Jump to content

ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బు

వికీపీడియా నుండి
మీడియం సైజు E27 తో 230 వోల్టుల ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బు, దీని ఫిలమెంట్ నిలువు సరఫరా తీగల మధ్య సమాంతర లైన్ గా కనిపిస్తుంది.
ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బు యొక్క ఒక టంగ్‌స్టన్ ఫిలమెంట్ యొక్క SEM చిత్రం.
200-వాట్ ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బు యొక్క ఫిలమెంట్ అత్యంత పెద్దదిగా

ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బు, ఇన్‌కాండిసెంట్ లాంప్ లేదా ఇన్‌కాండిసెంట్ లైట్ గ్లోబ్ అనేది విద్యుత్ ప్రవాహామును పంపించడం ద్వారా అధిక ఉష్ణోగ్రతకు వేడి అయ్యే వైర్ ఫిలమెంట్ తో మెరుస్తూ వెలుగును ఇచ్చే ఒక ఎలక్ట్రిక్ లైట్. ఈ వేడి ఫిల్మెంట్ జడ వాయువుతో నింపిన లేదా ఖాళీ చేయించిన ఒక గాజు లేదా క్వార్ట్జ్ బల్బ్ తో ఆక్సీకరణం నుండి రక్షించబడుతుంది. హాలోజెన్ దీపంలో ఫిలమెంట్ బాష్పీభవనము ఒక రసాయన ప్రక్ర్రియ ద్వారా నివారించబడుతుంది, ఇందులో లోహ ఆవిరి మళ్ళీ మళ్ళీ ఫిలమెంట్ పైకి చేరుతూ జీవిత కాలమును విస్తరిస్తుంది. ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బును థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టాడు.

టంగ్‌స్టన్ ఫిలమెంట్ వేడి నుంచి పుట్టించే దీని వెలుగుకు ఈ బల్చు తీసుకొనే విద్యుత్ చాలా ఎక్కువ, వాడే విద్యుత్ లో 5 శాతం మాత్రమే వెలుతురుగా మారి 95 శాతం వేడి రూపంలో వృథా అవుతుంది. అయితే మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ బల్చుకు మెరుగులు దిద్ది ఆత్యాధునిక బల్చును తయారు చేసింది. తద్వారా తక్కువ విద్యుత్ తో పనిచేసే కొత్త బల్బులు రాబోతున్నాయి.

  1. గ్లాస్ బల్బ్ ఆవరణరేఖ
  2. అల్ప పీడన జడ వాయువు (ఆర్గాన్, నత్రజని, క్రిప్టాన్, జినాన్)
  3. టంగ్‌స్టన్ ఫిలమెంట్
  4. కాంటాక్ట్ వైర్ (goes out of stem)
  5. కాంటాక్ట్ వైర్ (goes into stem)
  6. సపోర్టు వైర్లు (one end embedded in stem; conduct no current)
  7. స్టెమ్ (glass mount)
  8. కాంటాక్ట్ వైర్ (goes out of stem)
  9. కాప్ (స్లీవ్)
  10. ఇన్సులేషన్ ([vitrite)
  11. ఎలక్ట్రికల్ కాంటాక్ట్

ఇవి కూడా చూడండి

[మార్చు]

థామస్ అల్వా ఎడిసన్ - ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బు ఆవిష్కర్త

మూలాలు

[మార్చు]
  • సాక్షి దిన పత్రిక - 28-01-2016 (పాత బల్బుకు కొత్త షోకులు! మరింత సమర్థమైన ఇన్‌కాండిసెంట్ లైట్ బల్చు తయారీ. కరెంట్ ఖర్చు పిసరంతే)