వాడుకరి:Varahagiri.srinivas
స్వరూపం
ఓం శ్రీ మహాగణాదిపతయే నమః ఓం శ్రీ మహాసరస్వతయే నమః ఓం శ్రీ గురుభ్యో నమః
వరహాగిరి శ్రీనివాస్ శర్మ : జ్యోతిష్కులు, పంచాంగ కర్త, చిన్మయి జ్యోతిష్య పీఠం వ్యవస్థాపకులు
గోత్రము : భారద్వాజ గోత్రము
నివాస స్థలము : బెంగుళూరు
ఈమెయిలు (Email ID) : srinivas.vdvg@gmail.com
భారద్వాజ గోత్రమునందు తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా చింతలపల్లి గ్రామము స్వస్థలముగా కలిగిన బ్రహ్మశ్రీ వరహాగిరి సూర్యనారాయణ రావు శర్మ, శ్రీమతి కనకదుర్గ దంపతుల ప్రధమ సంతానముగా జన్మించి, వరహాగిరి శ్రీనివాస్ శర్మ నామధేయము కలిగి జ్యోతిష్య శాస్త్రం మీద వున్నఅపారమైన ఆసక్తి తో 1989 వ సంవత్సరం నుండి అంటే గత 26 సంవత్సరముల నుండి జ్యోతిష్య శాస్త్రములో భాగములైన, సిద్ధాంత, జాతక, ముహూర్త, మరియూ జాతక చక్ర గణన, జాతక చక్ర పరిశీలన, సంఖ్యా శాస్త్ర, హస్త సాముద్రిక, గృహ వాస్తు, శాస్త్రములందు విశేషమైన కృషి చేసిన అనుభవము. వేదపఠన రుచి చూపించి నాలో అంతర్లీనంగా వున్న భావాలను మేల్కొలిపిన మా గురువు గారు “శతాధిక ప్రతిష్టాది కార్యక్రమ ఆధ్వర్యులు, సువర్ణ ఘంటా కంకణ సన్మానితులు బ్రహ్మశ్రీ ఆర్.ఎల్.న్.శర్మ గారి” ఆశీస్సులతో అందరికీ అర్థము అయ్యేలా సరళ రీతిన పంచాంగము అందించాలనే భావనతో చేసిన ప్రయత్నం శ్రీ మన్మధ నామ సంవత్సర పంచాంగము. ఈ పంచాంగము రాజమండ్రి ప్రాంత సమయమునకు గణించడమైనది. ఏవిధమైన తప్పులు గమనించినా దయచేసి మా దృష్టికి తీసుకురావలసినదిగా ప్రార్థన. మరుసటి పంచాంగము రచనకు అది ఏంతో ఉపయుక్తమని మనవి.
పరాశర హోరా శాస్త్రం, ఫల దీపిక, వరహమిహిరచార్య బృహత్ జాతకం, మంత్రేశ్వర ప్రణీత ఫల దీపిక, కళ్యాణవర్మ సారావళి మొదలగు గ్రంధముల సహాయముతో ఎంతోమందికి వారి భవిష్యత్తు గూర్చి భయ, ఆందోళనలను దూరం చేసి సలహా ఇవ్వడం నిత్యకృత్యంగా వున్నది. జ్యోతిష్య శాస్త్రము మీద ఉన్న విశేషమైన ఆసక్తితోనూ, జిజ్ఞాసతోనూ 'చిన్మయి జ్యోతిష్య పీఠం' ప్రారంభించి, తద్వారా జ్యోతిష్య శాస్త్ర వ్యాప్తికి నిరంతర కృషి చేస్తూ జ్యోతిష్య శాస్త్రమును ప్రాణ ప్రదముగా భావిస్తూ, శాస్త్ర ప్రమాణాలను మరెంతో మందికి అందుబాటులోకి తీసుకురావటం అన్నది జీవిత ద్యేయంగా మలుచుకుని ఈ రోజు ఒక జ్యోతిష్య శాస్త్ర పండితునిగా సమాజములో వచ్చిన పేరు ప్రఖ్యాతులు పూర్తిగా శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి దేవి దయవలన, కృపవలన మాత్రమే.
వరహాగిరి శ్రీనివాస్ శర్మ