Jump to content

అనస్థీషియా

వికీపీడియా నుండి
అనస్థీషియా
Intervention
అనస్థీషియాకు సిద్ధమవుతున్న బాలుడు
Pronunciation/ˌænɪsˈθziə, -siə, -ʒə/
MeSHE03.155
MedlinePlusanesthesia
eMedicine1271543

అనస్థీషియా (మత్తుమందు) అనేది వైద్యప్రయోజనాల కోసం ప్రేరేపించబడిన నియంత్రిత, తాత్కాలిక స్పర్శానుభూతి లేదా అవగాహన స్థితి. మత్తు ఔషధాల ప్రభావంలో ఉన్న వ్యక్తులు కండరాల సడలింపు, స్మృతిలేమి ఇంకా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.[1]

అనస్థీషియా ద్వారా నొప్పి లేకుండా కొన్ని వైద్య ప్రక్రియలను సులభం చేస్తుంది. ఒకవేళ మత్తుమందు లేకపోతే ఆ ప్రక్రియలను తట్టుకోవడానికి వ్యక్తిలో శారీరక నిగ్రహం అవసరం. కొన్నిసార్లు అది సాంకేతికంగా సాధ్యం కూడా కాకపోవచ్చు.

అనస్థీషియా విస్తృతంగా మూడు వర్గాలు ఉన్నాయి:

సాధారణ అనస్థీషియా (General Anesthesia). ఇది కేంద్ర నాడీ వ్యవస్థ కార్యకలాపాలను అణిచివేస్తుంది. ఇంజెక్ట్ చేయబడిన లేదా పీల్చే మందులను ఉపయోగించి వ్యక్తిని కదలికలు లేని, అపస్మారక స్థితిలోకి వెళ్ళేలా చేస్తారు.

రెండవది సెడేషన్ (Sedation). ఇందులో కేంద్ర నాడీ వ్యవస్థను తక్కువ స్థాయికి అణిచివేస్తుంది. స్పృహ కోల్పోకుండా ఆందోళన, దీర్ఘకాలిక జ్ఞాపకాలను సృష్టించడం రెండింటినీ నిరోధిస్తుంది.

మూడవది స్థానిక అనస్థీషియా (Local anesthesia). ఇందులో శరీరం యొక్క నిర్దిష్ట భాగం నుండి నరాల ప్రేరణల ప్రసారానికి అడ్డుకట్ట వేస్తారు. పరిస్థితిని బట్టి, వ్యక్తి పూర్తిగా స్పృహలో ఉంటాడు లేదా సాధారణ అనస్థీషియా లేదా మత్తుతో కలిపి ఉపయోగిస్తారు. స్థానిక అనస్థీషియాలో వైద్యుడు నేరుగా సమస్య ఉన్న ప్రాంతంలోకి చొప్పిస్తారు. (ఉదా. దంత వైద్యం కోసం పంటిని మొద్దుబారేలా చేయడం).

వైద్యప్రక్రియ కోసం సిద్ధమవుతున్నప్పుడు, వైద్యుడు ప్రక్రియ రకం, నిర్దిష్ట రోగికి తగిన అనస్థీషియా రకం, అది ఎంతమేరకు ఇవ్వాలో నిర్ణయించుకుని అందుకోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మందులను ఎంచుకుంటాడు. సాధారణ మత్తుమందులు, స్థానిక మత్తుమందులు, హిప్నోటిక్స్, డిసోసియేటివ్‌లు, మత్తుమందులు, అనుబంధాలు, నాడీ కండరాలను నిరోధించే మందులు, అనాల్జెసిక్‌లు ఉపయోగించే మందుల రకాలు.

అనస్థీషియా సమయంలో లేదా తర్వాత వచ్చే సమస్యల ప్రమాదాలు అనస్థీషియా ఇచ్చే ప్రక్రియ నుండి వేరు చేయడం చాలా కష్టం. కానీ ప్రధానంగా అవి మూడు అంశాలకు సంబంధించినవి: వ్యక్తి ఆరోగ్యం, ప్రక్రియ యొక్క సంక్లిష్టత, ఒత్తిడి.

మత్తుమందు వ్యక్తి ఆరోగ్యంపై చెప్పుకోదగిన ప్రభావాన్ని చూపుతుంది. మరీ విపరీతమైన సందర్భాల్లో మరణం, గుండెపోటు లాంటివి కూడా ఉండవచ్చు. అయితే చిన్న ప్రమాదాలలో శస్త్రచికిత్స అనంతర వికారం, వాంతులు వంటివి ఉంటాయి.

మూలాలు

[మార్చు]
  1. "Anesthesia". Cleveland Clinic. May 30, 2023. Retrieved 26 November 2024.{{cite web}}: CS1 maint: url-status (link)