వాడుకరి:Ryali prasad
*ర్యాలి ప్రసాాద్* ఆధునిక తెలుగు కవిత్వంలో చెెెప్పుకోదగ్గ పేరు. ఈయన కవిిిిత్వంలో ఆధునికానంతర ధోరణులు దృగ్గోచరమవుతుంటాయి ర్యాలి ప్రసాద్ తల్లిదండ్రులు : సుబ్బలక్ష్మి, వేంకట రావు జన్మస్థలం : పిఠాపురం విద్య. : ఎమ్.ఎ , ఎమ్.ఎ. ( (ఎడ్యుకేషన్ ), ఎమ్.సి.ఎ ఉద్యోగం : అధ్యాపకత్వం
బాల్యం నుండి సాహిత్యం పట్ల ఆకర్షణతో పాటు తండ్రి వెంకటరావు సాహిత్య ప్రేమికుడు కావడమూ, సాహిత్య రాజధాని అనదగిన పిఠాపురంలో ఆనాటి ప్రముఖ సంగీత సాహిత్య నాటకరంగ ప్రముఖులతో అనుబంధం కారణంగానూ ఏర్పడింది. వెంకటరావు కధలు, కవిత్వం రాసేవారు. కొన్ని పత్రికల్లో ముద్రితమయ్యాయి.కానీ కొనసాగించలేదు.ఒక పక్క వృత్తి, మరొక పక్క వ్యవసాయాల మూలంగా రచనలకు దూరం అయ్యారు. ప్రసాద్ ఊహ తెలిసేనాటికి రెండు విధాలైన సమాజం వుండేది. సంస్థానం నశించినా ,ఆ కాలపు వ్యక్తులు ఒకవైపు, ఆధునికమైన ఆలోచనలు ఇంకొక వైపు వుండేవి. ప్రసాద్ ముందు రెండు ప్రధానంగా ఆకర్షణలు ఒకటి సంగీతం, రెండవది సాహిత్యం. అప్పటికి పిఠాపురంలో కేవలం ఒక సామాజిక వర్గం చేతిలో సంగీతం వుండేది. వేరే వారు నేర్చుకోవాలని అభిలాష వున్నా నెరవేరేది కాదు. బహుశా అందుకేనేమో పిఠాపురం నాగేశ్వరరావు లాంటి వారు శాస్త్రీయ సంగీతంలో ప్రవేశించలేకపోయారు. ఇక మిగిలింది సాహిత్యం. ఇంటినిండా కధలు, కవిత్వం పుస్తకాలతో చిన్న పాటి గ్రంధాలయమే వుండేది. తండ్రి దగ్గర మూడున్నర ఏళ్ల వయస్సుకే దాదాపు నలభై పైగా సంస్కృత శ్లోకాలు, వేమన సుమతీ శతకాలు కంఠతా వచ్చేసాయి. తండ్రి పశ్చిమ బెంగాల్ లోని ఖర్గపూరులో వుండడం వలన ఠాగూర్, శరత్ వంటివారి రచనలు విరివిగా తల్లిదండ్రులు చదవడం, రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం ముందు నమస్కరించుకోవడం నిత్యం కనులముందు కనిపించే దృశ్యాలు . ప్రసాద్ తల్లి సుబ్బలక్ష్మి పుట్టింది కూడా పిఠాపురమే కావడం. వీరి మాతామహుల ఇంటి దగ్గర లోనే తొలి తరం తెలుగు రచయిత్రి జూలూరి తులసమ్మ గారి వద్దా, మొక్కపాటి నరసింహశాస్త్రి గారి సోదరి కామమ్మ గారి వద్దా రామాయణ భారత భాగవతాలు ఆమె వద్ద నేర్చుకోవడంతో ప్రసాద్ బాల్యంలో తల్లిదండ్రులే గురువులయ్యారు. పాఠశాలకు వెళ్ళినా పెద్దగా అక్కడి చదువు రుచించలేదు. సూర్యరాయ విద్యానంద గ్రంధాలయం ప్రసాద్ సాహిత్యంలో నిలదొక్కుకునేందుకు ఎంతగానో ఉపయోగపడింది. వజ్రాయుధ కవి సోమసుందర్ పిఠాపురంలోనే వున్నా , పరిచయం వున్నా పెద్దగా ప్రభావితం చేయలేదు. కృతకమైన భాషలో కవిత్వం సామాన్యులకు అర్దం కాదని ప్రసాద్ అభిప్రాయం. తనకు తానుగా సొంత డిక్షన్ ఏర్పాటు చేసుకుని కవిత్వం రాయడం మొదలు పెట్టాడు.ఎన్నో ఒడిదుడుకుల మధ్య కవిత్వం సాగింది. ప్రపంచంలో ఏ భాషలో కూడా లేనన్ని రాజకీయాలు తెలుగులో కనిపిస్తాయి. తన వెనుక ఎవరూ లేకున్నా కేవలం అక్షరాలను మాత్రమే ఆశ్రయించి కృతకృత్యుడయ్యాడు. దాదాపు ముప్పై పుస్తకాలు నేటికీ రాసాడు. అవి తమస్ : మతకల్లోలాల నేపథ్యంలో జరుగుతున్న యుద్ధాలకు సంబంధించింది. రాలినపూలు : హైకూ కవితల సంపుటి. ఆమని : కవితా సంపుటి అల ఒక కల : ప్రణయ కవిత్వం స్వప్న భాష : కవితా సంపుటి తదనంతరం : // కుంకుమ రేఖ : // పునాసనీడ : ఆధునికానంతర కవిత్వం ఆల్ఫా ఒమేగా : // ఒక రాస్తాను : // విద్యున్మాలిక. : దీర్ఘ కవిత గోజంగి : // హరిచందనం : // మట్టి : // మా వూరు సూర్యరాయ : // అల్లూరి శ్రీ రామరాజు : కధాత్మక కవిత చేగువేరా : // గాంధీ : // ఉయ్యాలవాడ. : // కొవ్వూరి బసివిరెడ్డి : // అనుక్తం : కవిత మేఘతనువు : // జీవనేఛ్ఛ. : // సమీపాన. : // ప్రాంతచరిత్రలు : పెద్దాపురం వైభవం
రాజమహేంద్రి విశిష్ట విశాఖ కోనసీమ పిఠాపురం వైభవం
మొదలైనవి... ఇంకా అనేకం
వివిధ అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర స్థాయి కవితా కధా పోటీలలో అత్యుత్తమ పురస్కారాలు దాదాపు నూట అరవై పైగా. ఇప్పటి వరకు కేవలం పోటీ ద్వారా మాత్రమే పురస్కారాలు అందుకున్నారు. తెలుగు సాహిత్యంలో ఒక నూతన శకానికి ర్యాలి ప్రసాద్ నాంది చుట్టారు.శతాబ్దాలుగా అవధాన ప్రక్రియలో వున్న పద్యకవిత్వానికి బదులుగా వచన కవిత్వంతో అవధానానికి రూపకల్పన చేసి ఆ ప్రక్రియలో దశావధాన, శతావధాన, సహస్రావధాన , మహాసహస్రావధానాలు చేసి చరితార్ధులయ్యారు.ఈ అవధానాలలో ప్రత్యేకం ముందుగా ప్రణాళిక ప్రకారం అవధానం నిర్వహించడం వుండదు. సభలో ఆహుతులైన ప్రేక్షకులే పృచ్చకులుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం కొందరు ఒక సమూహం ఏర్పాటు చేసుకుని వారే పృచ్చకులుగా వ్యవహరించడం మనకు తెలిసిందే. అటువంటి వాటిని నిరసిస్తూ ఈ పద్దతి ప్రసాద్ ప్రవేశ పెట్టారు.
.