనని తలూపనూలేము !!

అదే పాత మాట-"కాలం తో పాటు మనం" .


ఇందుమూలంగ యావన్మందికి తెలియచేయునది ఏమనగా ప్రజల సౌకర్యార్దము, శనివారము ఎంచక్కా సెలవు పెట్టకుండా ఓ పిక్నిక్ లా అలా అలా శ్వేత రిసెప్షన్ కి వెళ్తే బాగుంటుందెమో. కనుక మీ అభిప్రాయం త్వరగా పంపితే అంతే త్వరగా ఏర్పాట్లు చేసుకోవచ్చు కదా!!! మీ జవాబు కోసం ఎదురు చూస్తూ,.....

ఇట్లు, మెయిన్ ఫ్రేంస్ మాఫియా