కాళ్ళ వీరభద్రయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాళ్ళ వీరభద్రయ్య (బద్రి గా సుపరిచితుడు) టీవీ 9 న్యూస్ చానల్ లో న్యూస్‌ రీడర్‌.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన వీరరాఘవులు, లీలావతి దంపతులకు 1977 ఏప్రిల్ 11పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు గ్రామంలో జన్మించారు. బద్రి అసలు పేరు వీరభద్రయ్య. అందరూ బద్రి అని పిలుస్తుంటారు. ఆయన స్వగ్రామం ఉంగుటూరు అయినప్పటికీ ఆయన అమ్మమ్మ, తాతయ్యలు అచ్యుత సుబ్బలక్ష్మి, శేషారావులది ఆవపాడు కావడంతో చిన్నప్పుడు ఇక్కడే గడిపారు. అతని మేనమామ అచ్యుత పెద పోలియ్య కుమార్తె లక్ష్మీసుజాతను వివాహమాడారు. బద్రి తండ్రి కాళ్ళ వీరరాఘవులు ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవారు. పదేళ్ల క్రితం వరకు ఉంగుటూరు, ఆవపాడుల్లో గడిపిన బద్రి ఆ తరవాత తండ్రితో సహా విజయవాడ వెళ్లారు. మొదట విజయవాడ సిటీ కేబుల్‌లో న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన బద్రి టీవీ9 ప్రారంభం నుండి కూడా న్యూస్‌ ప్రజెంటర్‌గా పనిచేస్తూ వస్తున్నారు.

ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆయనకు తెలుగు భాషపై ఉండే పట్టు వలన ఆయన వార్తా బృందంలో సభ్యునిగా ఎదిగాడు. ఆయనకు రాజకీయ అంశాలతోపాతు సినిమాలపై కూడా ఆసక్తి ఎక్కువ ఉండేది. అదే విధంగా సంగీతం నుండి క్రీడాంశాల వరకు ప్రత్యేక ఆసక్తి కనబరచేవాడు. టీ.వి.9 లో బద్రి ప్రొఫైల్

మరణం

[మార్చు]

ఫిబ్రవరి 8 2015 న ఆదివారం ఉదయం పెళ్ళికి వెళ్లి వస్తూ ప్రమాద వశాత్తు మరణించాడు. బద్రి ఆదివారం ఉదయం తన కుటుంబంతో కలిసి పెళ్ళి నుండి తిరిగి కార్లలో వస్తున్నారు. కారును స్వయంగా బద్రి నడుపుతున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల సమీపానికి రాగానే అనుకోకుండా కారు టైరు పేలడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. దానితో డ్రైవింగ్‌ సీటులో ఉన్న బద్రి అక్కడిక్కడే మరణించాడు. కారులో బద్రితో పాటు ఆయన భార్య, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. పెద్ద కుమారుడు కూడా కొంత సమయానికి మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Telugu TV 9 News Anchor Badri Dies in Road Accident: Celebs Condole his Death
  2. "టీవీ 9 న్యూస్‌ రీడర్‌ బద్రి ఇకలేరు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-07-18.

ఇతర లింకులు

[మార్చు]