కాళరాత్రి (నాటకం)
కాళరాత్రి | |
కాళరాత్రి పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | ప్రఖ్య శ్రీరామమూర్తి, (మూల నాటకం: హక్ ఐలాండ్, రచన: హోవర్డ్ ఇర్వింగ్) |
---|---|
సంపాదకులు: | బొందలపాటి శకుంతలాదేవి, శివరామకృష్ణ |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకం |
ప్రచురణ: | దేశి కవితామండలి, దేశి ప్రెస్, విజయవాడ |
విడుదల: | జూలై 1953 |
పేజీలు: | 138 |
కాళరాత్రి 1953లో ప్రఖ్య శ్రీరామమూర్తి స్వేఛానుసరణ చేసిన సాంఘీక నాటకం.[1] హోవర్డ్ ఇర్వింగ్ యంగ్ రాసిన "హక్ ఐలాండ్" నాటకం ఆధారంగా ఈ నాటకం రాయబడింది.
కథా నేపథ్యం
[మార్చు]మిత్రులతో కొన్నిరోజులు సరదాగా గడపడానికి భైరవలంకలోని తన ఎస్టేట్ రాజారావు వస్తాడు. ఆరోజు రాత్రి తుఫాన్ రావడంతో కరెంట్ పోతుంది. అప్పుడు వారంతా డిటెక్టివ్ ల గురించి, హత్యల గురించి గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళను పరీక్షించడానికి రాజారావు తను హత్య చేసినట్లు నాటకమాడుతాడు. అది నిజమైన హత్యగా మారుతుంది. ఉత్తుత్తి హత్య, నిజమైన హత్యగా ఎలా మారిపోయింది, అసలు హంతకుడెవరు, ఎందుకు చంపాడు అనేది మిగతా కథ.
పాత్రలు
[మార్చు]ఈ నాటకంలోని పాత్రల వివరాలు[2]
- రాజారావు (జమీందారు-20 సం.)
- వెంకన్న (సేవకుడు-45 సం.)
- రామానుజం (డిటెక్టివ్ నవల రచయిత-40 సం.)
- నరహరి (రాజారావు స్నేహితుడు-40 సం.)
- నారాయణ (రాజారావు స్నేహితుడు-30 సం.)
- మోహన్ (రాజారావు స్నేహితుడు-25 సం.)
- సుకుమార్ (రాజారావు స్నేహితుడు-30 సం.)
- కమల (నరహరి భార్య-25 సం.)
- నళిని (ఎస్టేటు మేనేజరు కూతురు-20 సం.)
ప్రదర్శనల వివరాలు
[మార్చు]1. 1954, ఏప్రిల్ 19న విజయనగరం రవిరాజ్ మెమోరియల్ క్లబ్ తొలిసారిగా ప్రదర్శించిన వివరాలు:
- రాజారావు - జె.వి. సోమయాజులు
- నరహరి - యం. జోగారావు
- రామానుజం - జె.వి. రమణామూర్తి
- నారాయణ - వి.వి. అప్పారావు
- మోహన్ - వి.యస్. దీక్షిత్
- సుకుమార్ - జె.వి. శ్రీరామమూర్తి
- వెంకన్న - బి. విశ్వేశ్వరరావు
- కమల - రత్నకుమారి
- నళిని - రాజకుమారి
- నిర్వహణ - అప్పారావ్ దొర
2. 1954, అక్టోబరు 16న విజయవాడ శ్రీ నవ్యకళా మండలి సంస్థ ప్రదర్శించిన వివరాలు:
- రాజారావు - జె.వి. రమణామూర్తి[3]
- వెంకన్న - యం.వి. చలపతిరావు
- రామానుజం - కె. వెంకటేశ్వరరావు
- నరహరి - డి. జగన్నాథం
- నారాయణ - పి. శ్రీరామమూర్తి
- మోహన్ - సిహెచ్. శ్రీరాములు
- సుకుమార్ - కె. ప్రసాద్
- కమల - యస్. జయశ్రీ
- నళిని - ఆర్. నిర్మల
- దర్శకత్వం - కె.వి. వెంకటేశ్వరరావు
- నిర్మాత - పి. శ్రీరామమూర్తి
ఇతర వివరాలు
[మార్చు]1954/55లో హైదరాబాదులో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటక పోటీలలో శ్రీకాకుళంకు చెందిన నాటక సంస్థ ఈ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు ఇతర రచయితల నాటకాల కంటే ఎక్కువ ఆదరణ లభించడంతోపాటు జె. వి. రమణమూర్తికి ఉత్తమ నటుడిగా బహుమతి వచ్చింది.[4] ఈ ప్రదర్శనలో జె.వి.సోమయాజులు, రావి కొండలరావు నటించగా, సినీరచయిత డి.వి.నరసరాజు జడ్జిగా వచ్చాడు.[5]
మాలాలు
[మార్చు]- ↑ వెబ్ ఆర్కైవ్, నాటకాలు. "కాళరాత్రి". www.web.archive.org. Retrieved 20 June 2020.
- ↑ వెబ్ ఆర్కైవ్, పాత్రలు. "కాళరాత్రి (నాటకం)". www.web.archive.org. Retrieved 20 June 2020.
- ↑ సాక్షి, ఫ్యామిలీ (23 June 2016). "అభినయకళామూర్తి". రెంటాల జయదేవ. Archived from the original on 26 June 2016. Retrieved 20 June 2020.
- ↑ సితార, సినీ మార్గదర్శకులు. "వేదికపైనా... వెండితెరపైనా... వెలిగిన నటుడు!". www.sitara.net. ఆచారం షణ్ముఖాచారి. Archived from the original on 18 August 2019. Retrieved 20 June 2020.
- ↑ ప్రజాశక్తి, ఫీచర్స్ (23 November 2019). "సృజన దాగదు - నటన ఆగదు". బెందాళం క్రిష్ణారావు. Archived from the original on 20 June 2020. Retrieved 20 June 2020.