Jump to content

వాడుకరి:Siramdasunagarjuna

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన శిరందాసు నాగార్జున రావు సీనియర్ జర్నలిస్ట్.  నాగార్జున విశ్వవిద్యాలయంలో నుంచి బి.ఏ., బి.ఎల్., ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేశారు. మంగళగిరి నుంచి జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ పొందిన మొదటి వ్యక్తి. 1984 నుంచి 37 సంవత్సరాలుగా జర్నలిస్టుగా ఉంటున్నారు. ఉదయం, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వార్త, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, సాక్షి దినపత్రికలలో సబ్ ఎడిటర్ నుంచి న్యూస్ ఎడిటర్ స్థాయి  వరకు పని చేశారు. మంగళగిరి, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, కడప, అనంతపురం, చెన్నై, హైదరాబాద్‌లలో పని చేశారు. ఏపీ ప్రభుత్వంలో June 2016 to 24.06.2019 వరకు పీఆర్ఓ (సచివాలయంలోని పబ్లిసిటీ సెల్) గా పని చేశారు. దాదాపు అన్ని తెలుగు దినపత్రికలలోని ఎడిటోరియల్ పేజీలలో 300కుపైగా వ్యాసాలు అచ్చయ్యాయి. ‘ప్రజారాజధాని అమరావతి’ అనే పుస్తకం కూడా రాశారు.