కాసాబ్లాంకా (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాసాబ్లాంకా
విలియం గోల్డ్ డిజైన్ చేసిన సినిమా పోస్టర్
దర్శకత్వంమైకేల్ కర్టిస్
స్క్రీన్ ప్లే
  • జూలియస్ జె. ఎప్‌స్టీన్
  • ఫిల్ప్ జి. ఎప్‌స్టీన్
  • హౌవార్డ్ కోచ్
దీనిపై ఆధారితంఎవెరీబడీ కమ్స్ టు రిక్'స్ 
by ముర్రే బర్నెట్, జోన్ ఎలిసన్
నిర్మాతహాల్ బి.వాలిస్
తారాగణం
  • హంఫ్రీ బోగార్ట్
  • ఇంగ్రిడ్ బెర్గ్‌మాన్
  • పాల్ హెన్రీడ్
  • క్లాడ్ రెయిన్స్
  • కాన్రాడ్ వీట్
  • సిడ్బూ గ్రీన్‌స్ట్రీట్
  • పీటర్ లోరే[1]
ఛాయాగ్రహణంఆర్ధర్ ఎడిసన్
కూర్పుఓవెన్ మార్క్స్
సంగీతంమాక్స్ స్టెయినర్
నిర్మాణ
సంస్థ
వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్
పంపిణీదార్లువార్నర్ బ్రదర్స్ పిక్చర్స్
విడుదల తేదీs
1942 నవంబరు 26 (1942-11-26)(హాలీవుడ్ థియేటర్లలో)
జనవరి 23, 1943 (అమెరికాలో)
సినిమా నిడివి
102 నిముషాలు
దేశంఅమెరికా
భాషఇంగ్లీషు
బడ్జెట్$878,000[2]–$1మిలియన్[3][4]
బాక్సాఫీసు$3.7[5]–6.9 మిలియన్లు[3]

కాసాబ్లాంకా 1942 నవంబర్ 26న విడుదలైన అమెరికన్ రొమాంటిక్ సినిమా. ఎవెరీబడీ కమ్స్ టు రిక్స్ అనే నాటకం ఆధారంగా ఈ సినిమాను మైకేల్ కర్టిస్ దర్శకత్వంలో హాల్ బి.వాలిస్ నిర్మించాడు. వార్నర్ బ్రదర్స్ సంస్థ విడుదల చేసింది. ఈ చిత్రానికి ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ దర్శకత్వం విభాగాలలో అకాడమీ పురస్కారాలు లభించాయి.[6]

కథ[మార్చు]

ఎడమ నుండి కుడివైపుకు: పాల్ హెన్రీడ్, ఇంగ్రిడ్ బెర్గ్‌మాన్, క్లాడ్ రెయిన్స్, హంఫ్రీ బోగార్ట్

'కాసాబ్లాంకా' అంటే ఉత్తర ఆఫ్రికా మొరాకో దేశంలోని ఓ రేవు పట్టణం. రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఇది ఎందరికో స్వాతంత్య్రాన్ని అందించిన నగరం అయ్యింది. ఇక్కడికి వెళితే ముందుగా పోర్చుగల్, ఆ తరువాత అమెరికాకు వీసాలు తేలికగా లభించేవి. అందుకే ఎందరో, రకరకాలుగా నాజీలు పెట్టే బాధలను భరించలేక కాసబ్లాంకాకు పారిపోయేవారు. అక్కడ లంచాలు ఇచ్చి వీసాలు సంపాదించు కొనేవారు. ఆ కోణంలోంచి చూస్తే కాసబ్లాంకా నగరం అవినీతికి, స్వతంత్రానికి కూడా కూడలిలాగా ఉండేది. ఈ నగరంలో జరిగిన కథే 'కాసాబ్లాంకా'.

ఈ చిత్రంలో హీరో రిక్ బ్లెయిన్. అతడు కాసాబ్లాంకాలో నిర్వహించే నైట్‌క్లబ్ పేరే 'రిక్స్'. రెండో ప్రపంచ యుద్ధకాలంలో పారిపోయే శరణార్థుల వ్యధలు, అదే సమయంలో తలెత్తే ప్రేమల కలగాపులగం కథ ఇది. వీసా కోసం వచ్చిన ఇల్సా అనే ఒక ఫ్రెంచ్ మహిళకు రిక్ సహాయం చేస్తాడు. ఆమె అంటే ఎంతో ప్రేమ పెంచుకుంటాడు. కానీ తనకు అప్పటికే పెళ్లయిందని, భర్త చనిపోయాడని ఆమె చెపుతుంది. అయినా ఇల్సా అంటే రిక్ ఎంతో ఇష్టపడతాడు. కొంతకాలానికి చనిపోయాడనుకున్న ఇల్సా భర్త లాస్లో తిరిగి వస్తాడు. దాంతో రిక్ త్యాగం చేస్తూ ఇల్సాను, లాస్లోను అమెరికాకు పంపే ఏర్పాటు చేస్తాడు. లాస్లోను నాజీలు గుర్తించి చంపేస్తారు. దాంతో ఇల్సా, రిక్‌లు ఆ విమానంలో అమెరికాకు చేరుకోవడంతో ఈ త్రికోణ ప్రేమకథ సుఖాంతం అవుతుంది. కానీ యుద్ధకాలంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగిన కారణంగా ఈ చిత్రం అమెరికన్ల మనసు దోచుకుంది.[6]

నటీనటులు[మార్చు]

సిడ్నీ గ్రీన్‌స్ట్రీట్, హంఫ్రీ బోగార్ట్
  • హంఫ్రీ బోగార్ట్ - రిక్ బ్లెయిన్‌
  • ఇంగ్రిడ్ బెర్గ్‌మాన్ - ఇల్సా లండ్‌
  • పాల్ హెన్రీడ్ - విక్టర్ లాస్లో
  • క్లాడ్ రెయిన్స్ - కెప్టెన్ లూయిస్ రెనాల్ట్‌
  • కాన్రాడ్ వీడ్ట్ - మేజర్ హెన్రిచ్ స్ట్రాసర్‌
  • సిడ్నీ గ్రీన్‌స్ట్రీట్ - ఫెరారీ
  • పీటర్ లోర్రే - ఉగార్టే
  • కర్ట్ బోయిస్ - పిక్ పాకెటర్
  • లియోనిడ్ కిన్స్కీ - సాస్చా
  • మడేలీన్ లెబ్యూ - వైవోన్‌
  • జాయ్ పేజ్ -అన్నానా బ్రాండెల్
  • జాన్ క్వాలెన్ - బెర్గర్‌
  • ఎస్.జెడ్.సకల్ - కార్ల్
  • డూలీ విల్సన్ - సామ్‌

విడుదల[మార్చు]

చుంబన సన్నివేశంలో బోగార్ట్,బెర్గ్‌మాన్

ఈ సినిమా 1943లో విడుదల చేయాలని అనుకొన్నా 1942 థాంక్స్ గివింగ్ రోజు(నవంబరు 26)న న్యూయార్క్‌లోని హాలీవుడ్ థియేటర్లో ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఆ ప్రీమియర్ జరిగిన రోజునే ఉత్తరాఫ్రికాలోని కాసబ్లాంకా వద్ద మిత్రపక్షాలు నాజీలపై విజయం సాధించారు. దానితో కాసబ్లాంకా చిత్రానికి ఎనలేని పబ్లిసిటి వచ్చేసింది. 1943 జనవరి 23న ఈ సినిమాను సాధారణ ప్రేక్షకుల కోసం విడుదల చేశారు. ఆ సమయానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్, బ్రిటన్ ప్రధాని చర్చిల్ తోనూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఛార్లెస్ డిగాల్‌తోనూ కాసాబ్లాంకాలోనే సమావేశం అయ్యాడు. చరిత్రపరంగా ఎంతో కీలకమైన ఈ సమావేశంతో 'కాసబ్లాంకా' అనే మాట అందరి నోట్లోనూ నానసాగింది. చిత్ర విజయానికి ఇది కూడా దోహద పడింది.[6]


అవార్డులు[మార్చు]

కాసాబ్లాంకా ఎనిమిది అకాడమీ పురస్కారాలకు ప్రతిపాదించగా అందులో మూడు అవార్డులను గెలుచుకుంది.

అవార్డు విభాగం గ్రహీతలు ఫలితం
అకాడమీ పురస్కారాలు ఉత్తమ సినిమా (అసాధారణ నిర్మాణం) వార్నర్ బ్రదర్స్ గెలుపు
ఉత్తమ దర్శకుడు మైకేల్ కర్టిస్ గెలుపు
ఉత్తమ నటుడు హంఫ్రీ బోగార్ట్ ప్రతిపాదన
ఉత్తమ సహాయ నటుడు క్లాడ్ రెయిన్స్ ప్రతిపాదన
ఉత్తమ స్క్రీన్ ప్లే జూలియస్ జె. ఎప్‌స్టీన్, ఫిలిప్ జి. ఎప్‌స్టీన్, హౌవార్డ్ కోచ్ గెలుపు
ఉత్తమ ఛాయాగ్రాహకుడు (నలుపు-తెలుపు) ఆర్థర్ ఎడిసన్ ప్రతిపాదన
ఉత్తమ ఎడిటర్ ఓవెన్ మార్క్స్ ప్రతిపాదన
ఉత్తమ సంగీత దర్శకుడు మాక్స్ స్టెయినర్ ప్రతిపాదన
నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డ్స్ టాప్ 10 సినిమాలు 6వ స్థానం
ఉత్తమ దర్శకుడు మైకేల్ కర్టిస్ గెలుపు
నేషనల్ ఫిల్మ్ ప్రిజర్వేషన్ బోర్డ్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ చేర్చబడింది
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ ఉత్తమ దర్శకుడు మైకేల్ కర్టిస్ ప్రతిపాదన
ఉత్తమ నటుడు హంఫ్రీ బోగార్ట్ ప్రతిపాదన
శాటర్న్ అవార్డ్స్ ఉత్తమ డివిడి క్లాసిక్ సినిమా కాసాబ్లాంకా:అల్టిమేట్ కలెక్టర్స్ ఎడిషన్ ప్రతిపాదన

విశేషాలు[మార్చు]

  • ఈ చిత్రానికి ఆధారమైన ముర్రె బర్నెట్, జోన్ ఎలిసన్‌లు రూపొందించిన 'ఎవిరిబడీ కమ్స్ టు రిక్స్' ఒక్క ప్రదర్శన కూడా ప్రదర్శింపబడలేదు.
  • హార్వర్డ్‌లో బ్రాటిల్ స్ట్రీట్ థియేటర్ ఏడాదికి రెండుసార్లు బొగార్ట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.ఈ చిత్రోత్సవంలో 'కాసబ్లాంకా' చిత్రం ప్రతిసారి తప్పనిసరిగా ఉంటుంది.
  • హాంఫ్రీ బోగార్ట్‌కు ఈ చిత్రంలో నటనకు సర్వత్రా ప్రశంసలు లభించినా ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు మాత్రం దక్కలేదు.

మూలాలు[మార్చు]

  1. ఎబర్ట్, రోజర్ (September 15, 1996). "గ్రేట్ మూవీస్:కాసాబ్లాంకా". RogerEbert.com. Archived from the original on 2015-08-11. Retrieved February 19, 2023.
  2. షాట్జ్, థామస్ (1999). బూమ్ అండ్ బస్ట్: అమెరికన్ సినిమా ఇన్ 1940s. యూనివర్సిటీ కాలిఫోర్నియా ప్రెస్. p. 218. ISBN 9780520221307.
  3. 3.0 3.1 వార్నర్ బ్రదర్స్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇన్ "ద విలియం షేఫర్ లెడ్జర్"Warner Bros financial information in "The William Shaefer Ledger".అపెండిక్స్ 1, హిస్టారికల్ జర్నల్ ఆఫ్ ఫిల్మ్, రేడియో అండ్ టెలివిజన్ (1995) 15:sup 1, 1–31 p. 23 doi:10.1080/01439689508604551
  4. "కాసాబ్లాంకా". బాక్స్ ఆఫీస్ మోజో. Archived from the original on 2022-09-22. Retrieved February 19, 2023.
  5. "టాప్ గ్రాసర్స్ ఆఫ్ ద సీజన్". వెరైటీ. January 5, 1944. p. 54. Archived from the original on March 17, 2017. Retrieved February 19, 2023.
  6. 6.0 6.1 6.2 పాలకోడేటి, సత్యనారాయణరావు (1 April 2007). హాలీవుడ్ క్లాసిక్స్ - 1 (1 ed.). హైదరాబాదు: అనుపమ సాహితి. pp. 56–57.