ఇథియోపియాలో హిందూమతం
చరిత్రకారుడు రిచర్డ్ పాన్‌ఖర్స్ట్ ప్రకారం, ఆక్సిమైట్ కాలంలో (సా.శ. 2 నుండి 9వ శతాబ్దం వరకు) భారతదేశం, ఇథియోపియా ల మధ్య పురాతన సంబంధాలు ఉన్నాయి. "ఇథియోపియా, భారతదేశం అని పిలువబడే భూమి మధ్య పరిచయాలు చరిత్ర ప్రారంభ కాలం నాటివి.". భారతదేశం, ఆక్సుమైట్ రాజ్యాల మధ్య వాణిజ్యం సా.శ. 6వ శతాబ్దంలో వృద్ధి చెందింది. పురాతన ఓడరేవు అదులిస్ ఒక ప్రవేశ ద్వారంగా, సముద్ర వాణిజ్యానికి కేంద్రంగా పనిచేసింది. ఇక్కడ భారతీయ వ్యాపారులు సుగంధ ద్రవ్యాలు, సిల్క్ వ్యాపారం చేయడానికీ దంతాలు, బంగారం కోసమూ తరలివచ్చారు.
తరువాతి కాలాలలో, 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి మద్దతుతో భారతీయుల రాక, 1868లో బొంబాయిలో బ్రిటిష్ సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా ఉన్న రాబర్ట్ నేపియర్, 1935లో ఫాసిస్ట్ ఇటలీ దాడి చేసినప్పుడు భారత దళాలను ఇక్కడికి తీసుకువచ్చాడు. ప్రసిద్ధ నగరం గోండార్, చక్రవర్తి ఫసిలిదాస్ ప్యాలెస్ ల అభివృద్ధిలో భారతీయ కళాకారులు, కార్మికులు ముఖ్యమైన పాత్ర పోషించారు [1]
ఇథియోపియా కోసం మిలిటరీ అకాడమీని ఏర్పాటు చేయడానికి జనరల్ రాలీకి భారతదేశం రుణం ఇచ్చింది. దేశంలోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో బోధించడానికి పెద్ద సంఖ్యలో భారతీయులు అరవైల చివరి నుండి తొంభైల మధ్య కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించబడ్డారు. కానీ కల్నల్ మెంగిస్టు చక్రవర్తి హైలే సెలాసీని పడగొట్టడంతో, కొత్త కమ్యూనిస్ట్ పాలన "ఇథియోపియానైజేషన్" విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని అర్థం విదేశీయులు ఇథియోపియన్ పాఠశాలల్లో బోధించడానికి అనుమతించబడరు. తత్ఫలితంగా, భారతీయ ఉపాధ్యాయులందరూ, పెద్ద సంఖ్యలో భారతీయ వ్యాపారవేత్తలూ ఇతర గమ్యస్థానాలకు తరలివెళ్లారు.
కొంతమంది భారతీయులు మాత్రమే ఉండిపోయారు. వారిలో మూడు తరాల కంటే ఎక్కువ కాలం నుండి దేశంలో స్థిరపడిన వారు కూడా ఉన్నారు.[2]
ఇథియోపియాలో హిందువులు
[మార్చు]ఇథియోపియాలో ఒకప్పుడు 9,000 కంటే ఎక్కువ హిందూ కుటుంబాలు ఉండేవి. 80ల మధ్య నాటికి వారి సంఖ్య 8,000కి తగ్గింది. ప్రస్తుతం, భారతీయ సమాజంలో సుమారుగా 1,500 మంది జాతీయులు ఉన్నారు. కాంట్రాక్టు కేటాయింపుపై 400 మంది బోధనా సిబ్బంది కూడా ఉన్నారు.[1]
వీరిలో దాదాపు వంద మంది వ్యాపారవేత్తలు. ప్రధానంగా గుజరాత్‌కు చెందిన వారు వివిధ దిగుమతి-ఎగుమతి కంపెనీలకు కమిషన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు.
మరో 150 మంది డిఫెన్స్ మినిస్ట్రీ ఇంజినీరింగ్ కాలేజీలోను, ప్రముఖ ఇథియోపియన్ విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలలోనూ పనిచేస్తున్నారు. ఇద్దరు ప్రొఫెసర్లు మెకెల్లే విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విభాగంలో పనిచేస్తున్నారు. వారిలో ఆరుగురు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీకి సమానమైన ప్రధాన మంత్రి కార్యాలయం పరిధిలోని సివిల్ సర్వీసెస్ కాలేజీలో బోధిస్తున్నారు.
ఇథియోపియాలోని భారతీయ సంఘాలు
[మార్చు]దేశంలో మూడు భారతీయ సంఘాలు ఉన్నాయి - 1937లో ఏర్పాటైన ది ఇండియన్ అసోసియేషన్, ది హిందూ మహాజన్, ది మలయాళ సంఘం.[1] ఇండియన్ అసోసియేషన్ 1947లో స్థాపించిన స్వయంప్రతిపత్త సంస్థ అయిన ఇండియన్ నేషనల్ స్కూల్ కూడా ఉంది.
అడ్డిస్ అబాబాలో ఉన్న హిందూ మహాజన్‌లో హిందువులకు దహన సంస్కారాలు అనుమతించబడతాయి.
భారతీయ వ్యాపారవేత్తలు
[మార్చు]అడిస్ అబాబాలోని మూడు భారతీయ రెస్టారెంట్లలో రెండింటిని భారతీయ వ్యాపారవేత్తలు నిర్వహిస్తున్నారు. అనేక భారతీయ PSUలు - TCIL, WAPCOS, RITES, ICT, లీ అసోసియేట్స్ సౌత్ ఏషియా ప్రై లిమిటెడ్. మొదలైన సంస్థలు దేశంలో అనేక కాంట్రాక్టులను గెలుచుకున్నాయి. లీ అసోసియేట్స్ ఇథియోపియాలోని వివిధ ప్రాంతాలలో 6 ప్రతిష్ఠాత్మకమైన హైవే ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసింది. 4 ప్రాజెక్ట్‌లు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. ఇథియోపియాలోని సంస్థ అధికారులు స్థానిక సహచరులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నారు. మొత్తం మీద, ఇథియోపియన్లు భారతీయ సమాజాన్ని ఎంతో గౌరవిస్తారు.[2] ఢిల్లీకి చెందిన బ్రిజేష్ తోమర్, అడిస్ అబాబాకు అతి సమీపంలోని డుకేమ్‌లో డిస్టిలరీ యూనిట్, మద్యం బాటిలింగ్ యూనిట్‌ను స్థాపించాడు. అడిస్ అబాబాలో ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, బాయిలర్, టర్బైన్‌లు, రసాయనాలు మొదలైన వాటి సరఫరా వంటి కొన్ని ఇతర వ్యాపారాలను కూడా చేస్తున్నాడు. అతను ఇథియోపియాలో భారతీయ కమ్యూనిటీని ఒక అసోసియేషన్ స్థాపించాలనుకుంటున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Ethiopia" (PDF). meaindia.nic.in. Archived (PDF) from the original on 2007-10-12. Retrieved 2007-03-07.
- ↑ 2.0 2.1 "Chapter 8: Other countries of Africa". Report of the High Level Committee on the Indian Diaspora (PDF). Archived from the original on 2012-02-06. Retrieved 2022-01-21.
{{cite book}}
:|work=
ignored (help)CS1 maint: bot: original URL status unknown (link)