ఆరుద్ర పురుగు
Appearance
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఆరుద్ర పురుగు Temporal range:
| |
---|---|
Trombidium sp. | |
Scientific classification | |
Unrecognized taxon (fix): | Trombidiidae |
ఆరుద్ర నక్షత్రములలో 6వది. హిందువులు, రాశి చక్రములలో, "ఆరుద్ర"తార నాలుగు పాదములు, మిధునము (జెమిని) అను రాశికి చెందినది.
వ్యవసాయము మొదలు పెట్టుటకు,"ఆరుద్ర కార్తె" అనుకూలమైనది. ఈ కార్తెలో మాత్రమే కనబడేది ఆరుద్ర పురుగు. ఇది మొఖమల్ క్లాత్ ను చుట్టుకున్నట్లుగా ఉండి, ఎర్రగా బుర్రగా, బొద్దుగా ఉంటుంది. అందంగా ఉండే ఈ పురుగు పంటలకు ఎలాంటి హానీ చేయదు. ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రత్యక్షమౌతుంది.[1]
తెలుగు నాట, ప్రాచుర్యములో ఉన్న జాతీయములు ఇవి. ("నల్ల పూసవు అయి పోవుట" అనే మాట, వాడుకలో ఉన్న జాతీయము.)
ఎంతో కాలానికి వచ్చిన, అరుదుగా వచ్చేఅతిథినీ, బంధువునీ పలకరిస్తారు ఇలాగ, "బొత్తిగా నల్ల పూసవైనావు! మీ కటాక్షం కలిగినప్పుడు మాత్రమే, ఇట్టే వచ్చి, అట్టే మాయమౌతావు, ఆరుద్ర పురుగుకు మల్లే."