ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇ.వి.ఎమ్) దేశవ్యాప్తంగా ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం అనేక సంస్కరణల ప్రవేశపెట్టింది. ఈవీఎం, వివి ప్యాట్, నోటా లాంటి కొత్త విధానాలతో ఓటర్లకు భరోసాను ఇచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇ.వి.ఎమ్) ను నిర్వచిస్తే " పోలింగ్ జరిగే ప్రదేశాలలో ఉపయోగించే యాంత్రికంగా ఓట్లను నమోదు చేయడానికి , లెక్కించే యాంత్రిక పరికరం (ఉపకరణం) గా చెప్పవచ్చును.[1]
చరిత్ర
[మార్చు]ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) ను నిర్వచనంలో పేర్కొన్నట్లుగా ఓట్లను నమోదు ( రికార్డ్ ) చేయడానికి మానవ సహాయంతో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) లు బ్యాలెట్ పత్రాలకు ప్రత్యామ్నాయంగా వచ్చాయి, భారత దేశంలో మొదటిసారి 1982 సంవత్సరంలో కేరళ రాష్ట్రం లోని నెం.70 పర్వూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఉపయోగించబడ్డాయి.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) లో కంట్రోల్ యూనిట్ ఉంటుంది, ఇది పోలింగ్ అధికారితో పర్యవేక్షణలో ఉంటుంది . ఓటింగ్ కంపార్ట్ మెంట్ లోపల ఉంచబడ్డ బ్యాలటింగ్ యూనిట్ ఉంటుంది.
కంట్రోల్ యూనిట్ పై బ్యాలెట్ బటన్ నొక్కడం ద్వారా బ్యాలెట్ విడుదల చేయడమే పోలింగ్ అధికారి పాత్ర. పోటీలో ఉన్న అభ్యర్థికి ఎదురుగా బ్యాలటింగ్ యూనిట్ పై నీలం బటన్ నొక్కడం ద్వారా ఓటరు తన ఓటువేయడానికి అనుమతిస్తుంది, ఓటరు వేసే వారిని ఎంపిక చేసుకోవడానికి గుర్తుగా ( చిహ్నం) ఉంటుంది . 2001 సంవత్సరంనుండి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) ల నమ్మకం. విశ్వసనీయత లేని సమస్య చాలాసార్లు లేవనెత్తబడింది, కానీ ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) ల ద్వారా ఓట్లను తారుమారు చేయడానికి ఎటువంటి అవకాశం లేదని పేర్కొంటున్నది . ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) లు సాధారణ బ్యాటరీపై పనిచేస్తాయి , వాటికి విద్యుత్ అవసరం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) ను గరిష్టంగా 2,000 ఓట్లను నమోదు చేయడానికి ఉపయోగించవచ్చు. ఒకవేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) లు పనిచేయడం ఆపివేస్తే, వెంటనే కొత్తదానితో భర్తీ చేస్తారు, కంట్రోల్ యూనిట్ మెమరీలో ఆ సమయం వరకు ఉన్న ఓట్లు రికార్డ్ చేయబడతాయి. డేటా డిలీట్ చేయబడే వరకు లేదా క్లియర్ అయ్యేంత వరకు కంట్రోల్ యూనిట్ మెమరీలో ఫలితాన్ని నిల్వ చేయవచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద పేపర్ రోల్ మార్చడం ఖచ్చితంగా నిషేధించబడింది. బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థుల పేర్ల ఏర్పాటు అక్షరక్రమంలో ఉంది, మొదట జాతీయ రాజకీయ పార్టీల నుండి అభ్యర్థులు, తరువాత ఇతర రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు రిజిస్టర్డ్ చేయబడినవాటివి ఉంటాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) ను తయారు చేయడం లో భారత ఎన్నికల సంఘం వారి సాంకేతిక నిపుణుల కమిటీ రెండు ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ల సహకారంతో రూపొందించడం, రూపకల్పన చేసే బాధ్యత పోషిస్తారు.[2]
నిర్మాణం
[మార్చు]భారతదేశంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 కింద ఓటింగ్ రాజ్యాంగ హక్కు( ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం). భారత దేశ ప్రజాస్వామ్యం ఓటింగ్ పునాదిపై నిర్మించబడింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో 1980 సంవత్సరములలో మొదటి భారతీయ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) లను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఇ. సీ.ఐ.ఎల్) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఇఎల్) అభివృద్ధి చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) లు సాధారణం గా 6 వోల్ట్ ఆల్కలైన్ బ్యాటరీపై నడుస్తాయి . ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) లకు అమెరికా, జపాన్ లలో విదేశీ కంపెనీలు మైక్రోకంట్రోలర్లను సరఫరా చేస్తోంది. అందువల్ల, పవర్ కనెక్షన్ లు లేని ప్రాంతాల్లో కూడా పని చేస్తాయి . ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) లు గరిష్టంగా 3840 ఓట్లను నమోదు చేయవచ్చు. ఒక పోలింగ్ కేంద్రములో సాధారణంగా మొత్తం ఓటర్ల సంఖ్య 1500 కు మించదు.[3]
భారతదేశం లో వాడకం
[మార్చు]భారత దేశం లో 1998 నవంబరులో జరిగిన మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్ (5), ఢిల్లీ (6) లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) లను ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. 2004 లోక్ సభ ఎన్నికలను పూర్తిగా నిర్వహించారు.[4]
లాభ నష్టములు
[మార్చు]ప్రపంచములో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా ఉన్నప్పటికీ కమ్యూనిస్ట్ దేశంగా ఉన్నందున, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడుతుంది. లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీలకు సార్వత్రిక ఎన్నికలు ఐదేళ్ల విరామంలో జరుగుతాయి. భారతదేశంలో ఎన్నికలు ఒక ప్రక్రియ గా పేర్కొనవచ్చును. భారత దేశములో విభిన్న ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం డబ్బు, సమయం, మానవ వనరులను ఉపయోగిస్తుంది . భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇ.వి.ఎమ్) ల వినియోగం భారత ఎన్నికల్లో తీవ్ర మార్పు చేసింది.[5]
లాభాలు
[మార్చు]ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓట్లు వేయడానికి , లెక్కించడానికి ఏదైనా ఓటింగ్ ఉంటుంది.[6]
ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో లాభనష్టములు ఉన్నాయి. సంప్రదాయ ఓటింగ్ ప్రక్రియతో పోల్చినట్లుగా, దేశ భవిష్యత్తును నిర్వచించడానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇ.వి.ఎమ్) లను వాడే ముందు పరిగణనలోకి తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ సరళమైన కార్యాచరణ ప్రక్రియ . ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇ.వి.ఎమ్) లు అత్యంత విలువైనవి ఎందుకంటే ఇది పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకోవడం, చెల్లని ఓట్లు, డూప్లికేట్ ఓట్లు వేయడం కష్టం . ఎలక్ట్రానిక్ ఓటింగ్‌తో ఎన్నికల ఫలితాలు తొందరలో అందుబాటులో ఉంటాయి . డిజిటల్ స్పేస్ లోకి ఓటింగ్ తీసుకురావడం ద్వారా, పోలింగ్ బూత్ ను సందర్శించలేని లేదా ఉపయోగించలేని ప్రజలు ఇంటి నుండి ఓటు వేయవచ్చు. ఈ ప్రక్రియ వికలాంగులకు , వృద్ధులకు మరింత సౌలభ్యం గా వారు ఓటును వినియోగించుకునే అవకాశం ఉన్నది . చివరగా, ఇ-ఓటింగ్ తో ప్రధాన ప్రయోజనం ఖర్చులలో దీర్ఘకాలిక తగ్గుదల. పేపర్ వినియోగం తక్కువ , దేశవ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల ఫలితాలను తొందరగా ప్రజలు తెలుసుకొనవచ్చును . ఎలక్ట్రానిక్ బ్యాలెట్ కౌంటింగ్ యంత్రాలు మానవ వనరులను తగ్గించగలవు . ఒకసారి కొన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇ.వి.ఎమ్) లు వాటిని ప్రతి ఎన్నికలలో తిరిగి ఉపయోగించవచ్చు.
నష్టములు
[మార్చు]ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇ.వి.ఎమ్) ల ప్రతికూలత ఎన్నికల హ్యాకింగ్. ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం మాదిరిగానే, ఎవరైనా ఎన్నికల ఫలితాలను చట్టవిరుద్ధంగా మార్చే ప్రమాదం ఉంది . మానవులు ట్యాంపరింగ్ చేయడం ,ఇంటర్నెట్ రిమోట్ దాడి ద్వారా జరిగే అవకాశం ఉంది . డిజిటల్ ఓటింగ్ కొరకు ప్రాథమిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి . వీటి నిర్వహణ , ఇన్ స్టలేషన్ , మొదట ఖర్చు చేయడం ఉంటుంది . కానీ దీర్ఘకాలంలో ఆదా అవుతుంది, కానీ ప్రారంభములో పేపర్ బాలెట్ ఓటింగ్ కంటే ఎక్కువ . ఓటింగ్ యంత్రాలు, మెయింటెనెన్స్, ఇన్ స్టలేషన్, మౌలిక సదుపాయాలను ఏర్పరచడం ప్రభుత్వాలు సౌకర్యాలను ఏర్పాటు చేయడం , ప్రాథమికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది .
మూలాలు
[మార్చు]- ↑ "Electronic voting machine". TheFreeDictionary.com. Retrieved 2021-08-07.
- ↑ "EVM | Electronic Voting Machine: What are EVM's? All about it". The Economic Times. Retrieved 2021-08-07.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2021-08-08. Retrieved 2021-08-08.
- ↑ "Electronic Voting Machine and its history with India: Controversy over EVMs malfunctioning, rigging allegations are not new-India News , Firstpost". Firstpost. 2019-01-22. Retrieved 2021-08-07.
- ↑ "One Nation One Election: Merits and Demerits". Jagranjosh.com. 2019-06-20. Retrieved 2021-08-08.
- ↑ "How Electronic Voting Works: Pros and Cons vs. Paper Voting". MUO (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-11-14. Retrieved 2021-08-08.