Jump to content

ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక పత్రం.

2022-23కి ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) 13 లక్షలకోట్లకు చేరుతుందని అంచనావేశారు.గత ఆర్థిక సంవత్సరం 11 లక్షల కోట్లు కావున వృద్ధిరేటు 16.22 శాతంగా వుంటుంది. వ్యవసాయం, అనుబంధ రంగాల స్థూల విలువ ఆధారిత వృద్ధి రేటు 13.18 శాతం, పరిశ్రమల రంగం 16.36 శాతం, సేవల రంగం 18.91 శాతంగా ఉంది. . స్థిరమైన ధరల ప్రకారం 2021-22లో దేశ వృద్ది రేటు 7% కాగా, ఆంధ్రప్రదేశ్ 7.02% నమోదైంది. గత సంవత్సరం దాదాపు 2 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం 2022-23లో 2.20 లక్షల కోట్లకు పెరిగింది.[1]

రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి

[మార్చు]

2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విలువ ఆధారంగా, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ₹12,01,736 కోట్లు. గత సంవత్సరపు విలువ 10,14,374 కోట్లు కాగా, గతెన్నడు లేనంతగా ఏడాదిలో ₹ 1,87,362 కోట్ల పెరుగుదల నమోదైంది. వార్షిక వృద్ధి రేటు 18.47% దేశపు వృద్ధి రేటు 17 శాతం కంటే ఎక్కువ.[2][3]

  • వ్యవసాయరంగం -₹3.9 లక్షల కోట్లు (+14.5%)
  • పారిశ్రామిక రంగం -₹2.5 లక్షల కోట్లు (+25.5% )
  • సేవా రంగం-₹4.67 లక్షల కోట్లు (+18.9% )

తలసరి ఆదాయం

[మార్చు]

ఏపీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విలువ ప్రాతిపదికన, తలసరి ఆదాయం ₹2,00,771. అంతకు ముందు సంవత్సరంలో తలసరి ఆదాయం ₹176,000. ఏడాదిలో రాష్ట్రంలో ₹31 వేలు తలసరి ఆదాయం పెరగగా, దేశంలో తలసరి ఆదాయం ₹23 వేలు పెరిగింది.

తలసరి ఆదాయం పెరుగుదల ప్రస్తుత ధరలలో (₹కోట్లలో) [3]
Year Per Capita Income (PCI) -AP PCI-india
2017-18 1,38,299 1,15,224
2018-19 (TRE) 1,54,031 1,25,946
2019-20 (SRE) 1,69,320 1,32,115
2020-21 (FRE) 1,76,707 1,26,855
2021-22 (AE) 2,07,771 1,49,848

2020-21 ముందస్తు అంచనాల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పెరుగుదల స్థిర ధరల వద్ద 1.58 శాతం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. జాతీయ స్థూల ఉత్పత్తి -3.8% కన్నా ఇది మెరుగు. స్థిర ధరల వద్ద 2020-21లో రాష్ట్రంలో తలసరి ఆదాయం ₹ 1,70,215. 2019-20లోని ₹ 1,68,480తో పోల్చితే ₹ 1,735 పెరుగుదల ఉంది.

ఐక్యరాజ్యసమితి 2030 నాటికి 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించింది. వీటి సాధనలో దేశంలో రాష్ట్రం 2018లో 4వ స్థానంలో ఉండగా 2019లో మూడో స్థానానికి చేరింది. పరిశుభ్రమైన నీరు- పారిశుద్ధ్యం, శాంతి- న్యాయం లక్ష్యాలలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలనలో మూడో స్థానం సాధించింది. మంచి ఆరోగ్యం, ఆర్థిక వృద్ధి వాతావరణ మార్పులు తదితర అంశాల్లో రెండో స్థానం సాధించింది.[4][5]

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్‌డీపీ ₹ 9,72,782గా అంచనా వేశారు. 2018-19లో ఇది ₹ 8,62,957 కోట్లు కావున ఈ ఏడాది 12.73% వృద్ధి సాధించినట్లు. 2018-19లో ఏపీలో తలసరి ఆదాయం ₹ 1,51,173గా ఉండగా ప్రస్తుతం అది ₹ 1,69,519కి పెరిగింది. ఇది భారత జాతీయ తలసరి ఆదాయం ₹ 1,34,432 కంటే ఎక్కువ [6][7]

2018-19 సంవత్సరానికి సామాజిక, ఆర్థిక సర్వే 2019 జూలై 12తేదీన బడ్జెట్ లో భాగంగా విడుదల చేశారు. 2018-19 ముందస్తు అంచనాల ప్రకారం, ప్రస్తుత ధరల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ₹ 9,33,402 కోట్ల స్థూల రాష్ట్ర ఉత్పత్తి కలిగివుంది. 2011-12 ధరల ప్రకారం 2018-2019 స్థూల రాష్ట్రఉత్పత్తి ₹ 6,80,332 కోట్లు కాగా, 2017-18 (తొలి సవరించిన అంచనాలు) ప్రకారం ₹ 6,12,793 కోట్లు. అంటే 11.02 % వృద్ధి నమోదైంది. ఇదే కాలానికి భారతదేశ వృద్ధి 7.0%గా నమోదైంది.

2018-19 ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల ఆధారంగా తలసరి ఆదాయం ₹ 164,000. 2017-18 (తొలి సవరించిన అంచనాల) ప్రస్తుత ధరల ఆధారంగా తలసరి ఆదాయం ₹ 1,43,935 కాబట్టి, 13.96% వృద్ధి నమోదైంది. ఇదే అంశంలో భారతదేశ వృద్ధి రేటు 10.21%గా నమోదైంది.[8]

2017-18 సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే [9][10] 2018 మార్చి 8న అసెంబ్లీలో ప్రవేశపెట్టబడింది. రాష్ట్రంలో అసమానతలను తొలగించి ప్రజలకు ఆరోగ్యం, సంపద, మెరుగైన మౌలిక సదుపాయలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది

ముఖ్యాంశాలు
  • రాష్ట్ర విస్తీర్ణం 1,62,970 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రం.
  • దేశంలో ఎక్కువ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ఉన్న కోస్తా తీర ప్రాంతం పొడవు 974 కిలోమీటర్లు.
  • రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 36,909.38 చదరపు కిలోమీటర్లు. మొత్తం విస్తీర్ణంలో ఇది 23.04 శాతం. అటవీ విస్తీర్ణం పరంగా 9వ స్థానంలో ఏపీ.
  • జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో 10వ అతిపెద్ద రాష్ట్రం.
  • పండ్లు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్.
  • మిర్చి, కోకో, నిమ్మ, ఆయిల్‌పామ్, బొప్పాయి, టమోటా ఉత్పాదకతలోను తొలి స్థానం.
  • జీడిమామిడి, మామిడి, బత్తాయి ఉత్పాదకతలో రెండో స్థానంలో ఏపీ.
  • గడచిన మూడేళ్లలో రాష్ట్రం సగటున 11 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇదే కాలంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.31 శాతంగా ఉందని వివరించింది.
  • రాష్ట్ర తలసరి ఆదాయం ₹ 1,42,054 :ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2017-18కి ₹ 1,42,054. 2015-16లో ఉన్న విలువ ₹ 1,23,664తో పోలిస్తే తలసరి ఆదాయంలో 14.87 శాతం వృద్ధి నమోదైంది. అదే 2011-12 బేస్ ఇయర్ నాటి స్థిర ధరల ప్రకారం లెక్కిస్తే తలసరి ఆదాయం 10.55 శాతం వృద్ధితో ₹ 96,374 నుంచి ₹ 1,06,545కు చేరింది.
  • పన్నుల ఆదాయంలో 20 శాతం వృద్ధి : 2016-17లో ₹ 44,181 కోట్లుగా ఉన్న సొంత పన్నుల ఆదాయం.. ఈ ఏడాది ₹ 52,717 కోట్లకు చేరింది. ఇదే సమయంలో సొంత పన్నేతర ఆదాయంలో 34 శాతం వృద్ధి నమోదైంది. 2016-17లో ₹ 3,989 కోట్లుగా ఉన్న ఆదాయం..₹ 5,347 కోట్లకు పెరిగింది. మొత్తానికి రాష్ట్ర సొంత ఆదాయం 20 శాతం వృద్ధితో ₹ 48,170 కోట్ల నుంచి ₹ 58,064 కోట్లకు చేరింది.
  • జీవీఏలో వ్యవసాయం వాటా 5.38 శాతంగా, వ్యవసాయ, అనుబంధరంగాలతో కూడిన వాటా 34.37 శాతంగా, సేవల వాటా 43.55 శాతంగా, పరిశ్రమల వాటా 22.09శాతంగా అంచనా వేశారు. 2017-18 ఆర్థిక సామాజిక సర్వే గణాంకాల ప్రకారం. రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీవీఏ) లో వ్యవసాయం, సేవలు, పరిశ్రమల రంగాల వాటా క్షీణించింది. 2016-17 తుది అంచనాల ప్రకారం జీవీఏలో వ్యవసాయం (అనుబంధ రంగాలు కాకుండా) వాటా 5.93 శాతంగా ఉంటే అది 2017-18లో 5.38 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. 2016-17లో ₹ 6,34,742 కోట్లుగా ఉన్న జీవీఏ 2017-18లో 15.9 శాతం పెరిగి ₹ 7,35,709 కోట్లకు చేరుతుంది. ఇదే సమయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీవీఏకి పన్నుల ఆదాయం కలిపి దానిలోంచి సబ్సిడీలు తీయగా వచ్చే విలువ) ₹ 6,95,491 కోట్ల నుంచి ₹ 8,03,873 కోట్లకు చేరనుంది.
  • రాష్ట్రం నుంచి ప్రధాన ఎగుమతులు - ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాణాధార మందులు, ఖనిజాలు, ఖనిజ ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్. వీటి విలువ 2016-17 లో ₹ 80,559.87 కోట్లు కాగా, 2017-18 (నవంబరు వరకు) ₹ 50,404.75 కోట్లున్నాయి.
  • 2016-17లో 5,07,43,000గా ఉన్న రాష్ట్ర జనాభా గడచిన ఏడాదిలో 0.58 శాతం (2,98,000 పెరుగుదల) వృద్ధితో 5,10,41,000కు చేరుకుంటుంది. రాష్ట్రం విడిపోయేనాటికి రాష్ట్ర జనాభా 5,01,51,000. ఈ మూడేళ్లలో ఏటా సగటున 2.96 లక్షల చొప్పున, జనాభా సంఖ్య 8.90 లక్షలు పెరిగింది.
  • గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు నాటికి దేశీయ వినియోగదారుల ధరల సూచీ 134 పాయింట్లుగా ఉంటే.. మన రాష్ట్రంలో మాత్రం 139 పాయింట్లుగా ఉంది. 2016-17తో పోలిస్తే 2017-18లో ఉల్లిపాయలు, చింతపండు ధరలు భారీగా పెరగినవి. కందిపప్పు, ఎండుమిర్చి ధరలు స్వల్పంగా తగ్గిననవి.
  • గత ఏడాదిలో పురుషుల కూలి రేట్లు 5.52 శాతం, మహిళల కూలి రేట్లు 8.47 శాతం పెరిగింది. పురుషుల సగటు కూలి రేటు ₹ 299.88 నుంచి ₹ 316.44కి పెరగ్గా, మహిళల సగటు కూలి రేటు 214.75 నుంచి 232.96కు పెరిగింది. రాష్ట్రంలో వడ్రంగి కార్మికులుం అత్యధిక సగటు కూలి 348.67 పొందుతుంటే, చర్మకారులు అత్యల్ప మొత్తం ₹ 271.79 పొందుతున్నారు.
  • గతేడాదితో పోలిస్తే పప్పు దినుసుల సాగు విస్తీర్ణం 14,13,000 హెక్టార్ల నుంచి 13,71,000 హెక్టార్లకు పడిపోయింది. దిగుబడి 9,31,000 టన్నుల నుంచి 11,44,000 టన్నులకు పెరగనుంది. అలాగే నూనె గింజల సాగు 12,30,000 హెక్టార్ల నుంచి 9,14,000 హెక్టార్లకు తగ్గింది. కాని దిగుబడి మాత్రం 24,91,000 టన్నుల నుంచి 29,11,000 టన్నులకు పెరగనుంది.. ఖరీఫ్, రబీ కలిపి వరి సాగు 5,85,000 హెక్టార్ల నుంచి 6,75,000 హెక్టార్లకు పెరిగింది. కాని దిగుబడి మాత్రం 1,20,03,000 టన్నుల నుంచి 1,20,77,000 టన్నులు మాత్రమే వస్తుంది.
  • 2014 మార్చి నాటికి రాష్ట్రంలో 70.02 లక్షల వాహనాలుండగా, గతేడాది నవంబరుకల్లా ఈ సంఖ్య 1.03 కోట్లకు పెరిగింది. ఇందులో ద్విచక్ర వాహనాలే 81 లక్షలు. 2014లో 54,31,832 ద్విచక్ర వాహనాలు, 5,09,581 ఆటోలు, 6,26,722 సరకు రవాణా వాహనాలు, కార్లు 6,37,461, కాంట్రాక్టు క్యారియర్ వాహనాల సంఖ్య 3,816 కు చేరుకున్నాయి.

2011-12 నాటి విలువ ఆధారంగా, 2016-17 ముందంచనాల ప్రకారం పెరుగుదల వ్యవసాయరంగంలో 14.03శాతం వుండగా, పరిశ్రమలరంగంలో 10.05 శాతం, సేవలరంగంలో 10.16 శాతం కాగా, మొత్తం పెరుగుదల 11.18 శాతంగా నమోదైంది. As of 2016-17, విలువల ప్రకారం ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ₹1,22,376, స్థిర విలువల ప్రకారం ₹95,566 ఉన్నాయి.[11]

ముందస్తు అంచనాల ప్రకారం, 2011-12 స్థిరధరల పద్ధతిలో 2015-16కు రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ₹493641 కోట్లు కాగా, 2014-15 కు మొదటి సవరించిన అంచనాల ప్రకారం ₹.44,4752 కోట్లు. అనగా పెరుగుదల 10.99%. సంబంధిత భారతదేశ పెరుగుదల 7.6%. స్థూల విలువ చేర్పు (GVA) 2011-12 స్థిరధరల పద్ధతిలో2015-16కు ₹4,55,484 కోట్లు కాగా 2014-15 (FRE) కు ₹4,12,188 కోట్లు, అనగా 10.50% పెరిగింది. ఇది భారతదేశానికి 7.3% వర్గాల వారీగా పెరుగుదల వ్యవసాయం : 8.4%, పరిశ్రమలు: 11.13%, సేవారంగం: 11.39%గా నమోదైంది. తలసరి ఆదాయం ప్రస్తుత ధరలవద్ద, ₹95,689 నుండి ₹1,07,532 చేరింది అనగా 12.38 % పెరిగింది.[12]

2014-15 సంవత్సరానికి గాను స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి (GSDP) లో ఆంధ్రప్రదేశ్ ఇతర భారతీయ రాష్ట్రాలతో పోలిస్తే ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రస్తుత విలువలు ఆధారంగా, ముందంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ విలువ చేకూర్చిన మొత్తంలో (Gross Value Added) వ్యవసాయరంగం 31.77 శాతం వుండగా, పరిశ్రమలరంగం 22.23 శాతం, సేవలరంగం 46.0 శాతం ఉన్నాయి.

ఇవీ చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]
  1. "andhra: AP సామాజిక ఆర్థిక సర్వే విడుదల చేసిన CM జగన్.. వివిధ రంగాల్లో వృద్ధిరేటు ఎలా ఉందంటే." goodreturns.in. 2023-03-15. Retrieved 2023-03-28.
  2. "AP Socio Economic Survey: ఏపీ ఆర్థిక సర్వే-₹31 వేలు పెరిగిన తలసరి ఆదాయం, వృద్ధి రేటులో భేష్!". ABP Telugu. 2022-03-11. Retrieved 2022-03-15.
  3. 3.0 3.1 Socio economic survey 2021-22 (PDF). Amaravathi. 2022.{{cite book}}: CS1 maint: location missing publisher (link)[permanent dead link]
  4. "రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 1.5% వృద్ధి". ఈనాడు. 2021-05-19. Retrieved 2021-05-22.
  5. "Socio Economic Survey 2020-21" (PDF). AP Government. 2021-05-19. Archived from the original (PDF) on 2021-05-22. Retrieved 2021-05-22.
  6. "ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆదాయం పెరిగిందా? సామాజిక, ఆర్థిక సర్వే ఏం చెప్తోంది?". బిబిసి. 2021-06-15. Retrieved 2021-05-22.
  7. "Socio Economic Survey 2019-20" (PDF). AP Government. 2020. Archived from the original (PDF) on 2021-05-22. Retrieved 2021-05-22.
  8. "SOCIO ECONOMIC SURVEY 2018-19" (PDF). 2019-07-11. Archived from the original (PDF) on 2019-07-15. Retrieved 2019-07-15. }}
  9. "Socio Economical Survey 2017-18" (PDF). Archived from the original (PDF) on 2018-08-26. Retrieved 2018-09-12.
  10. "ఆంధ్ర ప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2017-18". Archived from the original on Sep 12, 2018.
  11. "AP Economy in Brief 2017" (PDF). Directorate of Economics & Statistics, Government of Andhra Pradesh. 2017. p. 15. Archived from the original (PDF) on 2019-07-22. Retrieved 2021-03-08.
  12. "Socio economic survey 2015-16" (PDF). AP Government. 2016. p. 4. Archived from the original (PDF) on 2020-10-01. Retrieved 2021-05-22.