ఆరోహి పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరోహి పటేల్
2019 గిఫా అవార్డు వేడుకలో ఆరోహి పటేల్
జననం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం

ఆరోహి పటేల్, గుజరాత్ రాష్ట్రానికి చెందిన టివి, సినిమా నటి. సందీప్ పటేల్ తీసిన మోతీ నా చౌక్ రే సప్నా మ దితా అనే సినిమాలో బాలనటిగా తన నట జీవితాన్ని ప్రారంభించింది. ప్రేమ్‌జీ: రైజ్ ఆఫ్ ఏ వారియర్[1] అనే సినిమాలో మొదటిసారిగా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా 10 ప్రముఖ గుజరాత్ రాష్ట్ర అవార్డులను గెలుచుకుంది. లవ్ నీ భావై, చాల జీవి లయియే సినిమాల ద్వారా ప్రసిద్ధి చెందింది.[2] 17వ వార్షిక ట్రాన్స్‌మీడియా గుజరాతీ స్క్రీన్ అండ్ స్టేజ్ అవార్డ్స్-2017లో, రేడియో సిటీ సినీ అవార్డ్స్-2017లో లవ్ నీ భావాయికి 'ఉత్తమ నటి' అవార్డును కూడా అందుకుంది.

2019లో విజయగిరి బావ దర్శకత్వం వహించిన మోంటు నీ బిట్టు అనే సినిమాలో కూడా నటించింది.[3] ఈ సినిమాకు ఉత్తమ నటి విభాగంలో 2019 గిఫా అవార్డును కూడా అందుకుంది.[4]

జననం, విద్య[మార్చు]

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదబాదులోని దర్శక-నిర్మాత ద్వయం సందీప్ పటేల్ - ఆర్తీ పటేల్‌ దంపతులకు ఆరోహి జన్మించింది. ఆరోహికి సంజనా పటేల్ అనే చెల్లెలు కూడా ఉంది. అహ్మదాబాద్ విశ్వవిద్యాలయంలోని హెచ్‌ఎల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ నుండి అకౌంట్స్‌లో స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్స్ ఇన్ కామర్స్ పూర్తి చేసింది. గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి డెవలప్‌మెంట్ కమ్యూనికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది.

అహ్మదాబాద్‌లోని ప్రముఖ రేడియో స్టేషన్‌లలో ఒకటైన 94.3 మై ఎఫ్ఎంలో 2012 ఏప్రిల్ నుండి 2014 జనవరి వరకు ఇంటర్న్‌షిప్ గా పనిచేసింది. టివి9 గుజరాతీలో 2014 ఏప్రిల్ నుండి 2014 జూన్ వరకు రెండు నెలల ఇంటర్న్‌షిప్ కూడా చేసింది.[5] కళాశాల స్థాయిలో డ్యాన్స్, నాటక పోటీలలో పాల్గొని, గెలుపొందింది. కళాశాలలో ఉండగానే ప్రేమ్‌జీ: రైజ్ ఆఫ్ ఏ వారియర్‌లో తన మొదటి ప్రధాన పాత్రను పొందింది.[6]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఛానల్ ఇతర వివరాలు
2001 సతీ సావిత్రి యువ సావిత్రి సోనీ సబ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా 4 ఎపిసోడ్‌లు

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
1999 మోతీ నా చౌక్ రే సప్నా మ దితా పూజ గుజరాతీ బాలనటి
2015 ప్రేమ్ జీ: రైజ్ ఆఫ్ ఎ వారియర్ పవన్ గుజరాతీ
2017 లవ్ ని భావై అంతరా గుజరాతీ అవార్డు - ఉత్తమ నటి (2017) - ట్రాన్స్‌మీడియా
2019 చాల్ జీవీ లైయే! కేత్కి గుజరాతీ
2019 మొంటూ నీ బిట్టు బిట్టు గుజరాతీ అవార్డు - ఉత్తమ నటి (2019) - గిఫా
2022 ఓం మంగళం సింగిల్ వాణి గుజరాతీ

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర భాష
2019 నాన్-ఆల్కహాలిక్ బ్రేకప్ శైలీ[7] గుజరాతీ

మూలాలు[మార్చు]

  1. "I'm very much like Pawan in real life: Aarohi Patel - Times of India".
  2. "Trailer launchof Love Ni Bhavai".
  3. "Aarohi Patel: 'Montu Ni Bittu' film trailer will be out on 27 July". The Times of India. 26 July 2019. Retrieved 2023-01-19.
  4. "GIFA 2019: Pratik, Aarohi get Best Actor and Best Actress awards". Revoi. 2019-12-26. Archived from the original on 2020-01-27. Retrieved 2023-01-19.
  5. "Exclusive Interview with Aarohi Patel Gujarati Movie Actress". www.expressinfotoday.com.
  6. "Premji Rise of A Warrior : Interactive Session with Aarohi Patel". 24 June 2015. Archived from the original on 19 జనవరి 2023. Retrieved 19 జనవరి 2023.
  7. "Non-Alcoholic Breakup Web Series".

బయటి లింకులు[మార్చు]