ఉభయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరాముని గుడి నుంచి శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయమునకు మంగళవాయిద్యంలతో ఉభయంను తీసుకు వెళ్తున్న ఉభయ కర్తలు
ఉభయాన్ని స్వీకరిస్తున్న శ్రీ విఘ్నేశ్వరుడు
ఉభయం అందుకున్న స్వామి వారు గ్రామోత్సవమునకు బయలుదేరుట

దేవాలయానికి సంబంధించిన బ్రహ్మోత్సవ, ప్రత్యేక ఉత్సవాల్లో అయ్యే ఖర్చును భరించే వారిని ఉభయ కర్తలని వారు సమర్పించే ధన, వస్తు, ప్రసాద, పూజా సామాగ్రిని ఉభయం అని అంటారు. ఈ ఉభయాలను దేవాలయం తరపున గాని ఒక వ్యక్తి (కుటుంబం) లేక కొంతమంది కలిసిగాని ఈ కార్యక్రమాని నిర్వహిస్తారు. ఈ ఉభయాలను దేవాలయ నియమ నిబంధనలను అనుసరించి ఇవ్వవలసి ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఇచ్చే ఉభయాలలో ఎక్కువ మంది భక్తులు పాల్గొనడం వలన బాగా సందడిగా ఉంటుంది.

ఉభయంను తీసుకువెళ్ళే సమయంలో విద్యుదీపాలను అలంకరించడం, బాణాసంచా కాల్చడం, తప్పెట్లు, మేళ తాలాలు వాయించడం, పులి వేషాలు, కర్ర తిప్పుట, నెమలి ఆటలు, కోలాటం, పండరి భజనలు, నాటకాలు, డాన్స్ బేబి డాన్స్, పాటకచ్చేరి, అన్నదానం వంటి కార్యక్రమాలతో భక్తులను విశేషంగా ఆకర్షించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఉభయంను అందుకున్న స్వామి వారు వివిధ వాహన సేవలపై భక్తులను ఆశీర్వదించడానికి గ్రామోత్సవంతో బయలుదేరివస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=ఉభయం&oldid=3872207" నుండి వెలికితీశారు