వాడుకరి:Prasad Box office
స్వరూపం
పేదరికం
సాధారణముగా పేదరికం అనేది ఆర్థిక అసమానతల వలన సంభవిస్తుంది,ఇది ఒక సామాజిక సమస్య.మనుషుల మనుగడకు కనీస అవసరాలు అయిన ఆహారం,బట్టలు మరియు ఉండడానికి ఇల్లు లేక పోయినట్లయితే ఆ స్థితిని పేదరికం అంటారు,పేదరికంతో బాధ పడే వారిని పేదలు అంటారు.మన భారత వాని అపర సిరిసంపదలకు నెలవైన దేశం కానీ ఒక పూట ఒక ముద్ద కూడా నోచుకోని బ్రతుకులు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. పేదవారు తమ కుటుంబమును పోషించడానికి చేసే కష్టాలు వర్ణనాతీతం,పేద వారు ముఖ్యంగా పొట్టకూటి కోసమే ఎక్కువగా శ్రమ పడుతుంటారు,ఆ క్రమంలో ఒక పూట భోజనం చేస్తే రెండు పూటలు పస్తు ఉండాల్సిందే,అందులో భాగంగా ఏదైనా ఒక రోజు పని దొరకక పోయినట్లయితే ఆ రోజు మొత్తం కుటుంబం ఉపవాసం చేయాల్సి ఉంటుంది.రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు పేదవారివి,రోజంతా కష్టపడితేనే రోజుకిన్ని మెతుకులు,పనికెళ్ళకున్నా,పని దొరకకున్నా ఆగమాగమే పేద వారి బ్రతుకులు,ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజే నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తాయి,కూటి కోసం వలస పోరాటం,కాలినడక ప్రయాణం,ఆకలి రోగం ఎరుగదు,ఆకలి నిదుర ఎరుగదు,గుప్పెడు మెతుకుల కోసం చెమటోడ్చాల్సిన అవసరం,తుఫాన్ వచ్చిన,సునామీ వచ్చినా,మహమ్మారి వచ్చినా ముందుగా నిస్సహాయత పేదరికానిదే.మబ్బు మేరిస్తే ప్రేలి పోతారో తెలియదు,జబ్బు కరిస్తే రాలి పోతారో తెలియదు,ఈ విధముగా ఏ రోజుకారోజు పేదవారి జీవనం దినదినగండంగా ఉంటుంది. పేదలకు ప్రధానంగా ఆదాయం వచ్చేది ఉపాధి ద్వారానే,ఆ ఉపాధి కోసం వారు ఎటువంటి పనులు చేయడానికైనా,ఎంత దూరమైనా ప్రయాణించడానికి సిద్ధంగా ఉంటారు.ఆ ప్రయాణ క్రమంలో నిరుపేదలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఉపాధి కోసం వలస పోతుంటారు.మరి ఎంత మందికి ఉపాధి దొరుకుతుంది అనేది ప్రశ్నార్థకం? ఉపాధి దొరికిన వారి ఖర్చులకు ఆ ఆదాయం సరిపోవటం లేదు.నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినట్లు వారి యొక్క ఆదాయం కూడా పెరగటం లేదు.ఈ ఆదాయ అసమానతల వలన పేదవారు ఇంకా పేదవారి గానే మిగిలిపోతున్నారు.పేదరికం వల్ల ఎన్నో బతుకులు గాలిలో కలిసిపోయాయి మరెన్నో బతుకులు ఈ రోజా,రేపా అన్నట్టు కాలం వెళ్లదీస్తున్నారు.. పేదరికాన్ని నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి పథకాలను చేపట్టిన వాటి ప్రయోజనాలు నిజమైన నిరు పేదలకు అందడం లేదు,మరి దీనికి కారణం సమాజమా లేదా ఈ సమాజంలో పేద వారి అభివృద్ధి పథకాల నిధులను చీడ పురుగుల్లా తినేస్తూ మన మధ్య లోనే గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతున్న వ్యక్తులదా... ఇలాంటి చీడ పురుగులు సమాజంలో ఉన్నంతవరకు పేదవారు పేదవారి గానే ఉంటారు. మరి అలాంటి చీడ పురుగులను అంతమొందించ గలిగితే,మన ప్రభుత్వాలు అమలు పరుస్తున్న అభివృద్ధి పథకాలు నేరుగా నిరుపేదలకు అందితే"పేదరికం"అనే మాట వినబడదు,ఆకలిచావులు ఉండవు,మరి దీని కోసం పాటుపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు,తిన్నామా మన కడుపు నిండిందా అంతే అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం,నూటికో,కోటికో ఒక్కడు పోరాడితే అది సాధ్యం కాదు, పేదరికాన్ని నిర్మూలించాలంటే సమాజంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి హస్తం ఉండాలి,అలాంటి రోజు త్వరలోనే రావాలని మలేషియా దేశం మాదిరిగా మన భారతదేశంలో కూడా శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది... జై హింద్